బోనం ! తాత్త్వికత !! ~~~~~~~~~~~~~~ శైవ&శాక్తేయ సంప్రదాయాలకు కేంద్రస్థానమైన తెలంగాణ సంస్కృతిలో బోనం ఒక విశిష్ట పర్వం ! ఏడాది పొడుగునా ఇక్కడ బోనాలేబోనాలు… బోనం కథ & తాత్త్వికత చాలా చాలా పెద్దది అది రాస్తే రామాయణం,పాడితే భాగవతం…!! బోనం అంటే భువనం ! సకల ప్రాణికోటికి మూలస్థానం !! బోనం అంటే వట్టి మట్టికుండే. కానీ అది నిండుకుండ. బోనం ఒక పూర్ణకుంభం. బోనం ఒక బ్రహ్మాండబాండం. బోనం ఒక ధాన్యాగారం. బోనం […]
మొత్తానికి భలే మాయలేడి… ఒకరా ఇద్దరా… ఏకంగా ఇరవై ఏడు మంది…
ఫేక్ పేర్లతో… దొంగ మాటలతో బోలెడు పెళ్లిళ్లు చేసుకున్న మోసగాడు… కట్నం తీసుకుని, పరారైపోయి, మళ్లీ ఇంకోచోట ప్రత్యక్షం… ఇలాంటి వార్తలు చాలా చదివాం… అసలు ఏమీ తెలుసుకోకుండా, వరుడి కుటుంబం వివరాలు కనుక్కోకుండా ఎలా పిల్లనిస్తారు అనే ఆశ్చర్యం కలిగేది… కానీ ఇది పూర్తి భిన్నమైన కథ… జమ్ముకాశ్మీర్‌లోని ఓ యువతి ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకుంది… అందరినీ మోసగించింది… ఇప్పుడు 28వ పెళ్లి కోసం ఎవరిని బకరా […]
దటీజ్ సాయిపల్లవి..! అభినందించడానికి మరో కారణం దొరికింది…
సాయిపల్లవిని చాలా విషయాల్లో మెచ్చుకున్నాం… కుంటాం కూడా… ఆ బురద ఇండస్ట్రీలో ఆమె ఓ డిఫరెంట్ కేరక్టర్… ఆ బురద లక్షణాలేమిటనేది పక్కన పెడదాం… ఒకప్పుడు అలాగా బతుకు బతికిన నటులకు మంచి చాన్సులు దొరికితే, అనుకోకుండా హిట్టయితే… ఇక ఫ్యాన్స్, అట్టహాసాలు, హంగామాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా… ఆడలేడీస్ అయితే ఇక రాణివాసపు పోకడలే… సుకుమారంగా పెరిగినట్టు పోకడలు, ఫోజులు… అడుగు తీసి అడుగేస్తే అందం ఎక్కడ కందిపోతుందో అన్నట్టుగా మేకప్పులకు తరచూ […]
ప్రేమంటే..? పెళ్లంటే..? ఈమె బాష్యం వేరు, ఆచరణ వేరు…! నమ్మలేము…!!
ప్రేమ అంటే..? ఈ పదాన్ని సరిగ్గా, సమగ్రంగా నిర్వచించినవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు… పుట్టబోడు..! ఇప్పుడు అకస్మాత్తుగా ఇండియన్ మీడియాలో ఒక లవ్ స్టోరీ వైరల్ అవుతోంది… దానికీ ఓ నేపథ్యం ఉంది… షేర్ షా అని ఓ హిందీ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది… సిద్ధార్థ మల్హోత్రా హీరో, కియరా అద్వానీ హీరోయిన్… 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆర్మీ కెప్టెన్ బయోపిక్ ఇది… ఆ కథానాయకుడి పేరు విక్రమ్ బాత్రా… ఈ […]
హేమిటీ… వాళ్లింట్లో టమాట పప్పు, టమాట రసం, టమాట పచ్చడి, టమాట రైస్..?!
‘IT-Tamota’: అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ ఇంట్లో ఎవరూ నిద్ర లేవలేదు. దిగువ మధ్య తరగతి ఇళ్లున్న కాలనీ కాబట్టి బైకులు, ఆటోలు తప్ప కార్లు కూడా లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా ఒక కారుకు ఎదురుగా ఇంకో కారు వస్తే…ఎవరో ఒకరు వెనక్కు వెళ్లాల్సిందే. అలాంటి ఏరియాలో సాయుధ పోలీసులతో అధికార నిఘా విభాగం బృందాలు మెరుపు దాడి చేశాయి. ఆ ఇంటి తలుపు తట్టాయి. తెల్లవారక ముందే ఏ పాల బిల్లు కోసమో ఎవరో తలుపు తడుతున్నారనుకుని […]
ఛిఛీ… సర్కారు ఏం చేస్తున్నట్టు..? ఆదాయ ప్రదాతల్ని అవమానించడమే ఇది…
Discrimination: ఇది చూడడానికి చిన్న వార్తే కావచ్చు. కానీ… విషయం చాలా తీవ్రమయినది. పురోగామి సమాజంలో తిరోగామి చర్యలను ముక్త కంఠంతో ఖండించడానికి ఉద్యుక్తులం కావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించే వార్త. రాకెట్లు వేసుకుని అంతరిక్షంలో పర్యాటకులుగా తిరిగి వస్తున్న ఆధునిక నవనవోన్మేష కాలంలో… ఒకానొక మందుబాబు మందు షాపుకు వెళ్లి… డబ్బులిచ్చి 90 ఎమ్మెల్ పోయమంటే పోయనంటాడా? పైగా కులం పేరుతో మందును నిరాకరిస్తాడా? వేర్ వుయ్ ఆర్ గోయింగ్? వాట్ వుయ్ ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ […]
కన్నీళ్లతో, ఉద్వేగంతో కృష్ణ వరం కోరుకున్నాడు … ఓ రేణుక కథ…
( పురాణ ప్రసిద్ధురాలైన రేణుక జమదగ్ని మహర్షి భార్య. ఆమె తన పాతివ్రత్య ప్రభావంతో ,నది నుండి ప్రతిరోజూ నీటినే కుండ ఆకారంలోకి మార్చి ఆశ్రమానికి తీసుకొచ్చేది . ఒక రోజు నది వద్ద అత్యంత సుందరుడైన కార్తవీర్యార్జున మహారాజును చూసి ఒక క్షణం … ఒకే ఒక క్షణం రేణుక మనస్సు మోహావేశంతో చెదిరింది. ఆరోజు నీరు కుండ ఆకారంలోకి గట్టిపడలేదు. రేణుక మామూలు మట్టికుండలో నీళ్లు పట్టుకుపోవడంతో జమదగ్ని తన దివ్యదృష్టితో జరిగిన సంగతిని […]
ఇలా ఆలోచిస్తాడు కాబట్టే ముఖేష్ అంబానీ అంత ప్రపంచ ధనికుడయ్యాడు…
హఠాత్తుగా కొన్ని పోస్టులు వైరల్ అయిపోతుంటయ్… ఇదెక్కడో చదివినట్టుగా ఉంది, ఇది పాతదా, కొత్తదా అనే డైలమాలో కూడా పడేస్తయ్… పోస్టులో నిజానిజాలను పక్కనపెడితే… ఓ కథలాగా చదివేస్తే సరి అనుకుని చదివేయాలి… ఇదీ అలాంటిదే… ఓసారి పోస్టు చదవండి… ఇది విన్నారా అమ్మాయులూ !! రూ.100 కోట్ల వరుడు కావాలన్న, అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మతిరిగే ఆన్సర్…… రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి తన సంస్థకు సంబంధించిన పెద్ద మీటింగ్‌లలో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండదు. […]
అనుకుంటాం గానీ… తెలుగు నుంచి ఇంగ్లిషు అనువాదాలూ కష్టమే సుమీ…
ఇంగ్లిషు నుంచి తెలుగులోకి ఈనాడు తరహా క్షుద్రానువాదాలను గర్హిస్తున్నాం… భాషను ఖూనీ చేస్తున్న ఈనాడును చూసి ఖండిస్తున్నాం సరే… ఇంగ్లిషును ఇంగ్లిషులాగే ఉంచండిరోయ్, ఈ కాష్మోరా టైపు చేతబడులు వద్దురోయ్ అని మొత్తుకుంటున్నాం… ఈనాడోడు వినడు, అది వేరే సంగతి, వాడిని చూసి సాక్షి, జ్యోతి వంటి తోకపత్రికలు కూడా వాతలు పెట్టుకుంటున్నయ్ అప్పుడప్పుడూ… అదొక విషాదం… కానీ తెలుగు నుంచి ఇంగ్లిషులోకి కూడా కొన్ని అనువాదాలుంటయ్… అవి చదువుతుంటే, బాబోయ్, ఆ తెలుగు పదాల్ని అలాగే […]
దోశ టేస్టా..? పోహా టేస్టా..? ఇడ్లీ, వడలు బెటరా..? రోటీలు, పావ్ బజ్జీ బెటరా..?
ఎప్పుడూ పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు, టీవీలు, ఓటీటీ, సెలబ్రిటీలు… ఇవేనా..? టూరిజం, ఫుడ్, డ్రెస్సింగ్, ఫ్యాషన్స్ ఎట్సెట్రా కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు, సంవాదాలకు కారణమవుతుంటాయి… పెద్దగా ట్రోలింగ్ ఉండవు ఆ ట్వీట్లపై, పోస్టులపై… సరదాగా వాదాలుంటయ్… సోషల్ ట్రోలింగ్ పిచ్చోళ్లకు ఇందులో ఎలా జొరబడాలో తెలియక సైలెంటుగా ఉండిపోతారు… ఇలాంటి ఫన్నీ డిబేట్లకు, ఇంట్రస్టింగు చర్చలకు ఒక ఉదాహరణ… గబ్బర్‌సింగ్ అనే ఒక ట్విట్టరుడు కడక్ జిలేబీ, పోహా (అటుకులు, పోపేసిన చుడువా టైప్) […]
ఇప్పుడు ట్రెండు అరుణాచలం… గిరిప్రదక్షిణ చేయాల్సిందే… తండోపతండాలు…
Neelayapalem Vijay Kumar……… అవునూ … మా చిత్తూరు పక్కనుండే “అరుణాచలం” లో కొత్త దేవుడేమైనా వెలిసాడా ? Do you know what is the new fad in Andhra right now? తిరువన్నామలై “అరుణాచలం” గుడికి పోవడం …! వీలైతే పౌర్ణమి నాడు పోవడం …! అప్పుడెప్పుడో శబరిమలైలో దేవుడు ‘జ్యోతి’ ని కనిపింప చేస్తాడు అని లక్షల కొద్దీ పరిగెత్తే వాళ్ళు గుర్తుందా … ఇప్పుడు ‘అరుణాచలం’లో పౌర్ణమి నాడు గిరి […]
అబ్బురం… ఆ పిల్లలు ఆ భీకరమైన అడవిలో బతికే ఉన్నారు… దొరికారు…
నెలరోజుల క్రితం… ముచ్చట కూడా ప్రచురించిన ఓ కథనం ఇది… ముందుగా ఇది చదవండి… తరువాత కథ కూడా చెప్పుకుందాం… ఇంట్రస్టింగ్ స్టోరీ… హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీ… అసాధారణం అని చెప్పలేను కానీ అరుదైన వార్తలు… పదండి వార్తలోకి… ప్రపంచంలోకెల్లా అత్యంత దట్టమైనవి అమెజాన్ అడవులు… భీకరమైనవి కూడా… రోజూ వర్షం, పొడవైన దృఢమైన చెట్లు, విషసర్పాలు, క్రూరజంతువులు… ప్రతి అడుగూ ప్రాణాంతకమే… రనేక్ మకుటయ్ 11 నెలలు, 4 ఏళ్లు, 9 ఏళ్ల వయస్సున్న కుమారులు, […]
ఆ నలుగురు పిల్లలు… అంతటి అమెజాన్ అడవుల్లో… 17 రోజులపాటు…
మానవాసక్తి కథనాలు… అంటే ప్రత్యేకంగా ఆఫ్ బీట్ స్టోరీలు ఏమీ కాదు… రొటీన్‌కు భిన్నంగా మనస్సులను కనెక్ట్ చేసే స్టోరీలు… తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ స్టోరీలను వదిలేసి చాలాకాలమైంది… రొటీన్ పొలిటికల్ బురదను మాత్రమే ప్రేమిస్తోంది… అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు పిల్లల కథ చాలా ఆసక్తికరంగా ఉంది… ఆంధ్రజ్యోతి సరిగ్గా ప్రజెంట్ చేసింది తప్ప మిగతా పత్రికల్లో, టీవీల్లో ఈ వార్త జాడే కనిపించలేదు… ఇంతకీ ఆ వార్త ఏమిటో తెలుసా..? ప్రపంచంలోకెల్లా […]
పోరగాళ్లతో ఎక్స్‌కర్షన్… నలుగురు సముద్రం దగ్గర మిస్సింగ్… ఇగ చూడు నా పరేషాన్…
పాఠశాల విద్యను మించిన మధురమైన కాలం మరోటిలేదు. తెలిసీ తెలియని వయసు, చిల్లర చేస్టలు, సార్ల భయం.. అన్నిటి కలబోత.. సాధారణంగా బడుల్లో excursion నిర్వహిస్తుంటారు. ప్రతి పిల్లవాడు వెళ్ళాలనుకుంటాడు. ప్రతివాడు నూటొక్క కలలు కంటుంటాడు. నిర్వహించే సార్లకు ప్రాణాంతకం. ప్రతి పిల్లవాడు తిరిగి ఇంటికి చేరేంత వరకు వీళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. పిల్లలు ఇంట్లో చేసిన అప్పాలు తెచ్చుకుంటారు. కొన్ని కొందరికి పడవు. కడుపులో గడబిడ అయితే కొద్దిసేపు ఓర్చుకొని, మరీ తట్టుకోలేని సమయంలో […]
అది అన్నమే అన్నాడు కానీ అన్నమో కాదో… టీలాగే ఉంది గానీ అదో కాదో…
“మరలనిదేల రామాయణంబన్నచో నీప్రపంచక మెల్లనెల్ల వేళ దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు తనరుచి బ్రతుకులు తనవిగాన…” అని రామాయణ కల్పవృక్షం ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ గొప్పగా సూత్రీకరించారు. రోజూ అదే అన్నమే తింటున్నా… విసుగు పుట్టదు. ఏ పూటకాపూట ఆ అన్నం కోసమే ఎదురు చూస్తాం. హైదరాబాద్ నుండి వెస్ట్ బెంగాల్ సరిహద్దు దగ్గర బాగ్ డోగ్రాకు విమానమెక్కి, బాగ్ డోగ్రా నుండి నాలుగు గంటలు కారులో ప్రయాణించి భూటాన్ సరిహద్దు నగరం ఫుషిలాంగ్ చేరి, రాత్రి అక్కడే […]
మేం చిన్నప్పుడే నకల్ కొట్టేటోళ్లం… పరీక్షల్లో చిట్టీలు కూడా ఓ ఆర్ట్…
తొమ్మిదో తరగతి వరకు చదువుకునే పిల్లలకు పరీక్షలు అవుతున్నాయి కదా. ఇప్పటి రోజులు బడ్డువి. మా అప్పుడు మేం బహు చదివేవాళ్ళం. ఇప్పటి వాళ్ళ మాదిరిగా కాపీలు కొట్టేవాళ్ల మసలే కాదు అని అంటాం కానీ నిజాయితీగా చెప్పాలంటే మనం కూడా సంప్రదాయ పద్దతుల్లో కాపీలు కొట్టినవాళ్ళమే… లాగు పట్టేను బ్లేడుతో కొద్దిగా కోసి, చిట్టీలు మలిచి దాచేవాళ్ళం. అట్లనే అంగీ కాలర్ మధ్యలో, చెప్పులు కోసి చీటీలు దాచేవాల్లం. అవన్నీ అందరికీ ఎరుకున్న జాగలే.. రేపటి […]
సింగిల్ కాలమ్ దాటని కథ… నో, నో… పోస్టుకు ఎక్కువ- కథకు తక్కువ…
ఒకతను ఇంటర్వ్యూ రూం తలుపును సున్నితంగా తట్టాడు… ‘‘సర్, నేను లోపలికి రావచ్చా..?’’ అడిగాడు… లోపల నుంచి ప్యానెల్ సభ్యుల్లో ఎవరో అన్నారు… ‘‘కమిన్’’… లోనకు వచ్చిన మనిషి ఏదో అడగబోయాడు… నో, నో, ఫస్ట్ సీట్లో కూర్చో అన్నాడు ఓ సభ్యుడు… సరేనంటూ తలూపి, వాళ్లకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తను… ఒకతను అడిగాడు… ‘‘ఈ రూం చూస్తే నీకేమనిపిస్తుంది…? ‘‘వెల్ ఫర్నిష్డ్ సర్… మెత్తటి కార్పెట్, మంచి కలర్స్‌తో విండో స్క్రీన్లు, ఓ […]
ఆ ఎలుకల చెవుల్లో కోరికలు చెప్పుకోవాలి… తరువాత గణేషుడికి చేరతాయి…
సాధారణంగా హిందువుల్లో, శివభక్తుల్లో ఓ నమ్మకం ఉంటుంది… శివుడిని ఏమైనా కోరుకునేవాళ్లు తమ కోరికల్ని శివుడి వాహనం నందీశ్వరుడి చెవుల్లో చెప్పాలి అని… తరువాత నందీశ్వరుడు శివుడికి చెప్పి, ఆ కోరికలు నెరవేరేలా చూస్తాడు అని..! అంటే సరైన సమయంలో మన కోరికల్ని నందీశ్వరుడు శివుడికి విన్నవిస్తాడన్నమాట… అప్పుడు మాత్రమే ఫైల్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట… సరే, భక్తుల విశ్వాసాలు వాళ్లిష్టం… అన్ని నమ్మకాలకూ హేతుబద్ధత ఉండదు… ఉండాల్సిన పనీ లేదు… అసలు దేవుడి అస్థిత్వమే అతి పెద్ద […]
మనమెంత దయా హృదయులం… ఎప్పుడైనా వెనక్కి తిరిగి పరీక్షించుకున్నామా..?
కొన్నేళ్లు దాటాక… ఎన్ని కోట్లు సంపాదించాం, ఏయే హోదాలు వెలగబెట్టామనే కాదు… కాస్త ఆత్మతృప్తిని, కాస్త పుణ్యాన్ని సంపాదించి పెట్టే ఏదైనా చిన్న పనిని, ఛారిటీని చేశామా..? ఒక్కసారి వెనక్కి తిరిగి అవలోకిస్తే ఏమైనా కనిపిస్తున్నాయా..? అసలు మనలో పరులకు సాయపడే గుణం ఉందా..? అప్పుడప్పుడూ ఆ మథనం కోసం ఇలాంటి పోస్టులు చదవాలి… ఇది మనల్ని మనం పరీక్షించుకోవడం కోసమే… ఈ స్టోరీలో కనిపించే ఉదాహరణ చాలా చిన్నది కావచ్చు… కానీ కనీసం ఆ చిన్న […]
అప్పట్లో పరీక్ష రాసుడు అంటేనే పెద్ద పరీక్ష… ఇప్పటి లెక్క సుకూన్ కాదు…
నిన్నటి నుంచి బడిపిలగాండ్లకు పరీక్షలు మొదలయ్యాయి. ప్యాంటు షర్టు వేసుకొని, జేబులో ఒక బాల్ పెన్ పెట్టుకొని, చేతులూపుకుంటూ వెళ్తున్న వీళ్ళను చూస్తుంటే మన రోజులు యాదికొచ్చినై.. పరీక్షల ముందు రోజు ఇంకు పెన్ను కడుక్కొని, పెన్ను పత్తి, గడ్డ, నాలుక శుభ్రంగా కడిగేది. పెన్ను పత్తి సాఫ్ చేసేందుకు నాయిన ఎఫ్ఫార్ డబ్బాలోని భారత్ బ్లేడు లేదా దోస్తుగాడి ఇంట్లోంచి పాత బ్లేడు సగం ముక్క తెచ్చి పత్తి మధ్యలో ఉండే సన్న అతుకు మధ్యలో […]
- « Previous Page
- 1
- …
- 9
- 10
- 11
- 12
- 13
- …
- 16
- Next Page »