Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మా వైపున అత్తా అల్లుడూ ఎదురుపడి మాట్లాడుకోరాయె… మరెట్ల…

January 23, 2024 by M S R

roti podi

రోటిపొడి – రోకటిపోటు ~~~~~~~~~~~~~~~~ పండుగ రెండుమూడు రోజులూ కొద్దిగంత తీరుపాటం దొరికింది గద. మా పిల్లలకు హాస్టలుకు పంపుటానికని ఓ రెండు తీర్ల పొళ్లు చేద్దామని ముందేసుకున్న. పండుగకు ఊరికి పోయినము గనుక– కట్టెల పొయ్యి దొరికె, రోలూరోకలిబండా దొరికె. పచ్చని ఆక్కూర చెట్లూ, పప్పులూ, పంటలూ దొరికె. వాటిని పలుకరించుకోకపోతే ఎట్లా అని.. ఇట్లా ఓ పని. రోలుదే మొగడా ! రోకలిదే మొగడా! రోలుకాడ నన్నెత్తెయ్యి మొగడా.. !! అని సామెత. నేనూ.. […]

గురుదక్షిణ..! గురువుకు ఏదో ఇవ్వనక్కర్లేదు… గురువు మెచ్చే పని చేస్తే చాలు…

January 22, 2024 by M S R

sishya

డిసెంబరు 21, 1946… మైలాపూర్, వివేకానంద కాలేజీ, ఇంటర్మీడియెట్ క్లాస్… ఓ క్లాస్‌కు అయిదు నిమిషాలు లేటుగా వెళ్లాను… మా ఇంగ్లిష్ ప్రొఫెసర్, కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేశాడు… ‘సారీ సర్, నాకు కాస్త లేటయింది…’ ‘వోకే, వోకే, కమిన్… లంచ్ బ్రేకులో ఓసారి కలువు..’ 12.15 గంటలు… ఆయన ఆఫీసుకు వెళ్లాను… ‘క్షమించండి సార్, అనుకోకుండా రోజూ వచ్చే దారిలో డైవర్షన్… అందుకని ఇంకాస్త ఎక్కువ దూరం ఉండే దారిలో […]

సంక్రాంతి అంటే పీడ పండుగ అని ఊళ్లల్లో ఎందుకంటారు..?

January 20, 2024 by M S R

Sankranthi

Sampathkumar Reddy Matta….  సంకురాత్రి.. పీడపండుగ ~~~~~~~~~~~~~~~~~ చిన్ననాడు, అంటే నా డిగ్రీ పూర్తయేదాకా పుస్తకాలు,రేడియోలు, టీవీలు, సినిమాలు… సంక్రాంతికి పంటలు ఇంటికి వస్తయని చెప్పేవి. కానీ మా ఊర్లల్ల దీలెకే పంటలు ఇంటికొస్తయాయె. రెండుపంటల మధ్యకాలంలో సంక్రాంతి వస్తదిగదా మరి ఇదేంది?? ఇవన్నీ ఇట్లచెప్తయని అనిపించేది. గంగెద్దులవాళ్ళూ, మిత్తిలివార్లూ, బొబ్బిలివాళ్ళూ.. వానకాలపు పంటకల్లాల కాడికి తప్పకుంట వచ్చేవారు. సంక్రాంతి నెలపెట్టిన తర్వాత వారు ఇండ్లల్లకు వచ్చినా అది ధనుర్మాస సంస్కృతిలో భాగంగానే కనిపించేది. అంతేకానీ, అది […]

పశువులకు పండుగ భోజనం… అదే కనుమ/ కలుమ/ కరి పండుగు…

January 16, 2024 by M S R

kanuma

Sampathkumar Reddy Matta….. కాయకష్టంజేసే మూగజీవాలను పూజించుడు– సంక్రాంతి పండుగల ఒక ముఖ్యమైన ముచ్చట ! కనుమ నాడు వెనుకట మన దగ్గర కాపుదనపోళ్లు పశువులకు కాటి రేవుల పండుగ & దొడ్డి పండుగ జేద్దురు. ఊరమందలకు ఉమ్మడిగ జేసేది కాటిరేని పండుగైతే, ఎవరి దొడ్డికి వారు ఇంటిమందం జేసుకునేది దొడ్డిపండుగ. పొద్దుగాలనే.. దొడ్డి/ కొట్టం /గుడిసె శుభ్రం జేసి పసులకు పెయిగడిగి, కొమ్ములకు ౘమరు రాసి, మెడలల్ల గంటల చెలిదండలు, పట్టెలు అలంకరిద్దురు. తర్వాత దొడ్లెనే […]

ఒరేయ్ అప్పల్నాయుడూ మనోడు దంచినాడ్రా… ఒక్కొక డవిలాగ్…

January 8, 2024 by M S R

tandel

ఒరేయ్ అప్పల్నాయుడూ మనోడు దంచినాడ్రా… ఒక్కొక డవిలాగ్.. ఒక్కొక్క మాట ఇంటుంటే అచ్చం మనూరి గుంటడు సూరిగాడు లేడూ .. అచ్చం ఆడు మాట్లాడుతున్నట్లే ఉందిరా .. ఆడికన్నా ఈడికి ఒళ్లీరుకు కుసింత ఎక్కువే ఉన్నట్లుంది .. మహా సుల్లారం గుంటడి క్యారెక్టర్… అచ్చం దించీనాడు అనుకో… ఓడియమ్మా … ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకనుంచి ఇంకోలెక్క… మన బాసకూ ఫై స్టార్ రేటింగ్ వచ్చేత్తాది.. ఎప్పుడో రావడం కాదురా.. అల్రెడీగా వచ్చిసింది.. ఇకనుంచి ఎవుడైనా మన […]

రుచిలో వంకలేని నంబర్‘వన్’కాయ… ఇష్ట వంటకానికి ఇంత అవమానమా..!!

January 3, 2024 by M S R

aloo baingan

మీకు ఏ వంటకం ఇష్టం అనడిగితే… బోలెడు వంటకాలు చకచకా మన బుర్రలో రీల్‌లా తిరుగుతాయి… ఒకటోరెండో సెలెక్ట్ చేసుకోవడం కష్టం… ఏ వంట అస్సలు ఇష్టం ఉండదు అనడిగినా సరే, అదే స్థితి… ఉప్మా ప్రియులకు నచ్చకపోవచ్చుగాక… ఉప్మాను చాలామందిని ఇష్టపడరు ఎందుకోగానీ… నిజానికి వండటంలో సౌలభ్యం, చౌక, టైమ్ తక్కువ ప్రాతిపదికల్లో అదే బెస్ట్ వంట… ఎట్‌లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో… అందుకే ఫంక్షన్లలో టిఫిన్ అనగానే, ఇంటికి బంధువులు రాగానే చటుక్కున ఉప్మాయే […]

జిలుకర ఎల్లిపాయలు వేసి గోలిచ్చి, రోట్లెనూరిన.. ఎర్ర మిరుప కారం !

January 2, 2024 by M S R

food

వెనుకటి తిండి~~~~~~~~~~ ఓమ, నువ్వులువేసి ఉప్పి, కొట్టిచేసిన.. తెల్లజొన్న రొట్టె ! జిలుకర ఎల్లిపాయలు వేసి గోలిచ్చి, రోట్లెనూరిన.. ఎర్రమిరుప కారం !! అచ్చమైన తెలంగాణపల్లె సంప్రదాయకమైన తిండి. సాయజొన్న ముచ్చట: వెనుకట సాయజొన్న పంట పండుతుండే. చెరువుల కింద ఉన్న వందురు పొలంల తప్ప వరి పంటకు పెద్దగ విలువ లేని బంగారు కాలమది. వానకాలం, చలికాలం రెండు పంటలు జొన్నపంట పండేది. ఈ చలికాలంల కేవలం మంచుతో పండే జొన్నే సాయజొన్న. ఎనబై యేండ్ల […]

న్యూట్రెండ్… కండోమ్స్ ఆర్డర్లకూ… ఓయో రూమ్స్ బుకింగ్స్‌కూ… ‘అదే లింకు’’…

January 2, 2024 by M S R

oyo

కొత్త సంవత్సరం వస్తున్న వేళ నిమిషానికి 1244 బిర్యానీలు  ఆర్డర్లు ఇచ్చారట ఫుడ్ ప్రియులు… అదీ స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ సప్లయ్ ప్లాట్‌ఫారాలుగా… పెద్ద విశేషం ఏమీ కాదు, నిజానికి హోటళ్ల నుంచి స్వయంగా తీసుకువెళ్లిన ఫుడ్ పార్సిళ్ల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది… పైగా భారతీయులకు బిర్యానీని మించిన ప్రియవంటకం ఏముంటుంది..? మాంచి మసాలా… అవును, మసాలా వేళల్లో అదే కదా కోరుకునే డిష్… 2 లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల […]

తెలుగు మనుగడకు ఢోకా లేదు… ‘చచ్చినట్టు’ బతికించే భాష… బతికే భాష…

January 2, 2024 by M S R

తెలుగు

శంకర్ జీ……. *సుందర తెలుగు….* ఆసాంతం చదవండి…. సరదాగా, నవ్వుకోవడానికి… *చచ్చినట్టు’ బతికించే భాష!* తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి! అందరూ పొగ *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.* -ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు’. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. *ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, […]

Indira Canteen :: ఆకలితో ఉన్నవాడికే ఆహారం విలువ తెలిసేది…

December 30, 2023 by M S R

airport

మొన్నామధ్య సోషల్ మీడియాలో బాగా విమర్శలు వినిపించాయి… కనిపించాయి… కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మీద..! అదేమిటయ్యా అంటే..? బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం చౌక ఆహారం కోసం ఇందిరా క్యాంటీన్ పెడుతుందట… 5 రూపాయలకు టిఫిన్, 10 రూపాయలకు మీల్స్… రెండు క్యాంటీన్లు పెడతారు… ఠాట్, ఎయిర్‌పోర్టుకు వెళ్లేవాళ్లు, విమానాల్లో తిరిగేవాళ్లు ఏమైనా పేదవాళ్లా..? వాళ్లకు ఎందుకు చౌక ఆహారం..? నాన్సెన్స్, అన్ని రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో పెట్టండి, గుడ్, కానీ ఈ ఎయిర్‌పోర్టులో […]

కొడుకు సంసారంలో కాళ్లూవేళ్లూ పెట్టకండి… చేతులు కాల్చుకోకండి…

December 29, 2023 by M S R

oldage

ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు చెప్పిన రిటైర్డు ఫ్యామిలీ (సుప్రీమ్) కోర్టు జడ్జి గారు…. (1) ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండ మనండి. మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి. (2) మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి. లేదా ఒక ఫ్రెండ్ గానే […]

చలిచలిగా ఉందిరా ఒయ్‌రామా ఒయ్‌రామా… ‘హుషారుగా వణికించే’ పాటలివి…

December 29, 2023 by M S R

cool

Bharadwaja Rangavajhala…….   చలి చంపుతున్న ఛమక్కులో…. చలి తత్వ గీతమాలిక… చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి … చలిని అడ్డం పెట్టుకుని సాహిత్య విలువల్ని దెబ్బతీయకుండానే ఆహ్లాదకరమైన రొమాన్స్ అందించడం అనేదేదైతే ఉందో […]

పిశాచి… ఈమెను అమ్మ అని పిలవొచ్చా..? కంటేనే అమ్మ అంటే ఎలా..?

December 27, 2023 by M S R

priyanka tiwari

నిన్ననే కదా… రైలు పట్టాల మీద ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన సాహసం, ప్రేమ, తెగువ చదివాం, వీడియో చూశాం… అందరమూ చప్పట్లు కొట్టాం… దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని మరోసారి చెప్పుకుని ఆనందపడ్డాం కదా… కానీ కొన్ని పూర్తి వ్యతిరేక మొహాలు ఉంటయ్… ప్రియుల కోసం కన్నబిడ్డలకు విషం పెట్టి కడతేర్చిన తల్లుల కథలు విన్నాం కదా, చదివాం కదా… ఇదీ అలాంటిదే… ఓ తల్లి, కాదు, ఓ […]

ఎడ్లకు పిండప్రదానం, పెద్ద కర్మ, అస్థికల నిమజ్జనం… అదీ రైతుతో బంధం…

December 26, 2023 by M S R

oxen

కని పెంచిన తల్లిదండ్రులను కాటికి పంపించిన కొడుకుల్ని, బిడ్డల్ని చూశాం… ఎక్కడికో తీసుకెళ్లి, కాటకలిపి అగాధం చేసిన పిల్లన్నీ చూశాం… నిర్బంధంగా ఓల్డేజీ హోమ్స్ పాలుచేసిన వాళ్లను, బయటికి నెట్టేసి తలుపులు మూసుకున్నవాళ్లను, సజీవంగా స్మశానాల్లో పారేసివచ్చినవాళ్లను కూడా చూశాం… కలికాలం… కాలమహిమ అనుకుంటున్నాం… కానీ అదే సమయంలో… పెంపుడు జంతువులకు సొంత పిల్లలుగా ప్రేమించేవాళ్లనూ చూశాం, ఆస్తులు రాసిచ్చి వైభోగంగా బతికే ఏర్పాట్లు చేసినవాళ్లనూ చూశాం… ప్రస్తుత వార్త విషయానికొస్తే… సాధారణంగా వ్యవసాయం పనుల్లో తోడ్పడే […]

ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు…

December 19, 2023 by M S R

parrot

ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..! ” మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను” అని కన్నీరుపెట్టుకుంది..! దానికి ఇంద్రుడు… “దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది […]

పుంటి కూర పూరెక్కలు ఉప్పుకారంతో తినుడు ఒకనాటి పద్ధతి…

December 10, 2023 by M S R

punti flowers

కొట్టుకతిన్నదే బాల్యం~~~~~~~~~~~~~~~ ఈ మాగికాలంల చెల్కమీద దొరికే తిండి మస్తు. జామ కాయలు దోస కాయలు గంగరేగు వంఢ్లు చింత కాయలు పుంటి కూర పూలు… దేనికయినా నెఱీ పులుపుకైతె ఇంత ఉప్పుకారం అంటించి కొస నాలుకకు తాకిస్తే.. అదే అతి మధురం. పుస్తకాల సంచిల సెలవస్తె లాగు జేబులల్ల ఉప్పు పొట్లం, కారప్పొట్లం ఎప్పుడుండేది. కోమట్ల దుకాండ్ల ఏం ఉంటుండే గనుకా మా అంటె రసగుల్లలు, బొంగులు, పిప్పరమెట్లు. అదే చెల్కమీదికివోతె అరొక్కతీరు కాయలూ పండ్లూ. […]

తీరొక్క తీపి..! స్వీట్ల జాతర..! మధుమేహులు కుళ్లుకునే విందు…!

December 5, 2023 by M S R

sweets

తీపి జ్ఞాపకం… తెలుగు తీపులు అనంతపురం- హోళిగలు కర్నూలు- కోవా పూరీ చిత్తూరు- కోవా జాంగ్రీ ఒంగోలు- అల్లూరయ్య మైసూర్ పాక్ తాపేశ్వరం- కాజాలు పెద్దాపురం- పాలకోవా నెల్లూరు- మలై కాజాలు పెనుకొండ- పాకం కర్జికాయలు బందరు- హల్వా బందరు- లడ్లు తణుకు- బెల్లం జిలేబీ గరివిడి- కాజాలు మాడుగుల- హల్వా పెరుమాళ్ పురం- పాకం గారెలు కాకినాడ- కోటయ్య కాజాలు గుంటూరు- మాల్ పూరీ ఆత్రేయపురం- పూతరేకులు ఇవన్నీ స్వీట్ షాపులో అమ్మకం కోసం పెట్టిన డిస్ప్లే […]

డాక్టర్ ఎమ్మెల్యే..! సభలోకి ఏకంగా 15 మంది మెడికోలు… పైగా స్పెషలిస్టులు…

December 3, 2023 by M S R

doctor mla

వాట్సప్ న్యూస్ గ్రూప్స్‌లో చక్కర్లు కొడుతున్న ఓ పోస్టు చాలా ఆసక్తికరం అనిపించింది… మనకు ఉన్నదే 119 మంది ఎమ్మెల్యేలు కదా… మల్లారెడ్డి వంటి కొందరు విద్యాధికులు, విద్యావేత్తలను కాసేపు పక్కన పెడితే… 15 మంది మెడికల్ డాక్టర్లు ఉన్నారట… గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టేవారి సంఖ్య అది… పోటీచేసిన మొత్తం అభ్యర్థుల్లో ఎందరు డాక్టర్లు, ఎందరు ఇంజినీర్లు, గ్రాడ్యుయేషన్ దాటినవాళ్లు ఎందరున్నారో లెక్క తెలియదు… స్కూల్ చదువు కూడా దాటని వాళ్లు ఎందరో కూడా తెలియదు… […]

కుక్క అని తీసిపడేస్తం గానీ ఏం తక్కువ బ్రో… సొంత బిడ్డల లెక్క…

November 26, 2023 by M S R

dog school

Dog-Doctorate: “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు” -అన్నమయ్య కీర్తన “కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!” -సుమతీ శతకం “అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా ? విశ్వదాభిరామ వినురవేమా!” -వేమన పద్యం “నాది నాది అనుకున్నది నీది కాదురా! నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా! కూరిమి గలవారంతా కొడుకులేనురా! జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క […]

మరి ఇండిగో అంటే మజాకా..? బోలెడన్ని ఫ్లయిట్లు, చీప్ టికెట్ రేట్లు… కానీ…?

November 25, 2023 by M S R

indigo

భారతదేశంలో చాలా చౌక విమానయాన సంస్థ అని పిలవబడే ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈవో… ముంబైలోని ఒక హోటల్‌కు చేరుకున్నాడు… తర్వాత, బార్‌కి వెళ్లి ఓ పెగ్ అడిగాడు… బార్‌మాన్ తల వూపి “అది ₹50 అవుతుంది మిస్టర్ భాటియా” అన్నాడు… కాస్త అవాక్కయిన సీఈఓ (రాహుల్ భాటియా) “ఓహ్, ఇది చాలా చౌక” అని బదులిచ్చి, తన డబ్బు ఇస్తాడు… “సర్, మేం ఎప్పుడూ పోటీలో ముందంజలో ఉండటానికి ప్రయత్నిస్తాం, అందుకే ఈ ధర” అన్నాడు ఆ […]

  • « Previous Page
  • 1
  • …
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • …
  • 16
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?
  • ఓహ్… కేటీయార్ ప్రేమించిన కంచె ఐలయ్య కాంగ్రెస్ సలహాదారా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions