ఓ మిత్రుడు తన పదిహేను రోజుల నార్త్ స్పిరిట్యుయల్ టూర్ విశేషాలు చెబుతూ… కాశి, ఉజ్జయిని, అయోధ్య, ప్రయాగ, గయ, బృందావనం తదితర ప్లేసుల గురించి వివరిస్తున్నాడు… అయోధ్య, బృందావనం కట్టడాలు భక్తికే గాకుండా ఆ ఆర్కిటెక్చర్, ఆ వాతావరణం పర్యాటకులకు అబ్బురం… మరి కాశి, ప్రయాగ, గయ..? దర్శనాలకే కాదు… నదీస్నానాలకు, అంతకుమించి పితృకర్మలకు ప్రాముఖ్యం… తమ పూర్వీకులకు అక్కడే పిండతర్పణం చేసిరావడానికి భక్తజనం ప్రాధాన్యమిస్తారు… హిందూ మతస్తులకు ఇవి పితృకర్మల కోణంలో ముఖ్య సందర్శనీయ […]
మరక మంచిదే… మురికీ మంచిదే… అనుకోకుంటే ఇక ఉండలేం…
ఒక్క మాటలో చెప్పాలంటే “మరక మంచిదే” అన్నట్లు “మురికి మంచిదే” అనుకోవడం తప్ప మా కాలనీ చేయగలిగింది లేదు. రోజులో అన్ని వేళల్లో, సంవత్సరంలో అన్ని రుతువుల్లో అలా రోడ్లమీద మురుగు నీరు పొంగి ప్రవహించడానికి వీలుగా ప్రణాళిక రచించిన టౌన్ ప్లానింగ్ వారి అమేయ, అమోఘ, అనితరసాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానం భావితరాలకు ఒక పాఠం. నగర నిర్మాణ, నిర్వహణకు ఒక గుణపాఠం. జాతకాలు చెప్పేవారిమీద ఒక ఫేమస్ జోక్ ప్రచారంలో ఉన్నా…అందులో ఎంతో గాంభీర్యం, […]
ఈ అయిదు రకాల ఫ్రెండ్స్‌లో నిఖార్సయిన ఫ్రెండ్షిప్ ఎవరిది..?
ఒక రోమన్ తత్వవేత్త ప్రకారం స్నేహితులు 5 రకాలు 1. బెస్ట్ ఫ్రెండ్స్: ప్రతి మనిషికి 1- 2 ఉంటారు. ఈ స్నేహం ఎందుకు ఏర్పడుతుందో, ఎలా ఏర్పడుతుందో తెలియదు కానీ ప్రతి మనిషి జీవితం లో ఒకరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మన జీవితం అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నా, పరిస్థితులు బాగా లేని స్థితిలో ఉన్నా ఈ స్నేహంలో మార్పు ఉండదు. ఇద్దరికి మించి ఏ ఒక్కరికీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. మనకు ఉన్న […]
అసలు పేరు యామినీ పూర్ణ తిలక… ఇంతకీ ఏమిటీ ఆమె గొప్పదనం…
84 వ ఏట న్యూఢిల్లీలో అస్తమయం … నా నాట్యంతోనే పండుగలు సందడి చేస్తాయి (డా. పురాణపండ వైజయంతి) హస్తినాపురిలో జాతీయ పండుగలకైనా, తెలుగువారి పండుగలకైనా… ఆమె చిరు మువ్వల సవ్వడి చేయాల్సిందే… ఆమె అడుగులు నెమలికి నాట్యం నేర్పాయి… ఆమె జతులు లేళ్లకు గెంతులు నేర్పాయి… ఆ వయ్యారాలు నదులకు పరుగులు నేర్పాయి… ఆ కళ్లు నాట్యాన్ని పలికాయి… ఆ పెదవులు కావ్యాలను ఒలికాయి… ఆమె కదిలితే మెరుపు తీగలు….. ఆమె కంటిలో విద్యుల్లతలు… ఆమె నర్తిస్తే మెరుపులు, ఉరుములు… ఆవిడ ముద్దుపేర్లు పేరు […]
శ్రీశ్రీ, రారా, చేరా… రెండు కాదు.., ఒకే అక్షరంతో జగత్ ప్రసిద్ధుడు… మో…!!
‘మో’ కవిత్వంతో బతికిన క్షణాలు… Magical, surreal and insane at times ——————————– శ్రీశ్రీ నుంచి రా.రా, చేరా దాకా రెండక్షరాలతో పాపులర్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నా ఒకే ఒక్క అక్షరంతో కవితాజగత్ ప్రసిద్ధుడైనవాడు మాత్రం ‘మో’ వొక్కడే! జీవితాంతమూ సర్రియలిస్టు మబ్బుల్ని పట్టుకు వేలాడి సప్తవర్ణ మాలికల సౌందర్యంతో కవితామ్ల వర్షమై కురిసిన వాడూ ఆయనొక్కడే! ఆశాభంగం చెందిన అక్షరాలనన్నిటినీ పోగుచేసి, వాటికి క్షోభనూ, కన్నీళ్లనూ జతజేసి… “అలా అని పెద్ద బాధా […]
చూడ చూడ ఈ మూర్ఖ భక్తుల పైత్యాలు వేరయా విశ్వదాభిరామా…
అదసలే తమిళనాడు… నాస్తికత్వం, హేతువాదం గట్రా పార్టీల సిద్ధాంతాల్లో ఉంటాయి గొప్పగా… ఆస్తికత్వం, భక్తితత్వానికీ కొరతేమీ లేదు… ఎటొచ్చీ కొందరు మూర్ఖభక్తులుంటారు… దరిద్రులు… సినిమా తారలకు, హీరోలకు, రాజకీయ నాయకులకు గుళ్లు కట్టి పూజిస్తుంటారు దేవతలుగా… అదంతే… ఒకవైపు తెలివైన సమాజం, అదేసమయంలో మరోవైపు పూర్తి భిన్నమైన మూర్ఖ సమూహం… దేవుళ్లు, దేవతలు జాన్తానై కానీ… జయలలిత దూరంగా వెహికిల్‌లో వెళ్తుంటే ఉన్నచోటే సాష్టాంగ ప్రణామాలు చేసేంత పైత్యమూ అక్కడే… తాజాగా ఓ వీరభక్గుడు ఏకంగా ఓ […]
నగరాల్లో కోళ్లెక్కడివి… పొద్దున్నే కుక్కల కూతలే… ఎగబడి పంటి కోతలే…
మా కాలనీలో కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసాలు లేవు కాబట్టి…పూల పుప్పొడులమీద జుమ్ జుమ్మని వాలే తుమ్మెదల ఝుంకారాల్లేవు. వాలే కోయిలలు లేవు. పాడే కోయిలలు రావు. కొమ్మలకు చిలకపచ్చ చిగుళ్లు తొడిగే చిలుకలు రానే రావు. ఒకవేళ వచ్చినా పిలిచి పీట వేయడానికి చెట్టంత ఎదిగిన చెట్లు లేనే లేవు. కాబట్టి సూర్యుడు తూరుపు తెర చీల్చుకుని “దినకర మయూఖతంత్రుల పైన, జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన… పలికిన […]
ఓహ్… బీర్ అలా పుట్టిందా..? ప్రపంచవ్యాప్తంగా అలా మత్తెక్కిస్తోందా..?!
బీర్ అనేది ప్రపంచం లోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్ డ్రింక్స్‌లో ఒకటి.. మరి ఈ బీరు పుట్టు పూర్వోత్తరాల గురించి మీకు తెలుసా..? అసలు బీరుకు ఓ రంగును, రూపుని, రుచిని ఇచ్చింది, తెచ్చింది, అంతా మహిళలే నని మీకు తెలుసా..? ఈ రోజు అంతర్జాతీయ బీర్ డే సందర్భంగా బీరు పుట్టు పూర్వోత్తరాలు.. దాని చరిత్ర గురించి తెలుసుకుందాం..! సుమారు 7 వేల సంవత్సరాల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు తయారీ ఆసక్తికరంగా ప్రారంభమైంది.. […]
రాహులయ్యా… రాజీవుడి మరణానికీ వయనాడ్ విపత్తుకూ లింకేమిటయ్యా…
వయనాడ్ విషాదానికి, రాజీవ్ చావుకూ పోలిక ఉందా? మోదీని మించిపోయిన అన్నాచెల్లెళ్ల ‘భావోద్వేగాలు’! …………………. ‘‘కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ బాధితులను చూస్తే.. నా తండ్రి మరణించినప్పుడు నేను ఎలాంటి బాధ అనుభవించానో అలాంటి నొప్పి ఇప్పుడు నాకు కలుగుతోంది,’’ గురువారం చెల్లెలు ప్రియాంకా వాడ్రాతో కలిసి కేరళలో తన పూర్వ లోక్‌సభ నియోజవర్గంలోని ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్న మాటలివి. ‘‘నా అన్నకు కలిగిన బాధే నన్నూ […]
ఆలీ మీమ్ ఎక్స్ప్రెషన్ గుర్తుంది కదా… అసలు ఎవడు మమ్మీ వీడు…
మన తెలుగు మీమ్స్‌లో తరచూ కనిపించే ఓ ఎక్స్ప్రెషన్… కమెడియన్ ఆలీ ఓ విచిత్ర వేషంలో ‘అసలు ఎవడు మమ్మీ వీడు..?’ అని ఆశ్చర్యపోతూ ఎక్స్ప్రెషన్ పెడతాడు… ఈసారి ఒలింపిక్స్‌లో షూటర్ యుసుఫ్ డికెక్ మెడల్ కొట్టిన తీరు చూస్తే అలాగే అనాలని అనిపిస్తుంది ఎవరికైనా… తను టర్కిష్ షూటర్… అది ఒలింపిక్స్ 10 M ఎయిర్ పిస్టల్ ఈవెంట్… ఓ టీషర్ట్ వేసుకుని కాజువల్‌గా వచ్చాడు… 51 ఏళ్లు కదా… సాల్ట్ అండ్ పెప్పర్ జుత్తు… […]
లేటవుతుందీ అంటే… ఇజ్రాయిల్ అటాక్ భీకరంగా ఉండబోతున్నదీ అని…
ఇజ్రాయెల్ తాను ఎంత శక్తిమంతమైనదో ప్రపంచానికి చాటి చెప్పింది! ఇరాన్ హుతిల డ్రోన్ దాడి తర్వాత కొంచెం సమయం తీసుకొని ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది యెమెన్ మీద! యెమెన్ లోని సముద్ర తీరం లో ఉన్న పోర్టు నగరం అల్ – హోదేయా ( Al – Hodeideh) ను నేల మట్టం చేసింది! ఆపరేషన్ యద్ అరుక ! ఇజ్రాయెల్ పెట్టిన పేరు! Yad Aruka అంటే Long Arm . ఆపరేషన్ యద్ అరుక […]
వదిలేసుకుంటున్నాం… చైనా దేశీయ వైద్యం బాట మనకెందుకు చేతకాదు..?
చైనాలో మానవ నాగరికత మొదలైనప్పటినుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనాలో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. శరీరంపై పంచభూతాలు అగ్ని, గాలి, నీరు, భూమి, మెటల్ (లోహం) ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, ఇంకా శరీరం లోపలికి ఏమి వెళ్తుంది (YIN), ఏమి వస్తుంది(YANG) అనే వాటిని పరిశీలించి TCM వాడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవల్ కూడా ఉంది. 2020 అప్పుడు కరోనా […]
మర్నాడు ‘ఉదయం’ ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు వెలవెలబోయాయి…!!
Taadi Prakash……….. ఎబికె ప్రసాద్ , ట్రెండ్ సెట్టర్ ….. THE EPIC EDITOR OF OUR TIME…… 1984 డిసెంబర్ 29… తెల్లవారేసరికల్లా ఒక మెరుపుదాడిలా వచ్చి పడింది ‘ఉదయం’ దినపత్రిక. ఒక ఫ్రెష్ నెస్, ఒక కొత్తదనం. ఒక వూపు, ఒక వేగంతో వచ్చి జనాన్ని ఆకట్టుకుంది. ఎబికె ఎలా అనుకుంటే అలా – పాశం యాదగిరి ఏంరాస్తే అదీ – పతంజలికి ఏది బాగా అనిపిస్తే అలా – మోహన్ ఏ కార్టూన్ వేస్తే […]
అంతటి ఇజ్రాయిల్‌కే ముచ్చెమటలు పట్టిస్తున్న హుతీ ఉగ్రవాద డ్రోన్స్..!!
ఇజ్రాయెల్ మీద హుతీల డ్రోన్ ఎటాక్! సమద్ -3 (Samad -3) ఇది ఇరాన్ డ్రోన్! సమద్ -3 డ్రోన్ రేంజ్ 800 km కానీ ఇరాన్ దీనికి మార్పులు చేసి లాంగ్ రేంజ్ డ్రోన్ గా అభివృద్ధి చేసింది! మోడిఫై చేసిన సమద్ 3 డ్రోన్ ను హుతీ లకి సరఫరా చేసింది! హుతీలు నేరుగా సమద్ 3 డ్రోన్ ను ఇజ్రాయెల్ మీద ప్రయోగించారు! సమాద్ 3 డ్రోన్ నేరుగా టెల్ అవీవ్ లోని […]
మను బాకర్… ఆమెలో ఈ ఎదురుదాడి ‘కళ’ కూడా ఉందండోయ్…
మను బాకర్… ఒకే ఒలింపిక్ ఈవెంట్లో రెండు పతకాలు పొందిన ఏకైక ఇండియన్ లేడీ అథ్లెట్… ఇదొక రికార్డు… నిజంగానే ఆమె 20 M పిస్టల్ ఈవెంట్లో కూడా పతకం కొడితే అసలు ఆ కథ వేరే లెవల్… అంతకుముందు ఎవరూ లేరా..? ఉన్నారు… అప్పుడెప్పుడో 124 ఏళ్ల క్రితం బ్రిటిష్- ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ 200 ఎం స్ప్రింట్, 200 ఎం హార్డిల్స్ ఈవెంట్లలో సిల్వర్ మెడల్స్ కొట్టాడనేది చరిత్ర… ఇండిపెండెంట్ ఇండియాలో ఆ రికార్డు […]
చేయగలరో లేదో గానీ… ఇలా ఓసారి చేస్తే బాగుంటుందేమో చదవండి…
నాకు జీవితం లో ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు మరియు దేనిమీదా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? జీవితంలో కొన్ని రోజులు మీ అన్నీ పనులు పక్కన పెట్టీ ఈ ఒక్క పని చెయ్యండి… మొదటి రోజు… ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ పీ వార్డ్ కి వెళ్లి ఓ.పి రాయించుకుని కూర్చోండి. ఏమీ చెయ్యొద్దు. అక్కడ ఉన్నవారిని గమనించండి. రోగాలతో బాధ పడేవారూ, వారి ఆర్థిక స్థితిగతులు, అక్కడి చుట్టూ పరిసరాలు చూడండి. మాట […]
నిజంగా మందార పూల టీ తాగితే… వైద్య ప్రయోజనాలున్నాయా..?!
ఒక హీరోయిన్ మందార పువ్వు టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ ఒక పోస్ట్ పెడితే, ఒక డాక్టర్ ఆ వ్యాఖ్యపై నెగటివ్ గా స్పందించిన వార్త ఒకటి వచ్చింది. అది పక్కన పెడితే మందార శాస్త్రీయ నామం: హైబిస్కస్ రోజా సైనెన్సిస్. మందారలో ఔషధాలకి ఉపయోగపడే ఎన్నోరకాల బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న మాట వాస్తవం. మందార పువ్వులో ఫైటో కెమికల్స్ ఉంటాయి. డైరక్ట్ […]
పులులు, సింహాల్లా కాదు… తోడేళ్లలా బతకాలి… ఎందుకో తెలుసా..?
మనిషి సింహం, పులి, ఏనుగులాగా కాకుండా తొడేలులాగా ఉండాలి; ఒక్కరోజయినా, సమూహంలో, ప్రేమలో, స్నేహంలో, బంధంలో… తొడేళ్ళు 4 నుండి 36 వరకు గుంపుగా జీవిస్తాయి. ఒంటరిగా తొడేలు అసలు ఉండలేదు, ఉండవు. ఈ భూమిపై నివసించే జంతువుల్లో, సమూహం కోసం ప్రాణం త్యాగం చేసే జంతువు, నాకు తెలిసి, ఒక్క తొడేలు మాత్రమే. ఒకసారి ఆడ తొడేలు, మగ తొడేలుతో బంధం ఏర్పడిన తర్వాత, మగ తొడేలు మరణించినా, ఇంకే మగ తొడేలుతో సంబంధం పెట్టుకోదు. […]
అప్పులు, వాయిదాల జీవితాలు… దోచుకోవడానికీ ఏముంటున్నయ్ ఇళ్లల్లో…
ఒక దొంగను ఇంటర్వ్యూ చేసిన వీడియో ఒక చిన్న పార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సత్ ప్రవర్తన కలిగిన కొందరు నేరస్తులను జైళ్ల శాఖ నిర్వహించే పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు చేయిస్తున్నారు. ఉప్పల్ దగ్గర అలాంటి ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఈ ఇంటర్వ్యూ లో కూర్చున్న దొంగ ఇండియన్ ఆయిల్ యూనిఫాం వేసుకోవడం వలన అలాంటి ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూను ఏదైనా టీవీ వాళ్లు చేశారా, ఇంటర్వూయర్ వ్యక్తిగతంగా […]
‘తాగడానికి నీరు పనికి రాదు కాబట్టే, దానికి విస్కీ కలిపి కడుపులో పోసుకుంటాం’
‘తాగడానికి నీరు పనికి రాదు కాబట్టే దానికి విస్కీ కలిపి కడుపులో పోసుకుంటాం’ ………………… ఈ మాటలు చెప్పిన వ్యక్తి అనామకుడు కాదు. రెండుసార్లు ఇంగ్లండ్ ప్రధానిగా పనిచేసిన ప్రపంచ ప్రఖ్యాత రాజనీతి దురంధరుడు విన్స్టన్ చర్చిల్ కొటేషన్ ఇది. బిరియానీ, బీర్లను మొదట చాలా కష్టపడి తిని, తాగి వాటి రుచిని అనేక మంది భారతీయుల ఆస్వాదించినట్టుగానే బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియాలో విస్కీ రుచిని చర్చిల్ గుర్తించారట. అప్పటి వరకూ పొరుగు ప్రత్యర్ధి దేశం […]
- « Previous Page
- 1
- …
- 13
- 14
- 15
- 16
- 17
- …
- 108
- Next Page »