సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును మొద్దుబారుస్తోందని ఈమధ్య అనేక అధ్యయనాలు రుజువుచేస్తున్నాయి. మనం తప్పు టైప్ చేసినా ఆటోమేటిగ్గా సరిచేసేది- ఆటో కరెక్ట్. మనం టైపు చేయబోయే మాటలను దానికదిగా అందించేది- ప్రిడిక్టివ్ టెక్స్ట్. మనం టైపు చేసిన వాక్యంలో వ్యాకరణ దోషాలను సరిచేసేది- గ్రామర్లి. ఈ యాపులు […]
ఏది తప్పు? ఏది ఒప్పు? కొత్త ‘హైడ్రా’లజీలో భయసందేహాలే అధికం..!!
చట్టం- న్యాయం- ధర్మం ఒకటి కావు. వేరు వేరు అంశాలు. అకడమిక్ గా వీటిమీద యుగయుగాలపాటు చర్చోపచర్చలు చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా అయితే సంఘాన్ని సక్రమమార్గంలో నడిపడానికే ఈ మూడు. నాగరికత ప్రయాణించేకొద్దీ, వికసించేకొద్దీ చట్టాలను గౌరవించడం, న్యాయంగా జీవించడం, ధర్మమార్గంలో నడవడం ఒక ఆదర్శమవుతుంది. అభ్యుదయమవుతుంది. సంస్కారమవుతుంది. స్వభావమవుతుంది. ఆచారమవుతుంది. చివరికి ఒక విలువగా పాటించితీరాల్సిన కొలమానమవుతుంది. బాధ్యతగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్లమీద పోలీసులు, నిఘా కెమెరాల అవసరమే ఉండదు. తొంభై […]
దరిద్రం ఎలా ఉంటుంది..? ఇద్దరు అమెరికా రిటర్న్డ్ యువకుల ప్రయోగాలు..!!
చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు. కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు. తుషార్ హర్యానాలో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు ఉద్యోగాలు చేసాడు. డబ్బుకు లోటులేని జీవితం గడిపాడు. మరో కుర్రాడి పేరు మట్. పేరు చూసి వేరే దేశం వాడని పొరబడే వీలుంది. కానీ మన తోటి […]
నాట్ రేవంత్..! రాహుల్ యూఎస్ పర్యటనలో ఉత్తమ్, పొంగులేటి వర్గాల హల్చల్..!
అమెరికా… ప్రత్యేకించి డాలస్ రాహుల్ గాంధీ పాల్గొన్న కార్యక్రమాల విశేషాలు వింటుంటే అందులో కొన్ని నవ్వు పుట్టించాయి, కొన్ని చిరాకెత్తించాయి… కొన్ని ఆసక్తిని రేపాయి… మొదటిది… రెండు మూడొందల మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేని శ్రీనివాసరెడ్డి బొమ్మలు ప్రముఖంగా ముద్రించిన అంగీలు వేసుకుని వచ్చారు… నాలుగైదు వేల దాకా హాజరైతే… అందులో భిన్న ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లున్నారు… కాగా ప్రత్యేకంగా తెలంగాణ ఇష్యూసే చర్చనీయాంశం… ఒకావిడ మైక్లోనే ఆవేశంగా… హైడ్రా ఏర్పాటు, దూకుడు అన్ని సమస్యలకూ […]
చూస్తుంటే పేదరికానికీ మార్కెట్ బాగానే ఉన్నట్టుంది..!!
మిలియనీర్స్ స్లమ్… సంపన్నుల మురికివాడలు కొత్తొక వింత పాతొక రోత అని సామెత. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పాతొక వింత అని సామెతను తిరగరాయలేమో! ఏ దేశమైనా అభివృద్ధి సాధించాక ముందుకే వెళ్తుంది గానీ పాత రోజులు తల్చుకుంటూ ఉంటుందా ? అదీ పేదరికాన్ని అంగట్లో పెట్టి అమ్ముతుందా? దక్షిణాఫ్రికాలో ‘షాన్ టీ టౌన్’ అనే రిసార్ట్ ఉంది. ఇది బ్లోమ్ ఫాంటేయిన్ అనే చోట అత్యంత విలాసవంతమైన ఏమోల్య ఎస్టేట్ లో ఉంది. ఈ రిసార్ట్ […]
తెలుగు అంటే ఆంధప్రదేశ్ మాత్రమే కాదు భయ్యా… తెలంగాణ కూడా..!!
తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలుగును పేరులో నింపుకున్న తెలంగాణ ముందుగా గుర్తురావాలనే విషయం రాహుల్కు చెప్పలేదా, రేవంత్ గారూ? ………………………………… పదేళ్ల క్రితం రెండు రాష్ట్రాలుగా అవతరించాక రెండు తెలుగు ప్రాంతాల మెజారిటీ జనం తల్లి భాష తెలుగు విషయం వచ్చే సరికి చాలా మందికి సమస్యే. అంతర్జాతీయ స్థాయిలో ఈ రెండు రాష్ట్రాల వ్యక్తులు ఎవరైనా ఎంతో కొంత సాధిస్తే తెలుగు దినపత్రికలు… తెలుగోళ్లు, మనోళ్లు అంటూ శీర్షికల్లో, వార్తల్లో రాసేస్తున్నాయి. ఈమధ్య […]
బీజేపీలో ఏం జరుగుతోంది అసలు..? ఆ రెండు రాష్ట్రాల్లోనూ తప్పుటడుగులే..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల సన్నాహం! మొదటి నుండి అనుకుంటున్నదే జరిగింది! కాకపొతే కొంత సినిమా ఫక్కీ లాగా సన్నివేశాలు ఆవిష్కృతం అయ్యాయి! రెజ్లర్లు వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు! పాపం! కొంతమంది సోషల్ మీడియాలో వీళ్ళని క్రీడాకారులుగా చూడాలి తప్పితే రాజకీయాలు అంటగట్టకూడదు అంటూ వాకృచ్చారు. నేను సంవత్సరం క్రితమే స్పష్టంగా చెప్పాను వీళ్ళ రాజకీయ కుట్ర గురుంచి. సరే! అనుకున్నదే జరిగింది! వాట్ నెక్స్ట్? హర్యానా అసెంబ్లీ 2024 ఎన్నికల కోసం […]
ప్రొఫెషనల్ నిద్ర..! గాఢమైన కునుకు తీస్తే చాలు కలలు, తోడుగా కాసులు..!!
నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోందనే అనుకోవాలి. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిముషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు. కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు […]
గంటలో 10 కిలోమీటర్లు… ఆగకుండా పరుగు పరీక్ష… 12 మంది హఠాన్మరణం…
నిజంగా ఎంత బాధ్యతారాహిత్యం… ఈ 12 మంది మరణాలకు ఎవరిని నిందించాలో అర్థం కాదు… పెత్తనాలు, సంపాదన, అరాచకం తప్ప మరేమీ పట్టని వర్తమాన రాజకీయాల్లో నేతలెవరికీ ఎలాగూ పట్టదు… కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారుల బుర్రలేమైనాయో అర్థం కాదు… స్వీపర్ పోస్టులకు సైతం వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీపడుతున్న తీరు ఇంతకుముందు చదువుకున్నాం కదా… ఇది మరో కథ… జార్ఖండ్… ఆగస్టు 22 నుంచి ఎక్సయిజు కానిస్టేబుళ్ల పోస్టులకు అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు… అందులో […]
తక్కువ చదువు, తక్కువ స్థోమత ఉన్నవాళ్లకు స్వీపర్ పోస్టులైనా దక్కనివ్వరా..?!
దేశంలో నిరుద్యోగ యువత నిరాశానిస్పృహలకు అద్దం ఇది. చదివిన డిగ్రీలు ఎందుకూ కొరగాకుండా పోయిన విషాదమిది. హర్యానాలో రోడ్లు ఊడ్చే కాంట్రాక్ట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వేస్తే ఆరువేలమంది పిజి చదివినవారు అప్లయ్ చేసుకున్నారు. 40 వేలమంది డిగ్రీ చదివినవారు అప్లై చేసుకున్నారు. ఇంటర్ చదివినవారు లక్ష మందికి పైగా అప్లై చేసుకున్నారు. రోడ్లు ఊడ్చే ఉద్యోగాలు ఉన్నవి మహా అయితే అయిదు వేలే. జీతం నెలకు పదిహేను వేలు. పేరుకు చేతిలో డిగ్రీలు. చదివిన సబ్జెక్ట్ […]
విష్ణుప్రియ పెంట మాటలు స్టార్ట్… కేరక్టర్ చర్చ దాకా వెళ్లిపోయింది అప్పుడే…
ఒక్క వారం కూడా పూర్తి కాలేదు… పుణ్యస్త్రీ గొడవ దాకా వచ్చేసింది… నిజానికి విష్ణుప్రియ హౌజులో పెంట పెంట చేస్తుందనే ఓ అభిప్రాయం ఉండేది మొదట్లో… తనేం మాట్లాడుతుందో తనకే తెలియదు, కొన్ని పదాల్ని ఏ సందర్భాల్లో ఏ అర్థంలో వాడాలో అస్సలు తెలియదు… రెండోరోజో, మూడోరోజో… మాస్కులినిటీ, ఫెమినిటీ పదాల్ని వాడేసింది… నిజానికి వాటిని మగ, ఆడ అనే అర్థంలో వాడుతుంటాం కదా… కొన్నిసార్లు దృఢత్వం, సరళత్వం అని చెప్పడానికి ఆయా పదాల్ని సందర్భాన్ని బట్టి […]
చిన్నప్పుడు గణేషుడి సొంత ఉత్సవమే వేరు… తలుచుకుంటేనే ఓ మైమరుపు.!!
అరేయ్ వినాయకున్నీ పెట్టుకుందామా? అరేయ్ పైసలు లెవ్వు కదరా ఎట్ల మరి… ఏ ఏం కాదురా ఇద్దరి పొత్తుల పెట్టుకుందాం… గొడ్డలి పట్టుకుని సర్కార్ తుమ్మళ్లకు పోయి ఎనిమిది సర్కార్ తుమ్మ కట్టెలు కొట్టుకుని వచ్చినం… ఆ ఇసుక కుప్ప పక్క పొంటి నాలుగు పొక్కలు తవ్వి, అందులో సర్కార్ తుమ్మ కట్టెలు పెట్టి గుంజలు పాతినం… ఆ నాలుగు కట్టెలకు మీద ఇంకో నాలుగు కట్టెలు వేసి సుతిల్ దారాల తోటి పందిరి గట్టిగా కట్టి, […]
గీతామాధురి నోటి ముద్దును మించి థమన్ నోటి దూల… భలే దొరికారు ఇద్దరూ…
అనూహ్యం… ఏ ముగ్గురు కంటెస్టెంట్లు టాప్ త్రీలో ఉంటారని అనుకుంటున్నామో… ఆ ముగ్గురూ తెలుగు ఇండియన్ మార్కుల్లో, వోటింగులో లీస్ట్ త్రీగా వేదిక మీద నిలబడటం… శ్రీకీర్తి, కీర్తన, భరత్ రాజ్… ఆ ముగ్గురిలో భరత్ రాజ్ ఎలిమినేటయ్యాడు… చిత్రం… ఎందుకంటే… ఇదే భరత్రాజ్ నజీరుద్దీన్తో కలిసి పవన్ కల్యాణ్ రాబోయే ఓజీలో పాట పాడాడు… ఇదే థమన్ దర్శకత్వంలో… కానీ ఏమైంది..? సెమీ ఫైనల్స్లోనే ఎలిమినేటయ్యాడు… సో, రియాలిటీ షో వేరు… రియల్ లైఫ్ షో […]
ఫాఫం… రాధాకృష్ణ ప్లాంటూ మునిగిందట… బాబు గారికి అసలేమీ తెలియదట…
అనుకుంటున్నదే… ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వందల టన్నుల బురదను ఎత్తిపోసుకుంటున్నాయి తెలుసు కదా… బ్లేమ్ గేమ్ పీక్స్… బుడమేరు పాపం నీదే, కాదు నీదే అని తిట్టుకుంటున్నాయి… ఈ దశలో జగన్ మైక్ సాక్షి ఈ బురద చర్చలోకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ హైడల్ ప్లాంటును కూడా లాగింది… ఈ ప్లాంటు మునిగిపోకుండా వరదను డైవర్ట్ చేయడం వల్ల ముంపు సమస్య పెరిగిందని నిన్నటి సాక్షి కథనం… రాధాకృష్ణ అంటేనే చంద్రబాబు కదా, సో దాన్ని […]
విశ్వనాథుడి ఆ శంకరాభరణం సినిమాకు ట్రైలర్ ఈ సిరిసిరిమువ్వ…
శంకరాభరణం సినిమాకు ట్రైలర్ ఈ సిరిసిరిమువ్వ . అందాల తార జయప్రదను స్టారుని చేసిన సినిమా . రంగులరాట్నం , సుఖదుఃఖాలు సినిమాల తర్వాత , వాటికి మించి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి చంద్రమోహన్ కు వచ్చిన మహదవకాశం . కె విశ్వనాధ్ కళాతపస్విగా అవతరించడానికి శ్రీకారం చుట్టిన సినిమా . చంద్రమోహన్-జయప్రద జోడీ కెమిస్ట్రీ అద్భుతంగా పండిన సినిమా . తెలుగు సినిమా రంగంలో సంగీత , నృత్యాలకు ప్రాముఖ్యతని ఇస్తూ సంస్కారవంతమైన సినిమాలను […]
ఆ విల్లా ప్రాజెక్టులో కొత్త షాపు పడింది… హోండా జెట్ బోట్లు అమ్ముతారట…
వరదలో బురదోత్సవం! కాలువల్లో విల్లాల విలవిలోత్సవం! ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు భీమయ్యా! మన విల్లాల్లో తిరగడానికి ఏ బోటు కొందామా అని ఆలోచిస్తున్నా. ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! నేను మూడేళ్లకిందట వర్షాకాలం వరదలప్పుడు హోండా జెట్ టర్బో బోట్ కొన్నా. అయిదేళ్ల వారెంటీ. పదేళ్ల గ్యారెంటీ. అద్భుతంగా పని చేస్తోంది. తక్కువ సౌండ్. ఎక్కువ పని. ఎక్కువ కాలం మన్నిక. ఆటోమేటిక్. తెడ్లతో పని లేదు. ఏకకాలంలో పది మంది కూర్చోవచ్చు. నువ్వూ అదే కొను. నిజమే […]
మోడీ, కేసీయార్, రేవంత్ల జాతకాలు ఏమిటి న్యూమరాలజీ ప్రకారం..?
న్యుమరాలజీ ప్రకారం రేవంత్ రెడ్డి జన్మ సంఖ్య 8, డెస్టినీ సంఖ్య 8. ఈ భూమి మీద అత్యంత తక్కువ మందికి ఉండే కర్మ సంఖ్య ఇది. ప్రాచీన చైనా, ఈజిప్ట్, ఇండియా, రోమ్, కొరియా నాగరికతలని చూసినట్లయితే 8 సంఖ్యకి ఉన్న ప్రాధాన్యత తెలుస్తుంది. 8 సంఖ్య ప్రాధాన్యత తెలియాలన్నా పుణ్యం చేసుకొని ఉండాలి… 7 మహా సముద్రాల ఇవతల ఉత్తర ధ్రువం దగ్గర నాకు బాగా తెలిసిన వ్యక్తి జన్మ సంఖ్య 8, డెస్టినీ […]
ఫాఫం, కోట్ల యాడ్స్ ఇచ్చే ఆ గుండు బాస్ వార్తలు ఎప్పుడైనా ఇలా రాశారా..?
ఒక సింగిల్ కాలమ్ వార్త… ఆంధ్రజ్యోతిలో… దాన్ని వార్త అనొచ్చా..? వాణిజ్య ప్రకటన అది… దాన్ని వార్తలా రాసుకొచ్చారు, పబ్లిష్ చేశారు.., అది తమను నమ్మే పాఠకులను ఒకరకంగా చీట్ చేయడం… ఐతే ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు… ఎందుకంటే, పడిపోయిన యాడ్స్ ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ఇలాంటివి ఇంకా ఇంకా చేయబోతున్నాయి పత్రికలు… రాజకీయ వార్తలు, పార్టీలకు ఉపయోగపడే వార్తలు… కొన్ని చాన్నాళ్లు నుంచీ వస్తున్నాయి… అడ్వర్టోరియల్స్ అంటారు… అంటే వాటి ఉద్దేశం వార్తల్లా కనిపించేలాగా రాయబడిన ప్రకటనలు, […]
ఆఫ్టరాల్ ప్రాణాలు… ఎహె, పోతేపోయాయి… సెల్ఫీలకన్నా ఎక్కువా ఏం..?
సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీ.చి; స్వీ.దృ. అని పెట్టి ఉంటే స్వీచి వీచుల వీధుల్లో నిత్యం స్వైర విహారం చేసేవారికి ఎలా ఉన్నా భాషా ప్రేమికులకు మరింత ముద్దొచ్చేది! అందం మాటకు అర్థం చెప్పడం కష్టం. మనం తప్ప ప్రపంచంలో మిగతా వారందరూ అందవిహీనంగా ఉన్నారనుకోవడం ఒక భావన. మనం తప్ప ప్రపంచంలో మిగిలినవారందరూ […]
వినోదం కోటింగు లేని ఓ చేదు సామాజిక మాత్ర… ఇదోతరహా ఎర్ర సినిమా…
ఊరుమ్మడి బతుకులు . జాతీయ స్థాయిలో 1976 వ సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికయిన సినిమా . రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా , ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్ కు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు వచ్చిన సినిమా . ఊరుమ్మడి బతుకుల కష్టాల సినిమా . ఓ అరవై డెభ్భై ఏళ్ళ కిందట బాగా వెనుకబడ్డ ప్రాంతాలలోని గ్రామాల్లో పేదల్ని పీల్చిపిప్పి చేసిన పెత్తందార్లను నోరు లేనోడు చంపేసిన […]
- « Previous Page
- 1
- …
- 19
- 20
- 21
- 22
- 23
- …
- 118
- Next Page »