కాపీరాయుడికి కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారమా? కేంద్ర (అ)సాహిత్య అకాడమీ భావదారిద్ర్యం… సాహిత్యమా ఏదీ నీ దారి..? ఎటు నీ పయనం.. కాపీరాయుళ్ళు తప్ప వేరెవరూ లేరా? హవ్వ! షేమ్..షేమ్..షేమ్..! సిగ్గుపడండర్రా…!! 2023 కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీతల ఎంపిక తుది జాబితా ఒకటి బయటికి వచ్చింది. అందులో తక్కెడశిల జానీ అనే వారికి కవిత్వం, విమర్శ రెండు కేటగిరీలలో ఎంపికకు పేరు నమోదైంది. ఇందులో… 1991 లో వచ్చిన ” వివేచన” ( విమర్శ) కు […]
తకరారు నమస్తే… చంద్రబాబుపై ఏడుపు… ఆంధ్రజ్యోతికి నొప్పి… అక్షరాలా గిలగిలా…
పార్టీలే కాదు, ఆయా పార్టీల బాకాలు కూడా బజారుకెక్కి తన్నుకుంటయ్… తిట్టుకుంటయ్… తెలుగునాట చాలా సహజం… సాక్షిని ఈనాడు, సాక్షిని ఆంధ్రజ్యోతి… ఈనాడు, జ్యోతిలను సాక్షి… నమస్తేను వెలుగు, వెలుగును నమస్తే… నమస్తేను ఆంధ్రజ్యోతి, జ్యోతిని నమస్తే… ఇలా తిట్లదండకాలు నడుస్తూ ఉంటయ్… వార్తను బట్టి, తీసుకున్న పొలిటికల్ ధోరణిని బట్టి… వీటిల్లో ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి మైకు… అందుకని అవే రంగులు పూసుకుని, బజారులో పడి శిగాలూదుతూ ఉంటయ్… కానీ ఏదైనా సబ్జెక్టు […]
పురుషుడిగా మారుతున్న బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ కూతురు సుచేతన!
పురుషుడిగా మారుతున్న బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ కూతురు సుచేతన! పదేళ్లకు పైగా మార్క్సిస్టు సీఎంగా కొనసాగిన నేత పేరు ఇన్నాళ్లకు మళ్లీ వార్తల్లోకి… 42 ఏళ్ల సుచేతన సర్జరీ తర్వాత సుచేతన్–ఎంతైనా కమ్యూనిస్టులే నిజంగా గొప్పోళ్లు …………………………………………………………….. ‘పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె..’ అనే శీర్షికతో బుల్లి వార్త ఈరోజు ఈనాడు 15వ పేజీ కింద ఓ మూలన కనపడింది. రెండు చిన్ని చిన్ని ఫోటోలు చూశాక పశ్చిమ బెంగాల్ సీపీఎం చివరి మాజీ […]
610 జీవోపై ఆందోళన… కేసీయార్ తప్పులో కాలేశాడన్న తెలుగు మీడియా…
610 జీవోలో కెసిఆర్ పప్పులో కాలేశాడన్న మీడియా టివి వార్తల లెక్కలు బయటపెట్టిన బాబు జర్నలిస్ట్ జ్ఞాపకాలు- ————————————- ఒక అంశాన్ని అందరూ ఒకే కోణంలో చూడాలని లేదు , చూడాల్సిన అవసరం లేదు . మీడియా ఒక కోణంలో చూస్తే రాజకీయ నాయకులు మరో కోణంలో చూస్తారు . ఈ రోజుల్లో అయితే మొత్తం మీడియా కూడా ఒకే కోణంలో చూడదు . తమ తమ మీడియా రాజకీయ అనుబంధ కోణంలో చూస్తే , రాజకీయ […]
అవతరించెను… అంతలోనే అంతర్దానమయ్యెను… సకలం విష్ణుమాయ…
Fake Baba: “కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా… గోచిగుడ్డ నుండి మొదలయిన అంతులేని మహా సంసార ప్రయాణం కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే. ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ…ఒక సన్యాసి వచ్చి ఆ మంటపం కింద గూడు కట్టుకున్నాడు. పశువుల కాపర్లు […]
ఈ పరిపాలన చరిత్ర స్పృహ ఎరుగదు… త్యాగం విలువ తెలియదు…
Gurram Seetaramulu……… పుట్టని బిడ్డకు పేరు పెట్టి మురిసే సంతానాలు ఉంటాయి. రాయని కావ్యానికి సమీక్ష చేసే తెంపరులు ఉంటారు. చరిత్ర స్పృహ ఎరగని, త్యాగం విలువ తెలియని పాలనలో ఉన్నాము. తొమ్మిదేళ్ళకే దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటుంటే ఎవరయినా దశాబ్ది ఉత్సవాలు పదేళ్ళు నిండాక చేసుకుంటారు కదా అని ఒక్క బుర్ర ఉన్న మేధావి అడగలేదు. రాజు గారి వస్త్రాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చంకీల రంగు గురించి, వజ్రపు పొదుగులు పొదిగిన […]
అక్షయపాత్ర హైదరాబాద్… బొడ్రాయి ముహూర్తంలోనే ఏదో మహత్తు…
అక్షయ పాత్ర హైదరాబాద్… ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ———————————– ముహూర్తాల మీద నమ్మకం ఉన్నా లేకున్నా … హైదరాబాద్ నగరాన్ని ఐదు వందల ఏళ్ళ క్రితం ఏదో అద్భుతమైన ముహూర్తంలోనే నిర్మాణాన్ని ప్రారంభించి ఉంటారు . లేకపోతే అక్షయ పాత్రలా ఎంతమంది వచ్చినా ఎలా తిండి పెడుతుంది … ***** హలో ఎక్కడున్నావ్ ? అని ఉదయం ఓ జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో […]
అమరుల వివరాల్లేని ఘనస్మారకం… త్యాగాలకు తగిన గుర్తింపేం ఇచ్చినట్టు..?
అద్భుతమైన నిర్మాణం… మిర్రర్ ఇమేజీ కన్స్ట్రక్షన్… హుసేన్ సాగర పరిసరాల్లో నిర్మితమైన అమరవీరుల స్మారకం తెలంగాణ ఉద్యమకారులకు నచ్చేలా పూర్తయింది… నిజమే… కానీ అంతటి అపురూప నిర్మాణమైతే చేశారు కానీ అమరుల పేర్లేవీ..? వారి చరిత్రలేవీ..? అవి లేకుండా ఆ స్మారకానికి విలువేదీ..? అసలు తెలంగాణ కోసం జరిగిన పోరాటాల్లో అమరులైన వారి వివరాల సేకరణ ఈ ప్రభుత్వానికి ఈ తొమ్మిదేళ్లలో ఎందుకు పట్టలేదు..? అమరవీరుల స్మారకం సరే, కానీ వారి ఆకాంక్షల మాటేమిటి..? ఎన్నికలొస్తున్నాయి కాబట్టి, […]
బాలు మరో గద్దర్… కాపీ రచయిత వేటూరి… రామోజీ ఫేక్ విప్లవగీతాలు…
Bharadwaja Rangavajhala…… గూడ అంజన్న స్మృతి లో… అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది. నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో నెమలూరి భాస్కరరావుగారితో సమావేశం జరిగింది. ఆయన మాకు ఆ రాత్రంతా నక్సల్బరీ వెలుగు ప్రసరింపచేశారు. ఆ రాత్రి […]
పొంగులేటిని కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నది ఈయనేనా..? వెరీ ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
Siva Racharla……….. ఎవరీ పెద్దమనిషి?. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, చిన్నారెడ్డి, బలరాం నాయక్, మల్లు రవి తదితరులు వెళ్లారు. ఆ ఫోటోల్లో ఒక పెద్దమనిషి నన్ను ఆశ్చర్యపరిచారు. అర్రే, ఈయన ఇక్కడ ఎలా?, ఎందుకు అని అనిపించింది. మొదటి ఫొటోలో నుదురు మీద చిన్న కణితి ఉన్న పెద్ద మనిషిని చూడండి. చాలా తక్కువ మందే గుర్తు పడతారు. ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఆయన వయస్సు […]
ఆ దిక్కుమాలిన ఆదిపురుష్ సినిమాకు నీ ప్రమోషన్ వర్క్ దేనికి రంగరాజా..?
చిలుకూరు వెంకటేశ్వరస్వామి టెంపుల్ పూజారి రంగరాజన్… సర్కారీ దేవాదాయ దుష్ట చెరలోనికి చిలుకూరు గుడి వెళ్లకుండా… గుళ్ల స్వయంప్రతిపత్తికి పోరాడుతున్న ఆ గుడి పూజారుల పట్ల సద్భావన ఉంది… ఓ దళితుడిని భుజాలపై ఎక్కించుకుని గుడిప్రవేశం చేసిన తీరు పట్లా అభినందన… వీఐపీ ప్రవేశాల పేరిట దేవుడిని అమ్మకానికి పెట్టని ఆచరణ పట్ల ప్రశంస కూడా… కానీ నీకెందుకు స్వామీ… ఆదిపురుష్ మీద వాచాలత… ఆఫ్టరాల్ అదొక సినిమా… ఎస్, తిరుమల కొండ మీద దాని పవిత్రతను […]
అందరికీ జ్యోస్యాలు చెప్పే పంతులుకు… తన జాతకమే తెలియనట్టుగా…
Murali Buddha…. దాన వీర కర్ణ ముహూర్తం సూపర్ హిట్… ఎన్టీఆర్ , బాబు ముహూర్తం అట్టర్ ప్లాప్ … ఫలించని జోస్యం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు- —————————————— ‘‘ఎన్టీఆర్ గారూ, నేను చెబుతున్నాను, నా మాట వినండి . మీరు సినిమాను సంక్రాంతికి విడుదల చేయండి . సూపర్ హిట్ అవుతుంది అని అతను చెప్పగానే… భలే వారే, ఇంకా పదిహేను రోజులు కూడా లేదు . ఎలా సాధ్యం అని ఎన్టీఆర్ అనుమానం వ్యక్తం చేస్తే […]
చివరకు జోబైడన్, పుతిన్ ఉమ్మడి ఇంటర్వ్యూ దొరికినా ఫస్ట్ వేసే ప్రశ్న ఏంటంటే..?!
ఇప్పుడు ఈనాడు రిపోర్టర్ ఎవరైనా సరే… ఎంతటి పెద్దమనిషి ఇంటర్వ్యూకు వెళ్లినా సరే… జో బైడన్ అయినా సరే, ప్రధాని మోడీ అయినా సరే, రష్యా ప్రధాని పుతిన్, చైనా బాస్ జిన్పింగ్ అయినా సరే… ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న… ‘‘మార్గదర్శిపై జగన్ దాడులపై మీరేమంటారు..? ఖండిస్తారా..?’’ వీళ్లనే యాజమాన్యం మనసెరిగి నడుచుకునే ఉద్యోగులు అంటారు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మార్గదర్శి మీద జగన్ సర్కారు దాడుల తరువాత ఎవరు ఖండిస్తే వాళ్ల వార్తలు ఈనాడులో […]
పూరీ మాత్రమే కాదు… అహ్మదాబాద్, మహేశ్ రథయాత్రలూ దీటైనవే…
20 జూన్, 2023 పూరీ రథయాత్ర సందర్భంగా… (డా. వైజయంతి పురాణపండ) వేసవి వెనుకబడి తొలకరి జల్లులు కురుస్తున్న సమయంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది. బలభద్రుడు, సుభద్ర, శ్రీకృష్ణుడు వేడుకగా విహారయాత్రకు బయలుదేరతారు. దివ్యరథాల మీద పూరీ దేవాలయం నుంచి, స్వగ్రామంలో తోటలో కొలువుతీరిన భవంతికి చేరుకుంటారని భారతీయుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ యాత్రను శోభాయమానంగా, పవిత్రంగా నిర్వర్తిస్తారు. జగన్నాథుడిని విష్ణుమూర్తి అవతారంగా ఆరాధిస్తారు. ఒరిస్సాలోని పూరీ గ్రామంలో జగన్నాథుడు కొలువుతీరి ఉన్నాడు. జగన్నాథుడు, […]
పాలిటిక్స్ అంటే అంతే… ఫ్యాక్షన్లు, కులాలు, మతాల సమీకరణాలు…
Siva Racharla ………. నీ శత్రువే శాశ్వతం కానప్పుడు యుద్ధం, విజయం శాశ్వతం ఎందుకు అవుతుంది?. అంతిమ యుద్ధం అంటూ ఏమీ ఉండదు! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అని కాలం మళ్ళీ మళ్ళీ నిరూపిస్తుంది. ఫ్యాక్షన్ అన్న మాట రాయాలన్నా నాకు మనసు రాదు కానీ పశ్చిమ కర్నూల్ ప్రాంతంలో మూడు దశాబ్దాల ఫాక్షన్ లో ఎంతోమంది చనిపోయారు. కేవలం ఒక మండల నాయకుడు “కప్పట్రాళ్ల” వెంకటప్పయ్యనాయుడు నడిపిన ఫ్యాక్షన్ లో ఎంతమంది చనిపోయారో […]
పాపం పాపారావు… ఇల్లు కొన్నాడు… ఇది సర్రియల్ ఎస్టేట్…
House-Wish: పాపం పాపారావు. భార్య పోరు భరించలేక…కొన్ని ఆదివారాలను ఇల్లు కొనడానికి అన్వేషణకోసం కేటాయించాడు. పాపారావు పేరే పాతగా ఉంటుంది కానీ ఆయన ఉద్యోగం చాలా ట్రెండీగా ఉంటుంది. సాఫ్ట్ వేర్ కొలువు. భార్య కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగే. ఇద్దరికీ కలిపి రెండు లక్షల నెల జీతం చేతికి వస్తుంది. పెళ్లయి నాలుగేళ్లయింది. ఏడాది పాపతో పాపారావు ఇల్లు కళకళలాడుతూ ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు సహజంగా అలవడే శని, ఆదివారం అర్ధరాత్రి అలవాట్లు భార్యా భర్తలకు లేకపోవడంతో ఆ ఇంట్లో […]
మెగాబాబు లేదా మెగాపాప… ఓహో, మంచిరోజు చూసే ప్రసవం ఫిక్స్ చేశారన్నమాట…
టీవీ9 వాడికైతే మరీనూ… పిల్లొచ్చినా పిత్తొచ్చినా అపురూపమే… సమాచార సంచలనమే… హీరో రాంచరణ్, ఉపాసన దంపతులకు రేపు మార్నింగ్ 6.30 గంటలకు సంతానమట… ఇదొక మెగా ఈవెంట్ అన్నట్టుగా టీవీ9 వాడు ఎగబోసుకుంటూ వార్తల మీద వార్తలు ఇస్తున్నాడు… జనం రెండో ప్లేసులో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి ప్రసవించలేదు…సూపర్ ఎక్స్క్లూజివ్ అట… రెడీగా ఉండాలట… హాస్పిటల్ నుంచే ఉదయం నుంచే ప్రత్యక్ష ప్రసారమట… పాపం శమించుగాక… హాస్పిటల్ లోనికి వెళ్లకండిరా నాయనా… దీనిపై Abdul Rajahussain సార్ రాసిన ఓ […]
తెలంగాణలో బీజేపీ ఆశలు గల్లంతు
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? ఒక్కటంటే… ఒక్కటి! రాజా సింగ్ మాత్రమే తన స్వంత బలంతో ఓల్డ్ సీటీలో గెలిచాడు. మిగతా అన్ని చోట్లా కాషాయం కొట్టుకుపోయింది. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు రావటంతో కమలం క్యాంపులో కాస్త కళ వచ్చింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది! అయినా […]
అప్పట్లో శేషన్… తరువాత అంతటి సిన్సియర్ ఎలక్షన్ రిఫార్మిస్ట్ ఎవరో తెలుసా..?
Murali Buddha ఎంఐఎం అసదుద్దీన్ ను హడలెత్తించిన కొండయ్య … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————– ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలోనైనా ఫలితాలు ఎలా ఉండవచ్చు అని రకరకాలుగా చెబుతారు కానీ పాత నగరంలోని నియోజకవర్గాల ఫలితాల విషయంలో అందరిలో ఏకాభిప్రాయం ఉంటుంది . పాతనగరం సీట్లను యంఐయం పార్టీకి వదిలేసి లెక్కలు చెబుతారు . అలాంటిది యంఐయం నేత అసదుద్దీన్ ఒవైసి సైతం హడలిపోయేట్టు చేశారు ఒకరు . ఎవరు అమానుల్లా ఖానా ? అంటే.. . […]
ఓం రౌత్ సరిగ్గా కునుకు తీసి ఉంటే… ఆదిపురుష్ ఇంకాస్త బాగుండేదేమో…
Sleep Well: నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిమిషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు. కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు నిద్రకోసం […]
- « Previous Page
- 1
- …
- 74
- 75
- 76
- 77
- 78
- …
- 119
- Next Page »