……… By… Gurram Seetaramulu………. అదొక ఆదివాసీ గ్రామం . దశాబ్దాల నిర్బంధం తిష్టవేసిన చెరసాల లాంటి గిరిజన గూడెం. కనీసం పేపర్ ఎర్ర బస్ కూడా టయానికి దొరకని నిజం. అక్కడొక బడి పంతులు. ఆయన తమ్ముడు నాకు ఆప్తుడు. ఆ వూరిలో కాన్వెంట్ లేదు, కనీసం నూటా యాభై కిలోమీటర్లు పోతే తప్ప ఇంగ్లీష్ మీడియం బడి అందుబాటులో లేదు. ఉదయం గంట మోగిన దగ్గర నుండి సాయంత్రం ఇంటి బెల్లు మోగే వరకు […]
అబ్బో, హిమజను కూడా దింపారుగా… ఇక ఈ షోకు కూడా బూతే భవిష్యతి…
మొన్నామధ్య నటి హిమజ బ్రేకప్ అని వార్తలు వచ్చినయ్ కదా… ఎహె, నాకసలు పెళ్లే కాలేదు, ఇలా పెళ్లి చేసేముందు, విడాకులు మంజూరు చేసేముందు నాకూ కాస్త చెప్పండి అని సెటైర్ వేస్తూ ఓ వీడియో కౌంటర్ రిలీజ్ చేసింది చూశారు కదా… అబ్బో, ఈ పిల్లకు ఎటకారం ఎక్కువే అని కొందరు ఉడుక్కున్నారు… ఆమె తన ఇన్‌స్టాలో చాలా ఫోటోలు డిలిట్ కొట్టేసింది… కొన్ని కీలకఫోటోలు ఎక్కడైనా దొరికితే ఈమెగారి బ్రేకప్‌కు ముందు చిత్రాలు ఇవీ […]
నేహా శెట్టి… తెలుగు సినీ జర్నలిజాన్ని ఈడ్చి లెంపకాయ కొట్టింది…
తెలుగు సినిమా జర్నలిజాన్ని ఆ కొత్త హీరోయిన్ ఈడ్చి లెంపకాయ కొట్టింది… అసలే ఆమధ్య ఆర్ఆర్ఆర్ ప్రెస్మీట్లో ఒకాయన రాజమౌళి ఆహా, రాజమౌళి ఓహో అని కీర్తనలు పాడాడు కదా, అది కాస్తా వైరల్ అయిపోయి, నెటిజనం తిట్లపర్వానికి పూనుకోవడంతో మిగతా జర్నలిస్టులంతా తలలు దించుకున్నారు… ఇప్పుడు ఏమిటంటే..? డీజేటిల్లు అనే సినిమా వస్తోంది… అందులో జొన్నలగడ్డ సిద్ధు హీరో, నేహా శెట్టి హీరోయిన్… విమల్ కృష్ణ దర్శకుడు… టీజర్ రిలీజ్ పెట్టుకుని బుధవారం మీడియాను ఆహ్వానించారు… […]
‘‘అన్నీ సర్దుకున్నాను… నేను రెడీ…’’ ఆలోచనల్లో పడేసే ఓ డెత్ క్లీనింగ్ కథ…
మామూలుగానే కథల్లో నవ్యత కొరవడుతోంది, నాణ్యత కొడిగడుతోంది… ఏదో పైపైన రాసేస్తున్నారు… ఒక మథనం లేదు, మనిషిని ఆలోచనల్లో పడేసే కథాంశాలే కనిపించడం లేదు… ఇక కథాశిల్పం దాకా ఎందుకులెండి… రాను రాను తెలుగు కథలు కూడా తెలుగు సినిమా పాటల్లా రంగు, రుచి, వాసన, చిక్కదనం లేని ద్రావకాలు అయిపోతాయేమోనని చాలామంది సాహితీప్రియుల్లో ఓ ఆందోళన కూడా ఉంది… పోనీలెండి, కాలంతోపాటు కథ… అదొక్కటీ ఏం బాగుంటుందిలే అనుకుందాం… కానీ ఈమధ్య కొన్ని సరళమైన శైలిలో […]
వాట్సప్ యూనివర్శిటీ నుంచి మరో నాసిరకం సోషల్ పోస్ట్..!!
సోషల్ మీడియాలో కనిపించే వార్తలు కొన్ని నవ్వు పుట్టిస్తాయి… వీటిని పుట్టించే గుజ్జులేని బుర్రలకు సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరి మీదా ఓ తేలిక భావన… మనమేం రాసినా ఎడ్డి ఎదవలు నమ్ముతారనే ఓ వెర్రి భ్రమ… ఇలాంటి వార్తల్ని పుట్టించి, సర్క్యులేట్ చేసి, చివరకు తామే నవ్వులపాలు అవుతున్నామనే సోయి కూడా ఉండదు వీళ్లకు… అఫ్కోర్స్, వీటిని గుడ్డిగా అందరికీ షేర్ చేసే *రాటెన్ బ్రెయిన్స్’’ కూడా ఉంటారు కొందరు… మీరు వాట్సప్ యూనివర్శిటీ […]
పచ్చిపల్లీ… #kachabadam… ఆ వార్త గుర్తుందా..? ఇప్పుడా కథే మారిపోయింది..!!
గత నెల మొదటివారంలో మనం ఓ వార్త చెప్పుకున్నాం… పోలీసుల వద్దకు వచ్చిన ఓ వింత కేసు… బెంగాల్లో బిర్భూమ్ (వీరభూమ్) అనే ఓ పల్లెటూరు… అక్కడ భుబన్ బద్యాకర్ (భువన్ వద్యాకర్) ఓ వీథివర్తకుడు… పచ్చి పల్లికాయ (వేరుశెనగ)ను హోల్‌సేల్‌గా కొనుక్కుని, ఊళ్లు తిరుగుతూ అమ్ముకుంటాడు… పాత సెల్ఫోన్లు, పక్కన పడేసిన గిల్టు పట్టీలు, జూకాలు గట్రా తీసుకుని కూడా పల్లీలు ఇచ్చేస్తుంటాడు… పల్లీలమ్మా పల్లీలు, పచ్చి పల్లీలు అని అరుస్తూ తిరగకుండా… రండి బాబూ రండి, […]
హవ్వ… టోపీ పెట్టాడు… పగిడి చుట్టాడు… లుంగీ కట్టాడు… తుమ్మాడు, దగ్గాడు…
మోడీ ద్వేషం… బీజేపీ ద్వేషం తప్పు కాదు… ఒక నాయకుడిని, ఒక పార్టీని వ్యతిరేకించడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… కానీ అది అదుపు తప్పి, విమర్శ, వ్యతిరేకతలు పర్వర్షన్గా మారిపోతున్న తీరు మాత్రం చెప్పుకోవాలి… ఇది అలాంటిదే… మోడీ ఏం బట్టలు తొడగాలో తన ఇష్టం… ప్రధాని పదవికి తగినట్టు ఆ వేషధారణ హుందాగా ఉందా లేదానేది మాత్రమే ముఖ్యం… ఒకసారి దిగువన ఓ వార్త చూడండి… ప్రజాశక్తిలో కనిపించింది… అది పక్కాగా చైనా అనుకూల పార్టీకి చెందిన […]
పెద్దన్న… బ్రాండ్ వేల్యూ వేగంగా పడిపోతోంది… ఎందుకీ దుస్థితి..?!
నవంబరులో వచ్చింది సినిమా… పెద్దన్న… అది రజినీకాంత్ సినిమా… అసలు రజినీకాంత్ సినిమా అంటేనే తన అభిమానులతోపాటు సగటు ప్రేక్షకుల్లో కూడా బాగా ఆసక్తి ఉంటుంది… తన కమర్షియల్ రేంజ్ అది… పైగా అందులో నయనతార, కీర్తిసురేష్, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, ఖుష్బూ, మీనా ఎట్సెట్రా ఉండనే ఉన్నారు… కానీ సినిమా ఫట్టుమన్నది… కళానిధిమారన్ నిర్మించిన సినిమా… కానీ అందరూ పెదవి విరిచారు… ఫ్యాన్స్ కూడా అసంతృప్తికి గురయ్యారు… నిజానికి సినిమా బాగాలేదు… ఐనాసరే, రజినీ బ్రాండ్ చాలు, […]
ఎవడో తప్పుడు వార్త ఇస్తే… అందరూ కళ్లకద్దుకుని అచ్చేయడమేనా..?!
తమ చుట్టాలకు చెందిన కోవాగ్జిన్ టీకాలను దృష్టిలో పెట్టుకుని… ఈమధ్య ఈనాడు కరోనా వార్తలపై అదుపు తప్పిపోయింది… భయాన్ని పెంచే పనిలో పడింది… ఎంత భయం పెరిగితే అంతగా వేక్సిన్ల అమ్మకాలు… వాళ్ల బూస్టర్ డోసులకు, చుక్కల టీకాలకు గిరాకీ… తరువాత ఈ డోసులకు గిరాకీ తగ్గకుండా చూడాలనే ఓ పిచ్చి తాపత్రయం… సో, నిన్నటి నుంచీ ప్రచారంలోకి వచ్చిన ఓ పిచ్చి వార్తను ఫస్ట్ పేజీలో బొంబాట్ చేయడం గ్యారంటీ అనుకున్నారు అందరూ… ప్రతి ముగ్గురిలో […]
ఏంటీ దిక్కుమాలిన ఫోటో పోస్ట్… చిరంజీవి కోడలి మీద భారీ ట్రోలింగ్…
ఉపాసన… చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య… అపోలో వారసురాలు… తను సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గానే కనిపిస్తుంది… పలు పోస్టులు ఆలోచనాత్మకంగా ఉంటయ్… హుందాగానే ఉంటుంది… భేషజం కూడా ఏమీ ఉండదు… ఓసారి ఇండియన్ టాయిలెట్ ఎలా బెటరో చెబుతూ, తను ఆ ఫోజులో కూర్చుని ఫోటో పెట్టింది… తప్పులేదు, నచ్చింది… కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తప్పులో కాలేసింది… నిజంగా ఆమె టేస్ట్ ఏమిటో, ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో కూడా అర్థం కాదు… ఫలితంగా నెటిజన్లు […]
పద్మ అవార్డు అంటే… మెడలు వంచి, మెడలో మెడల్ వేయరు కామ్రేడ్…
బెంగాల్… 90 ఏళ్ల సంధ్యా ముఖర్జీ అనే గాయని కేంద్రం ఇవ్వదలిచిన పద్మశ్రీని తిరస్కరించింది… అదేమంటే..? అసలు నా స్టేచర్ ఏంటి..? ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు ఇచ్చినట్టుగా పద్మశ్రీ ఇస్తారా, వద్దుపో అనేసింది… ఇచ్చింది తీసుకోవచ్చు కదా అనేవాళ్లుంటారు… ఆమె కడుపులో బాధ అది, వ్యక్తీకరించనివ్వండి, తప్పేముంది అనేవాళ్లు కూడా ఉంటారు… సేమ్, బెంగాలీయే… తబలా వాయిద్యకారుడు అనింద్యా చటర్జీ కూడా దాదాపు అవే కారణాలతో రెఫ్యూజ్ చేశాడు… అలాగే మాజీ సీఎం బుద్దదేవ భట్టాచార్య కూడా […]
ఆఫ్టరాల్ పద్మ పురస్కారాలు అనుకున్నారా..? అది వార్తగానే కనిపించలేదా..?!
ఆశ్చర్యం కలిగింది… నిజమేనా..? ఇలాంటి పత్రికలు కూడా ఉన్నాయా..? అసలు నేను చదివింది నిజమేనా..? పద్మ అవార్డుల వార్త లేకుండా వచ్చిందా ఓ పత్రిక..? అసలు అది పత్రికేనా..? పత్రిక అనాలా..? పైగా మెయిన్ స్ట్రీమ్ పత్రిక అట… ఈ డౌట్లతో సూర్య అనే పత్రిక ఈ-పేపర్లు ఓపెన్ చేసి చూస్తే… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని వేర్వేరు ఎడిషన్లున్నయ్… నిజానికి వేర్వేరు ఎడిషన్లు, సేమ్ వార్తలు… సేమ్ పేజీలు, ఏమీ తేడా లేదు… జాగ్రత్తగా ఫస్ట్ పేజీ […]
KCR జాబ్స్ ఇవ్వడు సరే… కానీ హమాలీ పని చేస్తే అది నామోషీయా… ఎలా..?!
ఈ వార్త వెలుగు అనే కాషాయ దినపత్రిక ఫస్ట్ పేజీలో కనిపించింది… ఒక్కసారిగా చివుక్కుమన్నది… బీజేపీ ఎజెండా మేరకు రోజూ ఏదో ఒక కారణంతో కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచాలనే తపన, తాపత్రయం, ప్రయాస రాజకీయ కోణంలో అర్థం చేసుకుందాం… అన్ని పత్రికలూ అంతేగా… వెలుగు భిన్నమేమీ కాదుగా… బాసుతోపాటు నిలువెల్లా కాషాయం పులుముకుని పింక్‌ను ఎండగట్టాలి… వోకే… కానీ ఆ పరుగులో పడి, ఒక పనిని అవమానిస్తున్నామనే సోయి లేకపోతే ఎలా..? అవునూ, గ్రాడ్యుయేషన్ […]
మీడియా జ్ఞానులకు కేసీయార్ చురకలు… ఇప్పటికీ ఆ పాత వీడియో విలువైందే…
ఏడు నెలల క్రితం వీడియో ఇది… వరంగల్ అర్బన్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ కేసీయార్ తనకు కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందో చాలా విషయాల్ని షేర్ చేసుకున్నాడు… తను ఏం గోళీలు వాడానో కూడా చెప్పాడు… నిజానికి అవి అప్పటికన్నా ఇప్పటికీ బాగా యాప్ట్ అనిపిస్తున్నయ్… నిజం… కేసీయార్ అప్పట్లో చెప్పిన ఆ ప్రతి మాటా ఇప్పుడు బహుళ ప్రచారంలోకి రావాలి… ప్రత్యేకించి మీడియా మీద కేసీయార్ కరోనాకు సంబంధించిన విసిరిన విసుర్లు […]
మరో కంపెనీ లెంపలేసుకుంది..! తినిపారేసే చాక్లెట్ ర్యాపర్ల మీద దేవుళ్లు..!!
అమెజాన్ వాడు ఫలానా ఉత్పత్తి మీద గణేషుడి బొమ్మ ముద్రించాడు… ఒక వివాదం… ఇంకెవడో పాదరక్షల మీద హిందూ దేవతల బొమ్మలు వేశాడు… ఇంకొక పంచాయితీ… ఆ విదేశీ కంపెనీ హిందూ దేవుడి బొమ్మను నీచంగా చిత్రించింది… మరొక ఆరోపణ… ఎక్కడిదాకో ఎందుకు..? తెల్లారిలేస్తే మనం నెస్లే వాడివి ఎన్నో ఉత్పత్తులు కొంటూనే ఉంటాం కదా… వాడు కిట్‌కాట్ చాక్లెట్ రేపర్ మీద పూరీ జగన్నాథుడి బొమ్మను ముద్రించి మార్కెట్లోకి వదిలాడు… సో వాట్, చాక్లెట్ రేపర్ […]
గట్టిగా ఏడవకండి… మిమ్మల్ని మతోన్మాదులుగా ముద్రవేసే ప్రమాదముంది…
సోషల్ మీడియాలో చాలా పోస్టులు కనిపించినయ్… Srini Journalist రాసిన ఈ పోస్ట్ ఆలోచనాత్మకంగా ఉంది… సోకాల్డ్, మన కుహనా మేధావుల్లోని పక్షపాతాన్ని, వెన్నులేనితనాన్ని బజారులో నిలబెడుతున్నట్టుగా ఉంది… ఉద్దేశపూర్వక మౌనాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది… ఈ వాదనతో అందరూ ఏకీభవించకపోవచ్చుగాక… కానీ మెజారిటీ మతమే కొన్నిసార్లు బాధిత మతంగా, మైనారిటీ మతాలే ఆధిపత్య మతాలుగా చెలామణీ అయ్యే ఏకైక దేశం బహుశా ఇండియాయేనేమో అనిపిస్తుంటుంది… ఈ పోస్టు ఓసారి చదవండి… (మీకు మెయిన్ స్ట్రీమ్‌లో అసలు వార్తే […]
వైశ్యులు మండిపడ్డారు… జగన్ నిషేధించాడు… కానీ చింతామణి అసలు కథేంటి..?!
ఏదో చింతామణి అనే నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిందట… ఓహ్, అలాగా… దేనికి..? అందులో ఆర్య వైశ్య సామాజికవర్గంపై రీతిలేని కూతలు, అవమానించే వెకిలి రాతలు ఉన్నాయి కాబట్టి అట…! ఆ దిక్కుమాలిన నాటకాన్ని నిషేధించాలని సదరు సామాజికవర్గం కోరుతోంది కాబట్టి సకలకుల వల్లభుడైన జగన్మోహనుడు (ఆ ఒక్క కులం తప్ప) వెంటనే స్పందించి, ఠాట్, నా రాజ్యంలో మళ్లీ ఎవడూ ఆ నాటకాన్ని వేయకూడదనీ, వేస్తే మర్యాద దక్కదనీ అధికారికంగా హుకుం జారీ చేశాడుట… సరే, […]
అవునూ.., ముందుగా మందు ఏ బ్రాండ్లతో మొదలుపెడితే బెటరబ్బా..!?
Rajan Ptsk…………. తెలుగు “కోరా”లో ఓ అపరిచిత వ్యక్తి అడిగిన ప్రశ్న: నేను (25) ఇప్పటి వరకూ మద్యం సేవించలేదు. మానసిక ఒత్తిడి తో ఆరోగ్యం చెడగొట్టుకునే కన్నా మద్యం సేవించి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నా. నేను దేనితో (మద్యం రకం) మొదలు పెడితే మంచిది? . రాజన్ పి.టి.ఎస్.కె సమాధానం: మానసిక ఒత్తిడితో ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే మద్యం సేవించడమే ఉత్తమం. కానీ మీరు ఎంచుకునే బ్రాండ్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందుగా […]
ఆ అక్క కన్నీటిలాగే… ఆంధ్రజ్యోతి జర్నలిజమూ ఎండిపోయినట్టుంది…
ఒక హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తను ప్రజల్ని కనెక్టయ్యేలా రాయడం ఒకెత్తు… దాన్ని బరువైన హెడ్డింగ్‌తో, మంచి శైలితో రీరైట్ చేసి, పాఠకులకు ప్రజెంట్ చేయడం మరో ఎత్తు… మొదటిది రిపోర్టర్ పని… రెండోది డెస్కులో సబ్ఎడిటర్ పని… ప్రస్తుతం జర్నలిజం ప్రమాణాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి, ఆ చర్చలోకి వెళ్లకుండా… ఈ ఒక్క వార్త సంగతే ఆలోచిద్దాం… నిజానికి మనల్ని కదిలించే వార్త… గుండెల్ని కొన్నివార్తలు మెలితిప్పుతాయి… ఇదీ అలాంటిదే… విధివంచిత కుటుంబాలు, జీవితాలు… […]
ఎన్నాళ్లకెన్నాళ్లకు… మళ్లీ తెలుగు బుల్లితెర మీద నాటి ఉదయభాను సందడి…
టీవీ ప్రేక్షకులకు… అసలు ఓ లెక్కకొస్తే, హీరోయిన్లు, హీరోలు, ఇతర ఆర్టిస్టులందరికన్నా ప్రతి ఇంటికీ చేరేది యాంకర్లు… తెల్లారిలేస్తే పలకరిస్తారు, ఏదో ఓ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటి మనిషితోనూ ముచ్చట్లు పెడతారు… ఇంటిమనిషిగా కలిసిపోతారు… బట్, ఆ యాంకర్‌కు కాస్త స్పాంటేనిటీ, కాస్త సభ్యత, సరైన ఉచ్ఛరణ, కాస్త కలివిడితనం ఉంటేనే సుమా…! కొన్నేళ్లుగా టీవీ యాంకర్ అంటే సుమ… టీవీ హోస్ట్ అంటే సుమ… సినిమా ఫంక్షన్ అంటే సుమ… వెకిలి ధోరణులకు దూరంగా […]
- « Previous Page
- 1
- …
- 120
- 121
- 122
- 123
- 124
- …
- 126
- Next Page »