ఫేస్ఋక్లో మిత్రురాలు తులసి చందు పెట్టిన ఓ వీడియో పోస్టు ఓ కొత్త విషయాన్ని చెప్పింది… అదేమిటీ అంటే… గద్దర్ జీవితం ప్రశాంతంగా ఏమీ లేదు… రాజ్యం, ప్రభుత్వం తననేమీ నిశ్చింతంగా ఉండనివ్వడం లేదు… అంతేకాదు, కర్నాటకలో రెండుమూడేళ్లుగా నడుస్తున్న ఓ కేసులో తనకు ఏ శిక్షయినా పడవచ్చునని ఆయన సందేహిస్తున్నాడు… చివరకు ఉరిశిక్ష లేదా జీవితఖైదు కూడా పడవచ్చునని అంటున్నాడు… ‘‘అది బెగంపల్లి కేసు… 28 ఏళ్ల క్రితం పెట్టబడిన కేసు… అదే అమ్ముగూడ రైల్వే స్టేషన్ […]
ఇప్పటికీ జియ్యర్ మాటే చెల్లుబాటు… సీతారాములకు కొత్త గోత్రనామాలు….
అయిపోయింది… ఇక కేసీయార్ దగ్గర చిన జియ్యర్ పలుకుబడికి ఫుల్ స్టాప్ పడింది… యాదాద్రి మళ్లీ యాదగిరిగుట్ట అవుతుంది… శ్రీమన్నారాయణ నామకీర్తనలు ఉండవ్… అసలు జియ్యరుడికి ప్రవేశాలు, ఆహ్వానాలే ప్రశ్నార్థకం ఇకపై… అనే ప్రచారాలు సాగాయి, సాగుతున్నాయి… పాలకుడి రాగద్వేషాలు, బంధాలు, పీఠాధిపతుల పరిమిత జ్ఞానాలు మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని ప్రభావితం చేస్తున్నాయి అన్నమాట… సరే, దాన్నలా వదిలేస్తే… జియ్యర్ ప్రభావం ఏమీ ముగిసిపోలేదు… ఆయన వీరభక్తగణం భద్రాచలంలో బలంగానే ఉన్నారు… (జియ్యర్ ఎక్కడికి వెళ్లినా తన […]
ఎంతసేపూ ఆ ‘‘వెంట్రుకలు పీకే’’ డిబేట్లేనా..? సొసైటీకి అవే అత్యంత ప్రాముఖ్యమా..?!
జాతికి అత్యంత అరిష్టదాయకాలు ఏవి..? ఇంకేముంటయ్..? క్షుద్ర రాజకీయాలు..! మీడియా, సోషల్ మీడియా కూడా నాయకుల ప్రేలాపనలకు, అజ్ఞానపు ప్రవచనాలకు ఇస్తున్న ప్రాధాన్యం ఇతరత్రా వార్తలకు ఇవ్వదు కదా… డిబేట్ జరపదు కదా… మన రాజకీయాలు, మన మీడియా రేంజ్ ‘‘వెంట్రుక పీకడం’’ డిబేట్ల దాకా వెళ్లిపోయింది… సంతోషిద్దాం… సరే, ముందుగా ఓ వార్త చదవండి… రాజస్థాన్ హైకోర్టు ఓ ఆసక్తిదాయకమైన ఉత్తర్వులను వెలువరించింది… అదేమిటీ అంటే… ఒక భార్య కోర్టుకు మొరపెట్టుకుంటే జీవితఖైదు అనుభవిస్తున్న భర్తకు […]
ఇదేం కామెడీరా బాబూ..? వికటిస్తున్న లవ్ ట్రాకులు… కుళ్లు జోకులు…!!
టీవీ షోలలో రేటింగుల యావతో కృత్రిమంగా సాగే లవ్ ట్రాకులు చాలా సహజం… బోలెడు చూశాం… షోల నిర్మాతలు, స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్టర్లు కావాలనే ఈ కాగితపు ప్రేమల్ని క్రియేట్ చేస్తుంటారు… తెలుగు టీవీ చానెళ్లలో ఎవర్ గ్రీన్ లవ్ ట్రాక్ సుధీర్, రష్మిలదే… పదేళ్లపాటు సాగుతూనే ఉన్నా, అది అబద్ధం అని తెలిసినా, వాళ్లే చెప్పినా సరే… ప్రేక్షకులు వాళ్ల కెమెస్ట్రీని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు… ఆ జంటను చూసి ఎన్నో జంటల్ని క్రియేట్ చేసి, […]
ఆ శిక్షలో అమ్మదనమే ఉంది… కొడుకును గాడినపెట్టే తాపత్రయమే ఉంది…
Jagannadh Goud………… ఏ సమాజం లో నుంచి మాట్లాడుతున్నాం..? ఖమ్మం జిల్లాలోని అడవి పక్కన మారుమూల కుగ్రామం మాది. నాతోటి వాళ్ళందరూ చుట్ట/బీడీ తాగుతుంటే నేనూ ఒక రోజు బీడీ కాల్చి ఇంటికి వచ్చా. ఆ వాసన పసిగట్టి దూలానికి వేలాడతీసి కొట్టాడు మా నాన్న. మా నాన్న కొడతాడు అన్న భయంతో బీడీ ముట్టలేదు, ఆ తర్వాత ఊర్లో బయటికి వెళ్ళినా ఎవరో ఒకరు చూసి మా నాన్నకి చెప్తారు అన్న భయంతో ముట్టలేదు. పెద్దయ్యి బయటికి […]
‘‘కొంత గ్యాసు నూనె కావాలె సారూ… ఇప్పటికి ఇంకేమీ అక్కర్లేదు’’
సీనియర్ జర్నలిస్టులు, ప్రత్యేకించి సుదీర్ఘకాలం ఆ వృత్తిలో ఉన్నవాళ్లు తమ అనుభవాల్ని కొత్తతరంతో షేర్ చేసుకోవాలి… ఆ జ్ఞాపకాలు చరిత్రను చెబుతాయి… ప్రముఖుల తత్వాలను వివరిస్తాయి… అవన్నీ ఇప్పటితరానికి పాఠాలు అవునో కాదో చెప్పలేం కానీ ఖచ్చితంగా ఆ అనుభవాలు రికార్డ్ కావడం సమాజ ప్రయోజనమే… ఇప్పటి రాజకీయ పార్టీల కార్యకర్తల తీరు అందరమూ చూస్తున్నదే… కానీ ఒకప్పుడు..? సీనియర్ జర్నలిస్ట్ Bhandaru Srinivas Rao పోస్ట్ ఒకటి చదవాల్సిందే… “కొంత గ్యాసు నూనె కావాలె. మరేమీ […]
అన్ని దేశాల చూపూ ఇండియా వైపే… కీలక పరిణామాలివి… జాగ్రత్తగా చదవండి…
పార్ధసారధి పోట్లూరి……… భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా మన విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది ! గత 15 రోజులలో మొత్తం 11 దేశాల అధిపతులు లేదా విదేశాంగ మంత్రులు కావచ్చు దిల్లీని సందర్శించారు. దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి, అంతకంటే తీవ్రమయిన అంశం విస్మరించాయి. మరీ ముఖ్యంగా భారతదేశానికి సంకట పరిస్థిని తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. రష్యా మార్చి నెల 15న నార్త్ […]
మెగాస్టార్ అరుదైన యాడ్… తోడుగా ఖుష్బూ… ‘సైట్’ చూస్తేనేమో చిరాకు…
ఒక మిత్రుడి పోస్టు ఆసక్తికరంగా అనిపించింది… దాని సారాంశం ఏమిటంటే… సాధారణంగా బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవి వాణిజ్య ప్రకటనలు తక్కువే… ఏదిపడితే అది అంగీకరించేయడం అనేది కనిపించదు… ఆ రేంజ్ పర్సనాలిటీని ఒక యాడ్లో నటింపజేయడం అంటే ఆ రేంజులో సదరు కంపెనీ బిజినెస్ ఉండాలి… మార్కెటింగ్లో పర్ఫెక్షన్ కనిపించాలి… శుభగృహ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఆయనతో ఓ యాడ్ చేయించింది… చిరంజీవిని శుభగృహలో యాడ్లో చూస్తుంటే కాస్త విస్మయకరంగానే ఉంది… అందులో ఖుష్బూ ఉంది… […]
ప్రేమ… పిచ్చి… ఇరవయ్యేళ్ల చీకటి… పిచ్చెక్కించే ఓ యదార్థ గాథ…
Taadi Prakash……… గీత నాయర్ ఇంకా బతికే ఉందా ? మన ఆస్పత్రుల్లో ఏం జరుగుతోంది? మరీ ముఖ్యంగా పిచ్చాసుపత్రుల్లో … 31 సంవత్సరాల క్రితం జరిగిన నిజ జీవిత కథ చదవండి. ఒక నిస్సహాయురాలి భయానక విషాదాన్ని తెలుసుకోండి. తెలుగు సీనియర్ జర్నలిస్టు తోట భావ నారాయణ చూసిన, రాసిన గుండెలు పిండే విషాదం. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం ! its a mad mad mad world…. *** *** *** ప్రేమ…. పిచ్చి… ఇరవయ్యేళ్ళ చీకటి One […]
‘‘అత్తమీద కోపం దుత్తమీద…’’ గవర్నరమ్మ పట్ల అమర్యాద..!
అమ్మా… తమిళిసై… శుభకృత్ శుభాకాంక్షలు… చూస్తున్నాం, చదువుతున్నాం… ఉగాది వేడుకలకు రమ్మని అన్ని పార్టీల వారిని, ప్రభుత్వ ముఖ్యుల్ని ఆహ్వానించారు… అందరూ వచ్చారు, ప్రభుత్వం ప్లస్ టీఆర్ఎస్ వైపు నుంచి గాకుండా… ఎవరూ రాకుండా… అంటే ఏమిటి..? ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రథమ పౌరురాలిని తేలికగా తీసిపడేస్తున్నారన్నమాట… మర్యాద లేకుండా అవమానిస్తున్నారన్నమాట… డీజీపీ, సీఎస్ కూడా రాలేదంటే మొత్తం యంత్రాంగానికి మిమ్మల్ని పట్టించుకునే పనిలేదు అనే సంకేతాలు ఇస్తున్నారన్నమాట… అమర్యాదకరంగా… సాంకేతికంగా ఈ రాష్ట్ర పాలన నీదే… ప్రభుత్వం […]
‘‘ఆలయాల పురాతన అర్చన పద్ధతుల్లో ప్రభుత్వాల జోక్యం దేనికి..?’’
హిందూ మత సంబంధ తంతులపై, అర్చన రీతులపై, ఆచారాలపై, సంప్రదాయిక ధోరణులపై, దేవుళ్లపై, ఆస్తులపై కేసులు పడుతూనే ఉంటయ్… అక్కడికి అవలక్షణాలన్నీ ఈ మతంలోనే కుప్పపోసుకున్నట్టు…! అక్కడికి ధర్మపీఠాల మీద కూర్చున్న సర్వజ్ఞుల్లాగా న్యాయమూర్తులు తీర్పులు చెబుతూనే ఉంటారు…… ఈ విమర్శ ఈమధ్యకాలంలో బాగా వినిపిస్తోంది… ప్రభుత్వాలు, కోర్టులు ఎడాపెడా ఓ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చా… అనేది ఓ కీలక ప్రశ్న… బుధవారం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఓ ఇంట్రస్టింగ్ తీర్పు చెప్పింది… సకల […]
కళకు మతం రంగు…! తాజాగా ఇది మరో వివక్ష కథ… ఇదీ ఆ కేరళలోనే…!!
నిన్నో మొన్నో మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా… కేరళలో మన్సియా అనే భరతనాట్యం కళాకారిణి ప్రదర్శనను ఆమె హిందూ కాదనే కారణంతో ఓ ప్రముఖ గుడి కమిటీ రద్దు చేసింది… ఆమె నాట్యప్రదర్శనను తిరస్కరించింది… ఆమె ముస్లిం మతంలో పుట్టినా సరే, ఓ హిందువును చేసుకున్నా సరే, భరతనాట్యంలో రీసెర్చ్ చేస్తున్నా సరే, శిక్షణ పొందిన నాట్యగత్తె అయినా సరే… గుడి సంప్రదాయం ప్రకారం ఆమెను అనుమతించలేదు ఆ గుడి కమిటీ… దీని మీద సహజంగానే […]
ఖర్మకాలి రోగి మరణిస్తే… డాక్టర్ మీద మర్డర్ కేసు..! తర్వాత మరో ట్రాజెడీ..!!
ఒక హాస్పిటల్… ఒక రోగి… రోగి ఖర్మకాలి లేదా డాక్టర్ ఖర్మకాలి ఆ రోగి హరీమన్నాడు… వ్యాధి తిరగబెట్టిందో, ఆ టైమ్లో అదుపులోకి రాలేదో, లేక అప్పటికే ఆయుష్షు మూడిందో, ఇంకేం కారణమో గానీ బకెట్ తన్నేశాడు… ఆ క్షణంలో బంధువుల ఆవేదన ఆవేశంగా మారుతుంది కొన్నిసార్లు… డాక్టర్ నిర్లక్ష్యమనో, సిబ్బంది పట్టింపులేనితనం అనో ఆరోపిస్తూ విధ్వంసానికి పాల్పడతారు… చాలా చూస్తున్నాం… కానీ ఇది మరింత విషమించిన కేసు… పోలీసులు ఏకంగా మర్డర్ కేసు పెట్టేశారు ఓ […]
హిందువు కాదని ఆమె నాట్య ప్రదర్శనే రద్దు… కళకు మతం ఉంటుందా..?!
షమ్నా కాశిం అలియాస్ పూర్ణ తెలుసు కదా మీకు…? కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది, మలయాళీ… మొన్నటిదాకా ఢీ డాన్స్ షో జడ్జిగా కూడా చేసింది… ఆమె జన్మతః ముస్లిం… శాస్త్రీయ నాట్యంలో శిక్షణ పొందింది… మంచి నర్తకి… అవును, కళకు మతం ఏముంటుంది..? ఉంటుందా..?! ఉండదు కదా… కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పూర్ణలాగే బోలెడు మంది నాన్ హిందూస్ కూడా భరతనాట్యం, కథాకళి వంటి నాట్యరీతుల్లో శిక్షణ పొందుతుంటారు… పూర్ణను ఉదహరించడం దేనికంటే, విషయం […]
రష్యాలో విష్ణుమూర్తి విగ్రహం… అది తెలియజెప్పే కొత్త చరిత్ర… తెలియని కథ…
…… By… పార్ధసారధి పోట్లూరి…… రష్యాలో దొరికిన పురాతన విష్ణుమూర్తి విగ్రహం ! తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో పురాతన శివలింగం బయటపడ్డది అని… కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు… బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ పరీవాహక ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి దగ్గరలోనే ఉన్న నది నుండి నీళ్ళు తెచ్చి అభిషేకం చేయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో అలా ప్రతిష్టించి ఉండవచ్చు… […]
సినిమా పాత్రల్లో రాడికల్… నిజజీవితంలో బోలెడన్ని మూఢనమ్మకాలు…
……. By…. Abdul Rajahussain……….. సినిమా పాత్రల్లోనే ర్యాడికల్… నిజ జీవితంలో “ మూఢనమ్మకాల పుట్ట ” ఎన్టీఆర్ !! ఆంధ్రుల ఆరాధ్య నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయికి చాటి… చెప్పినవాడు, కాంగ్రెస్ ను మట్టి కరిపించి ‘ తెలుగుదేశం’ జెండాఎ గరేసిన మేరునగధీరుడు నందమూరి తారకరామారావు. అటువంటి వ్యక్తి మూఢ నమ్మకాల్ని నమ్మాడంటే…. నమ్మగలమా? నమ్మలేని నిజమే, అయినా.. జరిగిన వివిధ సంఘటనల్ని బట్టి నమ్మక తప్పదనిపిస్తుంది… సినిమాల్లోని […]
ఆ వేల బోనాలు అక్షరాలా కనుల పండుగ…! అన్నం కుండల పండుగ..!
గ్రామీణ పూజాసంస్కృతుల మీద ఈమధ్య చాలా ఆందోళనను వెలిబుచ్చే సోషల్ మీడియా పోస్టులు కనిపించినయ్… గ్రామదేవతల అర్చన పద్దతుల్ని కూడా బ్రాహ్మణీకరిస్తున్నారనేది వాటి సారం… కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన పని ఉందా..? ఇదొక చిక్కు ప్రశ్న… తెలంగాణ ప్రాంతం మీద ఏళ్ల తరబడీ సాగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మత దాడుల నుంచి తెలంగాణ తన సంస్కృతీ మూలాల్ని పదిలంగా కాపాడుకుంది… అంతకన్నా దారుణంగా ఆంధ్రా పాలనలో సాగిన అవహేళనల్ని, అవమానాల్ని కూడా తట్టుకుంది… కట్టు, […]
సాక్షిలో కుదుపు… ఒకాయన ఇంటికి… ఆ ప్లేసులోకి జగన్ సన్నిహితుడు…
నిజంగా ఇది కేవలం సాక్షి సమస్య మాత్రమే కాదు… ఇన్నాళ్లు పత్రికల మేనేజ్మెంట్ తీరు వేరు… ఇప్పుడు ప్రింట్ మీడియా మునుపెన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కుంటోంది… సంక్షోభం వైపు వెళ్తోంది… మూలిగే నక్క మీద అన్నట్టుగా కరోనా వచ్చి మరింత దెబ్బ తీసింది… చాలా షట్టర్లు మూతపడ్డయ్… తాళాలు పడ్డయ్… వేగంగా మీడియా సంస్థలు డిజిటల్ ఎడిషన్స్, వీడియో ఎడిషన్స్ వైపు వెళ్లిపోతున్నయ్… ఈ స్థితిలో సస్టెయినబులిటీ కోసం పలు మీడియా సంస్థలు ‘మేనేజ్మెంట్ మాడ్యూల్స్’ మార్చుకుంటున్నయ్… […]
ఔనా… అలాగా… జగన్ను ముంచేసి, బాబును కుర్చీ ఎక్కించే తీట దేనికట…
కొన్ని అంతే… నవ్వొస్తయ్… నవ్విస్తయ్… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాసుకునే కొత్తపలుకు కూడా కొన్నిసార్లు కామెడీ… ఈటీవీ జబర్దస్త్ కూడా పనికిరాదు… తను బేసిక్గా తెలుగుదేశానికి కలంకార్మికుడు… పర్లేదు, ఆ సేవలో మునిగిపోతే ఎవరికీ అభ్యంతరం లేదు… తను దాచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు కాబట్టి… కడుపులో ఒకటి, ముసుగు మరొకటి అన్నట్టుగా ఉండటం లేదు కాబట్టి… కాకపోతే ఆ రాతల్లో కాస్త తర్కం, హేతువు గట్రా ఉంటే ఇంకా బాగుండేది… ఊరికే అశ్శరభ […]
తెలుగు పాత్రికేయంలో రిపోర్టర్లే కాదు… మేనేజర్లూ అలాగే తయారయ్యారట…
నిన్నటి నుంచీ తెగ హల్చల్ చేస్తోంది ఒక వాట్సప్ మెసేజ్… అంత పెద్ద సందేశం అవసరం లేదు గానీ, సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే… *ఈనాడులో పెద్ద తలకాయ మీద వేటు * పక్కా ఆధారాలతో దొరికిపోయిన మేనేజర్ శ్రీనివాసులు నాయుడు * అనంతపురం జిల్లా యాడికి మండలంలో రూ.కోటితో బంగ్లా నిర్మాణం * తిరుపతి యూనిట్ లో పెద్దల్ని ప్రసన్నం చేసుకుని పదేళ్ల పాటు మేనేజర్ గా కొనసాగింపు * పదుల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి బయటికి […]
- « Previous Page
- 1
- …
- 106
- 107
- 108
- 109
- 110
- …
- 124
- Next Page »