అక్షరమథనంలో పుట్టే అమృతాన్ని అస్మదీయులకు, హాలాహలం తస్మదీయులకు ఇచ్చి, తాను మంధరుడిలా మిగిలాడు… రామోజీరావుపై ఓ నెటిజన్ వ్యాఖ్య ఇది… (మంధరుడి కథ తెలిసినవాళ్లకు దీని అర్థం సరిగ్గా బోధపడుతుంది)… మరో మిత్రుడి వ్యాఖ్య మరింత ఆప్ట్… రామోజీరావు గురించి రాయడానికి ఏమేం విశేషణాలున్నాయో వెతికాను, కాసేపటికి వెలిగింది, అసలు రామోజీరావు పేరే ఓ విశేషణం కదా, కొత్తగా ఇంకేం యాడ్ చేయాలి అని… నిజమే, తన గురించి రాస్తూ పోతే పేజీలు సరిపోవు, స్పేస్ సరిపోదు… […]
ఉత్తరప్రదేశంలో కమలం ఎందుకు వాడిపోయింది..? ఒక సమీక్ష..!!
ఉత్తర ప్రదేశ్ లోకసభ ఎన్నికలు – నా సమీక్ష ! ఉత్తర ప్రదేశ్ లో ఏ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది! ఇది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆనవాయితీగా వస్తున్నదే! 2014 , 2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలిచింది! 2024 లో ఎందుకు వెనకపడింది? కారణాలు అనేకం ఉన్నాయి కానీ రెండు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించాల్సి ఉంటుంది! […]
అక్కర్లేని అంశాల మీద అధిక సమయం వెచ్చించడం ఓ మానసిక సమస్య
ప్రతి మనిషీ తెలుసుకోవాల్సిన 3 విషయాలు (జగన్నాథ్ గౌడ్) 1. సర్కిల్ ఆఫ్ కంట్రోల్ (మన నియంత్రణ వలయం): మన ప్రవర్తన, మన ఆరోగ్యం, మన సంపద, మన ఉద్యోగం, మనం ఏమి చదువుతున్నాం, మనం ఏమి చూస్తున్నం, మనం ఏమి చేస్తున్నం, మన నిద్ర, మన మైండ్ సెట్ , మన బలం, మన బలహీనత, మన లోపాలు, మన అపజయం, మన విజయం మొదలగునవి (వీటి గురించి రోజులో 23 గంటల 50 నిమిషాలు […]
పైకి ఫన్నీ వన్ లైనర్స్ కొన్ని… తరచి తరచి పరిశీలిస్తే లోతెక్కువ…
డిల్బర్ట్ ఓ అమెరికన్ హ్యూమరిస్టు వన్ లైనర్స్ చాలా ఫేమస్… క్లాసిక్ కూడా… వీటిల్లో ఏది మీకు బాగా నచ్చిందో మీకు మీరే చెప్పుకొండి… కొన్ని వన్ లైనర్స్… (ఇంగ్లిషు నుంచి తెలుగులోకి అనువాదం కొంత సంక్లిష్టమే ఇవి…)(చాలావరకు మార్మికంగా ఉంటాయి… ఫన్ కాదు, డెప్త్) (అవి ఏయే సందర్భాల్లో ఎలా వర్తిస్తాయో మనకు మనం అన్వయించుకోవాల్సిందే…) 1. నేను ఆల్కహాల్‌కు నో చెప్పాను, అదేమో నా మాట వినదు 2. విడాకులకు ప్రధాన కారణమేంటో తెలుసా..? […]
ఇతరుల చీకటి కోణాల విమర్శ… బలహీనత కాదు, బలహీన సమర్థనా కాదు…
సుప్రసిద్ధ రచయిత Veerendranath Yandamoori నుంచి త్వరలో రాబోయే ఓ కొత్త పుస్తకం నుంచి ఓ పార్ట్ ఇది… తను షేర్ చేసుకున్నదే… ఇదంతా ఏ పాత్ర ఏ సందర్భంలో చెబుతుందో తెలియదు… కానీ నిజానికి దీన్ని పూర్తిగా అంగీకరించలేరు కొందరు… ముందుగా ఈ పార్ట్ యథాతథంగా చదవండి ఓసారి… బాగా లేకపోవడం వేరు, నచ్చక పోవటం వేరు..! అర్థం పర్థం లేకుండా రాళ్లు విసిరే విమర్శకులు కూడా అంతే.ఒక సెలబ్రిటీ విజయాన్ని పోజిటివ్ దృష్టితో అస్సలు చూడరు. చూడటానికి […]
ఆ చాయ్‌వాలా ప్రధాని కావొచ్చు గాక… ఈ చాయ్‌వాలా అభ్యర్థికీ ఓ రికార్డు…
ఇదుగో లోకసభకు పోటీచేసిన అభ్యర్థుల్లో అందరికన్నా ధనికుడు… టాప్ టెన్… వీళ్లపై అధికంగా కేసులున్నాయి… ఇదుగో వీళ్ల విద్యార్హతలు అంటూ రకరకాల వార్తలు వస్తుంటాయి కదా… వృత్తులతో సహా… కానీ ఎప్పుడైనా నిరుపేదల గురించి చెప్పుకున్నామా..? అసలు ఎవరైనా సరే పోటీ పడగలగడం కదా మన డెమోక్రసీ బ్యూటీనెస్… కాకపోతే గెలుస్తారా, గెలవనిస్తారా అనేది వేరే సంగతి… పార్టీల దన్ను ఉన్న నిరుపేదలు చాలామంది గెలిచారు… అవీ చెప్పుకున్నాం కూడా… మన ప్రధాని ఒకప్పుడు చాయ్‌వాలా కదా… […]
కేశవా… ఎట్టకేలకు ఆ శని సెంటిమెంట్ నుంచి విముక్తమయ్యావు…
మరీ తేలికగా తీసిపారేయలేం కదా… ఎప్పుడో ఓసారి చివరకు ఆ ఆంధ్రప్రభలోనూ హఠాత్తుగా ఓ ఇంట్రస్టింగ్ వార్త తళుక్కుమంటుంది… ఇదీ అలాంటిదే… పయ్యావుల కేశవ్‌కు ఎట్టకేలకు శాపవిముక్తి దొరికిందనేది వార్త… బాగుంది… అంటే, ఇంట్రస్టింగుగా ఉందీ అని..! అందరికీ తెలిసిందే కదా… సినిమాల్లో, రాజకీయాల్లో సెంటిమెంట్ల మంట అధికం… జ్యోతిష్కులు, మూఢనమ్మకాలు, పూజలు గట్రా అధికం… బయటికి నాస్తికుల్లా, హేతువాదుల్లా కనిపించే కొందరు లోలోపల ఏవో భయాలతో శనిజపాలు కూడా చేస్తుంటారని అంటుంటారు… సరే, దాన్నలా వదిలేస్తే… […]
టీడీపీకి ఇక మిగిలిన ఏకైక దిక్కనుకున్న జూనియర్ పేరే లేదెక్కడా…!
నిజమే… ఒక మిత్రుడు తన పోస్టులో విశ్లేషించినట్టు… జగన్ భీకరంగా దంచి కొడుతున్న దెబ్బలతో తెలుగుదేశం సతమతమవుతున్న రోజులు… అసలు ఈ పార్టీని బతకనిస్తాడా జగన్ అనుకుంటున్న కాలమది… లోకేష్ చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగించలేడనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో నిండిపోతున్న దినాలు… బాలయ్య ఒక పార్టీ పగ్గాల్ని చేపట్టి రథాన్ని నడిపించలేడు… మరెవరు ఈ పార్టీ ఉనికి కాపాడేది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తేది… ఆ స్థితిలో ఎక్కడికి వెళ్లినా ఓ కోరిక గట్టిగానో, చిన్నగానో వినిపించేది… […]
ఎర్రజెండా… మరింత సంక్షోభంలోకి ఉనికి… కేరళలోనూ కొడిగట్టి..!!
విదేశీ భావజాలం, మద్దతు… విదేశాల కనుసన్నల్లో పార్టీల అడుగులు… ప్రత్యేకించి శత్రుదేశం ఆదేశాలకు అనుగుణంగా ఓ పార్టీ ఆలోచనలు… పడికట్టు పదాలు… వృద్ధనాయకత్వం… పట్టించుకోని కొత్తతరం… దేశీయ పరిస్థితులకు అనుగుణంగా మారని, మార్చుకోలేని అవే పాచినీటి సిద్ధాంతాలు… వెరసి లెఫ్ట్ వెలిసిపోతోంది… ఒకప్పుడు కాంగ్రెస్‌కు దీటైన ప్రత్యామ్నాయం లెఫ్ట్… తరువాత చీలికలు పేలికలై… ఇప్పుడు ఉనికి కోసం తన్లాట… కాస్తో కూస్తో త్రిపుర, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కనిపించేది… మమత రౌడీ దెబ్బలకు బెంగాల్ సీపీఎం కకావికలై, […]
స్టేట్ తల్నొప్పులే బోలెడు… ఢిల్లీ చక్రాలకు పెద్ద టైమ్ లేదిప్పుడు…
హఠాత్తుగా మోడీ మీద జనంలో సానుభూతి పెరిగింది… ఫాఫం, ఇక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుందని కాదు… చంద్రబాబు మీద, నితిశ్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితిలో ఇరుక్కున్నందుకు..! మీరు ఎప్పుడొచ్చినా సరే, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, మీకేం కావాలో అడగండి అని ఇండి కూటమి నుంచి ఖాళీ చెక్కు అందిందట… ఇంకేముంది..? అసలే చంద్రబాబు… చక్రాలు తిప్పే అలవాటు… పైగా లోలోపల మోడీ మీద ఎన్నాళ్లుగానో అణుచుకున్న కోపం… ఎప్పుడు ఎన్డీయే కాడి కింద […]
ర్యాంప్ వాక్… ఒక్కసారిగా ఛాతీ భాగపు బట్టలూడిపోయి… ఫ్యాషన్…
Sai Vamshi…….. ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం … 2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం. … ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి. […]
ఇంటర్నేషనల్ ఫ్లయిట్లో మీల్స్ సమస్య… ఇలా సొల్యూషన్ దొరికింది…
ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి (అమెరికా రాజధాని) వెళ్లే ఫ్లయిట్ అది… స్ట్రెయిట్ ఫ్లయిట్… మధ్యలో ఎక్కడా దిగేది లేదు, ఆగేది లేదు… ఇప్పుడన్నీ అంతే కదా… ప్రత్యేకించి కొత్త విమాన సర్వీసులు ఆధునిక ఫ్లయిట్లను సమకూర్చుకున్నాక ఆగకుండా వెళ్తున్నాయి విమానాలు… కాకపోతే సుదీర్ఘమైన ప్రయాణం… ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు అంటే… దాదాపు 14, 15 గంటల ప్రయాణం… మనవాళ్లు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఎకానమీ క్లాసే… అవేమో ఇరుకిరుకు సీట్లు… కాసేపటికి కాళ్లు […]
ఇరానీ మొహమ్మద్ మోసాదేగ్ = ఇండియన్ నరేంద్ర మోడీ…
ఇరాన్ 1951 – భారత్ 2024 ….. కొద్దిపాటి మార్పులతో ఒకే విధంగా పోలికలు ఉన్నాయి… ఇరాన్ 1951 కి భారత్ 2024 కి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? మొహమ్మద్ మోసాదేగ్ – నరేంద్ర మోడీ… ఇరానియన్లు అమెరికాని ‘ లాండ్ ఆఫ్ డెవిల్స్ ‘ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 1951 లో మొహమ్మద్ మోసాదెగ్ ( Mohammad Mosadegh) ఇరాన్ ప్రధాన మంత్రి అయ్యాడు. మొహమ్మద్ మోసాదెగ్ ప్రధాని అయ్యే నాటికే ఇరాన్ […]
బుల్ Vs బేర్… పడి లేవటం స్టాక్ మార్కెట్‌కు అలవాటే… డోన్ట్ ఫియర్…
సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది … డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది … జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్లే… జనవరి 2009 టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోకి వెళుతుంటే ఓ యువకుడు ఫోన్లో సత్యం షేర్లు లక్ష కొన్నాను – అని గట్టిగా చెబుతున్నాడు . అప్పటివరకు దాదాపు ఐదు వందల రూపాయలు ఉన్న సత్యం 2009 లో స్కామ్ బయటపడగానే తగ్గుతూ పది రూపాయలకు వచ్చింది […]
ఎగ్జిట్ పోల్స్ Vs ఎగ్జాక్ట్ పోల్స్… సెఫాలజిస్టులు ఎక్కడ ‘లెక్క తప్పారు’…?
ఆరా మస్తాన్ మీద ట్రోల్ సాగుతోంది… పోరా మస్తాన్, ఏరా మస్తాన్ అంటూ వెక్కిరింపులు… తను జగన్ గెలుస్తాడని తన ఎగ్జిట్ పోల్ సర్వేలో చెప్పడమే కారణం… ఇండియాటుడే తరఫున ఎగ్జిట్ పోల్ చేసిన మైయాక్సిస్ ఇండియా బాధ్యుడు ప్రదీప్ గుప్తా లైవ్ టీవీ షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు… తన ఎగ్జిట్ పోల్ ఎక్కడెక్కడ, ఎందుకు ఫెయిలైందో కారణాలు కొన్ని చెప్పుకునే ప్రయత్నం చేశాడు… రవిప్రకాష్ ఆర్టీవీ తెలుగుదేశం కూటమి ఘనవిజయం అని చెబితే, సేమ్ కులం […]
దొంగమొగుడే… తనకు జీవితంలో ప్రతీ సెకనూ అర్ధవంతంగా ఉండాలి…
Veerendranath Yandamoori…… అతని కంపెనీ చీరల్ని కట్టనిది అతని భార్య ఒక్కతే. ఆవిడ పేరు మాధవి. ఆమెదో చిత్రమైన మనస్తత్వం. ఒకరోజామె ఏదో ఫంక్షన్ కి నిండుగా అలంకరించుకుని వెళ్ళింది. ఫంక్షన్ కి వచ్చిన ఒకావిడ “నీకీ చీర నప్పలేదమ్మా” అని మాధవి మొహం మీదే అనేసింది. పక్కనున్న మరొకావిడ ఆ మాట అందుకుని, “అమె కేమిటమ్మా… మొగుడు చీరల కంపెనీ ప్రొప్రైటరు. చీరలు ఫ్రీగా వస్తాయి-” అంది. ‘ఫ్రీగా వచ్చిన చీరలు అంతకన్నా ఏం బావుంటాయిలే…’ […]
మళ్లీ వెన్నుపోటు..? ఇప్పుడందరి దృష్టీ చంద్రబాబు, నితిశ్లపైనే…!
మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా… అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ రేపు మా మిత్రపక్షాలతో మాట్లాడి చెబుతాం అన్నాడు సంక్షిప్తంగా… ఏర్పాటు చేయబోమని తోసిపుచ్చేలేదు… ఇదే ప్రశ్నను ఖర్గేకు వేసినప్పుడు… మా వ్యూహాలేమిటో ఇప్పుడే చెబితే మోడీ యాక్టివ్ అయిపోతాడు కదా అని మర్మగర్భంగా బదులిచ్చాడు… అంటే, ఆల్రెడీ ఇండికూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రాథమిక సంకల్పంతో ఉంది… కాంగ్రెస్ పార్టీ మరో అహ్మద్ పటేల్ డీకే శివకుమార్ ఆల్రెడీ రంగంలోకి దిగి సంప్రదింపులు మొదలుపెట్టాడనీ సమాచారం… […]
పట్నాయక్ శకానికి ఇక స్వస్తి..! ‘దత్త వారసుడి’ చేతుల్లో బందీ..!!
తండ్రి బిజూ పట్నాయక్ రెండుసార్లు… కొడుకు నవీన్ పట్నాయక్ 5 సార్లు ముఖ్యమంత్రి వరుసగా… పాతికేళ్లుగా దాదాపు… ఇక ఆ పట్నాయక్ వారసత్వానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే…! నవీన్ పట్నాయక్‌ను ఇన్నేళ్లూ అమితంగా ఆదరించిన ఒడిశా ప్రజలు ఈసారి మరీ ఘోరంగా తిరస్కరించారు… ప్చ్, అనేక విషయాల్లో ఆదర్శ నాయకుడే… కానీ ఆరోగ్యం క్షీణించి, చేరదీసిన బ్యూరోక్రాట్ల చేతుల్లో బందీ అయిపోయాడో ఇక అన్నిరకాల పతనం ఆరంభమైంది… ఇంత దారుణమైన ఓటమిని ఎవరూ ఊహించలేదు… ఎగ్జిట్ పోల్స్‌లో […]
పాలిటిక్స్, క్రికెట్, టీవీ, సినిమాల జోలికి పోను… వేణుస్వామి కఠోర నిర్ణయం…
నిజమే, వేణుస్వామి మీదే ఇప్పుడు అందరి దృష్టి… తను ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పాడు… ఇప్పటికే తన మీద భారీగా ట్రోలింగ్ సాగుతోంది… జగన్ గెలుపు మీద తను కాన్ఫిడెంటుగా తన మాట మీదే నిలబడ్డాడు తప్ప, తప్పించుకోవడానికి వీలుగా జ్యోతిష్యపరమైన ఏ మార్మిక భాషనూ వాడలేదు… కొందరు అటయితే అటు, ఇటయితే ఇటు చెప్పేందుకు వీలుగా భాషను తెలివిగా వాడుతుంటారు… తను నిజంగానే తెలుగునాట సినిమా, టీవీ, క్రికెట్, పొలిటికల్ ముఖ్యుల వ్యక్తిగత జాతకాలను […]
అడిగెదనని కడువడి జను నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్…
తెలుగు సాహిత్యానికి అన్నమయ్య, పోతన, వేమన ఎంత ఆయుస్సు పోశారు? ఎన్ని నగిషీలు దిద్దారు? ఎన్నెన్ని అలంకారాలు అద్దారు? ఎంత మాధుర్యాన్ని జత చేశారు? అత్యంత సరళమయిన తెలుగు భాషను ఉపయోగిస్తూ ఎలా అనన్యసామాన్యమయిన భావనలను ఆవిష్కరించారు? పదంలో, పద్యంలో ఛందస్సు మధ్య వాడిన వారి మాటలు ఎన్నెన్ని ఇప్పుడు సామెతలుగా, వాడుక మాటలుగా మన నోళ్లల్లో నిత్యం నానుతున్నాయి? అన్నవి తెలుగువారు తప్పనిసరిగా తెలుసుకోదగ్గ విషయాలు. సకల శాస్త్రాలు చదివిన గొప్ప కవికి వెయ్యేళ్ల ఆయుస్సు […]
- « Previous Page
- 1
- …
- 23
- 24
- 25
- 26
- 27
- …
- 108
- Next Page »