Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పది మార్కుల ప్రశ్న…! ఆర్ఆర్ఆర్ నిర్మాత ఎవరు..? ఏమైపోయాడు..?

January 30, 2023 by M S R

DANAYYA

ఎవరో అడిగారు… ఆర్ఆర్ఆర్ నిర్మాత ఎవరు..? చటుక్కున గుర్తురాలేదు… దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ వంటి నిర్మాతలైతే గుర్తొచ్చేదేమో… సినిమా ప్రమోషన్లలో, వసూళ్ల సక్సెస్ మీట్లలో, ఆడియో రిలీజుల్లో, ప్రిరిలీజ్ ఫంక్షన్లలో, పోస్టర్ విడుదల సమయంలో, టీజర్ల వేళో ఎప్పుడైనా నిర్మాతగా హడావుడి చేసి ఉంటే మన మైండ్లలో ఇంప్రెషన్ పడి ఉండేది… కానీ… ఆర్ఆర్ఆర్ అంటే జస్ట్, రాజమౌళి… తరువాత రాంచరణ్, జూనియర్… ఈమధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చాక నాటు కీరవాణి… అంతే, ఇక […]

ఆర్నబ్‌కు చేతకాలేదు… పాల్కీ శర్మ… అనిల్ ఆంటోనీ… వీళ్లే బీబీసీ బట్టలిప్పారు…

January 28, 2023 by M S R

palkisarma

పాల్కీ శర్మ… ఇంగ్లిష్ టీవీల్లో న్యూస్, విశ్లేషణలు చూసే ప్రేక్షకులు బాగా ఆదరించి పేరు… ఆమె వ్యాఖ్యలకు ఓ క్రెడిబులిటీ ఉంది… తెలుగు టీవీల్లో న్యూస్ విభాగాలు పనిచేసే స్టాఫ్, రుధిర ప్రజెంటర్లు, పౌడర్ దిగ్గజాలు, పోస్కో పెద్ద తలకాయలు గట్రా ఆమెకు కనీసం ఓ వంద మైళ్ల దూరంలో ఉంటారేమో… కయ్ కయ్ అని హైపిచ్‌లో అరిచే ఆర్నబ్‌కన్నా కూడా చాలారెట్లు నయం ఆమె… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దానికి ఓ నేపథ్యం ఉంది… ఎన్డీటీవీని […]

గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)

January 28, 2023 by M S R

మంథర ——– చక్కగా, వేగంగా సాగిపోతున్న రథచక్రానికి చీల జారిపోతుందని తెలిసి, వెంటనే పరుగెత్తి ఆ చీలను సరిచేసి, చక్రం ఊడిపోకుండా, రథం పడిపోకుండా చేసే మంచి వాళ్లు ఉన్నట్లే- ఎక్కడో ఒక మూల దాగి, చక్రానికున్న చీలను ఊడబెరికి, రథాన్ని పడదోయడానికి ప్రయత్నించే చెడ్డవాళ్లు కూడా లోకంలో ఉంటారు. శ్రీమద్రామాయణంలో మంథర ఒక దాసి. కైక పుట్టింటి నుండి అరణంగా వచ్చిన దాసి. కైక అంతఃపురంలోనే ఉండే దాసి. ఈ దాసి చాటు మాటుగా అంతటి […]

రామాయణంలో అసలు ప్రతినాయకి కైకేయి… చివరకు ఆమె ఏమైంది..? (పార్ట్-2)

January 27, 2023 by M S R

కైకేయి ——– సాగర సంగమమే చరమ గమ్యంగా సాగిపోతున్న ఒక ఏటి ప్రవాహానికి ఎక్కడో ఒక కొండ అడ్డుతగిలితే, ఆ ప్రవాహం చిందర వందర అవుతుంది. పాయలు పాయలుగా చీలిపోతుంది. చిత్ర విచిత్రాలైన మలుపులు తిరుగుతుంది. ప్రవాహ వైశాల్యం కూడ పెరుగుతుంది. అడ్డుపడిన కొండ వల్ల ఆ ప్రవాహానికి ఇలా జరిగినా, దాని వల్ల లోకానికి మేలే కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రవాహం పాయలుగా చీలి, మలుపులు తిరిగి, విశాలమైనందువల్ల అనేక ప్రాంతాల నీటి సమస్య తీరుతుంది. […]

ఎంగిలి పళ్లు తినిపించింది సరే… తరువాత శబరి ఏమైపోయింది… (పార్ట్-1)

January 26, 2023 by M S R

రామాయణం అనగానే…. రాముడు, సోదరులు, తండ్రీ తల్లులు… విలన్లు… అంతేనా..? మరి ఇతర కీలక పాత్రలు జటాయువు, శబరి, గుహుడు, తార, మంథర… వీళ్ల మాటేమిటి..? చివరకు వాళ్లంతా ఏమయ్యారు..? అసలు వాళ్ల పాత్ర చిత్రణ మాటేమిటి..? వాళ్లేమయ్యారు..? ఎవరైనా పట్టించుకున్నారా..? జగనానంద కారకా, జయజానకీనాయకా అని పాడుకోవడమేనా, జనం వాళ్లను పట్టించుకున్నారా..? అసలు కథారచయిత వాల్మీకి పట్టించుకున్నాడా..? కీలకపాత్రలేమయ్యాయి..? అసలు ఆ పాత్రల వైశిష్ట్యం ఏమిటి..? అవి కదా…! పోనీ, మనం ఓసారి ముచ్చటించుకుందామా..? చిన్న […]

మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!

January 25, 2023 by M S R

ramayan

చిన్నప్పటి నుంచీ రకరకాల కళారూపాల్లో, మార్గాల్లో రామాయణం వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం… కట్టె, కొట్టె, తెచ్చె అనేంతవరకు అందరికీ తెలుసు రాముడి కథ… కానీ మీకు ఎంతమేరకు తెలుసు..? ఎప్పుడైనా పరీక్షించుకోవాలని అనిపించిందా..? ఇక్కడ 108 ప్రశ్నలున్నయ్… ఓసారి మీకు తెలుసో లేదో పరీక్షించుకొండి… ప్రశ్న, తరువాత జవాబుకు నడుమ కాస్త దూరం ఉంది… అందుకని ప్రశ్న చదివి, మెల్లిగా దిగువకు స్క్రోల్ చేసుకుని జవాబు చూసుకొండి… సులభప్రశ్నలే కాదు, చాలా గొట్టు ప్రశ్నలు కూడా ఉన్నయ్… […]

RRR… చివరకు మిగిలింది ఒకటే… రాజమౌళి మరిచిన చేదునిజం ఏంటంటే…

January 24, 2023 by M S R

rrr

వస్తే సంతోషం… ఒక భారతీయ సినిమాకు, టెక్నీషియన్లకు ఆస్కార్ అవార్డు వస్తే మస్తు ఖుషీ… అందులోనూ ఓ తెలుగు సినిమాకు వస్తే మరింత ఖుషీ… కానీ లాబీయింగ్, డొంకతిరుగుడు, డబ్బు ఖర్చు, మేనేజింగ్ థింగ్స్ అవార్డులను ప్రభావితం చేసే పక్షంలో వాటికి విలువ ఏముంటుంది..? ఆర్ఆర్ఆర్ విషయంలో జరుగుతున్నది ఇదే… రాజమౌళి అండ్ గ్యాంగ్ అక్కడే అడ్డా వేశారు… ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏ విభాగంలో కూడా ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ లభించలేదు… అదేదో చెల్లో షో […]

అమ్మా అలీదా గువేరా… వీళ్లకు సంఘీభావం చెప్పే అర్హత కూడా లేదమ్మా…

January 23, 2023 by M S R

che guvera

Gurram Seetaramulu………. చేగువేరా బిడ్డ హైదరాబాద్ వస్తోంది అని తెలిసి, అంత గొప్ప యోధుని బిడ్డను చివరిసారిగా చూడాలి అని ఆఘమేఘాల మీద హైదరాబాద్ బయలుదేరా. రవీంద్ర భారతి ముందు ఈ ఇరవై ఏళ్ళలో అన్ని కార్లు ఆగి ఉండడం నేనెప్పుడూ చూడలేదు. మొత్తానికి నిలబడే స్థలం కూడా లేని, కిక్కిరిసిన రవీంద్ర భారతిలో ఒంటికాలి మీద నిలబడి ఒక్కసారి ఆమెను చూసి బయట పడ్డా.. ఐరిష్ మూలాలున్న చే కుటుంబం… లాటిన్ అమెరికాలో స్థిరపడ్డ మెడికో… […]

ప్రొఫెషనల్ డాన్సర్లకు దీటుగా… అదరగొట్టేస్తున్న బీబీజోడి డాన్స్ షో…

January 22, 2023 by M S R

bbjodi

నిజానికి చాలారోజులైంది ఈ ప్రోగ్రాం స్టార్టయి… ఎహె, నలుగురు సెలబ్రిటీలను తీసుకొచ్చి ఏవో పిచ్చి గెంతులు వేయిస్తారు, అంతేకదా అనుకున్నాను అందరిలాగే… కానీ స్టార్‌మాటీవీలో వచ్చే బీబీ జోడీ ప్రోగ్రాం డిఫరెంటుగా ఉంది… ఆకట్టుకుంటోంది… బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రాం చేయడం మాటీవీకి అలవాటే… వాళ్లకు కూడా అదనపు ఆదాయం కాబట్టి మాటీవీ చెప్పిన ప్రోగ్రామ్స్‌లో చేస్తుంటారు… మాటీవీకి నాన్-ఫిక్షన్ కేటగిరీలో రియాలిటీ షోల అవసరం ఉంది… లేకపోతే రేటింగుల్లో ఇంకా పడిపోయే ప్రమాదం […]

మా లెక్కల సార్ రుణం తీర్చుకునే లెక్క దొరికింది నాకు…

January 22, 2023 by Rishi

teacher

డిసెంబరు 21, 1946… మైలాపూర్, వివేకానంద కాలేజీ, ఇంటర్మీడియెట్ క్లాస్… ఓ క్లాస్‌కు అయిదు నిమిషాలు లేటుగా వెళ్లాను… మా ఇంగ్లిష్ ప్రొఫెసర్, కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేశాడు… ‘సారీ సర్, నాకు కాస్త లేటయింది…’‘వోకే, వోకే, కమిన్… లంచ్ బ్రేకులో ఓసారి కలువు..’ 12.15 గంటలు… ఆయన ఆఫీసుకు వెళ్లాను… ‘క్షమించండి సార్, అనుకోకుండా రోజూ వచ్చే దారిలో డైవర్షన్… అందుకని ఇంకాస్త ఎక్కువ దూరం ఉండే దారిలో నడిచి […]

పైసలా, పెంకాసులా… వరల్డ్ ఫోర్త్ రిచ్చెస్ట్ యాక్టర్ ఆస్తి ఇన్నివేల కోట్లా..?

January 22, 2023 by M S R

srk

అమితాబ్ కుటుంబంలో ముగ్గురు సంపాదిస్తున్నారు… సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు… నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ దరిదాపుల్లోకి కూడా రారు… హాలీవుడ్  నటులకు ఇచ్చే రెమ్యునరేషన్లు, ఎండార్స్‌మెంట్ డబ్బులు అడ్డగోలు… ఐనా సరే, నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ వాళ్లను కూడా దాటేసిపోయాడు… ప్రస్తుతం షారూక్ పొజిషన్ ఏమిటో తెలుసా..? ప్రపంచంలోకెల్లా నాలుగో అత్యంత ధనిక నటుడు… పఠాన్ సినిమాను బ్యాన్ చేస్తారా..? చేసుకొండి… కొడుకు ఆర్యన్ ఖాన్ మరింతగా డ్రగ్ కేసుల్లో ఇరుక్కుంటాడా..? […]

ఎంతసేపూ ఆడ దేహాలు, మొహాలే… నెట్ సుధీర్‌లకు మగ మొహాలు పట్టవెందుకో..!!

January 21, 2023 by M S R

masculinity

పింక్ శారీలో జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యను చూస్తే తట్టుకోలేం భయ్యా… నాభి అందాలతో అనసూయ అదుర్స్ స్వామీ… శ్రీముఖి క్లీవేజీతో మతిపోతోంది బాసూ… విష్ణుప్రియ ఎదపొంగులతో ఇక వేడి సెగలే… కొత్త లుక్కులో రష్మి పిచ్చెక్కిస్తోంది చూశారా… జాకెట్ మరిచి దడపుట్టిస్తున్న శ్రీలీల……. ఇలాంటి థంబ్ నెయిల్స్ కోకొల్లలు… యూట్యూబ్ చానెళ్లే కాదు, తెలుగులో మేం తోపులం అని చెప్పుకునే సైట్లు సైతం ఇదే బాట… ఇక సినిమా హీరోయిన్ల విషయంలోనైతే చెప్పనక్కర్లేని హెడింగులు, వర్ణనలు… […]

ఓ చిన్న ప్రశ్న… పెద్ద చర్చ… అమలా పాల్‌ను గుడిలోకి అనుమతిస్తే తప్పేమిటి..?!

January 19, 2023 by M S R

amala paul

హిందూ బంధుగణానికి ఓ ప్రశ్న… సినిమా నటి అమలా పాల్‌ను ఓ గుడిలోకి రానివ్వకపోవడం కరెక్టేనా..? కేరళలోని తిరువైరానిక్కుళం మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లగా… అక్కడి అర్చకులు, ఆలయ కమిటీ, సిబ్బంది అడ్డుకున్నారు… అన్యమతస్తులకు ప్రవేశం లేదని తేల్చి చెప్పారు… మహాదేవ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉందని తేల్చి చెప్పారు… ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చని సూచించారు… విధి లేక ఆమె అలాగే చేసింది… ఇదీ వార్త… ప్రశ్న ఏమిటంటే..? ఆమె ప్రవేశాన్ని ఆలయ ఆచారాలు, […]

పవన కల్యాణం అనుష్టుప్ నారసింహం… అబ్బో, అదొక వ్యా‘కారణ యాత్ర…

January 19, 2023 by M S R

anusthtup

Yatra Names: హిందూపురం ఎస్.డి.జి ఎస్ కాలేజీ తెలుగు అధ్యాపకుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ అంటే మా నాన్నకు అపారమయిన గౌరవం. మా నాన్న అవధానాల్లో నిషిద్ధాక్షరి పృచ్ఛకుడుగా చాలావరకు కర్రా సారే ఉండేవారు. కర్రా సార్ దగ్గర అయిదేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నానని మొదట్లో అనుకునేవాడిని. తరువాత కేవలం విన్నానని అర్థమయ్యింది. వ్యాకరణ పాఠం అయ్యాక కొంతకాలం ఛందస్సు కూడా చెప్పారు. గురు, లఘువుల గణాలు పెన్సిల్ తో గీతలు గీసుకుని, యతి ప్రాసలు […]

విన్న ఎన్టీయార్ వేరు… చూసిన ఎన్టీయార్ వేరు… ఓ ఆర్టిస్టు స్వగతం…

January 18, 2023 by M S R

…….. By……… Taadi Prakash………..  “చండ్ర, సుందరయ్య కంటే గొప్పోణ్ణి కాదు” Artist mohan encounter with NTR —————————————————– అది 1984, డిసెంబర్ 29. దాసరి ‘ఉదయం’ దినపత్రిక ప్రారంభమైన రోజు. ఆరోజే మోహన్ని రమ్మని పిలిచారు ఎన్టీయార్. N T R … Darling of the millions. Larger than life hero. Pure artiste to the core. అయితే, మోహన్ ఆరోజు … other side of the N T […]

హా-రుద్ర..! సొంత భార్య రామలక్ష్మికే సమజ్ కాని ‘‘త్వమేవాహమ్’’…!!

January 18, 2023 by M S R

arudra

పాఠకులకు ‘కవిత్వం’ అర్థంకాకుంటే….. ఆ తప్పు కవిదా ? పాఠకులదా ? *ఆరుద్ర గారూ.! అర్థం కాకపోతే …….. “అన్ ఎడ్యుకేటెడ్ ఆంధ్రా” నా ? హవ్వ.! ఆరుద్రగారు సాంప్రదాయరీతులకు భిన్నంగా టెక్నిక్ తో ” త్వమేవాహమ్ ” కావ్యాన్ని రాశారు. తన కళాకేళీ ప్రచురణల తరపున. ‘  ఆవంత్స… సోమసుందర్’ (పిఠాపురం) గారు అచ్చేయించారు. అది పాఠకులకు ఓ పట్టాన కొరుకుడు పడలేదు. బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా కూడా…. కవి హృదయం అర్ధం కాలేదు.!! అప్పుడు పాఠకులేం […]

ఫేస్‌బుక్ రచయితలు… సినిమా సమీక్షకకులు పలురకములు ఇలలో సుమతీ…

January 17, 2023 by M S R

reviewers

Sai Vamshi ………..   Facebookలో సినిమా రివ్యూలు – రకరకాల మనుషులు (Disclaimer: (ఇది నా అబ్జర్వేషన్‌తో సరదాగా రాసింది. ఎవర్నీ ఉద్దేశించింది కాదు. కాబట్టి ఏకీభవించినా, విభేదించినా చివరిదాకా హాయిగా చదవొచ్చు). 1) రాయని భాస్కరులు: వీళ్లు సినిమాలు చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత తమ పనుల్లో బిజీ అయిపోతారు. సినిమా చూశాక రివ్యూ రాయాలన్న ఆశ, ఆలోచన లేని సగటు జీవులు. 2) నా ఇష్టం: వీళ్లు ఎవరికీ లొంగరు. ఏ భావజాలానికీ […]

ధనవంతరి వారసులం… కాసుపత్రుల కాంతులం… ఆ బిల్లుల్లోనే అసలు యముడు…

January 17, 2023 by M S R

((Sivaram Prasad Bikkina….)) మేము ఎదుర్కొన్నామండీ ఈ సమస్య. మీరు కావాలంటే ఈ సమాచారం షేర్ చేయొచ్చు కూడా.! మా సమీప బంధువుల అమ్మాయికి డెలివరీ ముందు రెగ్యులర్ గా చూసే గైనకాలజిస్ట్ కాజువల్ గా చేయించిన రాపిడ్ టెస్ట్ తో కొవిడ్ పాజిటివ్. డెలివరీ చేయను పొమ్మంది. జిల్లా అంతా ఎంక్వయిరీ చేస్తే… ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి తప్ప ఎక్కడా కొవిడ్ పాజిటివ్ లేడీకి డెలివరీ చేయొద్దని ప్రభుత్వం నిబంధనలు పెట్టినట్టు తేల్చారు. ప్రభుత్వాసుపత్రి ప్రసవం […]

సినిమా చూసి బజ్జుంటే సరిపోదోయ్… నాలుగు ముక్కలు రివ్యూ రాసిపడెయ్…

January 14, 2023 by M S R

review

Sai Vamshi …….  .. చిన్నప్పుడే బాగుండె! థియేటర్‌లో సినిమా చూసి ఇంటికొచ్చి తిని పడుకున్న తర్వాత ఆ సినిమా పేరు కూడా మర్చిపోయేవాళ్లం. తర్వాత రోజు ఏదైనా గోడ మీద పోస్టర్ కనిపిస్తేనో, టీవీలో యాడ్ వస్తేనో, టీ బంకుల దగ్గర ఖాళీ దొరికితేనో తప్పించి ఎవరూ పెద్ద చర్చించేవారు కాదు. జస్ట్ బాగుంటే బాగుంది, లేకపోతే లేదు. బ్రహ్మానందం, అలీ, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ వీళ్ల కామెడీ గురించి గ్యారెంటీగా చెప్పుకునేవారు. ఇప్పుడు కొత్త సినిమా […]

జీవితం బహుముఖీనం… ఒకే వాదాల మూసలోకి అది ఒదగదు…

January 14, 2023 by M S R

off beat

ప్రపంచంలో, ఏక కాలంలో సమాంతరంగా అనేక నాగరికతలు అభివృద్ధి చెందాయి. ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి, అందుబాటులో ఉన్న వనరులతో ప్రకృతి వికసించింది. ప్రకృతిలో భాగమైన మనిషి కూడా, పరిణామ క్రమంలో సంక్రమించిన తెలివితేటలతో… కాలంతో పాటు ఎదిగాడు. మనిషి సమూహ జీవి . వికాసం (ఎవల్యూషన్) లో భాగంగా తన అవసరాలను తీర్చే సాధనాలు వేటికవి గొప్పగా అభివృద్ధి చెందాయి. సమూహాలలో తమవైన వాటి పట్ల – పరాయి వాటి పట్ల, స్త్రీ పురుష భేదాలతో […]

  • « Previous Page
  • 1
  • …
  • 112
  • 113
  • 114
  • 115
  • 116
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions