మన విశ్వనగరంలోనే… ఏరియా పేరు ఎందుకు లెండి… ఇద్దరు మిత్రులు ఓ అపార్ట్మెంట్ పార్కింగులో నిలబడి మాట్లాడుకుంటున్నారు… ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చాడు అక్కడికి… సార్, మీకేమైనా ఈ డిటెయిల్స్ తెలుసా అనడిగారు… ఆ బిల్లుపై కనిపించే వివరాలు చూస్తే… ఓ పేరుంది… ఫస్ట్ ఫ్లోర్ అని ఉంది… అపార్ట్మెంట్ పేరు లేదు… ఫోన్ నంబర్ ఉంది గానీ… ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు… అసలు స్విగ్గీ ఆర్డర్ మరిచిపోయారో, కావాలనే లిఫ్ట్ చేయడం లేదో […]
గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
నా పేరు కపిలవాయి రవీందర్. నాకు ఇద్దరు కుమారులు. పెద్దబాబు B.Tech. చిన్నబాబు MBA.. .. పెద్దబాబును Group-1 అధికారిగా చూడాలని నా కోరిక.. అయితే ఈ నోటిఫికేషన్ కోసం 9 ఏళ్లు ఎదురు చూశాము. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో చివరి సారిగా 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. 2014 ల తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత ఇగ మా రాష్ట్రం మాకు వచ్చింది, మాకు ఇంకేం కావాలి అనుకున్నా. అప్పటి నుండే […]
సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
నిన్నో మొన్నో మిత్రుడు Yeddula Anil Kumar పోస్ట్ ఒకటి కనిపించింది… ‘‘ప్రముఖ కన్నడ నవలా రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారు మహాభారతం మీద వ్రాసిన నవల “పర్వ”… దాదాపు 90సార్లు ఈ పుస్తకం మరుముద్రణ కాబడింది… లక్షల కాపీలు అమ్ముడయ్యాయి… 7 దేశీయ భాషల్లో, మూడు విదేశీ భాషల్లో ఈ పుస్తకము అనువాదం అయ్యింది… ఇంత గొప్ప పుస్తకాన్ని కశ్మీర్ ఫైల్స్ చిత్రము తీసిన ప్రముఖ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి గారు సినిమాగా తీస్తున్నారు… అందుకోసం రచయితతో ఒప్పందం కూడా […]
సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…
ఈరోజు చదివిన మంచి పోస్టు… ఒక్కో సినిమాకి 50 కోట్లు లేదా 100 కోట్లు వసూలు చేసే ఈ సినిమా నటులు లేదా నటీమణులు ప్రజలకు ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. అగ్రశ్రేణి సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, అధికారులు తదితరులకు ఏడాదికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మాత్రమే సంపాదన ఉంటే, అదే దేశంలో ఒక సినిమా నటుడు ఏడాదికి 10 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు! అతను […]
హమ్మో… భడవా అంటే అంత దారుణమైన తిట్టా… ఇన్నాళ్లూ తెలియనేలేదు…
Nancharaiah Merugumala……. మొన్న రాత్రి లోక్ సభలో బీఎస్పీ కువర్ దానిశ్ అలీని బీజేపీ గుజ్జర్ సభ్యుడు రమేశ్ బిధూఢీ తిట్టడం వల్లే…. ‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది! ………………………………………………………………………………………………… తెలుగు సినిమాల్లో ముఖ్యంగా బాపు, కె.విశ్వనాథ్ వంటి బ్రాహ్మణ దర్శకుల సినిమాల్లో, తర్వాత కొందరు కాపు, కమ్మ, రెడ్డి డైరెక్టర్ల చిత్రాల్లో– వయసులో చిన్నవారిని పెద్దలు కొన్ని సందర్భాల్లో ‘ఓరి భడవా!’ అని ఆశ్చర్యం, కొద్దిపాటి దిగ్భ్రాంతితో […]
చివరి పుటల్లో చీకట్లు… ఎంతటి చంద్రబాబు చివరకు ఎలాగైపోయాడు..?!
నేను రాసేది వివాదాస్పదం అవుతుండవచ్చు, కొందరి మనసులను గాయపరుస్తుండవచ్చు… కానీ రాజకీయమనేది యదార్థం. ఆ యధార్థాన్ని బలహీనమైన పునాదులపై నిలబెట్టరాదు. దానికి దృఢమైన పటుత్వం ఉన్నప్పుడే రాజకీయం రసకందాయం అవుతుంది. అవును రాజకీయం చాలా విచిత్రమైనది. నీ కళ్ళతో చూసేది నిజం కాదు, నీ చెవులతో వినేది వాస్తవం కాదు, రాజకీయాల్లో ఏది శాశ్వతం కానే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో చూసి, మరెన్నో అద్భుతాలు చేసి తనదైన ముద్రవేసిన ’45 ఏళ్ళ రాజకీయం’ అత్యంత హీనమైనస్థితిని అనుభవిస్తుంది. నాకింకా గుర్తున్నాయి, […]
‘‘వయస్సు మళ్లితే చాలు… మేం ఇక పౌరులుగానే కనిపించడం లేదా..?’’
జయా బచ్చన్… అమితాబ్ బచ్చన్ భార్య… వయస్సు 75 ఏళ్లు… ఆమె పార్లమెంటులో వృద్ధులు, అనగా సీనియర్ సిటిజెన్స్ సమస్యలను ప్రస్తావించి, కొన్ని మంచి పాయింట్లను లేవనెత్తిందనీ, ప్రభుత్వాన్ని ఏకిపారేసిందనీ ఓ పోస్టు వాట్సపులో చక్కర్లు కొడుతోంది… బహుశా ఆమె ప్రసంగ సారాంశం కాకపోవచ్చు… ఏమో కావచ్చు కూడా… కానీ ఏ మీడియాలోనూ కవరైనట్టు కనిపించలేదు… పోనీ, ఆమె చాలా సీనియర్ సిటిజెన్ కదా, సెలబ్రిటీ కదా, హైప్రొఫైల్ లేడీ కదా… మాట్లాడిందనే అనుకుందాం కాసేపు… అవి […]
ఆ సమైక్య ఎడిటర్ ఇంట్లో పెళ్లా..? పిచ్చ లైట్ తీసుకున్న సీఎం కేసీయార్…
ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూస్తుంటే బీడీ కట్ట కోసం , ప్లేట్ ఇడ్లీ కోసం ఎవరో ఒక్కరిపై ఆధారపడే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కెసిఆర్ కాదు మేమే … మేం లేకపోతే కెసిఆర్ ఎక్కడ అంటూ బోలెడు మాట్లాడుతున్నారు . ఆ వీడియోలు చూస్తుంటే అలాంటి దృశ్యాన్ని మరికొందరు జర్నలిస్ట్ మిత్రులతో కలిసి నేరుగా చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది . ************* 2014 లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో […]
మోడీ మార్క్ మిస్టరీ సీక్రెసీ… బీజేపీ సహా అన్ని పార్టీలకూ గింజులాట…
ఇవి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు… ఎజెండా ఏమిటో ఒక్క చిన్న అంశమూ బయటికి పొక్కడం లేదు… టాప్ సీక్రెసీ మెయింటెయిన్ చేస్తోంది మోడీ ప్రభుత్వం… సొంత పార్టీ వాళ్లకే ఏ సమాచారం లేదు… లీక్ కావద్దనే భావనతో కొందరు ముఖ్యులకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వడం లేదు… మొత్తం పీఎంఓ ఆర్గనైజ్ చేస్తోంది… దీంతో విపక్షాలు గింజుకుంటున్నాయి… నోట్ల రద్దు సమయంలో ఏం జరిగిందో తెలుసు కదా… నరమానవుడికీ తెలియనివ్వలేదు… మోడీ ప్రెస్మీట్ చూశాకే ప్రజలందరితోపాటు ఆ పార్టీ […]
తెలంగాణ చెవిలో కన్నడ మంత్రోపదేశం… కాంగ్రెస్ హామీలపై ఓ విశ్లేషణ…
అటు సోనియా గాంధీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను జారీ చేయడం పూర్తి కూడా కాలేదు… అప్పుడే యాంటీ కాంగ్రెస్ సెక్షన్లు సోషల్ మీడియాలో వెక్కిరింపులు, ఆక్షేపణలు స్టార్ట్ చేశాయి… బీఆర్ఎస్ సహజంగానే ఈ కౌంటర్లలో ముందుంది… తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాకు ఎప్పటిలాగే చేతకాలేదు… ‘కేవలం ఓట్ల కోసమే ఈ హామీలు.., ఏం, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఇస్తున్నారా..? ఐనా మిమ్మల్ని నమ్మేదెవరు..?’ వంటి వ్యాఖ్యలు జోరుగా సాగాయి, గుతున్నాయి, తాయి… మేధావులుగా చెప్పబడే కొందరి […]
ఎలక్షన్ ఇయర్లోకి వచ్చేశాం… మన పురాణం సీత గారేమంటారంటే…
Bharadwaja Rangavajhala……… ఇల్లాలి ముచ్చట్లు ….( పునః ) – పురాణం సీత గారు 2. O అనుకుండూండగానే ఎలక్సన్ ఇయర్లోకి వచ్చేశాం … ఎవరు గెలుస్తారు … ఎలా గెలుస్తారు … బ్లడీ డిస్కషన్స్ … కిచెన్లోనూ అవే … డైనింగ్ టేబుల్ దగ్గరా అవే … ఫేస్బుక్లోనూ … టీవీల్లోనూ … ఆల్ సోషల్ అండ్ సైన్స్ మీడియా అంతటా … వాటీజ్ సైన్స్ మీడియా అంటారా … టీవీలూ పేపర్లూ ఎక్సెట్రా ఎక్సెట్రా […]
హీరో తేలిపోయాడు గానీ… విలన్ పాత్రధారి రెచ్చిపోయాడు… ఫాఫం విశాల్…
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎస్.జె.సూర్య సినిమా ఇది… అదేనండీ, మార్క్ ఆంటోనీ… పేరుకు విశాల్ హీరో, రకరకాల గెటప్పుల్లో కనిపిస్తాడు… కానీ నటుడిగా తన విలన్ పాత్రకు మంచి ప్రయారిటీ ఇప్పించుకుని, తనే బలంగా ఎక్స్పోజయ్యాడు సూర్య… కొన్నిచోట్ల విశాల్ వెలవెలా… ఇందులో మన సునీల్ కూడా ఉన్నాడు… ఉండీ లేనట్టే… మనకు పెద్దగా కొత్తగా కనిపించడు… హీరోయిన్ ఉంది… రీతూవర్మ… ఈ పాత్ర కూడా ఉండీలేనట్టే… ఫాఫం, ఆమెకు మంచి మెరిట్ ఉండీ మంచి పాత్రలు […]
తమిళ నిర్మాతలు ఆ నిర్ణయమైనా తీసుకోగలిగారు… తెలుగువాళ్లకు చేతనవుతుందా..?
ఒక వార్త ఎందులోనో కనిపించింది… కాస్త ఆసక్తికరంగానే అనిపించింది… తమిళ సినీ నిర్మాతలకు అంత దమ్ముందా..? మన తెలుగు నిర్మాతలకు, దర్శకులకు అందులో వీసమెత్తు దమ్ము కూడా లేదెందుకు..? ఎందుకీ బతుకులు అని కూడా అనిపించింది ఓ దశలో… తీరా వార్త చివరకు వచ్చేసరికి ఓ వాక్యం ఉంది…‘‘గతంలోనే తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుంది… కానీ పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాకపోవడం గమనార్హం…’’ అని వార్తకు చివరలో పంక్చర్ కొట్టారు… నిజమే… […]
బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ నిజంగా డ్రగ్ నేరస్తుడేనా..?
రామాయణం… సీతను రావణుడు కిడ్నాప్ చేస్తాడు… అంటే రామాయణం కిడ్నాపులను ప్రోత్సహించినట్టేనా..? జస్ట్, ఓ సందేహం… ఓ సినిమాలో ఓ అమ్మాయిని విలన్లు అత్యాచారం చేసినట్టు చూపిస్తారు… అంటే సదరు సినిమా అత్యాచారాల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టేనా..? ఓ నవలలో ఓ ముసలాయన్ని తన సొంత బంధువులే హతమారుస్తారు… అంటే సదరు రచయిత హత్యల్ని, హింసను ప్రమోట్ చేస్తున్నట్టేనా..? మద్యపానం సీన్లు, అమ్మాయిలకు వేధింపుల సీన్లు, హింస సీన్లు లేని సినిమాలు ఉన్నాయా ఈరోజుల్లో… ఇదంతా దేనికి అంటే… […]
కేసీయార్పై సగం మందిలో తీవ్ర వ్యతిరేకత… సిట్టింగులు మాత్రం పర్లేదుట…
డిస్క్లయిమర్ :: అన్ని సర్వేలు నిజమైన ప్రజాభిప్రాయాన్ని చెప్పాలనేమీ లేదు… ఆయా సర్వేల ఉద్దేశాలు, సర్వే సంస్థల క్రెడిబులిటీ, తీసుకునే శాంపిల్స్ సంఖ్య, సరైన మిక్స్, క్రోడీకరణలో శాస్త్రీయత వంటి చాలా కారణాలు ఉంటయ్… జర్నలిస్ట్, పొలిటికల్, బ్యూరోక్రాట్ సర్కిళ్లలో ఓ జనరల్ ఒపీనియన్ ఉంది… అదేమిటంటే… తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద జనంలో బాగా వ్యతిరేకత ఉంది, వాళ్లను నమ్ముకుంటే కేసీయార్ మునిగిపోవడం ఖాయం, సిట్టింగులతో పోలిస్తే కేసీయార్ మీద మాత్రం కాస్త తక్కువ వ్యతిరేకత […]
భారీ చోరీ… దక్కేది పిసరంత… అఫ్కోర్స్, ఈ చోరీలు అంత వీజీ కాదు…
బ్యాంకుల్లో వేల కోట్లు అప్పులు తీసుకుని దివాలా తీశామని ఎగ్గొట్టడం సులభం. పెట్టే బేడా సర్దుకుని లండన్లో స్థిరపడి సెలెబ్రిటీల పునరపి పెళ్లి…పునరపి రిసిప్షన్లలో మందు గ్లాసులు పట్టుకుని చిరునవ్వులు చిందించడం సులభం. వెయ్యి కోట్లు అప్పు తీసుకుని రెండొందల కోట్లు కట్టి…ఎనిమిదొందల కోట్లు ఉద్దేశపూర్వకంగా కట్టకుండా పరపతి ఉపయోగించి వన్ టైమ్ సెటిల్మెంట్లో రెండొందల కోట్లు మాత్రమే కట్టి దర్జాగా ఆరొందల కోట్లు ఎగ్గొట్టడం కూడా సులభమే. పాతిక వేల కోట్లు అప్పులు తీసుకుని…ఎగ్గొట్టి రాజకీయ […]
‘కత్తి’ వ్యాఖ్యల ఉద్దేశం ఏదైనా… ఓ గొప్ప సూక్తిని పరిచయం చేశాడు సిద్ధార్థ లూథ్రా…
Nancharaiah Merugumala……… సిద్దార్థ్ లూథ్రా– 300 ఏళ్ల క్రితం గురు గోవిందసింగ్ రాసిన గొప్ప ఫార్సీ వాక్యం పరిచయం చేసినందుకు మనం ఆనందించాలేమో! జఫర్ నామా గురించి తెలియని తెలుగోళ్లు ఈ పంజాబీ వకీలుకు సదా రుణపడి ఉంటారు! ……………………………………………………………………… ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న దిల్లీ పంజాబీ హిందూ ఖత్రీ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా బుధవారం మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ […]
చేనేత వృత్తే కాదు, ఓ కళ… ఓ పోచంపల్లి ఆర్టిస్టు గురించి తెలుసా..?
Taadi Prakash…. రామలింగం నేతబండి ఆగిపోయింది… Mohan’s tribute to our pochampalli hero —————————————————– రామప్ప శిల్పం చెక్కినట్టు, కొండపల్లి శేషగిరిరావు రేఖా విన్యాసంతో బొమ్మకి సౌందర్యాన్ని అద్ధినట్టు, బంగారు పిచ్చిక, మనిషి నిర్ఘాంతపోయేంత నైపుణ్యంతో గూడు అల్లినట్టు.. చిలువేరు రామలింగం మగ్గం మీద కాంతులీనే కలనేతతో మతిపోగొడతాడు. ఆయన అల్లికతో, రంగురంగుల దారాల మేళవింపులోని సొంపుతో …చీర ఒక సృజనాత్మక సౌరభంతో వున్మీలనమౌతుంది. తెలంగాణ, నల్గొండ జిల్లా, భూదాన్ పోచంపల్లిలో వుండే రామలింగం గారిని […]
ఎంతైనా మన పూర్వీకులు కదా… అచ్చు మనలాగే వాటికీ ‘‘అడుక్కునే కళ’’…
Begging Skills: పద్యం:- అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను? మృగజాతి కెవ్వడు మేతబెట్టె? వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె? జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె? స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె? ఫణుల కెవ్వడు పోసె బరగబాలు? మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె? బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి? జీవకోట్లను బోషింప నీవెకాని వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ! భూషణవికాస | శ్రీధర్మ పురనివాస | దుష్టసంహార | నరసింహ దురితదూర | -నృసింహ శతకంలో కవి శేషప్ప అర్థం:- అడవిలో పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు? […]
ఇలాంటి వార్తలతో చంద్రబాబుకు ఫాయిదా ఏముంది ఆంధ్రజ్యోతీ..?
పీవీ రమేష్ ఇంటర్వ్యూకు ఓ అర్థముంది… చంద్రబాబుపై సీఐడీ స్కిల్ స్కాం ఆరోపణలకు పూర్తి కౌంటర్ కాదు, కానీ అదొక కోణంలో వివరణ… చేతనైతే ఆయన మేఘా నుంచి రాజీనామాతో ఎందుకు బయటపడాల్సి వచ్చిందో రాయాలి… డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ వివరణ పబ్లిష్ చేయడంలో అర్థముంది… ఈ స్కాంలో వాళ్లదే ప్రధానపాత్ర అని సీఐడీ ఆరోపిస్తున్నది కాబట్టి… ఒక లోకేష్, ఒక భువనేశ్వరి, ఒక బాలయ్య వ్యాఖ్యల్ని, విమర్శల్ని పబ్లిష్ చేయొచ్చు… చంద్రబాబు కుటుంబసభ్యులు […]
- 1
- 2
- 3
- …
- 55
- Next Page »