డబ్బు గురించి నా చికాగో స్నేహితుడి మాటల్లో…! ‘‘సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులు సహజం. కానీ, నా స్నేహితుడి జీవితంలో ఆ ఒడిదొడుకుల తీవ్రత, సంఖ్య కాస్త ఎక్కువే. 20 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన తరువాత, 42వ ఏట అతని బ్యాంక్ ఖాతాలో కేవలం 6 లక్షల 50 వేల రూపాయలే మిగిలి ఉన్నాయి. అదీ, అమెరికాలో దశాబ్దకాలం పనిచేసి కూడా… 2006లోనే అతని వద్ద 3 కోట్ల రూపాయల విలువైన ఆడీ కార్ […]
డీజే జర్నలిస్టులం..! మాకు ఉగాది ఉషస్సుల్లేవ్… శివరాత్రి జాగారాలే రోజూ…!!
పేరుగొప్ప.. జైలు బతుకు.. ఓహ్.. జైలులో ఉన్న ఖైదీలను కూడా పండుగ రోజుల్లో సందడి చేసేందుకు అనుమతిస్తారేమో కదా? అయితే ఇక్కడ ఈ హెడ్డింగ్ వర్తించదు అనుకుంట! సగటు జీవులు ఎలాంటి లైఫ్‌ను కోరుకుంటారు? ఒత్తిడి లేని జీవితాన్ని.. చేతినిండా జీతాన్ని! వారం పాటు పనిచేసినా.. మధ్యలో ఒక్కరోజు సరదా సమయాన్ని! ఏదైనా పండుగో.. పబ్బమో.. ఆపదో.. వస్తే సంతోషం, వినోదం, బాధ.. అనుభవించేందుకు.. పంచుకునేందుకు నాలుగైదు రోజుల పని విరామాన్ని! ఇగ రాకపోతయా? అగ రాకపోతయా? […]
జస్ట్, ఇది ట్రెయిలర్ మాత్రమే… అసలు సినిమా ముందుంది…:: ఇజ్రాయిల్
ఇజ్రాయేల్ Vs హెజ్బొల్లా! Part 2 మేము ఇంకా పూర్తి స్థాయి ఎటాక్ మొదలు పెట్టలేదు! అసలు ఆ అవసరం కూడా రాకుండా హెజ్బొల్లా ని కట్టడి చేయుగలం! ప్రతీ దాని మీదా మాకు నియంత్రణ ( Control ) ఉంది. మేము ఇజ్రాయేల్ లో ఉంటూనే లెబనాన్, సిరియా లలో ఉన్న మా ప్రత్యర్థులని భయపెట్టగలం! ఇప్పటివరకూ జరిగింది కేవలం కొద్దిపాటి టెక్నాలజీ తో జరిగింది. ఇంకా మేము వాడాల్సిన టెక్నాలజీ చాలా ఉంది….. ఇజ్రాయేల్ […]
బాబు గారూ… హెరిటేజ్‌కు ఇస్తే బదనాం… ఇదుగో ఇలా చేయండి…
నూతన ఆలోచనలు చేయాలి…. టీటీడీ లడ్డు నాణ్యత విషయంలో, ప్రభుత్వం, దర్యాప్తు కంపెనీల మీద, ఇతరుల మీద, కఠినమైన చర్యలతో పాటు మరో ముఖ్యమైన చర్చ నేడు మనం చేయాల్సిన అవసరం ఉంది. తమిళ్ నాడు, కర్నాటక, గుజరాతీ రాష్ట్రాల్లోని పాల ఉత్పత్తి, ఆవు పాల నుండి సేకరించిన నెయ్యి ఉత్పత్తిలో, జాతీయ స్థాయిలో మన రాష్ట్రం కూడా పోటీ పడగల శక్తి మన రైతులకు ఉంది . మన రాష్ట్రంలో 50 లక్షలకు పైగా, పాలు ఉత్పత్తి […]
ఏమో, చచ్చినా సరే, మళ్లీ బతుకుతారేమో… మీ దేహాన్ని భద్రపరుచుకొండి…
ఇక అంత్యక్రియలు అంతమవుతాయా? మళ్లీ బతికించడం కోసం బాడీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు! చావంటే భయం నటిస్తాం కానీ…నిజానికి మనకు చావంటే చాలా ఇష్టం. కొంచెం పని పెరగగానే మనకు చచ్చేంత పనిగా మారిపోతుంది. నిజానికి చచ్చేప్పుడు ఎవరూ పని పెట్టుకోరు – చచ్చే పని తప్ప. ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా చచ్చే చావొస్తుంది. పసిపిల్లలు అల్లరి చేస్తుంటే చంపేస్తున్నార్రా అనకపోతే బతుకు సాగదు . చచ్చేట్టు తిడితేనే తిట్టినట్లు. కొందరు పెళ్ళిలో, చావులో మాత్రమే కలుస్తూ […]
సీఎం చంద్రబాబూ… సుబ్బారెడ్డి భార్య గురించి నీకేం తెలుసని వ్యాఖ్యలు..!?
నా జీవితంలో చంద్రబాబు ఏడవడం మొదటిసారి చూశాను… తన సతీమణిని వైసీపీ నాయకులు కించపరిచారనీ, కుళ్లు రాజకీయాల్లోకి సంస్కారరహితంగా ఇంట్లోని ఆడవాళ్లను తీసుకొస్తున్నారనీ విలపించాడు… ఆరోజు తన విలాపం నాటకం కాదు, నిజంగానే నీచమైన వ్యాఖ్యల్ని ఎదుర్కున్నారు ఆ దంపతులు… ఖచ్చితంగా తప్పే… (నవ్వడమూ అరుదే, ఉద్వేగరహితుడు… యంత్రుడు) తన పక్షం నుంచి చిల్లర కూతల్ని నివారించలేదు జగన్, అదీ తప్పే… అలాగని టీడీపీ క్యాంపు ఏమీ శుద్దపూస కాదు… జగన్ కుటుంబసభ్యుల మీద కూడా అవాకులు […]
అసందర్భంగా చిలుకూరు బాలాజీని ఈ రచ్చలోకి లాగడం దేనికి రాధాకృష్ణా..?!
‘దేవుడు ఫలానా చోటే ఎందుకు పవర్‌ఫుల్‌గా ఉంటాడు? దేవుడు సర్వాంతర్యామి అని కదా చెబుతారు? కొన్ని దేవాలయాలు వెలవెలబోతుంటాయి. మరికొన్ని దేవాలయాలు కళకళలాడుతుంటాయి. ఇదంతా మార్కెటింగ్ మహత్యమే…’ అని మొదలుపెట్టాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన అని మనం నొసలు ముడేసేలోపు ఇదుగో ఈ అసందర్భ ప్రస్తావన మొదలవుతుంది… ‘చిలుకూరు బాలాజీ దేవాలయాన్నే తీసుకుందాం. అక్కడకు వెళ్లే వారికి అమెరికా వీసాలు లభిస్తాయని ప్రచారం చేశారు. ఇంకేముందీ.. అమెరికాలో చదువుకోవాలనుకునేవారు, అక్కడ ఉద్యోగాలు చేయాలనుకొనేవారు […]
కెమికల్ ఫుడ్..! రసాయనాల్నే తింటూ, తాగుతూ, పీలుస్తూ… ఒళ్లంతా విషమే…!!
చిలుక కొరికిన పండు తియ్యన. ఆ పండు రుచే రుచి . చిలుక కొరకడంవల్ల పండు తియ్యగా మారదు…మొత్తం చెట్టుకాయల్లో ఏది తియ్యగా ఉంటుందో పసిగట్టి దాన్నే చిలుక కొరుకుతుంది. చిలుక ప్రత్యేకత అది. నృసింహ శతకంలో అడవిపక్షులకెవడు ఆహారమిచ్చెను ? అని ప్రశ్న . అడవి పక్షుల ఆహారం గురించి తరువాత సంగతి. ముందు జనారణ్య పక్షులమయిన మనం తినే ఆహారం ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకుంటే వీధివీధికి కార్పొరేటు ఆసుపత్రులు మూడు బెడ్లు ముప్పైమంది […]
జగన్‌ను వీడి జనసేనలోకి వెళ్తాడు సరే, బాలినేని అక్కడ ఇమడగలడా..?
2021 అక్టోబర్ రెండో వారంలో ఒక ఉదయం 7 గంటలప్పుడు.. ఒక యువ కాంగ్రెస్ నేతకు బాలినేని నుంచి 12 ఫోన్ కాల్స్ … మన పిల్లోడివి నువ్వు టీడీపీలోకి పోవద్దంటూ బుజ్జగింపుతో మొదలు పెట్టి బెదిరించే వరకు.. నేను ఫోన్ చేస్తే చాలు అతను ఆగిపోతాడు అనుకున్న బాలినేనికి అతను కూల్ గా ఇచ్చిన సమాధానం చిర్రెత్తించింది.. కోపంతో ఫోన్ కట్ చేయటం మళ్ళీ 5 నిముషాలకు ఫోన్ చేయటం.. మొత్తం పన్నెండుసార్లు కాల్ చేశారు.. […]
మెంటల్ హౌజ్..! వెతికి మరీ ఎర్రగడ్డ, విశాఖ కేసుల్ని పట్టుకొచ్చినట్టున్నారు..!!
ఎవరైనా కమర్షియల్ సైకియాట్రిస్టులు తమ గిరాకీ కోసం ఈసారి బిగ్‌బాస్ షో స్పాన్సర్ చేసి నడిపిస్తున్నారేమో… అలాగే ఉంది చూడబోతే..! ప్రత్యేకించి నాగమణికంఠకు ఎక్కువ వోట్లు వచ్చాయట.., ప్రేక్షకదేవుళ్లు తను ఖచ్చితంగా హౌజులో ఉండాల్సిందేనని మిస్డ్ కాల్స్, వోట్లతో బిగ్‌బాస్ కంప్యూటర్లు స్టక్కయిపోయే రేంజులో దాడిచేస్తున్నారట… హౌజులోకి వచ్చింది మొదలు, మెంటల్ గేమ్ ఆడుతున్నాడో, మెంటలేనో తెలియదు గానీ… సింపతీ కార్డు మాత్రం భలే ప్లే చేస్తున్నాడు… నిన్న ఆడుతూ ఆడుతూ కింద పడిపోయాడు… ఏమైందో తెలియక […]
చైనాలో పెళ్లి జరగదు… రష్యాలో కడుపు పండదు… ప్చ్, ఇదొక దురవస్థ…
లంచ్ బ్రేక్ లో అయినా శృంగారించి పిల్లల్ని కనాలని పుతిన్ పిలుపు చైనా, రష్యాలకు పెద్ద చిక్కొచ్చి పడింది. యువకులు పెళ్లికి దూరం కావడంతో జననాల రేటు తగ్గుతోంది. ముసలివారి నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. బహుశా అందుకేనేమో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల పద్దులో మొదటి స్థానంలో అప్రతిహతంగా చాలా కాలంపాటు ఉన్న చైనాను రెండో స్థానంలోకి లాగి పడేసి… వారి మొదటి స్థానాన్ని మనం ఆక్రమించగలిగాం. వారి నిరాసక్తతే తప్ప కనీసం ఇందులో కూడా […]
అతిశి మార్లెనా..! ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఇంటిపేరు అదికాదు… మరిదేమిటి..?!
పేరు మధ్యలో ‘మార్లెనా’ ఉంటే క్రిస్టియన్ అని బీజేపీ ముద్రేయకుండా.. 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఆతిశీ కమ్యూనిస్టు ప్రొఫెసర్ల తెలివైన కూతురే మరి! ………………………………….. ‘‘ నా అసలు ఇంటి పేరు సింగ్. నేను పంజాబీ రాజపుత్ (క్షత్రియ లేదా ఖత్రీ) కుటుంబం నుంచి వచ్చాను. దిల్లీ ఓటర్లను నా పేర్లతో మాయ చేసి ఆకట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే నేను నా అసలు కుటుంబనామాన్ని (సింగ్) నా పేరుకు తోకలా వాడుకుంటూ ఉండేదాన్ని,’’ ఆరేళ్ల క్రితం […]
అదితి – సిద్ధార్థ్ నిరాడంబర వివాహం… పెళ్లి ఎందుకు నచ్చిందంటే..?!
అదితిరావు హైదరీ, సిద్ధార్థ్ జంట పెళ్లిబంధంతో అధికారికంగా ఒక్కటయ్యారు… ఇన్నేళ్ల ప్రణయం, సహజీవనానికి చట్టబద్ధత కల్పించుకున్నారు, అదీ హిందూ సంప్రదాయ వివాహ పద్ధతిలో… అదీ ఓ ఆలయ ప్రాంగణంలో… అదీ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో… అదీ మరెవరికీ ప్రవేశం లేని కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ… ప్రత్యేకించి మీడియా హడావుడి లేదు… అట్టహాసాలు లేవు, ఆడంబరాలు లేవు… బందోబస్తుల్లేవు… ఎడాపెడా ఖర్చుల్లేవు… అభిమానులు, హంగామాలు, తోటి సినిమా కళాకారులు, పెద్దల రాకపోకలు గట్రా ఏమీ లేవు… సింపుల్‌గా […]
పొద్దుగాల సిన్సియర్‌గా డ్యూటీకి వస్తే… ఇంత అవమానిస్తారా సార్..?
మునుగోడు ఎమ్మెల్యే శ్రీమాన్ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సాబ్… ఏమిటి మీరు చేస్తున్న పని..? సరే, ఓ మందు షాపుల వద్దకు వెళ్లారు… ఈ మందు షాపుల ఆకస్మిక తనిఖీలు ఏమిటి..? ఎవరైనా ఆఫీసులో, స్కూళ్లో, హాస్టళ్లో, ఇంకా ఏవైనా ప్రజావసరాల సంబంధిత వ్యవస్థలో తనిఖీలు చేస్తారు… మంచీచెడూ కనుక్కుంటారు… కానీ తమరేమిటి ఇలా మందు షాపులు బాగా నడుస్తున్నాయా లేదాని తనిఖీలు చేస్తున్నారు..? సరే, చేశారు… ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ముఖ్యం కాబట్టి, తమ పరిధుల్లోని మద్యం […]
కృష్ణదేవరాయలు తన జీవనసంధ్యలో అక్కడికి ఎందుకు వెళ్లాడు..?!
రాజుగారి సమాధి ఏది? అవును, రాజు గారికి సమాధి ఉండాలి కదా?, ఏ రాజు గారికి? పులకేశికా ? రాజరాజ- 2 కా? అమోఘ వర్షుడికా? వీర భల్లాల దేవుడికా? బిజ్జాల దేవుడికా? గణపతి దేవుడికా? రుద్రమ దేవికా? అనుగు రాజుకా లేక బ్రహ్మ నాయుడికా? రాచ వేమారెడ్డికా? శ్రీకృష్ణ దేవరాయలకా? చాలా చారిత్రక ప్రదేశాలు, కోటలు చూసి ఉంటారు కదా ? ఏ హిందూ రాజుదైనా సమాధి చూశారా?. కొంత చరిత్ర చదివినా, పైన ఉదహరించిన […]
బీర్ మార్కెట్..! దేశంలో కింగ్ఫిషరిష్టులే అధికం… దీన్ని కొట్టే కంపెనీయే లేదు..!!
వేల కోట్లు… లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వేలాది మంది ఎంచక్కా పలు పార్టీల్లో చేరి, రక్షణ పొంది… మరీ బీజేపీలో చేరినవాళ్లు మరింత రక్షణ పొంది… జల్సాగా, ఎంచక్కా, నిక్షేపంగా జీవితాలను ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు, మన తెలుగు ఫ్రాడ్లూ బోలెడుమంది… జాతిని ఉద్దరించడం కోసం కొందరి రుణాల్ని ప్రభుత్వమే రైటాఫ్ చేసి, అత్యంత కరుణనూ చూపిస్తుంటుంది… రుణాలు తీసుకున్నవాడు బాగానే ఉంటాడు… అడ్డగోలు కమీషన్లు పొంది రుణాలు ఇచ్చినవాడూ బాగానే ఉంటాడు… కానీ నిజంగానే […]
జగన్ మద్య అరాచకానికి చెల్లుచీటి..! సరసమైన చౌక ధరలతో బాబు పాలసీ..!!
పెద్దగా ఆలోచించడానికి ఏమీలేదు… జగన్ పాలనలో అత్యంత దరిద్రమైన పాలసీ మద్యం., దారుణం… మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తాను అనే పిచ్చి సాకుతో, వాగ్దానంతో… దిక్కూమొక్కూలేని అస్మదీయుల కంపెనీల రంగుసారాకు నానా దిక్కుమాలిన బ్రాండ్ల పేర్లు పెట్టి మార్కెట్లోకి వదిలాడు… బ్రాండెడ్ క్వాలిటీ దొరకదు… రుచి మరిగిన నాలుక వదలదు… ఆ దరిద్రపు కొత్త రంగుసారాను తాగీతాగీ లక్షల మంది కాలేయాల్ని కోల్పోెయారు… రియాలిటీ… ఒడలు గగుర్పొడిచే అరాచకం… వర్తమాన రాజకీయాలు, అధికారాలు సమాజానికి ఎంత నష్టదాయకంగా మారుతున్నాయో తెలిపే […]
పార్లమెంటులో తన కుటుంబం మీద పాక్షిక సత్యాలే వెల్లడించిన ఏచూరి..!!
ఏచూరి వంటి తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా? ……………………………………………………………………… ఇండియాలో ఎంతటి గొప్ప రాజకీయ నాయకుడైనా తాను అన్ని మతాలకూ సమ దూరంలో ఉండే లౌకికవాదినని, తనకు కులం పట్టింపు లేదని చెప్పుకోవడానికి తన జీవితంలో వాటికి సంబంధించిన అనుకూల అంశాలనే వెల్లడిస్తాడు. ఈ విషయంలో తాను అతీతుడిని కాదని మొన్ననే కన్నుమూసిన జగమెరిగిన తెలుగు మార్క్సిస్టు కామ్రేడ్ సీతారామ్ ఏచూరి ఏడేళ్ల క్రితం పార్లమెంటులో నిరూపించుకున్నారు. నాటి మద్రాసు నగరంలో […]
శ్రీ ఎల్.బి.శ్రీరాం గారికి… మీ కవిసమ్రాట్ సినిమాపై నాలుగు మాటలు…!
ఎల్. బి. శ్రీరామ్ గారికి, నమస్సులు. మీరు నిర్మించి, నటించిన “కవిసమ్రాట్ విశ్వనాథ”ను యూట్యూబ్ లో చూశాక స్పందనగా ఈ నాలుగు మాటలు. “అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్” నిజమే. విశ్వనాథలాంటి శిష్యుడిని పొందగలిగే భాగ్యం చెళ్ళపిళ్ళవారికి దక్కింది కానీ…నన్నయ్య, తిక్కనలకు దక్కిందా? “ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపుఁ దెనుఁగుతోట […]
ఈనాడు కుదింపు ప్లాన్… ఆంధ్రజ్యోతి పెంపు స్ట్రాటజీ… సాక్షి నిరాసక్తత..!!
ఈనాడు సంపాదక పేజీ రీడర్ షిప్ ఎప్పుడూ చాలా పూర్… సాక్షి మరీ పూర్… ఆంధ్రజ్యోతిలో భిన్న అభిప్రాయాలకు వేదికగా మార్చినందున కొంత రీడర్ షిప్ ఉన్నట్టుంది… మిగతా పత్రికల సంపాదక పేజీల గురించి ప్రస్తావనే అనర్హం… ఈనాడులో కొన్నాళ్లుగా సంపాదక పేజీలో మార్పులు… హాయ్ బుజ్జీ, అంతర్యామి ఈ పేజీలోకి వచ్చేశాయి… ఆఫ్ బీట్ మాయం… రెండు ఫీచర్లు మూడయ్యాయి… చిన్నగా… ప్రజెంటేషన్ కూడా అనాసక్తంగా… ఎడిటోరియల్ సగమైపోయింది… మొత్తానికి ఏదేదో చేస్తున్నారు… నేషనల్ పేజీని […]
- « Previous Page
- 1
- …
- 52
- 53
- 54
- 55
- 56
- …
- 125
- Next Page »