Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!

April 27, 2022 by M S R

vagdevi

ప్రస్తుతం వివిధ చానెళ్లలో వచ్చే మ్యూజిక్ కాంపిటీషన్ల ప్రోగ్రాములకన్నా… ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ డెఫినిట్‌గా బెటర్… దానికి కారణాల జోలికి ఇక్కడ పోదల్చుకోలేదు… అది వేరే సబ్జెక్టు… ఇప్పుడున్న కంటెస్టెంట్లలో కాస్త బక్కపల్చగా ఉన్న ఓ అమ్మాయి మీద అందరి దృష్టీ ఫోకస్ అవుతోంది… పేరు వాగ్దేవి… ఊరు నెల్లూరు… అలై పొంగెరా పాడుతుంటే అంతటి థమన్ కూడా నోటమాట లేకుండా అలా వింటూ ఉండిపోయాడు… మంచి గొంతు… ప్లజెంట్ లుక్కు… ప్రత్యేకించి […]

పేరుకు పెద్ద పెద్ద వంటగాళ్లు… ఒక్కరికీ గసగసాల వాడకం తెలియదు…

April 21, 2022 by M S R

poppy seeds

ఖస్ ఖస్ అంటారు హిందీలో… తెలుగులో గసగసాలు… ఇంగ్లిషులో పాపీ సీడ్స్… మన ఈతరం వంటగత్తెలు, వంటగాళ్లు మరిచిపోయారు దాని వాడకం… ప్రత్యేకించి పెద్ద పెద్ద చేతులు తిరిగిన చెఫులకూ గసగసాల వాడకం తెలియదు… మిలియన్ల వ్యూస్ ఉన్న, వేయి వంటల వీడియోలు చూస్తే ఒక్క దాంట్లోనూ గసగసాలు వాడుతున్నట్టుగా లేదు… నిజానికి వేల ఏళ్లుగా గసగసాలు లేక భారతీయ వంటశాల  లేదు… అనేక వంటల్లో అవి పడాల్సిందే… ఇప్పుడేమో కిరాణా సామగ్రి జాబితా నుంచి మాయమైపోయింది […]

అసలు సమస్యేమిటి..? ఆడవాళ్లు ఆల్కహాల్‌ బ్రాండ్లను ప్రమోట్ చేయడమా..?

April 12, 2022 by M S R

pragya

అవునా..? నిజంగానా..? ప్రజ్ఞా జైస్వాల్ క్షమించరాని తప్పు చేసిందా..? ఒక ఆడ లేడీ ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తే అంత నేరమా..? కాస్త వివరాల్లోకి వెళ్దాం… అఖండలో ఫాఫం, బోయపాటి ఆమెతో నాకుడు భాష మాట్లాడింపజేసి, అంతటి బాలయ్యకే పచ్చడి నాకుడు, కల్లు తాగుడు నేర్పించాడు ఆమెతో… అఖండ తరువాత కాస్త మళ్లీ వెలుగులోకి వచ్చింది… అంతకుముందు పెద్దగా అవకాశాల్లేక డీలాపడి ఉండేది… ఓ వాణిజ్య ప్రకటన చేసింది ఈమధ్య… బోర్ బన్ బ్రాండ్ డ్రింక్ గురించి సోషల్ […]

చివరకు తోడుండేది ఓ పడక మంచం… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…

April 11, 2022 by M S R

alone

వయస్సు 85 ఏళ్లు… ముంబై నుంచి పూణెకు వెళ్లిపోతోంది… పూణెలో ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు… అనగా వృద్ధాశ్రమానికి… అంటే మీకు తెలిసిన వృద్ధాశ్రమాలను ఊహించుకోకండి… ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు… ఆమె చదువుకున్నదే… ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది… వాళ్లందరూ అమెరికా పౌరులు… అందరికీ ఇద్దరేసి పిల్లలు… వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు… ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది… కాన్పులు చేసింది… వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది… ఇక చాలు అనుకుంది… […]

రాములోరి లగ్గం పూట మామిడి సద్ది..! కంగాళీ చేయకండి, ఇలా చేస్తేనే అసలు రుచి…!!

April 10, 2022 by M S R

pulihora

శ్రీరామనవమి అనగానే… గుర్తొచ్చేవి పానకం, వడపప్పు… కొన్నిచోట్ల చలిమిడి… ప్రసాదం వరకూ ఇవి వోకే… కొత్త జనరేషన్ వాటి జోలికి పోవడం తగ్గిపోయింది, కొబ్బరికాయ కొట్టేసి, నాలుగు ఊదుబత్తీలు ముట్టించేసి దండం పెట్టేస్తున్నారు… అందరికీ పూజ తంతు తెలియాలని ఏముంది..? భక్తి మాత్రమే ముఖ్యం కదా… దేవుడు కూడా తప్పుపట్టడు… కానీ ఆత్మారాముడి కడుపు నింపే మెయిన్ కోర్స్..? పండుగపూట, అదీ రాములోరి లగ్గంపూట… నాలుకకు తీపి తగలకపోతే ఎలా..? అందుకే చాలామంది తమకిష్ఠమైన పాయసం చేసుకుని, […]

మంచి మానవాసక్తి కథనం… జీవం చంపేసిన ఈనాడు పాత్రికేయం…

April 9, 2022 by M S R

ఈ వార్త చదివేకొద్దీ అసహజంగా తోచింది… ఏదో ఉంది… అదేమిటో అర్థం గాకుండా ఉంది… సాధారణంగా ఈనాడు ఒక సంస్థను గానీ, ఓ కమర్షియల్ ఆర్గనైజేషన్‌ను గానీ ఓ వాణిజ్య ప్రకటన తరహాలో ప్రమోట్ చేస్తున్నట్టుగా వార్తల్ని అనుమతించదు… ఇదేమో దానికి భిన్నంగా ఉంది… డెస్క్ కూడా వార్తలో ధ్వనించే సందేహాలకు నివృత్తి ప్రయత్నం కూడా చేసినట్టు లేదు… ఏదో వార్త వచ్చింది, వేసేశాం అన్నట్టుగా ఉంది… అదీ మెయిన్ పేజీలో… విషయం ఏమిటంటే..? మంచిర్యాలకు చెందిన […]

చద్దన్నం వేరు… పెరుగన్నం వేరు… పాచిపోయిన కథనాలు వేరు…

April 9, 2022 by M S R

fermented rice

ఎంతటి ప్రయోజనకరమైన, సులభ అంశమైనా సరే… సంక్లిష్టం చేసి, నానా అబద్ధాలూ జతచేసి, సొంత పైత్యాలను తాళింపు వేసి, రుచీపచీ లేని వంటకంగా మార్చడంలో మన మీడియా తరువాతే ఏదైనా..! యూట్యూబర్లు, సైట్ల చెఫులను ఆడిపోసుకుంటారు గానీ, నిజానికి ఈ చెడగొట్టు విద్యలో మెయిన్ స్ట్రీమ్ మీడియా తరువాతే ఎవరైనా..! ఉదాహరణకు… చద్దన్నం..! ఈ చద్దన్నం గురించి మనం గతంలో కూడా రెండుమూడుసార్లు ముచ్చటించుకున్నాం… మళ్లీ ఎందుకు గుర్తుచేసుకోవడం అంటే… చద్దన్నం గురించి ఎవరికి తోచినట్టు వాళ్లు […]

మామిడికాయ పప్పుచారు… యూట్యూబ్ వంటల వీడియోలతో జాగ్రత్త సుమీ…

April 8, 2022 by M S R

mango

ఎంతసేపూ ఆ చెత్తా రాజకీయాలు, నేరాలు, ఘోరాలేనా..? కాస్త ఆత్మారాముడి సంగతీ చూద్దాం… మొన్నొక ఫేస్‌బుక్ దోస్తు బాధపడిపోయాడు… యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసి వంటలు చేయడం చాలా కష్టం సుమీ అని…!! కానీ చాలామందికి కాస్తోకూస్తో వంటలు నేర్పిస్తున్నది యూట్యూబే… కాకపోతే సదరు వీడియోల్లో చూస్తూ మక్కికిమక్కీ చేయాలని ప్రయత్నించడంతో వస్తుంది సమస్య… ఓ ప్రధాన సూచన, సలహా ఏమిటంటే… యూట్యూబ్ వీడియోల నుంచి వివిధ పంటల బేసిక్స్ తెలుసుకోవాలే తప్ప యథాతథంగా అనుసరించొద్దు… ప్రత్యేకించి […]

అమ్మ… ఆమె చేతిలో అదే పాత చీపురు… అదే పని… నిర్వికారంగా…

April 6, 2022 by M S R

kaur

పంజాబ్… బర్నాలా జిల్లాలోని ఉగోకే… ఆమె పేరు బల్దేవ్ కౌర్… ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్… అదీ కంట్రాక్టు పద్ధతిన… 22 ఏళ్లుగా కంట్రాక్టు జీతమే… ప్రతి ఏటా క్రమబద్ధీకరణకు ఆమె దరఖాస్తు చేసుకుంటుంది, ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుంది… భర్త కూలీ… ఆ ఇంటికి ఆమె తీసుకొచ్చే జీతమే ప్రధాన ఆధారం… పొద్దున్నే ఓ చీపురు తీసుకుని స్కూల్ వెళ్లడం, ఆవరణతోసహా గదులన్నీ క్లీన్ చేయడం, లాంగ్ బెల్ కొట్టేదాకా అక్కడే ఉండి, ఇంటికి వచ్చేయడం… అదే […]

పొట్టలో పట్టినంత..! పదిరకాల కోస్తా స్పెషల్ టిఫిన్లు… కాస్త వెలితి ఏంటంటే..?!

April 2, 2022 by M S R

buffet

ఎవరి వాల్ మీదో కనిపించి, కాసేపు మౌస్ అలా ఆగిపోయింది… అది ఫుడ్ మీద పోస్టు కాబట్టి… అలవాటైన తెలుగు టిఫిన్లు కాబట్టి… కాకపోతే కోనసీమ వంటిల్లు పేరిట హోటల్ పెట్టుకున్నాడు ఒకాయన… కూకట్‌పల్లిలో… అందుకని ఈ టిఫిన్లకూ ఆంధ్రా పేర్లే పెట్టాడు… అసలు అదికాదు, 120 రూపాయలకు అన్‌లిమిటెడ్ బఫె బ్రేక్ ఫాస్ట్ అనే స్కీమ్ ఆకట్టుకుంది… ఇలా క్లిక్ చేయగానే అలా ఇన్‌స్టాగ్రాంలో హైదరాబాద్ ఫుడ్ ట్రిప్ అనే ఖాతాకు తీసుకుపోయింది… నిజానికి బఫె […]

హబ్బ… ఏం ఇంటర్వ్యూ వేశారు సార్… భక్తిప్రపత్తులతో అద్దిరిపోయింది…

April 2, 2022 by M S R

sitara

మొన్నామధ్య ఎవరో కలంవీరుడు అపరిమితమైన ఆనందభక్తివిశ్వాసాలు తాండవిస్తుండగా… రాజమౌళి వైపు అత్యంతారాధనగా చూస్తూ… జక్కన్న కాలంలో జర్నలిస్టుగా పుట్టడం ఈ జన్మకే అదృష్టం అని పులకరించి, పరవశించిపోయాడు… చాలామంది పకపకా నవ్వుకున్నారు… జర్నలిజం మరీ ఈ స్థాయికి పడిపోయిందా అని బోలెడుమంది బాధపడ్డారు… ఇక చరిత్రలో ఇంతకుమించిన దరిద్రపు ప్రెస్‌మీట్ ఇంకొకటి ఇప్పట్లో రాకపోవచ్చునని కూడా బొచ్చెడుమంది ఈసడించుకున్నారు… ఎందుకు..? అతి… ఓవర్… టూమచ్… ఆంధ్రజ్యోతి పత్రిక, నవ్య పేజీలో మహేశ్ బాబు బిడ్డ సితారతో చేసిన […]

ఆ నలుగురు కూతుళ్లు… కన్నీళ్లతో… ఆ అమ్మ దేహంతో అటూ ఇటూ…

March 31, 2022 by M S R

నిజానికి ఈరోజు అన్ని పత్రికల్లోనూ కనిపించాల్సిన వార్త ఇది… మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు రాజకీయ రంగులు పూసుకుని డప్పులు కొట్టుకోవడానికి, ప్రత్యర్థి పార్టీలను తిట్టడానికే స్పేస్ సరిపోవడం లేదు… ఇక అసలైన వార్తలకు, ప్రజాకోణంలో అవసరమైన వార్తలకు చోటెక్కడిది..? వార్త ఏమిటంటే..? మధ్యప్రదేశ్ రాష్ట్రం… రేవా జిల్లా… రాయ్‌పూర్ గ్రామం… 80 ఏళ్ల ములియా కీవత్‌కు తీవ్ర అనారోగ్యం… పరిస్థితి విషమిస్తోంది… ఏం చేయాలి..? సమయానికి ఎవరూ ఆదుకునేవాళ్లు లేరు..? అయిదు కిలోమీటర్ల దూరంలో కుర్చలియన్ […]

ఇవేం సంగీత పోటీలుర భయ్… సక్కగ ఆర్కెస్ట్రా కూడా ఉండదు…

March 31, 2022 by M S R

orchestra

ఇండియన్ ఐడల్ హిందీ షో… సోనీలో… అరుణిత తేరే మేరే బీచ్ మే పాట పాడుతోంది… దాదాపు 30 వయోలిన్లు… ఇతరత్రా ఫుల్ ప్లెడ్జ్‌డ్ ఆర్కెస్ట్రా టీం, పరికరాలు… వీనులవిందు… సంగీతాభిమానిని ఓ తాదాత్మ్యంలోకి తీసుకుపోతుంది ఈ వాతావరణం… ఇండియన్ ఐడల్ తెలుగు షో… ఆహా ఓటీటీలో… ఓ గాయకురాలు ఏదో పాడుతోంది… నిజానికి ఎక్కువగా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించాల్సిన పాట అది… థమన్ కూడా అదే అన్నాడు, ఏఆర్‌రెహమాన్ కనీసం 200, 250 మందితో ఈ పాట […]

దిసీజ్ కాల్డ్ వైఫిజమ్ యు నో..? లిజన్, వైఫ్ ఈజ్ ఆల్వేస్ వైఫ్… దట్సాల్…

March 31, 2022 by M S R

wife

Bharadwaja Rangavajhala ……………… మిసెస్ తేడా సింగ్ … లెక్చ‌ర్ ఆన్ మేల్ డామినేటెడ్ సొసైటీ ఈ మేల్ డ్యామినేటెడ్ సొసైటీలో ఫీమేలుగా పుట్ట‌డం క‌న్నా ఏ ఫారెస్టులో అయినా ట్రీగా పుట్టినా మంచిదే అని ఎవ‌డో లిట‌ర‌రీ ప‌ర్స‌న్ అన్న‌ట్టు స‌మ్ మౌ నా చిన్న‌త‌నంలో విన్నాను.. వాళ్లే మ‌న‌ల్ని డామినేట్ చేసి … మ‌న‌మేదో వాళ్ల‌ని వేదిస్తున్నామ‌ని మ‌న మీద జోకులేస్తూంటారు.. దిసీజ్ రెడిక్యుల‌స్ .. మా ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగింది వింటే అవాక్క‌వుతారు… […]

మోడీ కూడా వొస్తే మస్తు గమ్మతుంటది కథ… మరి కేసీయార్ ఏం జేయాలె..?!

March 30, 2022 by M S R

bhadrachalam

కేసీయార్… యాదగిరిగుట్టను డెవలప్ చేసిండు… ఇంగ ఎములాడను ఉద్దరిస్తా అంటుండు… గట్లనే కొండగట్టు అంజన్న గుడినీ డెవలప్ చేస్తడట… జిందగీల ఇంగ ముచ్చింతల్ సమతా మూర్తి దిక్కు పోడు… భద్రాచలం పట్టించుకోడు… ఎందుకో తెల్వదు… బీజేపోళ్లను ఎక్కడికీ రానియ్యడు… కనీ వాళ్లు ఊకుంటరా..? కేసీయార్‌కు పట్టనివి వాళ్లు పట్టించుకుంటరు… చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ దిక్కు కేసీయార్ అస్సలు పోడు, గుంజుకపోయినా రాడు… బీజేపోళ్లు పోతరు… ఎన్నికలొస్తే కంపల్సరీ పోతరు… బండి సంజయ్ బండి తాపతాపకూ అటే […]

యాదికుందానుల్లా..! గీ రామ్ములక్కాయల తొక్కు… నిన్నియాల కానొస్తలెవ్వు…

March 27, 2022 by M S R

small tomatoes

ఎంత మంచిగ రాసిండు సారు… మనం గప్పట్ల ఆన్యపు కాయల గురించి చెప్పుకున్నం కదా… ఏక్ దమ్ జబర్దస్త్ కాయగూర అది… ఇంటింటినీ అర్సుకునేది… గట్లనే రాములుక్కాయలు గూడ… పోనీ, రామ్ములక్కాయలు అందాం… వాటి మీద Sampathkumar Reddy Matta… రాసిన రామసక్కదనపు రాములుక్కాయలు పోస్టు చదువుతుంటే… నిఝంగ సకినాలకు, సర్వపిండికి, మక్క గట్కకు, పజ్జొన్న రొట్టెకు రామ్ములక్కాయల అంటుపులుసు అంచుకు పెట్టుకున్నట్టే అనిపిస్తంది… చెప్పుడు దేనికి..? మీరే చదువుకోండ్రి… ఇదుగో… సారుకు శనార్తులతో… ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ పులినిజూసి, […]

పంటి కిందికి పలుగురాళ్లు… ఎస్పీ బాలు మహా బాగా చెప్పాడు…

March 20, 2022 by M S R

alai

నిన్న మనం ఓ పాట గురించి మాట్లాడుకున్నాం… ఊత్తుకాడు వెంకటసుబ్బ అయ్యర్‌ రాసిన అలై పొంగెరా గీతాన్ని వేటూరి అబ్బురంగా అనువదించిన తీరు గురించి… గాదిలి పదాన్ని కాదిలి అనే గాయకులు పాడటం, దానికి కారణం గట్రా చెప్పుకున్నాం కదా… ఇంత పాపులర్ గీతం కదా, ఏ స్వరాభిషేకంలోనో, ఏ పాడుతా తీయగా షోలోనో ఎస్పీ బాలు వివరణలు, సందేహనివృత్తులు ఏమైనా ఉన్నాయేమో అని వెతికితే… ఎప్పటిదో పాడుతా తీయగా వీడియో కనిపించింది… తను చెప్పిన కొన్ని […]

ఆహా… ఊత్తుక్కాడు వెంకట కవి – ఊపిరులూదే వేటూరి కవి… స్వరసౌభాగ్యం…

March 19, 2022 by M S R

vagdevi

……….. By…. విప్పగుంట రామ మనోహర అలై పాయుదే కన్నా… అలై పొంగెరా కన్నా. సఖి సినిమాలోని పాటగానే చాలా మందికి తెలుసు. ఊతుకాడి వెంకట సుబ్బయ్యర్ కవి రాసిన కృతిగా సంగీతాభిమానులకి తెలిసి ఉంటుంది. నాకు తెలీదు. పోయిన వారం ‘ఆహా’ లో తెలుగు ఇండియన్ ఐడల్ లో వాగ్దేవి అనే సింగర్ ఈ పాట పాడి జడ్జిల ప్రశంసలు అందుకుంది. ఆ ఎపిసోడ్ చూశాక అలై పొంగెరా లిరిక్స్ కోసం వెదికా. వేటూరి రాసిన పాట. […]

ఇదీ ఓ వార్తేనా..? ఇది సరైన వార్తేనా..? ఆ అంబానీ మనమడు ఐతేనేం..!?

March 18, 2022 by M S R

ఏది వార్త..? ఏది సరైన వార్త..? వార్త ఎలా ఉండాలి..? వార్త ప్రమాణాలు ఏమిటి..? ఈ ప్రశ్నలకు ప్రపంచంలో ఎవడూ సరిగ్గా జవాబులు, నిర్వచనాలు చెప్పలేడు… కీర్తనలే కథనాలుగా మారిన ఈరోజుల్లో మరీ కష్టం… ఒకప్పుడు పండితులు తమకు ఆశ్రయమిచ్చిన చక్రవర్తులు, రాజులను శ్లోకిస్తూ, భజిస్తూ, వాళ్లను విష్ణుస్వరూపులుగా చిత్రిస్తూ, రాజుల పట్ల ప్రజల్లో భయభక్తులు పెంచే రచనలు చేస్తూ, రాజుల కొలువులో ఇదే కొలువుగా చేస్తుండేవారు… ఇప్పుడూ అంతే… మనం అనుకుంటున్నాం, మారిపోయామని… నెవ్వర్… మరింత […]

స్వామివారు ప్రవచనాలు, ప్రసంగాలు మానేస్తే… అదే వైష్ణవానికి గొప్ప సేవ..!!

March 18, 2022 by M S R

chinna jiyyar

పురాణాల్లోని అనేకానేక అంశాలకు బాష్యం చెప్పడంలో, వివరణ ఇవ్వడంలో, సందేహ నివృత్తిలో ఉషశ్రీ పేరు చెబుతుంటారు… ఒక ప్రవచనం గురించి ఉదహరించాలంటే చాగంటి పేరు చెబుతుంటారు… అవధానం ప్లస్ ప్రవచనం గరికపాటి ఫేమస్… వీళ్లే కాదు, బోలెడుమంది ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుంటారు… అసలు దైవసంబంధ, మతసంబంధ అంశాల్ని అరటిపండు ఒలిచినోట్లో పెట్టినట్టుగా చెప్పడం ఓ కళ… పిట్టకథలు, సరస సంభాషణలు, చమక్కులు, నడుమ నడుమ పద్యాలు, పాటలు, రాగాలతో కొందరు భలే రంజింపజేస్తారు, రక్తికట్టిస్తారు… ఇప్పుడంటే హరికథల్లేవు […]

  • « Previous Page
  • 1
  • …
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • …
  • 26
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions