పెళ్లి విందులో మటన్ ముక్కల కోసం యుద్ధం… యుద్ధం లేనిది అయోధ్య అన్నారు పండితులు. అంటే రాముడి అయోధ్యలో మానసికంగా, భౌతికంగా యుద్ధాలు చేసుకునే అవసరమే ఉండదు. అది త్రేతాయుగం. ఇది కలియుగం. ఈ యుగంలో ఏదయినా ముందు అనుమానం, అవమానం, అలజడి, ఆందోళన, సిగపట్లు , బాహాబాహీ , యుద్దాలతోనే మొదలవ్వాలి. ఇరుపక్షాలు అలసి యుద్ధం ఆగలేకానీ…యుద్ధం దానికదిగా ఆగదు. అయోధ్యలో సయోధ్యల గురించి మనం రామాయణంలో చదువుతాం. ప్రతి ఊళ్ళో రాముడి ఆలయం కట్టి […]
వారణాసి @ కాశి..! జీవి తాపత్రయ నివారిణి… బ్రహ్మ కపాల విమోచనకారిణి…
కాశీ క్షేత్ర యాత్ర…. జీవితమే ఒక యాత్ర ! ఉత్కృష్టమైన మానవజన్మలో జీవితం ఇహ పరములకు వారధిగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం జీవికి ! ఆ యాత్ర సంకల్పమనే మంత్రంతో, జ్ఞాన శోధన -అభ్యాసం – గురు అనుగ్రహమనే తంత్రంతో , తన అస్తిత్వం, జీవన పరమార్థం తెలుసుకునే “ఆధ్యాత్మిక “ పూజా పుష్పమై , వెళ్లి వాలిపోయే యంత్రమే “తన క్షేత్రం “!!! పరమశివుడు స్థితి కారకుడైన , శ్రీదేవి భూదేవి పతి అయిన […]
థంబ్ నెయిళ్ల భాషాదరిద్రంపై కూడా ఓ హైడ్రా అవసరం సార్..!!
తెలుగు భాషా దినోత్సవం పూట కొన్ని యూట్యూబ్ ఘనవార్తల థంబ్ నెయిళ్లు దురదృష్టంకొద్దీ చూడబడ్డాను… వామ్మో, వరుసగా అవి పైపైన చదువుతూ వెళ్తుంటే… ఎన్నో బూతులు… అంటే తప్పులు… తప్పుల కారణంగా పుట్టుకొచ్చే బూతులు… చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏర్పాటులాగా… యూట్యూబ్ చానెళ్లలో ఇలాంటి భూతపిశాచాల్ని గుర్తించి, కేసులు పెడితే, కనీసం యూట్యూబ్‌లో వాటి ప్రసారాల్ని బ్యాన్ చేయిస్తే… తెలుగు రక్షింపబడుతుందేమో అనిపించింది… పాత్రికేయం వంటి పెద్ద పదాలు వద్దులెండి ఇక్కడ… ఇది రాస్తూ, ఫేస్బుక్ […]
లిపి హత్యా నేరం…! తెలుగును తెలుగులో రాస్తే నేరమా…?
మాతృ భాష. అమ్మ భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి / తెలంగాణా తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం. పడాలి కూడా. భాసించేది భాష. అంటే వెలిగేది, వెలుగును పంచేది. అంటే నిజమయిన వెలుగుగురించి చెప్పాలన్నా కాంతిమంతంగా వెలిగే భాష లేకపోతే సాధ్యం కాదన్నమాట. అందుకే మండే సూర్యుడి వెలుగును సంకేతిస్తూ భాస్కరుడు అంటున్నాం. మాట కూడా అంతటి సూర్యుడికి తక్కువేమీ […]
ఆ డాల్డా మన ఆరోగ్యాన్ని కబళిస్తూ… ఇంకా మన మిఠాయిల్లోనే ఉంది…!!
మామూలుగానైతే దీపావళి, కార్తీక పౌర్ణమి నడుమ పేనీలు తినేది… పేనీలు అంటే చాలామంది తెలంగాణవాసులకే తెలియదు… సన్నగా, అత్యంత సన్నగా, పొరలుపొరలుగా చేసిన ఒకరకం స్వీట్… చక్కెర పొడి, వేడి పాలు పోసుకుని తినేయడమే… వంటామంటా ఏమీ ఉండదు… నార్తరన్ డిష్ కదా, తెలంగాణలోని కొన్ని కులాల కుటుంబాలకే పరిమితం… రాజస్థాన్ స్వీట్ హౌజులో కనిపిస్తే రేటు అడిగాను… రెండు రంగుల్లో కనిపించాయి… ముదురు గోధుమ రంగు అయితే నెయ్యితో చేసినవి అట… పావుకిలో 120 రూపాయలు […]
… కనుక అధ్యక్షా… ఫుల్ బాటిల్‌నే మన అధికార చిహ్నం చేయడం మర్యాద…
చుక్కలకే చుక్కలు చూపిస్తున్న తెలుగు రాష్ట్రాలు 1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి దూరంగా ఎక్కడో దేవతావస్త్రం లాంటి కనిపించని ట్రాక్ మీద, కనిపించని ప్రయాణం చేస్తుంటాయి. ఏ ట్రాక్ మీద వెళ్లేవి ఆ ట్రాక్ మీదే వెళ్లాలి. లేకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయి. ఏది నేరం? […]
ఏదో అడగబోయి… నారా రోహిత్‌తో ఏదో చెప్పించబోయి… చివరకు తామే నివ్వెరబోయి…
ప్రతినిధి-2 సినిమా హిట్టయింది కదా… ప్రతినిధి-3 ఏమైనా తీసే ఆలోచన ఉందా..? అనడిగాడు జర్నలిస్టుడు… ఎక్కడ హిట్టయిందండీ బాబూ.. నాకూ తెలియదు..? అని నవ్వుతూ జవాబు ఇచ్చాడు నారా రోహితుడు… అదేమిటండీ, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదాని ఇంకేదో చెప్పబోయాడు జర్నలిస్టుడు… అదొకటి వచ్చీపోయిందని తెలుసో లేదో తెలియదు గానీ, మీరన్నిసార్లు అడుగుతుంటే ఓహో నిజంగానే ఆ సినిమా వచ్చిందనిపిస్తుంది అని నవ్వుతూనే బదులిచ్చాడు రోహితుడు… అందరూ ఫక్కున నవ్వారు అక్కడే… ఈ వీడియో బిట్ […]
జైళ్లోనే భేటీ… ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నట్టున్నారు… హీరో దర్శన్, గ్యాంగ్‌స్టర్ విల్సన్…
చూస్తున్నాం కదా… డబ్బులుంటే చాలు, బయట ఉన్నట్టుగానే జైళ్లలో కూడా సకల విలాసాలకు కొదువ ఉండదు… తీహార్ దగ్గర నుంచి అంతటా అదే స్థితి… అన్నీ దొరుకుతాయి… జైళ్ల సిబ్బందే ఎంచక్కా సహకరిస్తారు… పెరోల్స్ మీద బయటికి రావచ్చు, లేదా జైలులోనే ఉండి తమ యాక్టివిటీ కొనసాగించవచ్చు… మరి బెంగుళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ ఏమైనా మినహాయింపా..? అదీ అంతే… దర్శన్ తెలుసు కదా.., తన సహజీవని పవిత్ర గౌడకు అసభ్య మెయిళ్లు, మెసేజులు పెట్టి […]
ఇండియన్ జర్నలిస్టులతో మాట్లాడితే చాలు… పాకిస్థాన్ దేశద్రోహులేనట…
పాకిస్థాన్ ఆర్మీ చెప్పినట్టుగా వ్యవహరించే అక్కడి అధికార గణం పీటీఐ ప్రతినిధి రవూఫ్ హసన్‌ను అరెస్టు చేసింది… ఏవేవో నేరారోపణలు చేసింది… పీటీఐ అంటే మన దేశంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా… అంటే జాతీయ వార్తా సంస్థ, మీడియా సంస్థలకు వార్తల్ని సేకరించి ఇస్తుంటుంది… కానీ పాకిస్థాన్‌లో పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ… పాకిస్థాన్ తెహ్రీక్-ఇన్సాఫ్… ఆ పార్టీకి రవూఫ్ స్పోక్స్ పర్సన్… తనను అరెస్టు చేయడానికి అధికారగణం ఆరోపించిన కారణాల్లో ముఖ్యమైంది… తను […]
రాహుల్ గాంధీకి స్క్రిప్టు రాసిచ్చే వాళ్లలోనే ఏదో తేడా కొడుతోంది..!!
ఈ మాట అనడానికి మనం బీజేపీ సానుభూతిపరులమే కానక్కర్లేదు… మామూలుగా పరిశీలించినా సరే ఇట్టే అర్థమైపోతుంది… రాహుల్ గాంధీ సమాజాన్ని చూసే కోణంలోనే ఏదో భారీ తేడా ఉందని..! మిస్ ఇండియా విజేతల జాబితా చూశాను, దళిత-గిరిజన-ఓబీసీ- మైనారిటీలు లేనే లేరు అని ఎక్కడో వ్యాఖ్యానించినట్టుగా ఓ వార్త వచ్చింది… దీనిపై నెటిజనం విరుచుకుపడుతున్నారు… సహజమే… అంటే మిస్ ఇండియా పోటీల్లో కూడా రిజర్వేషన్లు పెట్టమంటావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు… బీజేపీ, బీజేవైఎం తదితర ప్రత్యర్థి విభాగాలు […]
రాను రాను తెలుగు ఇండియన్ ఐ‘డల్’… ఇదోతరహా శ్రీదేవి డ్రామా కంపెనీ…
కేశవరామ్… ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరీ తెలుగు ఇండియన్ ఐడల్ సాంగ్స్ కంపిటీషన్ షోలో పాల్గొంటున్నాడు… మొదట్లో ఇరగదీశాడు… ఈసారి నువ్వే ఎలిమినేట్ అయ్యేదంటూ ఎవరు హింట్ ఇచ్చారో గానీ ఈసారి తన రాగం శృతితప్పింది… నీరసంగా సాగాయి రెండు పాటలూ… పాడుతున్నప్పుడే అనిపించింది, జడ్జిలు నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడే అనిపించింది ఈసారి పడిపోయే వికెట్ అదేనని… అలాగే ఆ వికెటే పడిపోయింది… చిత్రమేమిటంటే… జడ్జెస్ చాలెంజ్ థీమ్ ఈసారి, అంటే పూర్తి కంట్రాస్టు ఉండే రెండు […]
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే… బీజేపీ అభ్యంతరం… లీగల్‌గా వాట్ నెక్స్ట్..?
అబ్బే, కోర్టు స్టే ఇచ్చింది… విచారణ పూర్తయితే, నాది తప్పు అని తేలిస్తే నేనే కూలగొట్టేవాడిని… కోర్టులో ఉన్నప్పుడు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కూలగొట్టుడేంది..? అని అక్కినేని నాగార్జున తను చెరువును కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూలగొట్టడం మీద స్పందించి వివరణ ఇచ్చాడు, రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు… నిజంగానే హైడ్రా తప్పు చేసిందా..? రేవంత్ రెడ్డి ప్రభుత్వం లీగల్‌గా ఇరకాటంలో పడినట్టేనా..? అర్జెంటుగా హైకోర్టు ఆ నిర్మాణం కూల్చివేత మీద […]
రాహుల్ గాంధీకి పెళ్లయింది, పిల్లలున్నారు సరే… కానీ నిగ్గు తేల్చాల్సింది ఎవరు..?!
మామూలుగానైతే బీజేపీ నాయకుడు రఘునందన్ మంచి వక్త… మంచి వకీలు… లాజిక్కులు, లాపాయింట్లు సరిగ్గా పట్టుకుని ఎదుటోడికి చాన్స్ ఇవ్వకుండా దడదడలాడిస్తాడు… కానీ ఈ విషయంలో మాత్రం భిన్నంగా ఉంది… తను సోనియా గాంధీ నివాసానికి వెళ్లాడు.,. బ్లిట్జ్ అనే ఓ మ్యాగజైన్ పత్రికలో రాహుల్ గాంధీ రహస్య వివాహం, పెళ్లిళ్లకు సంబంధించిన కథనాలు వచ్చాయి, ఇద్దామని వచ్చాయి అని అక్కడి సెక్యూరిటీ వాళ్లకు చెప్పాడట… వాళ్లు నథింగ్ డూయింగ్ అనేసరికి ఆ కాపీలు వాళ్లకే ఇచ్చేసి, […]
మాయమైపోతున్న గోదావరి..! ప్రవాహం నడుమే అనూహ్యంగా అదృశ్యం… మిస్టరీ..!!
ప్రజాశక్తిలో ఓ వార్త… నదిలో రోజుకు సగటున 28 టీఎంసీల నీరు మాయమైపోతున్నదనీ, సీడబ్ల్యూసీ నివేదికలో కూడా ప్రస్తావించారనీ, దీంతో పోలవరం పటిష్ఠతపై కూడా అనుమానాలు ప్రబలుతున్నాయనేది వార్త… అదృశ్య గోదావరి అని శీర్షిక… సాధారణంగా ప్రవాహజలాల్ని క్యూసెక్కుల్లో, నిల్వనీటిని టీెఎంసీల్లో కొలుస్తాం కదా… మరిదేమిటి..? రోజుకు 28 టీఎంసీలు అంటారేమిటి..? అంతటి సీడబ్ల్యూసీ కూడా (కేంద్ర జల మండలి) అలా నివేదికలో రాసిందా..? సరే, ఈ టెక్నికల్ సందేహాలు పక్కన పెడితే… వాళ్ల లెక్కల్లోనే 28 […]
ఐదు రూపాయలు… ఓ ఆదర్శ స్మరణీయుడి కథను చెబుతోంది ఇలా…
“నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని ! సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన […]
మరి ఆ సందర్భాల్లో మీ గొంతులు ఏమయ్యాయ్ తెలంగాణ బుద్దిజీవులూ..!!
మేధావులు (?), కళాకారులు, రచయితలు, పాత్రికేయులు ఎట్సెట్రా చాలా మంది కేసీయార్ క్యాంపు మనుషులు (ఒక్క హరగోపాల్ మినహా అనుకుంటున్నాను) చాలా ఆవేదనతో, వేదనతో, బాధతో, నొప్పితో రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు… అయ్యా, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీ రేవంత్ రెడ్డి మా సచివాలయం ఎదుట పెడతా అంటున్నాడు… కానీ సరికాదు… సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెడితేనే మొత్తం తెలంగాణ సమాజం ఆకాంక్షలను గౌరవించినట్టు… ఇంకెక్కడ పెట్టినా సరే అవమానించినట్టు… కేసీయార్ […]
నిజంగానే ప్రారంభ వాక్యాలు అలా ఉంటాయేమోనని హడలగొట్టారు కదా సార్..?!
ఆగస్టు 22. 1955. నర్సాపురం ఆసుపత్రి. ఉదయం 10. 10 నిమిషాలు. చిత్త నక్షత్రం. భూమికి నలుదిక్కులా మంగళ వాద్యాలు మోగుతున్నాయి. సప్త ఋషులు ఏడు దిక్కులా నిలబడి మంత్రోచ్ఛాటన చేస్తూ భూమి మీదకి పూలు విసురుతున్నారు. ఎనిమిదో దిక్కున నారద తుంబురులు స్వాగతగానం చేస్తున్నారు. ఒక మహోన్నత వ్యక్తి రాకని సూచిస్తూ ఒక నక్షత్రం ఆకాశంలో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తో౦ది. ‘పద్మావతీ నామధేయ నర్సు పురుడు పోయగా, పద్మాసానుడే ఉసురు పోయగా, నటరాజ తేజమై, నవరస నాందీ […]
డౌట్ లేదు… రాజీవ్ విగ్రహం బదులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కరెక్టు..!
మొన్న ఎక్కడో మాట్లాడుతూ కేటీయార్ ‘బస్సుల్లో రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకొమ్మనండి, మాకేం అభ్యంతరాల్లేవు’ అని ఏదో అన్నాడు… అంతకుముందు అక్కలు అని రేవంత్ సంబోధించినా సరే, అదేదో మొత్తం తెలంగాణ ఆడపడుచులందరినీ అవమానించారు అంటూ ట్విస్ట్ చేసి, ఏదో గాయిగత్తర లేపాలని చూశారు… కానీ తను చేసిన సంస్కారరహితమైన డాన్సుల మాటేమిటి..? అదేమంటే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రచ్చ… దానికీ కేసీయార్ కాలంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్క చెప్పి సీతక్క కౌంటర్ […]
కరిగిపోయాను కర్పూర వీణలా..! ఓ పాత ప్రేమకథకు కొత్త రూపు ఇలా…!!
ఓ ప్రేమ జంటకు కొత్తగా పెళ్ళైంది… ఆ జంట తమ హానీమూన్‌కు ప్లాన్ చేసుకుంది… కాస్త భిన్నంగా, ఎప్పుడూ గుర్తుండేలా… అది మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లడం… థ్రిల్లింగ్ కమ్ రొమాంటిక్… అనుకున్నట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ట్రెక్కింగుకు వెళ్తుంది ఆ జంట… పూర్తిగా పైకి వెళ్ళాక అనుకోని ప్రమాదం… హఠాత్తుగా ఓ మంచు లోయలో పడిపోతాడు ఆ భర్త… షాక్ తింటుంది భార్య… కన్నీరుమున్నీరు అవుతుంది… హానీమూన్ కాస్తా తనకు అంతిమ యాత్రగా […]
నమ్మలేనంత ప్రేమ… భార్య కోసం సముద్రగర్భంలో 13 ఏళ్లుగా అన్వేషణ …
2004లో సునామీ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తే, 2011లో ఆ ప్రతాపం జపాన్ మీద పడింది. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిశాయి. భారీ అలలు తీరాన్ని తాకి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జపాన్‌లో నమోదైన ప్రకృతి విపత్తుల్లో ఇది అత్యంత పెద్దది. ప్రపంచంలోని భయంకరమైన భూకంపాల్లో ఇది నాలుగోది. అలలు 133 అడుగుల ఎత్తున ఎగిసిపడి జనాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. ఈ కారణంగా సుమారు 20 వేల మంది మరణించగా, 6,242 మంది […]
- « Previous Page
- 1
- …
- 10
- 11
- 12
- 13
- 14
- …
- 107
- Next Page »