మేం తలవంచమని మీకు తెలుసు… మమ్మాపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు… అనిపించేది అందం, అనుకున్నది చేద్దాం, ఎవ్వడాపుతాడో చూద్దాం…… ఇది బాలకృష్ణ అన్‌స్టాపబుల్ తాజా సీజన్ తాలూకు ప్రోమోలో మొదటి డైలాగ్… అది వింటుంటే చంద్రబాబు జైలు, తెలుగుదేశం ఆందోళనలు, కోర్టుల్లో పోరాటాలు, కార్యకర్తల ఆరాటాలు గట్రా గుర్తొస్తున్నాయా..? అబ్బే, ఇది కామన్ అన్‌స్టాపబుల్ డైలాగే అంటారా..? సరే… సినిమాలో ఐనా, లైఫులో ఐనా అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు… సర్వం నాశనం చేయడానికి బయల్దేరతాడు… […]
కరివేపాకు తారలు… చంద్రబాబుకు అమితమైన ప్రేమ… అవ్యాజ అనురాగం…
మీరు చూసిన తొలి నటి / నటుడు ? గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న బాబు చుట్టూ తారలే… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————- తొలిసారి మీరు చూసిన సినిమా యాక్టర్ ఎవరో గుర్తున్నారా ? పద్మనాభం తీసిన దేవత సినిమాలో ఓ సన్నివేశం కొత్తగా ఉంది . ఎన్టీఆర్ , సావిత్రి నటించిన ఈ సినిమా పద్మనాభం తీశారు . 1965 లో వచ్చిన సినిమా . ఆ కాలంలో సినిమా తారలు అంటే దేవుళ్ళు అనుకునేంత అభిమానం […]
సీఎం పదవికి రెడీగా ఉన్నాను…. ఇప్పటికీ పవన్ అడుగుల్లో అవే పొరపాట్లు…
పవన్ తొలి మాటతోనే నాయకుడు కాదనిపించింది … చిరంజీవి పవన్ పార్టీలతో అనుబంధం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ——– ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కొద్దిగా చదివాక అన్నాదమ్ముల పార్టీలు , ఒక రిపోర్టర్ గా వాటితో అనుబంధాలు గుర్తుకు వచ్చాయి . పవన్ ఉపన్యాసం పూర్తిగా వినాలి అంటే తన అభిమాని అయినా కావాలి , వ్యతిరేకించే రాంగోపాల్ వర్మ అయినా కావాలి . లేదా ఆ వార్తను […]
భట్టి పాదయాత్ర… రాహుల్ గాంధీ ఆరా..!
భట్టి పాదయాత్ర… రాహుల్ గాంధీ ఆరా! తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి! తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన […]
మోడీయే మెగా విలక్షణ నటుడు… చిరంజీవిపై ప్రేమను భలే నటిస్తున్నాడు…
ఐనా మోడీ ముందు చిరంజీవి ఏపాటి నటుడు..?! అది జగమెరిగిన మెగాస్టార్…! చిరంజీవికి ఇఫి ద్వారా ‘ఫిలిమ్ పర్సనాలిటీ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డు ఇస్తున్నాడు… కేంద్ర మంత్రితో ప్రకటన జారీచేయించాడు… వెంటనే విలక్షణనటుడు అని అభినందిస్తూ ఓ ట్వీట్ కొట్టాడు తెలుగులో… మోడీ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది కదా… మరి ఇందులో ఏముంది..? ఎస్, చిరంజీవికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఓ పేజీ ఉంది… పద్మభూషణే ఇచ్చారు, ఈ ఇఫి అవార్డుదేముంది..? […]
ఒకరికి అభినందన… మరొకరికి అభిశంసన… ప్రధాని పలకరింపుల్లో మర్మం…
అనుమానం దేనికి..? ఒకరకంగా ప్రధాని నుంచి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అభిశంసన ఇది… ఎవరెన్ని రకాలుగా సమర్థించుకున్నా సరే… ప్రధాని మాటల్లోని శ్లేష అదే… ఒకవేళ ఆంధ్రజ్యోతి వార్త నిజం అయిఉంటేనే సుమా…! ఎస్, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ విభాగాల కార్యక్రమాలు జరిగినప్పుడు ‘స్వపరిచయం’ ఎపిసోడ్లు ఉంటాయి… అది మంచిదే… అయితే ఇక్కడ సిట్యుయేషన్ వేరు… ఇప్పుడున్న బీజేపీ వేరు… ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని బోలెడు మంది వచ్చి చేరుతున్న నయా కాంగ్రెస్ ఇది… వస్తున్నారు, […]
వర్మ పిచ్చి లెక్క… జగన్ ఇజ్జత్ పోవడం ఖాయం… ఇదే నిదర్శనం…
ఎందుకు కొన్ని తప్పులు సరిదిద్దుకోలేం..? నిక్షేపంగా దిద్దుకోవచ్చు… ఉదాహరణకు, జగన్ తన తప్పు తెలుసుకుని, ఇప్పటికైనా తన ఇజ్జత్ పోయే ప్రమాదాన్ని గుర్తించి, రాంగోపాలవర్మను తాడేపల్లికి మళ్లీ పిలిపించి ‘‘బయోపిక్కులు లేవు, తొక్కాతోలూ ఏమీ లేవు, వదిలెయ్, లేకపోతే మర్యాద దక్కదు’’ అని హెచ్చరిస్తే… అదొక దిద్దుబాటు… చేయొచ్చు… కానీ చేస్తాడా లేదా అనేది వేరే ప్రశ్న… అంత ఆలోచిస్తే వ్యూహం, శపథం సినిమాలు ఎందుకు వార్తల్లోకి వస్తాయి,..? ఆలీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్ ఎలా అవుతాడు..? […]
డియర్ ఆలీ భాయ్… ఈ యెల్లో టీవీ చానెళ్లను కాస్త కంట్రోల్‌లో పెట్టాలోయ్…
సినిమా నటుడు ఆలీ… ఇండస్ట్రీలో అందరికీ ఇష్టుడే… చిన్నప్పటి నుంచీ కష్టపడ్డాడు… కుటుంబాన్ని ఆదుకున్నాడు… పదిమందికీ సాయం చేస్తాడు… నవ్వుతూ, నవ్విస్తూ సాగిపోతున్నాడు… కానీ ఒక్కసారిగా తనకు తీవ్ర అసంతృప్తి… అదీ జగన్ వైపు నుంచి..! అసలు జగన్ పట్ల మద్దతుగా నిలిచిన సినిమావాళ్లు ఎవరున్నారు..? పోసాని వంటి ఒకటీరెండు కేరక్టర్లు తప్ప… పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైనా, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నా ఆలీ జగన్‌కు మద్దతుగా ఉన్నాడు, పార్టీలో చేరాడు… మరి ఆ ఆలీకి జగన్ ఏం […]
హాహాశ్చర్యం..! ఆర్జీవీతో జగన్ బయోపిక్..! ఇదేమి కొత్త విపత్తు స్వామీ..?!
ఈరోజు వార్తల్లో ఆసక్తిగా అనిపించిందీ, జగన్‌ను చూస్తే జాలేసిందీ ఓ వార్త ఉంది… అదేమిటంటే..? రాంగోపాలవర్మ అనే ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జగన్మోహన్‌రెడ్డి బయోపిక్ తీయబోతున్నాడట… తాడేపల్లికి వెళ్లి, జగన్‌తో భేటీ వేసి, సినిమా బడ్జెట్, కథ కమామిషూ మాట్లాడి, మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడట… సినిమా పేరు జగన్నాథ రథచక్రాలు అట… వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ఈ సినిమా ఉపయోగపడాలట… ఇన్ని ‘ట’లు ఎందుకంటే..? ఇవేవీ ధ్రువీకరించబడిన వార్తలు కావు కాబట్టి… ఇప్పుడప్పుడే ఎవరూ దీని […]
పవన్ తప్పేముంది ఫాఫం… ఏపీ పాలిటిక్సులో అందరూ సంస్కార పురుషులే కదా…
నిజానికి ఏపీ రాజకీయాల్లో ఎవరూ తక్కువ కాదు… ఒకడిని మించి మరొకడు… వైసీపీ, టీడీపీ క్యాంపుల్లో కొందరు పేరొందిన నేతలున్నారు… బూతులు తప్ప మరో భాష రాదు… పీకేదేమీ ఉండదు, ఆ భాషలో వాగడం తప్ప…! సాక్షాత్తూ నా భార్యను అవమానిస్తున్నారంటూ అంతటి సుదీర్ఘమైన కెరీర్ ఉన్న చంద్రబాబు భోరుమని ఏడవడం ఏపీ బురద రాజకీయాల్లో ఓ మరుపురాని ఘట్టం… అంతకుముందు జగన్ మీద కూడా అసెంబ్లీలోనే అలాంటి దాడి జరిగేది… సో, ఎవరూ తక్కువ కాదు… […]