అహో.. లేక్ తాహో.. నిన్ను చూడగా రెండు కళ్లు చాలవే.. ’గాడ్‌ఫాదర్’ గుర్తుందిగా.. మొన్నొచ్చిన మన చిరంజీవిది కాదు. పాతది. ఇంగ్లీషు సినిమా. చాలా క్రైం, థ్రిల్లర్లకు మూలం. అందులో హీరో మైఖేల్‌ను చంపడానికి జరిగే సీన్‌ని ఎక్కడ తీశారో తెలుసా.. ప్రపంచ వెండితెరను ఏలిన నటి ఎలిజబెత్ టేలర్. ఆమె, మోంట్ గోమేరి క్లిఫ్ట్ నటించిన ట్రాజిడీ ఎపిక్ ’ఎ ప్లేస్ ఇన్ ది సన్’ కోసం సెట్స్ వేసిందెక్కడనుకున్నారు? 432 ఎపిసోడ్స్‌గా వచ్చిన తొలి […]
So Long Love… ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్లకు…
చాలామంది నమ్మరు మా ప్రేమకథను… అసాధారణ కాలహరణం… ఏళ్ల తరబడీ జాప్యం… నిరీక్షణకు మేం పర్యాయపదాలం… హమారా నబ్బే వాలా ప్యార్ థా… అంటే నైన్టీస్ నాటి ప్రేమ కథ… అప్పట్లో డైరెక్ట్ మెసేజుల్లేవు… వాట్సపుల్లేవు… ఆన్ లైన్ చాటింగుల్లేవు… కానీ ఒకరి పేరు వినిపించగానే మరొకరి హార్ట్ స్కిప్పయ్యే ప్రేమ మాది… అప్పుడు నాకు 18 ఏళ్లు అనుకుంటా నేను సంజయ్ గారిని తొలిసారి కలిసింది… తను నా బ్రదర్ స్నేహితుడు… కలిసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నా […]
ఈ బీరువా తలుపులు తెరవగానే… నా బాల్యం నన్ను నిండా కమ్మేస్తుంది…
ఆ బీరువాను మా అమ్మమ్మ అమ్మకు పెళ్లి సమయంలో ఇచ్చిందట… చాలా ఏళ్లపాటు ఆ బీరువా అంటే అమ్మకు అదోరకమైన అనుబంధం… ప్చ్, మాకన్నా ఆమె దాన్నే ఎక్కువ భద్రంగా చూసుకునేదంటే పెద్దగా ఆశ్చర్యం లేదు… కొత్తగా కట్టిన ఇంట్లో మంచి ఆధునికమైన వార్డ్ రోబ్స్, పెస్ట్ రెసిస్టెంగ్ ఫినిషింగ్, ఐరన్ సేఫ్ ఉన్నా సరే… ఆమె తన బీరువాను మాత్రం వదల్లేదు… మోడరన్ లుక్కులో అదొక్కటీ ఆడ్‌గా కనిపిస్తున్నదీ అంటున్నా వినేది కాదు… వస్తువుల మీద […]
ఒక అమ్మాయిని ఇటు ఇవ్వండి… ఇదుగో ఈ అమ్మాయిని మీరు తీసుకొండి…
అప్పట్లో పెళ్లిచూపులు అనేది ఓ పెద్ద తతంగం… పెళ్లికి అది పీఠిక వంటిదన్నమాట… అబ్బాయి తరఫు ఓ పటాలం అమ్మాయి ఇంట్లో దిగేది… సంప్రదాయికమైన పరిచయాలు జరిగేవి ముందుగా… ఓ స్టాండర్డ్ టిఫిన్ మెనూ మరియు కాఫీ… కేసరి, వంకాయ బజ్జీ ఎక్కువగా ఉండేవి… లేదంటే ఇంకేదో స్వీటు, చేగోడీలు… (ఆ బజ్జీల నుంచి ఒకరిద్దరు పిల్లలు నూనె కూడా పిండేస్తూ కనిపిస్తారు…) తరువాత అమ్మాయికి లిట్మస్ పరీక్ష ఉండేది… తండ్రి పిలవగానే వచ్చి కూర్చునేది… అందరి […]
హాయిహాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి… మందుజల్లి నవ్వసాగె ఎందుకో…
Moon Light:భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా… చాలా దగ్గరి చుట్టమే. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ. దేవదానవులు అమృతం కోసం వాసుకి మహా సర్పాన్ని తాడుగా చుట్టి… మంథర పర్వతాన్ని చిలికినప్పుడు… అమృతం కంటే ముందు లక్ష్మీ దేవి… ఆమెతో పాటు చంద్రుడు వచ్చారు. అమ్మ సోదరుడు కాబట్టి అలా మనకు చంద్రుడు మేనమామ అయి… జగతికి చందమామ అయ్యాడు. “పల్లవి:- చందమామను చూచి […]
ప్రపంచ వినోద రాజధానిలో ఓ మైనపు బొమ్మల కొలువు… చూస్తే అచ్చెరువు…
Akula Amaraiah……… మైనపు బొమ్మా, నువ్వెవరమ్మా! బొమ్మకు ప్రాణం పోసిన టుస్సాడ్స్.. లాస్ వెగాస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎలా ఉందంటే….. చూపు చుక్కల్లో ఉన్నా కాళ్లు నేలమీదుండాలిగా.. లండన్ పోతానో లేదో, పోయినా కారల్ మార్క్స్ సమాధీ, మేడమ్ టుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియం చూస్తానో లేదో… మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు వొలకబోసుడెందుకు? ఉన్నది చూస్తే పోలా! అనుకుంటూ లాస్ వెగాస్ టుస్సాడ్స్ మ్యూజియం బిల్డింగ్ ముందాగాను. నా మది కనిపెట్టిన మమ్మాయి దీప్తి.. […]
ఈనాడు స్పూర్తితో క్షుద్ర అనువాద ‘గీతం’… మీకు ‘కార్యశాల’ అంటే తెలుసా..?
కొత్తగా చాట్‌జీపీటీ వచ్చింది కదా… అంతకుముందు నుంచే గూగుల్ ట్రాన్స్‌లేషన్స్ తరీఖ చూస్తున్నాం కదా… మరీ కొత్తగా బాడ్ రాబోతోంది కదా… ఇవి గాకుండా మైక్రోసాఫ్ట్ అనువాదం వంటివీ ఉన్నాయి… నిజానికి ఏదీ సరైన అనువాదం కాదు, పైగా నవ్వు పుట్టించే అనువాదాలు… అన్నీ ఈనాడు అనువాదాల తరహాయే… ఈనాడులో వచ్చే అనువాద పదాలను చదివి మనం ఎన్నిసార్లు పకపకా నవ్వుకున్నామో కదా… అప్పుడప్పుడూ ఈనాడును చూసి సాక్షి, ఆంధ్రజ్యోతి, కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా వాతలు […]
శివాయ విష్ణు రూపాయ- శివరూపాయ విష్ణవే..! ఔను, అన్నీ రూపాయల లెక్కలే..!
Pronunciation:దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం అని అనుకుంటారు. దేవుడి వల్ల ఆదాయం, దేవుడి పేరుతో ఆదాయం అని విభక్తులను భక్తి నుండి వేరుచేసి అర్థం చేసుకుంది లోకం. “శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే” అంటే శివుడు- విష్ణువు ఒకటే అని అర్థం. శివుడు డబ్బుకు విలువ ఇవ్వడు […]
ఆరు బయట బహిరంగ గణేశుడు… అటవీమాత ఒడిలో కొలువైన దోస దేవుడు…
సాధారణంగా గుడి అంటే..? దేవుడు ఎవరైతేనేం..? సాధారణంగా గర్భగుడి, మంటపం, ప్రహారీ, ధ్వజస్థంభం, గంటలతోపాటు హుండీలు ఉంటాయి… పెద్ద గుళ్లయితే భక్తులను దోచుకోవడానికి స్పెషల్ టికెట్లు, కాస్త ప్రహారీ పక్కనే రకరకాల ఆర్జిత సేవల టికెట్లు అమ్మే ‘దుకాణాలు’ కనిపిస్తాయి… క్యూలైన్ల నిర్మాణాలు కూడా..! హనుమంతుడి గుళ్లూ అంతే… కాకపోతే హనుమంతుడు పేదవాళ్ల దేవుడు కదా, ఎక్కడైనా సరే వాటిని కట్టేస్తారు… ఎర్రగా చందనం పులిమిన విగ్రహం, రాముడికి దండం పెడుతున్నట్టుగా మూర్తి, ఓ చిన్న స్లాబుతో […]
- « Previous Page
- 1
- …
- 12
- 13
- 14








