ఒక ఊరు… ఒక గాడిద… ఒక యజమాని… రోజూ రాత్రి దాన్ని ఆయన ఇంటెదురుగా ఉన్న ఓ చెట్టుకు కట్టేస్తూ ఉంటాడు… లేకపోతే కష్టం… వెళ్లి, ఎవరి చేలలోనో పడిందీ అంటే… సదరు రైతు తెల్లారే వచ్చేసి, తనను ఉతికేసి పోతాడు మరి…! అందుకని కట్టేయడం మాత్రం మానడు… ఆ చెట్టుపైనే ఓ దెయ్యం కాపురం ఉంటుంది… కొంచెం తీట కేరక్టర్ దానిది… అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్నట్టుగా… అసలే కాస్త తీట కదా… […]
దశకథకుడు..! రాస్తే మాస్టర్ పీసులే… లేదంటే ఏళ్లుగా నిశ్శబ్దమే…!!
Taadi Prakash…………… విరబూసిన ఆ కథలే…. సి.రామచంద్రరావు …… Old man and the sea of telugu literature…. మన వాళ్లు వొట్టి వెధవాయిలోయ్! ఎంతసేపూ 30 రోజుల్లో రామోజీరావు అవ్వడం ఎలా? అన్న పాడు బుద్ధులే తప్ప, పది కథల్తోనే ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడం ఎలా? అని ఆలోచించే వాళ్లెవరైనా వున్నారా? ఒక్క సి.రామచంద్రరావుగారు తప్ప! ఏ కొద్దిమందినో మినహాయిస్తే, ఈ తరం కుర్రసన్నాసులెవరికీ రామచంద్రరావుగారు తెలీక పోవచ్చు. ఆయన కథల గురించీ విని […]
అక్కినేనిని అంతగా అనగలిగాడు… అందుకే అతను ఆత్రేయ…
Bharadwaja Rangavajhala….. అక్కినేని మీద ఆత్రేయ వ్యాసం… సెప్టెంబరు 20 అక్కినేని జన్మదిన సందర్భంగా … ఎవరీ అక్కినేని? ….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు. నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఉన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు.అమ్మాడు. […]
మీకూ ఇలాంటి దుస్థితే తప్పదు… అగ్ర హీరోలకు శాపాలు… ట్వీట్లలో శోకాలు…
నో డౌట్… కృష్ణంరాజు మరణానికి తెలుగు ఇండస్ట్రీ ఘన నివాళినే అర్పించింది… హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖులు అందరూ వెళ్లారు, షూటింగుల కోసం ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా సంతాపం ప్రకటించారు… హైదరాబాద్‌కు రాలేకపోయినవాళ్లు ట్వీట్లు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ నివాళి కనబరిచారు… కానీ రాంగోపాలవర్మకు అది సరిపోలేదట… ఓ వింత వాదనకు తెరతీశాడు… అఫ్కోర్స్, ఇప్పుడు తన స్థాయిని బట్టి, తనను ఎవరూ పట్టించుకోరు ఇండస్ట్రీలో… కాకపోతే ఏదో ఒకటి గెలకడంలో నంబర్ […]
ఎవడితో పంచాయితీల్లేవ్… తిట్లు తినే ‘పిచ్చి వేషాల్లేవ్’… ‘రాజులాగే’ బతికాడు…
ఆరడుగుల దాటిన ఎత్తు… మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే గాంభీర్యం… దృఢమైన దేహం… కళ్లల్లో రౌద్రం… మాటలో పౌరుషం… కృష్ణంరాజు ఎన్నిరకాల సాత్విక పాత్రలు వేసినా సరే, ఆయన పేరు వినగానే సినిమాలకు సంబంధించి రౌద్రరూపమే ఎక్కువగా కనిపిస్తుంది… బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు వంటి పాత్రలే చటుక్కున ఆలోచనల్లో మెదులుతాయి… అదేమిటో గానీ తనకు నటుడిగా పేరు తెచ్చిపెట్టినవీ, నిలబెట్టినవీ అలాంటి పాత్రలే… నిజానికి తనకు బేసిక్‌గా నటనకన్నా ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్… హైదరాబాదులో రాయల్ స్టూడియో […]
నిలబడింది, భేష్… కానీ కాఫీడేను నిలబెట్టిందా..? నాణేేనికి ఇది మరో కోణం..!
హరి క్రిష్ణ ఎం. బి……… Cafe Coffee Day…. పోయిన ఏడాది ఒకసారి, ఈ మధ్య మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో కాఫీడే కంపెనీ అధినేత మాళవిక కంపెనీ ఆర్ధిక పరిస్థితిని పూర్తిగా మలుపుతిప్పారని రాసేశారు. అప్పులన్నీ తీర్చేస్తున్నట్టు, కంపెనీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్నట్టు చెప్తున్నారు… ఇది పాక్షిక సత్యం. సోషల్ మీడియా రాకముందు కూడా మన ప్రధాన స్రవంతి మీడియా కూడా ఇలా పాక్షిక అబద్దాలను, నిజాలను అటూ ఇటూ తిప్పేసి రాసేసి […]
ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పుస్తెలకు కట్టాలట… యాణ్నుంచి వస్తర్రా భయ్ మీరంతా…
ఒక దృశ్యం… ఒక మంచం వేసి ఉంది… దానిపై ఓ బట్ట… దాని నాలుగు కోళ్ల దగ్గర నాలుగు రాళ్లు తెచ్చిపెట్టారు… వాటి మీద నీళ్లు జల్లి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టారు… ఇద్దరు బాలింతలు తమ చంటి బిడ్డలను అక్కడికి తీసుకువచ్చారు… అలంకరించిన చాటల్లో పడుకోబెట్టారు… పైన తెల్లటి వస్త్రాన్ని కప్పారు… తరువాత ఆ ఇంటి పెద్దను, అనగా అత్తగారిని పిలిచారు… ఆమె చాటను ఒకవైపు లాగుతూ ఈ బిడ్డ నీకా నాకా అనడుగుతుంది… […]
ఓనం అంటేనే సాద్యా… ఒక్కసారి అరిటాకు ఖాళీ అయిపోతేనే పండుగ మజా…!!
ఈరోజు మలయాళ పండుగ ఓనం… ఆంధ్రులకు సంక్రాంతి, తెలంగాణలో దసరా పండుగల్లాగే కేరళ వాళ్లకు ఓనం ప్రధానమైన పండుగ… ఎవరి స్థోమతను బట్టి వాళ్లు పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు… ఒకప్పటితో పోలిస్తే ఈ పండుగ కూడా తన ప్రాభవాన్ని వేగంగా కోల్పోతోంది… ఆ కారణాల చర్చలోకి వెళ్లడం లేదు గానీ… ఓనం సాధ్యా అనేది ఆసక్తికరమైన పండుగ విశేషం… సాధ్యా అంటే ఓనం పండుగ భోజనం… నేల మీద కూర్చుని, కుటుంబసభ్యులంతా, అరటి ఆకుల్లో 24 నుంచి […]
ఆ ఒంటరి నాన్న జీవితంలో మళ్లీ సిటీ మొహం చూడలేదు..!!
భార్య చనిపోయింది… ఈలోకం నుంచి సాగనంపారు… పదమూడోరోజు కార్యక్రమాలు కూడా ముగిశాయి… రిటైర్డ్ పోస్ట్‌మ్యాన్ మనోహర్ ఇక తన ఊరిని, ఇంటిని విడిచిపెట్టి ముంబైలోని తన కొడుకు సునీల్ ఇంటికి వచ్చేశాడు… నిజానికి ఆ ఇంటికి రావడానికి ఏళ్లు పట్టింది తనకు… కొడుకు ఇంటికి వెళ్దామని ఎప్పుడు చెప్పినా సరే, భార్య అంగీకరించేది కాదు… వాళ్ల జీవితాల్లోకి మనం ఎందుకు జొరబడటం..? ఏం, ఇప్పుడు ఈ ఊళ్లో బాగానే ఉందిగా అంటూ వారించేది… ఇప్పుడు ఆమె లేదు… […]
అసలు ఏమిటి కన్సల్టెన్సీ అంటే… అదిరిపోయే ఉదాహరణ ఇదుగో…
ఎన్నికల వ్యూహాలకు కన్సల్టెన్సీలు… పథకాల రచనకు కన్సల్టెన్సీలు… ప్రతి శాఖలో కన్సల్టెన్సీలు… ఎక్కడ చూసినా కన్సల్టెన్సీలు… . ఓ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీకి ఓ ఫేమస్ కన్సల్టెంట్ వచ్చాడు ఏదో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి… ఓ విద్యార్థి తననే అడిగాడు… ‘‘కన్సల్టెన్సీ అంటే ఏమిటి సార్..?’’ . ఏ మూడ్‌లో ఉన్నాడో గానీ కన్సల్టెంట్ కాస్త అర్థమయ్యేట్టుగానే చెప్పడానికి రెడీ అయ్యాడు… ఓ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు… . ‘పర్ సపోజ్, నా దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు… […]
హంగరీ తండ్రి, రష్యా తల్లి, తను స్విట్జర్లాండ్… మెట్టింది, గిట్టింది ఈ నేలపై…
సైనికులకు ఇచ్చే పురస్కారాల గురించి చదువుతుంటే… ఓ ఎపిసోడ్ ఇంట్రస్టింగుగా అనిపించింది… మన పిల్లలకు బోధించే కరిక్యులమ్‌లో ఇలాంటివి ఎందుకు ఉండవు అనిపించింది..? మరీ కార్తికేయ-2, బ్రహ్మాస్త్ర సినిమాల తరహాలో కాదు గానీ దీని వెనుక కూడా ఓ పురాణగాథ ఉంది… పక్కా భారతీయ స్త్రీగా మారిన ఓ విదేశీ యువతి ఉంది… ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా మన సైనిక విభాగాలేమైనా సరే, అందుకోదగిన అత్యున్నత సైనిక పురస్కారం ఏమిటో తెలుసు కదా… పరమవీరచక్ర… […]
గురువుతో అఫైర్… క్షమించిన భర్త… బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ కథ…
Nancharaiah Merugumala…… రాజకీయ గురువుతో ‘అఫైర్’ నుంచి బయటిపడి భర్తతో దాంపత్య జీవితాన్ని కాపాడుకున్న కాబోయే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ నిజంగా గ్రేట్…. బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన మేరీ ఎలిజబెత్ ట్రస్ (47) దాంపత్య జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మీకూ చెప్పాలనిపించి రాస్తున్నాను. బోరిస్ జాన్సన్ రాజీనామాతో పాలకపక్షమైన కన్సర్వేటివ్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం కోసం భారత పంజాబీ ఖత్రీ రిషి సునక్ నుంచి ఎదురైన పోటీలో విజేతగా నిలిచిన లిజ్ […]
KCR ను ఇరుకునపెట్టే BJP ‘విమోచన’ ప్లాన్… TRS కౌంటర్ స్ట్రాటజీ రెడీ…
నిన్న నమస్తే తెలంగాణలో ఫస్ట్ లీడ్ స్టోరీ ఒకటి వచ్చింది… ఏమిటీ అంటే..? తెలంగాణ భారత యూనియన్‌లో కలిసి 74 ఏళ్లు పూర్తయినందున, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవం నిర్వహించాలని పలువురు మేధావులు ముఖ్యమంత్రిని అడిగారట… సీఎం సానుకూలంగా స్పందించాడట… కేబినెట్లో చర్చిస్తామని చెప్పాడట… 75 ఏళ్లు కాలేదు, 74 ఏళ్లే… ఐతేనేం… రాజకీయ అవసరం… మేధావులు కేసీయార్‌కు చెప్పడం, ఆయన సావధానంగా వినడం, సానుకూలంగా స్పందించడం అసలు జరిగే పనేనా..? కావాలనే ఆ స్టోరీ వండబడింది… […]
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు… క్రూరహింసకు గురవుతున్న ఓ గుడి ఏనుగు కథ…
నిన్నో, మొన్నో యాంకర్ రష్మి వినాయకుడికి దండ వేస్తున్న ఓ గజరాజు వీడియో పోస్ట్ చేస్తే… వెనకాముందూ చూడకుండా, ఆమె గురించి తెలియకుండా హిందూ ద్రోహి అని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కొందరు… సరే, ఆ వివాదం ఎలా ఉన్నా, ఆ వార్తల్ని చెక్ చేస్తుంటే మరో ఇంట్రస్టింగ్ వార్త కనిపించింది… అదీ ఏనుగుదే… ఓ ఏనుగు బాధ… ఎందుకు ఒక్కసారిగా కనెక్టయ్యానంటే… ఆ ఏనుగు కోసం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం… రాష్ట్ర […]
నాకు వేరే పులిట్జర్ అవార్డు అవసరమా..? ప్రభుత్వ పురస్కారం కావాలా..?
Taadi Prakash…………. ఎడిటర్ నండూరికి నివాళి, గతకాలపు మంచితనాన్ని మరొక్కసారి తలుచుకుంటూ …. నండూరి వారితో వదంత వీజీ కాదు!…. An Uphill Task at AndhraJyothi daily ______________________________________ జర్నలిజంలో పదేళ్లు పూర్తి చేశాను. 1974-75లో వచ్చిన ‘ఈనాడు’ తెలుగు జర్నలిజంలో భూకంపం పుట్టిస్తే, 1984-85లో వచ్చిన ‘ఉదయం’ సునామీ సృష్టించింది. ఈ రెండు దినపత్రికలూ రూల్స్ ఆఫ్ ది గేమ్ ని పూర్తిగా మార్చేశాయి. నిజానికి నేను ఈనాడుకీ ఉదయానికీ పుట్టిన అక్రమ సంతానాన్ని. […]
చైనాతో నేపాల్‌కూ తలబొప్పి… ఆ రెండు హైడల్ ప్రాజెక్టులూ ఇండియా చేతికి…
పార్ధసారధి పోట్లూరి ……… చైనాది ఎంత విషకౌగిలో హంబన్‌తోట పోర్టుతో శ్రీలంకకు అర్థమైంది… నాసిరకం ఆయుధాలతో బంగ్లాదేశ్‌కు అర్థమవుతోంది… ఇప్పుడు నేపాల్‌కు కూడా అర్థమైపోయింది… చైనా అర్థంతరంగా వదిలేసిన రెండు విద్యుత్ ప్రాజెక్టుల పనుల్ని భారత్ కి ఇచ్చింది నేపాల్ ! నేపాల్ దేశం కోసం రెండు విద్యుత్ ప్రాజెక్ట్స్ ని నిర్మించమని భారత్ తో ఒప్పందం చేసుకున్న నేపాల్ ప్రభుత్వం… హిమాలయ రాజ్యం అయిన నేపాల్ పశ్చిమ భాగంలో సేటి హైడ్రో పవర్ ప్రాజెక్టు [West […]
ఓహో… ఆ పత్రిక రాసిన ‘పెయిడ్ స్టోరీస్’తోనే ఢిల్లీలో ముసలమా..!!
అదేదో శుద్ధపూస పత్రిక అయినట్టు… ఆప్, బీజేపీ తన్నుకుంటున్నాయి..! ఆప్ నేతలు చెబుతున్నారేమిటంటే..? ‘‘ఢిల్లీ ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్ని న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ప్రత్యేక కథనంగా కుమ్మేసింది… అది చూసి మోడీకి, షాకు బుగులు పట్టుకుంది, ఇక రాబోయే ఎన్నికలు కేజ్రీ వర్సెస్ మోడీ అనేది ఫిక్స్… పైగా అదే పత్రిక కరోనా సమయంలో మోడీ వైఫల్యాల్ని కూడా ఏకిపారేసింది… అదుగో, దాంతో కక్షపెట్టుకుని సిసోడియాను టార్గెట్ చేసి, సీబీఐ కేసు పెట్టించాడు […]
ఓహో… బుల్డోజర్ బాబా తొలి ప్రతాపం బాలీవుడ్ కేరక్టర్లపైనే అట…
మొన్నామధ్య అనురాగ్ కశ్యప్ అనబడే ఓ వెకిలి దర్శకుడు హీరోయిన్ తాప్సి స్తనాలపై చేసిన వెగటు వ్యాఖ్య గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ కశ్యపుడి కథేమిటా అని చెక్ చేస్తుంటే… మరో ఆసక్తికరమైన వార్త కనిపించింది… ఒక్క కశ్యప్ మాత్రమే కాదు… తనతోపాటు రాజ్‌బబ్బర్, ఆయన భార్య నదిర, విశాల్ భరధ్వాజ్, నవాజుద్దీన్ సిద్దిఖి ఎట్సెట్రా 172 మంది బాలీవుడ్ పర్సనాలిటీలు ప్లస్ కొందరు ఇతరులు నెలనెలా 50 వేల పెన్షన్లు పొందారట… షాకింగ్‌గా ఉందా..? అంతేమరి… […]
నో.. నో.. ఝన్‌ఝన్‌వాలా సక్సెస్ స్టోరీ కాదు… ఓ ఫెయిల్యూర్ స్టోరీ…
హబ్బ… ఏం సక్సెస్ స్టోరీ..? జస్ట్, చేతిలో అయిదారు వేల రూపాయలతో మొదలుపెట్టి, స్టాక్ ఎక్స్ఛేంజీలతో, స్టాక్ మార్కెట్లతో ఆడుకున్నాడు… 40 వేల కోట్లు సంపాదించాడు… ఇది కదా సక్సెస్ అంటే… ఇది కదా లైఫ్ అంటే… ఇది కదా థ్రిల్ అంటే… ఇలా మీడియా, సోషల్ మీడియా మస్తు రాసేశాయి రాకేష్ ఝన్‌ఝన్‌వాలా గురించి… తను సంపాదించిన డబ్బును మాత్రమే చూశారు, కానీ ఎందుకు తను కేవలం 62 ఏళ్లకే చనిపోయాడో మాత్రం పట్టించుకోలేదు… ప్రస్తుత […]
రైల్ పలారం..! నో ఆయిల్, నో ఫ్రై, నో మసాలాస్… సింపుల్, టేస్టీ, హెల్దీ…!
రైల్ పలారం… తెలంగాణ వంటల్లో సర్వప్ప, సకినాలు, గట్క, కారపు అప్పాలు గట్రా పాపులర్ అయ్యాయి గానీ ఈ రైల్ పలారం చాలామంది తెలంగాణవాళ్లకే తెలియదు… నిజానికి ఇది చాలా పాత రెసిపీయే… ఎంతోకాలంగా తెలంగాణ అమ్మలు ప్రేమగా చేసి వడ్డిస్తున్నదే… కాకపోతే కాస్త టైమ్ ఎక్కువ తీసుకుంటుంది… కొంచెం కష్టపడాలి… గణేష్ చతుర్థికి కుడుములు, ఉండ్రాళ్లు చేసుకుంటాం కదా… అలాంటివే చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, మనకు ఇష్టం వచ్చిన రీతిలో పోపు పెట్టుకుని, మనకు […]