ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా భయంకరమైన బాధ ఏమిటి? మరణం ముందు దీర్ఘకాల రోగం, ఆర్ధిక సమస్యలు, కోర్టు కేసులూ… ఉహు… ఇవేమీ కావు. అన్నిటి కన్నా పెద్ద సమస్య… మనకి ఇష్టం లేనివారితో కలిసి బ్రతకాల్సిరావటం. అవును. శారీరక బాధల్లోనూ, ఆర్ధిక సమస్యల్లోనూ, ‘ఎప్పటికైనా ఈ అవస్థ నుంచి బయట పడక పోతామా’ అన్న చిన్న ఆశ చిరుదీపంలా మినుక్కు మినుక్కు మంటూ ఉంటుంది. కానీ “కష్టసాధ్యమైన మనుష్యులతో” కలిసి ఉండటం కన్నా నరకం మరొకటి […]
టచింగ్ యాడ్..! సోది రొటీన్ యాడ్ కాదు… ఓ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్…!!
నిజానికి నేను గమనించలేదు ఈ యాడ్… ఓ మిత్రుడు పంపించి, చూస్తుంటే మనసు ద్రవించినట్టయింది అన్నాడు… తను అంతగా ఫీలయ్యాడు అంటే అందులో విషయం ఉన్నట్టే అనుకుని చూశా… కరెక్ట్… టచింగ్… ఎంత బాగుందో… నిజానికి ప్రసార మాధ్యమాల్లో తమ ఉత్పత్తుల ప్రచారానికి కంపెనీలు బోలెడు యాడ్స్ చేయిస్తుంటాయి… కోట్ల ఖర్చు, క్రియేటివ్ యాడ్ ఏజెన్సీలు… తమ ప్రకటన వినియోగదారుల్ని కనెక్ట్ కావాలి, దానికేం చేయాలి… ఇదొక పరిశ్రమ, ఇదొక ప్రయాస, ఇదొక మథనం… కొన్ని కంపెనీలు […]
అందుకే చెప్పేది… కవర్ పేజీ చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దు అని..!!
ఆరోజు అనుకోకుండా కలిశాడు తను… నా పాత క్లాస్మేట్… దాదాపు ముప్ఫయ్ సంవత్సరాలు అయ్యిందేమో మేం ఒకరికొకరం చూసుకుని… ఆ హోటల్ లాబీలో తనను చూడగానే మొదట సంబరం అనిపించింది… పాత మిత్రుడిని చూసినందుకు… అదేసమయంలో వాడిని చూసి జాలేసింది… మామూలు సాదాసీదా బట్టల్లో ఉన్నాడు… నా ఆడంబరపు అప్పియరెన్స్‌తో పోల్చుకుంటే వాడి మీద జాలేసింది అందుకే… నన్ను చూసి, నా పలకరింపు విని బాగా ఆనందపడ్డాడు… ఇద్దరమూ ఫోన్ నంబర్లు మార్చుకున్నాం… నా నంబర్ తీసుకుంటున్నందుకు […]
ఏ గంధర్వలోకం నుంచి ఆవిర్భవించాడో… నారదుడో, తుంబురుడో… ఏ అవతారమో..?!
పసివాడు కాదు పాదుషా! బాలగంధర్వుడు … ఎస్, చూడగానే, ఎవరైనా వాడిని పాలబుగ్గల పసిమొగ్గే అనుకుంటారు! కానీ, రిథమిగ్గా రాగం అందుకుంటే., వాడు గండరగండడే, స్వచ్ఛమైన గానగంధర్వుడే! సకల విద్యాప్రదాయిని సరస్వతీ కటాక్షంతో కళకళలాడుతోన్న ఈ బంగారుకొండ, పాటలఖనికి ఏడేళ్లు! పేరు ఆవిర్భావ్, సన్ ఆఫ్ సజైమన్, సంధ్య! స్వస్థలం కేరళ రాష్ట్రం ఇడుక్కీ! అక్క అనిర్విణ్యనే ఈ యంగ్ సింగర్ కు ఓనమాలు నేర్పిన ఆదిగురువు! ఈ చిచ్చరపిడుగు సంగీతంలో వేసే ప్రతి అడుగూ అక్క […]
మృత్యుపేటిక..! ఇంటికి వచ్చి మరీ నొప్పిలేని మరణాన్ని ప్రసాదిస్తుంది..!!
ఒక్కో దేశంలో ఒక్కో తీరు… కొన్ని దేశాలు మన చావు మనల్ని చావనిస్తాయి… అక్కడి చట్టాలు అడ్డుపడవు… బహుశా కారుణ్య మరణం అనాలేమో దీన్ని… నయం కాని రోగాలు, తీవ్రంగా అవస్థ పెడుతున్న వ్యాధులు, పీక్కు తింటున్న జబ్బులు, వృద్ధాప్య సమస్యలతో సతమతం అయ్యే వాళ్లు ఒకవేళ ‘ఇక మేం ఈ లోకాన్ని విడిచిపెడతాం, మాకు విముక్తి కావాలి’ అని బలంగా నిర్ణయం తీసుకుంటే… డాక్టర్లే అధికారికంగా ‘హతమారుస్తారు’… విషపు ఇంజక్షన్లు ఇచ్చి, ప్రభుత్వం ఇచ్చే అనుమతిని […]
సామాన్యుల బతుకుచిత్రాలు… ఆ చేతివేళ్లతో అలా అసామాన్య చిత్రీకరణ…
సామాన్య సౌందర్యశాస్త్రం… మొక్కజొన్న కంకులు అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి జీవితంలో చెప్పుకోదగ్గ సందర్భం, కళ్ళలో మైమరపు ఉంటుందని ఊహించగలమా ? వేడి వేడి టీ అమ్మే మహిళ ముఖం చల్లటి నవ్వులు చిందిస్తుందా? ఏ రోజు కారోజు సైకిల్ రిపేర్లు చేసుకుంటూ జీవితం గడిపే బడుగు వ్యక్తి ముఖంలో అనితర మందహాసం ఎలా సాధ్యం? వీళ్ళే కాదు… కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, చిందరవందరగా ఈగల మధ్య చేపలమ్ముకునే వ్యాపారి, చెరుకురసం అమ్ముకునే అతను… వీళ్ళందరూ మనందరికీ చిరపరిచితులే. […]
నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ… ఒంటరి హనీమూన్..!!
నాతో నాకే పెళ్లి… నాతో నేనే హనీమూన్ కు… “జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని మింటికి కంటిని నేనై జంటను […]
పంకీ… రిచ్చెస్ట్ అంబానీ ఇష్టపడే ఓ వెరయిటీ అరటి అట్లు..!!
అంబానీ ఇల్లే వేల కోట్లు… ఆస్తి లక్షల కోట్లు… కొడుకు ప్రీవెడ్డింగ్ ఖర్చు వందల కోట్లు… పెళ్లికయ్యే ఖర్చు లెక్కలేనన్ని కోట్లు… అన్నీ కోట్ల ముచ్చట్లే… అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి 2500 వంటకాలు అట… ఇన్ని వంటకాలు అనే వార్తే ఆశ్చర్యాన్ని, నవ్వును కలిగించింది… జస్ట్, తన సంపద ప్రదర్శనే తప్ప… అందులో పెళ్లి గెస్టులు ఎన్ని తింటారు..? తినడం మాట అటుంచితే ఎన్ని టేస్ట్ చేయగలరు..? ప్రత్యేకించి తనింట పెళ్లికి వచ్చే అతిథులందరూ […]
మన ఉప్మాకే కాదు, ఈ బెంగాలీ చద్దన్నానికీ ఆ వరల్డ్ సైట్ అవమానం…
మొన్న ఒక వార్త చెప్పుకున్నాం కదా… టేస్ట్ అట్లాస్ అను ఫుడ్ వెబ్ సైట్ (పాపులర్ ఇంటర్నేషనల్ సైట్) వరస్ట్ రెసిపీలు అని పది ఇండియన్ ఫుడ్స్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చిందనీ, అందులో మన ఉప్మా కూడా ఉందనీ..! ఆ జాబితాలో పాంటా భాత్ అనే వంటకం కూడా ఉంది… ఇది ప్రధానంగా బెంగాలీ (బంగ్లాదేశ్ కూడా) సంప్రదాయ వంటకం… సింపుల్‌గా చెప్పాలంటే మన చద్దన్నం వంటిదే… వంటిదే కాదు, చద్దన్నమే… కాకపోతే ఫ్రై చేసిన చేపల్ని లేదా […]
ఎలాగోలా ఆ రాత్రిని అలా జరిగిపోనివ్వండి… కరిగిపోనివ్వండి…
ఆ రాత్రి గడిచిపోనివ్వండి…. – మహమ్మద్ ఖదీర్‌బాబు బాంబేలోని బాంద్రా నుంచి పెడర్ రోడ్‌కు 15 కిలోమీటర్లు ఉంటుంది. కారులో గంట గంటన్నర పట్టొచ్చు. ఈ కొద్ది దూరం, ఆ కాస్త సమయం ఒక విలువైన ప్రాణం తీయగలదు– మంకుపట్టుకు పోతే. అక్టోబర్ 9, 1964. ఆ సాయంత్రం నుంచి గురుదత్ పెడర్ రోడ్‌లోని తన ఇంటిలో తాగుతూ కూచున్నాడు. అతనికి హఠాత్తుగా తన కూతురు నీనాను చూడాలనిపించింది. ఇష్టం ఆ పాపంటే. అప్పటికి సంవత్సరం రోజులుగా […]
టేస్ట్‌లెస్ సైట్..! ఉప్మా చెత్త వంటకమట… ముద్ర వేసేసింది..!!
టేస్ట్ అట్లాస్… పాపులర్ ఫుడ్ వెబ్సైట్… సూప్స్ దగ్గర నుంచి స్నాక్స్, మెయిన్ కోర్స్, కర్రీస్, డెజర్ట్‌ల దాకా రకరకాల కేటగిరీల్లో ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది… సరే, ఈ ర్యాంకుల ఖరారుకు పాటించే ప్రామాణికత ఏమిటో, శాస్త్రీయత ఏమిటో తెలియదు గానీ… ప్రపంచవ్యాప్తంగా ఫుడ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది… ఎటొచ్చీ… చాలా ర్యాంకుల్ని మనం అంగీకరించలేం… టాప్ ఫుడ్స్ మాత్రమే కాదు, వరస్ట్ ఫుడ్స్ ను కూడా అది వర్గీకరిస్తూ ఉంటుంది… అందులో మనం ఇష్టపడే ఐటమ్స్ ఉంటే […]
ఇది పిచ్చి మొక్క కాదు… కళ్లెదుట ఓ సూపర్ మూలిక… దీని విలువ తెలిస్తే కదా…!!
ఈ పోస్టు బాగా నచ్చింది… అల్లోపతీ వైద్యం డ్రగ్ మాఫియా, మెడికల్ మాఫియా చేతుల్లో చిక్కి, దోపిడీ శక్తుల పరమయ్యాక…. ప్రతి పల్లె, ప్రతి ఇల్లు ఈ దోపిడీతో నిలువునా చచ్చిపోతున్న దశలో…. మన దేశీయ వైద్యం, మన వారసత్వ వైద్యం, అందులోని ‘మంచి’, మన నిర్లక్ష్యం ఇంకా ఇంకా వెలుగులోకి రావాలి… రావాలీ అంటే ఇలాంటి కొన్ని ఉదాహరణలు కావాలి… పరిశోధనలు సాగాలి… ఢిల్లీలోని బ్యూరోక్రాట్ల మెదళ్లను ఆవరించిన అవినీతి, అక్రమాల వైరస్ చచ్చిపోవాలి… దేశీయ […]
ఆయన నవ్వడమే అరుదు… నా జవాబు విని చిన్నగా నవ్వాడు…
నిజానికి ఇది ఓ సీనియర్ జర్నలిస్టు స్వగతం, తన బయోపిక్‌లో ఓ చిన్న సీన్… పెరిఫెరల్గా చూస్తే ఇందులో న్యూస్ ఎలిమెంట్ ఏమీ లేదు… కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే… ఒకప్పుడు ఈనాడును రామోజీరావు ఎంత జాగ్రత్తగా నిర్మించాడో అర్థమవుతుంది… ఇప్పుడంటే ఈనాడును ఎవరుపడితే వాళ్లు ఆడేసుకుంటున్నారు గానీ ఒకప్పుడు రామోజీరావు ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా తనే చూసుకుంటూ, దాన్ని జాగ్రత్తగా పెంచాడు… ఈనాడులో ఒకప్పుడు ప్రతిదీ సిస్టమాటిక్, మెటిక్యులస్… ఆ పునాదులు అంత బలంగా […]
హవ్వ… సినిమా పాటల్లో అగ్లీ పదాలకు సినారె విఫల సమర్థన…
అనుకోకుండా ఎన్టీవీలో రష్మితో ఓ యాంకరిణి సంభాషణ వీడియో ఖర్మకాలి చూడబడ్డాను… జబర్దస్త్‌లో వెకిలి పదాలు, వెగటు భాష, అవన్నీ చూస్తూ పిల్లలు ఏమైపోతారు అంటూ ఈమె ఏదో అడిగింది… దానికి రష్మి ‘‘అవునండీ, ఆ షో రాత్రి తొమ్మిదిన్నర తరువాత… అప్పుడు పిల్లల్ని టీవీలు ఎవరు చూడమన్నారు..? పడుకోవాలి కదా… అది అడల్ట్స్‌ను ఉద్దేశించిన షో…’’ అని ఏదో సొల్లింది… అవును, అంతే… ఒక రష్మి నుంచి, ఒక అనసూయ నుంచి, మింగుడు భాషకు ప్రాచుర్యం […]
నాకు వేదికపై దక్కిన తోపుడు భాగ్యం చూసి… మీడియాకు ఒకటే కుళ్లు…
ఆయన తాగింది మందు కాదు… నన్ను తోసింది తోపుడు కాదు యావత్ సోషల్ మీడియా ట్రోలర్లకు మీ అభిమాన కథానాయిక వ్రాయు బహిరంగ లేఖార్థములు:- మొన్న ఆ వేదిక మీద ఆ కథానాయకుడు వాటర్ బాటిల్లో మందు పోసుకుని… తప్ప తాగి వేదిక మీదికి వచ్చి… స్పృహ లేని మైకంలో నన్ను తోస్తే… నేను దబ్బున పడబోయి… నిభాయించుకుని… నిలబడి… ఏడవలేక… నవ్వానని… మీరు వైన వైనాలుగా, చిత్రవిచిత్రాలుగా, దృశ్య విదృశ్యాలుగా, రకరకాల కామెంట్లతో ఆ వీడియోను […]
కొంతమంది డెస్టినీ… రాత రాసిన దేవుడికీ సమజ్ కాదేమో…
బాల్యంలో కిడ్నాప్ కు గురయ్యాడు… 22 ఏళ్లు కనిపించకుండా పోయాడు. ఇక తిరిగి రాడని… తమ బిడ్డ లేడని ఆ కుటుంబం శోకసంద్రమైంది. కానీ, మనిషికి దేవుడిచ్చిన ఓ వరం.. మరుపు! అలా కాలంతో పాటే… మానవ సహజంగా మర్చిపోయారు… అప్పుడప్పుడూ గుర్తుకొచ్చి ఆందోళన కనిపించినా.. చేసేదేమీలేదని తమకు తాము సర్ది చెప్పుకుని బతుకుతున్న ఆ కుటుంబానికి ఓ ఊహించని పరిణామమెదురైంది. అదే, తమ కొడుకు 22 ఏళ్ల తర్వాత… 29 ఏళ్ల వయస్సులో తిరిగిరావడం. మానవ […]
పాతదే .. కానీ ఎవర్ గ్రీన్.. మార్కెటింగ్ తెలివిలో పీక్స్ అన్నమాట…
ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతి పెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతి పెద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ? అడిగాడు బాస్. చెయ్యలేదు సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! . తర్వాతి […]
ఈయన ఎవరో తెలుసా..? ఆ రతన్ టాటా తమ్ముడు… ఫుల్ కంట్రాస్ట్, అజ్ఞాతి…!!
రతన్ టాటా… జగమెరిగిన పేరు… వేల కోట్ల ఛారిటీ, విలువలతో కూడిన వ్యాపారం, క్రమశిక్షణ, నిలువెల్లా భారతీయత, విశ్వసనీయత, పరిపూర్ణ జాతీయతత్వం ఎట్సెట్రా… టీవీలు, పత్రికలు, సైట్లు, చానెళ్లు, బిజినెస్ సర్కిళ్లు, పొలిటికల్-బ్యూరోక్రటిక్ సర్కిళ్లు, ఇతర ఇండియన్ అత్యధిక ప్రభావశీల సమూహాల్లో ఎప్పుడూ నానే పేరు ఆయనది… ఈ కేరక్టర్‌కు పూర్తి భిన్నమైన నీడ ఒకటి ఉంది… ఫుల్ కంట్రాస్ట్ కేరక్టర్… ఆయన పేరు జిమ్మీ టాటా… ఆ రతన్ టాటాకు స్వయానా తమ్ముడు… అసలు ఈయన […]
జీవితమంతా పని, సంపాదన మాత్రమేనా..? దేహం ఓ యంత్రమేనా..?
Veerendranath Yandamoori….. ఒలంపిక్స్ పరుగు పందెం జరుగుతోంది. మూడో బహుమతి పొందినవాడు భారతీయుడు. నాలుగవ స్థానంలో ఉన్నవాడు కూడా భారతీయుడే. మూడో స్థానం (కాంస్య పతకం) వచ్చిన వాడికి ప్రభుత్వం 50 లక్షలు బహుమతి ఇచ్చింది. ఉద్యోగం ఇచ్చింది..! స్టాటస్టిక్స్ చూస్తే మూడోవాడికీ, నాలుగోవాడికీ తేడా 0.01 సెకను మాత్రమే. స్ప్లిట్ సెకండ్ కి అంత విలువ ఉంది. దాన్నే ‘క్షణంలో వెయ్యవ వంతు’ అని రచయితలు అంటారు. ‘సమయాన్ని వృధా పరుచుకోవద్దు’ అంటే నా ఉద్దేశం […]
కౌంటింగ్‌కు రెండ్రోజుల ముందే రామోజీ హెడింగ్ రెడీ అప్పట్లో… మరిప్పుడు..?
ఏమిటి..? మరీ బజారులో నిలబడి బరిబాతల పోతురాజులా కొరడాతో కొట్టుకుంటున్నదేమి..? ఈ వికృత నర్తనం ఏమిటి..? అని పాఠకులు చాలామంది ఏవగించుకుంటున్నారు గానీ, తెలుగుదేశం పుట్టిన కొత్తలోనూ అంతే కదా… సాక్షి, నమస్తే, జ్యోతి కూడా అంతేకదా, ఇంకా ఎక్కువ కదా అంటారా..? ఆ దరిద్రాల గురించి కాదు… ఈనాడును దశాబ్దాలుగా తెలుగు జనం అక్కున పెట్టుకుని పోషించారు, పెంచారు, లక్షల కోట్ల సంపదలకూ, పెత్తనాలకూ ఆస్కారమిచ్చింది ఆ ఆదరణే… ఐనా సరే, తనలో పాత్రికేయ, ప్రజాస్వామిక […]
- 1
- 2
- 3
- …
- 34
- Next Page »