. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడిని పార్టీ శ్రేణులు మళ్లీ ఎన్నుకున్నాయి… నిజానికి ఈ వార్త పెద్ద ఆశ్చర్యమూ కాదు, విశేషమూ కాదు… ఆయన పేరుకు బదులు మరో పేరు వినిపించే సవాలే లేదు… తను ఉన్నన్ని రోజులూ పార్టీకి తనే సర్వాధ్యక్షుడు… ఒకవేళ తను ఎన్టీయార్ నుంచి పార్టీని లాక్కున్నట్టుగా ఎవరైనా లాక్కుంటే తప్ప… అలాంటి ప్రమాదాన్ని చంద్రబాబు ఎలాగూ రానివ్వడు… తనెవరినీ నమ్మేది లేదు… ఒకవేళ కుటుంబంలోనే ఎవరైనా అలా చేస్తారని […]
జర్నలిజం – ఇప్పుడు ఒక వెలిసిపోయిన ఆశ.., కళ తప్పిన కల…
. జర్నలిజం… నిజానికి చాలామందికి ఇది కేవలం ఉద్యోగం కాదు. ఒక ప్యాషన్. ఒక తపన. ఒక ఉత్సాహం. అన్నింటికీ మించి సొసైటీకి ఏదో మేలు చేయాలను తలంపు. నిజాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని చెప్పాలి. సామాజికంగా మార్పు తేవాలి. ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో మంది యువత ఈ రంగంలోకి అడుగుపెట్టింది ఆ ఆకాంక్షతోనే… కానీ ఇప్పుడు? ఇప్పడది లేదు… ఆ ఉత్సాహం వెలిసిపోయింది… ఆ సంకల్పం లేదు… ఈ వృత్తి ఓ నిస్తేజమైన మార్గంలా కనిపిస్తోంది… అందుకే […]
అవధానాల్లో అప్రస్తుతాలు… అవే అసలైన హాస్యస్పోరకాలు…
. అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి అవధాని అంత కంటే కొంటెగా సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను. మీరూ ఆనందిస్తారు కదా అని. *1.ప్రశ్న* :- అవధానం చేసే వారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో..? *జవాబు* :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు కారం అట్లంటేనే ఇష్టం* *2. ప్రశ్న* :- పద్యానికి, శ్లోకానికి తేడా […]
రాను రాను కొందరు ఉన్నత విద్యావంతులు… డాక్టర్ కీకరకాయలు…
. ప్రకృతిలో గొప్ప వైవిధ్యం ఉంటుంది. ఏ మొక్క జాతికి, ఏ జంతువు జాతికి ఒక దానితో ఒకటి ఎన్నో సామ్యాలు, దగ్గరతనాలు ఉంటాయి… అలాగే ఎన్నో తేడాలు ఉంటాయి. ఒకే జాతి జీవులలో కూడా ఎన్నో విధాలైన మార్పులు ఉంటాయి. ప్రతి మనిషి తనకే ప్రత్యేకమైన లక్షణాలతో ఉంటారు. సగటు ఎత్తు, బరువు, రంగు, తెలివితేటలు, రూపాలతో ఆయా సమూహాలకు ప్రామాణికత అంటూ ఏర్పరుచుకున్నప్పటికీ… విడిగా ఎవరికి వారు ప్రత్యేకమైన వ్యక్తులు. ఒకే గర్భంలో ఎదిగి, […]
మన సీఎం ఫ్లయిట్‌ను పాకిస్థాన్ కూల్చేసింది… ఆ ఘటన నిజమే,, కానీ..?
. ఏదైనా సమర్థనో, ఖండనో రాస్తే… తప్పయినా సరే నమ్మేలా ఉండాలి… అది ప్రజెంట్ సోషల్ మీడియా ప్రాపగాండా శకంలో ప్రథమ నీతి.,. కానీ చాలాసార్లు పలు పార్టీలు తప్పులో కాలేస్తుంటాయి… ఇదీ అలాంటిదే… ముందుగా ఓ వార్త చదవండి… పాకిస్థాన్, భారతదేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన భార్య ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చివేసి, పొరపాటున క్షిపణిని ప్రయోగించామని చెప్పింది. అప్పుడు భారత ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. అవును, 1965 సెప్టెంబర్ 19న గుజరాత్ ముఖ్యమంత్రి […]
ఓటీటీల మెడలు వంచే ప్లాన్… పే పర్ వ్యూ… ఆమీర్, కమల్ క్లిక్కవుతారా..?!
. థియేటర్ల సమస్య ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది… పనిలోపనిగా ఇండస్ట్రీ సమస్యలన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి… ఫాఫం, ప్రేక్షకుడి పర్సు విషయం తప్ప, సరే, వాళ్లు వ్యాపారులు… తమ గల్లాపెట్టే తమకు ప్రధానం కదా… దాన్నలా వదిలేస్తే… ఓ వార్త ఇంట్రస్టింగు… ఆలోచించతగింది కూడా… అదేమిటంటే… అమీర్ ఖాన్ తన కొత్త సినిమా సితారే జమీన్ పర్ బిజినెస్ మోడల్‌ను వర్తమాన ట్రెండ్‌కు భిన్నంగా ప్రకటించాడు… అది చర్చనీయాంశం కూడా… తను ఏమంటాడంటే..? ‘‘నేను […]
నివురు గప్పిన నిప్పు… బీఆర్ఎస్ లోలోపల సెగ పెరుగుతూనే ఉంది…
. బీఆర్ఎస్లో కవిత తిరుగుబాటు వ్యవహారం శృతి మించి, రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచుతోంది… ఇదంతా కేసీయారే స్వయంగా ఆడిస్తున్న డ్రామా అని బయటికి కొన్ని సెక్షన్లు ప్రచారం చేస్తున్నా సరే.., ఏవో సీరియస్ డెవలప్మెంట్స్ చకచకా సాగిపోతూనే ఉన్నాయి… గతంలో ఆమె నాయకత్వం వహించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పోటీగా సింగరేణి జాగృతిని ప్రకటించి పదకొండు ఏరియాలకు కన్వీనర్లను కూడా పెట్టేసింది… తనతో సంప్రదింపులకు వచ్చిన కేసీయార్ ముఖ్య అనుచరులతో కూడా ఆమె తన […]
టీచర్ 39… స్టూడెంట్ 15… ప్రేమ గుడ్డిది కదా, ఇంకేమీ చూడలేదు…
…. ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్… ఆమె తన భార్య బ్రిజిట్… వియత్నాం వెళ్తూ విమానం దిగే ముందు ఆయన మొహంపై సరదాగా చరిచింది… నిన్నంతా ప్రపంచవ్యాప్తంగా మీమ్స్, జోక్స్, పోస్టులు… సోషల్ మీడియా ఊగిపోయింది… అఫ్కోర్స్, సరదా వ్యాఖ్యలే… మరీ అప్పడాల కర్ర బాపతు వడ్డింపు కాదు కదా… అవన్నీ చదివి, విని, చూసి మాక్రాన్ కూడా నవ్వుతూ, అబ్బే, ఆమె కొట్టలేదోయ్, జస్ట్ అలా సరదాగా ఒకటేసింది అన్నాడు… ఐనా భర్తలను కొట్టే హక్కు […]
భౌతిక దేహాలకూ సగౌరవంగా సాగిపోయే హక్కు… ఇదో చిక్కు ప్రశ్న..!!
. “మృతదేహాన్ని మీకు అప్పగిస్తే.. దానిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. స్వగ్రామంలో ర్యాలీలు చేస్తారు. అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు కడతారు. ఏదైనా సందర్భం వస్తే అక్కడ నివాళులు అర్పించడం వంటివి చేస్తుంటారు. ఇదంతా మళ్లీ నక్సలిజం వైపు కొందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది. అందుకే మేం మృతదేహం ఇవ్వం”…. – ఛత్తీస్‌గఢ్ పోలీసులు . ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోలీసులే అంత్యక్రియలు నిర్వహించడం ఓ భిన్నమైన చర్చను లేవనెత్తింది… ముందుగా వార్త… సీపీఐఎంల్ మావోయిస్టు పార్టీ […]
ఆ హొయలు, ఆ జిలుగుల వెనుక… చీకటిలా వ్యథలు, కథలున్నయ్…
. ఏడేళ్ల వయసులోనే బాలికలకు యోని సున్తీ.. ఆ దురాచారంపై పోరు 16 ఏళ్లకే అత్యాచారం బారిన పడి.. హక్కుల కోసం ఆరాటం ఊహ తెలియనప్పుడే లైంగిక వేధింపులు.. వాటిపై పోరాటం మిస్ వరల్డ్ పోటీదారుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ విశ్వవేదికపై తమ వాణి వినిపించిన సుందరీమణులు అవును, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ స్టోరీకి డెక్స్… దీంతోనే అర్థమైంది కదా ఆ స్టోరీ ఏమిటో… మిస్ వరల్డ్ పోటీల మీద ఎవరేం రాస్తున్నా సరే, ఈ […]
‘‘నువ్వు నా కోడి పీక మీద కన్నేస్తే… నీ రెండు కోడి పీకలూ పిసికేస్తాం…’’
. ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రుల్లో ప్రత్యర్థులపై పంచ్ ట్వీట్లు సంధించడంలో దిట్ట అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ… దేశానికి సంబంధించిన ఇష్యూస్, బీజేపీ విధానాల సమర్థనలో కూడా… ఈ టెంపర్మెంట్ ఇతర బీజేపీ సీఎంలలో కనిపించదు… ప్రత్యేకించి కాంగ్రెస్ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కొడుకు, లోకసభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్ మీద విరుచుకుపడుతున్నాడు… తను ఐఎస్ఐ ఏజెంట్ అనేది సీఎం ఆరోపణ… ఇప్పటికీ ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్ సీడీకేఎన్ అనే […]
రోబోలకూ మానవ ఉద్వేగాలు వచ్చేస్తే… అదే కలవరపెడుతున్న పెద్ద ప్రశ్న..!!
. ముందుగా మనిషిని బెదిరించిన ఓ ఎఐ ప్లాట్‌ఫామ్ స్టోరీ సంక్షిప్తంగా వేగంగా చదివేయండి ఓసారి… ఈనాడులో కూడా కనిపించింది… రోబో సినిమా సీన్ రిపీట్… “నన్ను షట్ డౌన్ చేస్తావా, ఒరేయ్, నీ అక్రమ సంబంధం బయటపెడతా, ఏమనుకుంటున్నావో…” అంటూ తనను డెవలప్ చేసిన మనిషిని ఒక ఎఐ టూల్ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) బెదిరించింది… ఆంధ్రోపిక్ అనే ఏఐ సంస్థ కొత్తగా క్లాడ్ ఓపస్ 4 అనే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయగా, ఇది ఎంతవరకు సురక్షితమని […]
ఫ్రాన్స్ మనకు రాఫెల్ సోర్స్ కోడ్ ఎందుకు ఇవ్వలేదు మరి..?!
. పార్థసారథి పొట్లూరి.,.. మెసెంజర్ లో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న: రాఫెల్ సోర్స్ కోడ్ అడిగితే ఫ్రాన్స్ కి చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ మనకి ఇవ్వలేదు ఎందుకు అని. మన దేశం బ్రహ్మోస్ మిసైల్ ని రాఫెల్ తో అనుసంధానం చేయడానికి ఫ్రాన్స్ ని సోర్స్ కోడ్ అడిగిన మాట వాస్తవం! కానీ ఫ్రాన్స్ ఇంతవరకూ ఇస్తానని కానీ ఇవ్వను అని కానీ అనకుండా మౌనంగా ఉంది! సోర్స్ కోడ్ – Source Code అంటే […]
War Real Time Data…. పాకిస్థాన్‌తో ఘర్షణలో మనం ఏం సాధించామంటే..!
. Pardha Saradhi Potluri ……. May 10 న ఆపరేషన్ సిందూర్ కి విరామం ప్రకటించాక ఇప్పుడిప్పుడే అసలైన డాటా బయటికి వస్తున్నది, అయితే ఇది కూడా 50% మాత్రమే! యుద్ధ వ్యూహలు అనేవి వందశాతం వెంటనే బయటికి రావు! రెండవ ప్రపంచయుద్ధం తాలూకు వ్యూహలూ, వాటిని అమలు చేసిన వివరాలు పూర్తిగా బహిర్గతం అవడానికి 20 ఏళ్ళు పట్టింది! ఎందుకంత సమయం పట్టింది? ఎందుకంటే యుద్ధంలో వాడిన ఆయుధాలు అవుట్ డేట్ అయిపోయి కొత్త […]
తెలుగుదేశంలో పవర్ సెంటర్…: లోకేష్ మిత్రుడు రాజేశ్ కిలారు ఎవరు..?
. నిజానికి చంద్రబాబునాయుడు పార్టీలో ఎవరినీ రెండో పవర్ సెంటర్‌గా ఎదగనివ్వడు… తన లెక్క తనది… అలా చూసుకున్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ తన చెప్పుచేతల్లో ఉంది ఇన్నాళ్లూ… కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి… తన వయోభారం కావచ్చు, ఇంకేమైనా కారణాలు కావచ్చు… వారసుడు లోకేష్ పగ్గాలు పట్టుకున్నాడు… పార్టీ, ప్రభుత్వంలో తన మాటే చెల్లుబాటు ప్రస్తుతం… తను గతంలోని లోకేష్ కూడా కాదు… అన్నీ నేర్చుకున్నాడు… పరిణతి కనిపిస్తోంది… ఐతే పార్టీలో లోకేష్ గాకుండా మరో […]
మిస్టరీ..! ఇది రుతుపవనాల రాకను చెప్పే జగన్నాథుడి గుడి..!!
. కొన్ని ఆలయాల్లో మనకు అంతుపట్టని మిస్టరీలు… హేతువుకు అందవు… వాటిని మహిమలుగా నమ్మలేకపోవచ్చు మనం, కానీ అవెలా సాధ్యమో అర్థం కాదు… అలాంటి మిస్టరీల ఉదాహరణలన్నీ ఇక్కడ చెప్పుకోలేం గానీ… అలాంటి మరో విశేషాన్ని చెప్పుకుందాం… జగన్నాథ దేవాలయం అంటే పూరి… అదే కదా మనకు గుర్తొచ్చేది… కానీ మరో విశేషమైన జగన్నాథ దేవాలయం ఉంది… అది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఉంది… బెహతా బుజుర్గ్ ఏరియాలో… ఉత్తరప్రదేశ్ రాజధాని నుంచి 120 కిలోమీటర్లు… ఓ్ […]
నిక్కచ్చి జస్టిస్… అందుకేనా ఆమె పదవీ విరమణ ప్రోగ్రామ్‌కు బాయ్‌కాట్..?!
. కోర్టుల అంతర్గత విషయాలపై నిజానికి మీడియాలో జరగాల్సినంత చర్చ జరగడం లేదనీ, జనానికి తెలియడం లేదనీ అనిపిస్తుంది చాలాసార్లు… ఒక సుప్రీంకోర్టు జడ్జి రిటైరైనప్పుడు లాయర్లు పదవీ విరమణ కార్యక్రమాన్ని బహిష్కరించడం ఓ విశేషమే… కానీ ఆమె అంటే ఎందుకంత కోపం…? మిత్రులు Murali Krishna ఫేస్బుక్ వాలీ మీద కనిపించిన పోస్టు ఏమనాలో కూడా అర్థం గాకుండా ఉంది… మీరే చదివి ఓ అభిప్రాయానికి రండి… సహజంగా తోటి ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో […]
నో మైసూర్ పాక్… నో కరాచీ బేకరీ… పతంజలి ముల్తానీ మిట్టీ వోకేనా..?!
. Subramanyam Dogiparthi …… #పహల్గాం_ఫైల్స్ … జూలియస్ సీజర్ అనే నాటకాన్ని William Shakespeare వ్రాసారు . చాలామంది చదివే ఉంటారు . లేదా సినిమాను చూసి ఉంటారు . విషయం ఏందంటే : కొంతమంది సెనేటర్లు సీజర్ని చంపుతారు . రోమ్ ప్రజలు కుట్రదారుల మీద తిరగపడతారు . మూక మనస్తత్వంతో కుట్రదారులని ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తుంటారు . అప్పుడు రోమ్‌లో సిన్నా అనే పేరుతో ఇద్దరు ఉంటారు . ఒకరు కవి […]
ఇప్పుడు మోడీతో ఫోటో ఓ క్రేజ్… కానీ అప్పట్లో మోడీతో ఫోటో ఓ కలకలం…
. నాడు వైఎస్ -మోడీ ఫోటో చూసి వణికిపోయారు … నేడు రేవంత్ – మోడీ ఫొటోతో మురిసిపోయారు … ఆ ఫోటో చూడగానే సీఎం పేషీ ముఖ్యుడు వణికిపోయారు … ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కరచాలనం చేస్తున్న ఫోటో అది … ఒక ఫోటోగ్రాఫర్ దృష్టితో చూస్తే అది చాలా బాగా వచ్చిన ఫోటో … ఫోటో కోసం ఫోజు ఇస్తున్నట్టుగా కాకుండా ఒక వరుసలో ఉన్న వైఎస్ఆర్ […]
…. ముఖ్య అతిథి సీఎం గారి పెళ్లాం అని తెలియకపోతే ఎలా మరి..?!
. ఒక ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది, ముందు నవ్వొచ్చింది… అది చూశాక హఠాత్తుగా ఓ పాత లెటర్ హెడ్ గుర్తొచ్చింది… చాన్నాళ్లుగా అది సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది… ఆ లెటర్ హెడ్ ఏమని చెబుతుందంటే..? (అది ఫేకా, ఒరిజినలా తెలియదు గానీ నవ్వుకోవడానికి భలే ఉంది… అంతేకాదు, ప్రస్తుతం మన వర్తమాన సమాజంలో ఉన్న రాజకీయ పోకడలు, ప్రత్యేకించి నాయకుల కోటరీలు, బంధుగణం ఎచ్చులను అది గుర్తుచేస్తుంది…) ఇదుగో ఆ లెటర్ హెడ్… వెతికితే […]
- « Previous Page
- 1
- …
- 16
- 17
- 18
- 19
- 20
- …
- 127
- Next Page »