నిజానికి ఇది వార్తగా గాకుండా… ఎవరికైనా దీన్ని మామూలుగా చెబితే ఎహె, ఊరుకొండి, సినిమా కథ చెబుతున్నావా.? కల్పనకు కూడా హద్దుండాలి అని తిట్టేస్తారేమో… అంతటి అసాధారణత్వం ఈ కథలో… ఇంత ఆర్ద్రమైన కథను, నిజాన్ని, వార్తను వినలేం, చదవలేం… అంత డెప్త్ ఉంది… ఈరోజు తెలుగు పాఠకులందరినీ కదిలించిన ఆ వార్త ఏమిటంటే..? సాఫ్ట్వేర్ దంపతులు… ఆరేళ్ల కొడుకు… తనకు మెదడు కేన్సర్… డాక్టర్లకు చూపిస్తున్నారు… బిడ్డకు అర్థం అవుతుందో లేదో వాళ్లకు తెలియదు కానీ […]
నాయుడు గారి గొంతులో ‘యువగ(ర)ళం’ !
పత్రి వాసుదేవన్ :: అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలు పెరిగిన తర్వాత బిడ్డలా ? ఇప్పుడా సామెత నారా వారి ఫ్యామిలీకి అతికినట్టు సరిపోతుంది. చినబాబు గారి ‘ఒంటి గంట రామలింగం’ ఫిలాసఫీతో ఇప్పటికే తలబొప్పి కట్టిన చంద్రబాబుకు, తాజాగా పుత్ర రత్నం ఇచ్చిన షాక్ చూస్తే ఎవరైనా విస్తుపోక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అంశం నారా లోకేష్ పాదయాత్ర. ప్రస్తుత పరిస్తితుల్లో అసలు ఈ పాదయాత్రకు అనుమతులు లభిస్తాయా? లభించినా […]
మన ‘ఏడుకొండల్లా’గే జార్ఖండ్‌లో పార్శ్వనాథ్ గుట్టలు… అగ్గిపెట్టిన సర్కారు…
సంఖ్యాబలమున్న మైనారిటీలను మచ్చిక చేసుకోవాలి… వోటు బ్యాంకుగా చూసుకోవాలి… వాళ్లు చెప్పినట్టు సై అనాలి… ఇదేకదా, భారతదేశంలో ప్రతి సెక్యులర్ పార్టీ చేసేది… మరి మైనారిటీలు అంటే, నిజంగానే సంఖ్యాబలం లేని మైనారిటీలను ఎవడు పట్టించుకోవాలి..? అదే కదా మన దరిద్రం… మన రాజకీయ పార్టీలు, మన ప్రభుత్వాల అడుగులు అలా ఉంటాయి… మన దేశ మైనారిటీల్లో క్రిస్టియన్లు, ముస్లింలే కాదు… పార్శీలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా ఉన్నారనే సోయి రాజకీయ పార్టీలకు ఉండదు… ఇవి […]
ఈ లోకం వీడుతున్నాననే స్పృహలోనే… నిర్వికారంగా మరణాన్ని ఆహ్వానిస్తూ…
గొల్లపూడి మారుతీరావు…. గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారట. అప్పారావు గారు వైద్యుడిని చూసి ‘‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట. వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు. మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య ఈ విషయాన్ని చెప్పారు. ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ఏం కావాలని. […]
ఓహ్… ఈ సుపారీ హత్యల వెనుక ఇంత చరిత్ర ఉందా..? ఇంట్రస్టింగు…
పార్ధసారధి పోట్లూరి …… సుపారీ అనే పదం తరుచూ మనం సినిమాలలో మరియు పత్రికలలో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ! సుపారీ అనేది కాంట్రాక్ట్ హత్యలకి మారు పేరుగా వాడుతుంది అండర్ వరల్డ్ మాఫియా ! అయితే ఈ ‘సుపారీ ‘ అనే పదానికి అర్ధం ‘తాంబూలం ‘! డబ్బులు తీసుకొని చేసే హత్యలకి పర్యాయపదంగా సుపారీ అనే పేరు ఎలా వాడుకలోకి వచ్చింది ? ఈ సుపారీ అనే పదానికి చారిత్రిక నేపధ్యం ఉంది […]
సాక్షి కదా… అదంతే… పాఠకుల్ని పిచ్చోళ్లను చేయడంలో నెంబర్ వన్…
పొద్దున్నే టీవీల్లో కొందరు స్వాములు రంగురంగుల పూసల దండలు వేసుకుని, ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఓ విరుగుడు చెప్పేస్తుంటారు… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు… మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు… వాళ్లను చూస్తుంటేనే ఓ అలర్జీ… సేమ్, సాక్షిలో ఈరోజు వచ్చిన హాఫ్ పేజీ ఐటం కూడా అలాగే అనిపించింది… ఐటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే… అది యాడ్‌లా అనిపించలేదు, యాడ్ అనీ రాయలేదు… స్పాట్ వార్త కాదు, స్పెషల్ స్టోరీ కాదు… ఫ్యామిలీ పేజీ […]
చంద్రబోసూ… శివుణ్ని మరీ గుడ్డికన్నోడా అని తిట్టేశావేంటి మహాశయా…
థమన్… వెనకబడ్డావేమిటి..? కమాన్, గేరప్… డీఎస్పీతో పోటీ అంటే మాటలా మరి..? పాడాలి, ఎగరాలి, దూకాలి, షో చేయాలి,… నువ్వు కాపీ కొడతావా, సొంతంగా కంపోజ్ చేస్తావా మాకు అనవసరం… వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ పాటలో జపాన్ టీంను దింపాడు డీఎస్పీ… మస్తు పెద్ద పెద్ద సంగీత వాయిద్యాలేవో కనిపిస్తున్నయ్… మా చిన్నప్పుడు మా పక్క టౌన్లో అన్నపూర్ణ బ్యాండ్ వాళ్లు కూడా ఇంత పెద్దవి వాడలేదు… నువ్వు మరింత పెద్ద వాయిద్యాలను తీసుకొచ్చి, మంగోలియా […]
పాన్ వరల్డ్ కిల్లర్… అసలు ఏ దేశపౌరుడు ఇప్పుడు… ఎక్కడికి వెళ్తాడు..?
2003… హిమాలయన్ టైమ్స్ అనే పత్రిక జర్నలిస్టు ఒకరు ఖాట్మండు వీథుల్లో తిరుగుతున్నాడు ఏదో వార్త కోసం… ఆ వార్త వర్కవుట్ కాలేదు గానీ ఓ కేసినోలో అనుకోకుండా ఓ కేరక్టర్ మొహం అనుమానాస్పదంగా కనిపించింది… ఇక తనపై నిఘా వేశాడు… రెండు వారాలు… పాత పత్రికలు తిరగేశాడు… క్లిప్పింగులు, ఫోటోలు సరిచూసుకున్నాడు… తాజా ఫోటోలతో సహా వార్తలు పబ్లిష్ చేశాడు… ఫలానా వ్యక్తి నేపాల్‌లో తిరుగుతున్నాడు అని… పోలీసులు సోయిలోకి వచ్చారు… ఆ కేసినో మీద […]
ఈడీ రివర్స్ గేమ్..! రోహిత్‌రెడ్డే కాదు, మిగతా ఆ ముగ్గురిపైనా గురి..!?
అన్ని పత్రికల్లోనూ సేమ్ వార్త… బీఆర్ఎస్ పార్టీవర్గాలు పేర్కొన్నట్టుగా… అంటే పార్టీయే ఆఫ్ ది రికార్డుగా పంపించిన నోట్ కావచ్చు బహుశా… త్వరలో ఎన్నికలు జరగనున్న ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ, రైతు విభాగాల ఏర్పాటు, పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఢిల్లీలో కేసీయార్‌ను కలిశారు, ఏపీ నుంచి కూడా బోలెడు మంది, వేగంగా బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి… సేమ్, ఇదే కంటెంటు… ఇవన్నీ నిజంగా జరుగుతూ ఉంటే, మీడియా తనంతటతనే రాయాలి, అంతేతప్ప ఇలా రాయించుకుంటే […]
జబర్దస్త్ షోలకు రేటింగ్స్ దెబ్బ… జనం వాటిని చూడటమే మానేస్తున్నారు…
నిజానికి ఈటీవీ రేటింగ్స్‌ను నిలబెడుతున్నవి ఇన్నాళ్లూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు… బూతుల షోలుగా ఎంత ప్రసిద్ధి పొందినా సరే, జనం చూస్తూనే ఉన్నారు… ఈటీవీ వాటిని అలాగే కొనసాగిస్తూనే ఉంది… ఆ షోలోకి కమెడియన్లు, జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… కానీ బేసిక్‌గా దాని ఫార్మాట్ మారదు… కాకపోతే ఒకప్పుడు స్కిట్‌ను స్కిట్‌గా ప్రదర్శించేవాళ్లు… ఇప్పుడు బాడీ షేమింగులు, ర్యాగింగ్ డైలాగులు ఎట్సెట్రా జోకులుగా చలామణీ అవుతున్నాయి… ఈ షోలు ఎంత నాసిరకంగా మారిపోతున్నా సరే… వేరే […]
సీబీఐ విచారణ గదిలో మీడియా సీక్రెట్ గొట్టాలు… చూసినట్టే రిపోర్టింగ్…
‘సౌత్ గ్రూపు’తో సంబంధమేమిటి..?… సాక్షి… పదిఫోన్లు ఎందుకు మార్చారు… వెలుగు… సెల్ ఫోన్ల ధ్వంసమేల..? ఆంధ్రజ్యోతి… ఇలా రకరకాల పత్రికలు సీబీఐ టీం ఎమ్మెల్సీ కవితను ఏమేం ప్రశ్నలు అడిగాయో రాసిపారేశాయి… అసలు ఈ విచారణకు లైవ్‌లో ప్రసారం చేయాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిన్న చేసిన డిమాండే పెద్ద నవ్వులాట అయిపోయింది… చివరకు ఆ పార్టీ దురవస్థ అది… మీడియా కథనాలు కూడా నారాయణ బాటలోనే ఉన్నాయి… ఆరు గంటలా..? ఏడు గంటలా..? విచారణ జరుగుతున్నంతసేపూ సినిమాల్లో […]
అడ్డమైన గ్రాఫిక్స్ వచ్చి… మన ఇమేజీ దెబ్బతినిపోయిందోయ్… ఏం చేద్దాం…
సాక్షి Yaseen Shaikh ది మంచి వెటకారం, వ్యంగ్యం, శ్లేష దట్టించిన కలం… మొదలుపెడితే చాలు, అలా నవ్విస్తూ సాగిపోతుంది… కానీ చాన్నాళ్లయింది తనను చూసి… చదివి… మళ్లీ ఎఫ్బీలో కనిపించింది తాజాగా… షేర్ చేయకుండా ఉండలేం… మీరూ ఎంజాయ్ చేయండి… ఎఫ్బ రైటింగ్సులో తోపులం అనుకునేవాళ్లు ఖచ్చితంగా చదవాలి సుమా… సినీమృగాయణం! ‘ఓసోసీ పిల్ల ఖోడి ఫ్ఫెఠ్ఠా’ పాట దూరంగా వినిపిస్తుండగా పరవశించింది కోడి. ‘‘నా జాతిజనులు పాడుకునే జాగృతీ గీతంగా ఈ పాట ఎప్పటికీ నిలచిపోవాల’’ని […]
తెలంగాణ కంచి… ఈ వరదరాజపురం గుడికి వందలేళ్ల నాటి ఓ కథ ఉంది…
శారదా వాసుదేవ్ తన వాల్ మీద రాసుకొచ్చిన ఓ స్టోరీ ఆసక్తికరంగా అనిపించింది… ఏ గుడికైనా రకరకాల స్థలపురాణాలు ఉంటాయి… అందులో అధికశాతం నమ్మబుల్‌గా ఉండవు… కానీ ఇదెందుకో కనెక్టింగ్… ఆమె రాసింది యథాతథంగా ఇక్కడ పెట్టలేం… అంటే స్టార్ గుర్తులు అడ్డుతగులుతాయి… మన భాషలో మనం చదువుకుందాం… గుండెలపై కాదు… తలపై కుంపటి,.. అది తెలంగాణ కంచి… శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం… హైదరాబాద్‌కు దగ్గరలోనే ఉంది… ఎలా వెళ్లాలో తెలుసా..? ఈసీఐఎల్ క్రాస్ […]
రైలు స్టేషన్ చేరింది… బెర్తు మీద ఆయన చనిపోయి ఉన్నారు…
A WORLD CLASS WRITER OF OUR TIME…. డి సెంబర్ 9 అల్లం శేషగిరిరావు పుట్టినరోజు… విశాఖ అంటే సముద్రమూ, ఆంధ్రా యూనివర్సిటీ, యారాడకొండ మదిలో మెదిలినట్టే , తెలుగులో వేట కథలు అంటే పూసపాటి కృష్ణంరాజు, అల్లం శేషగిరిరావు, కే ఎన్ వై పతంజలి గుర్తొస్తారు. శేషగిరిరావు, ఆయన కథలు నాకు బాగా తెలుసు. ఆయనకి నేను కొద్దిగా తెలుసు. ఆయన తక్కువ మాట్లాడతారు. ‘రావోయి చాయ్ తాగుదాం’ అని కబుర్లు కొట్టే రకం కాదు. […]
బండి ఎద్దుకు బాగా బలిసింది… డైపర్లు కడితేనే ఆ వీథిలోకి రానివ్వండి…
నిన్న పొద్దుణ్నుంచీ ఎదురు చూస్తున్నా… ప్చ్, ఈ వార్త మీద సోషల్ మీడియా, టీవీ మీడియా, సైట్స్ ఏమైనా స్పందిస్తాయేమో, ఏమైనా రాస్తాయేమో అని… నిరాశే… అసలు ఈ పత్రికే ఇంకాస్త ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది… సరే, వాళ్ల పత్రిక, వాళ్లిష్టం… కానీ మనం ఎలాంటి పాలన వాతావరణంలో బతుకుతున్నామో సరిగ్గా అర్థమై ఓరకమైన వైరాగ్యం ఆవరిస్తుంది మనకు… పాలితుడంటే పాలకులకు ఎంత అలుసో అర్థమవుతుంది… పాలితుడంటే సగటు మనిషి, పాలకుడు అంటే పోలీస్, ఉన్నతాధికారులు, నాయకులు… […]
శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
హఠాత్తుగా చుట్టుముట్టిన వరద… ఓ మనిషి తను ముందుజాగ్రత్తగా ఇంటి వద్ద ఉంచుకున్న పడవలో కుటుంబసభ్యుల్ని, పశువుల్ని ఎక్కించాడు… వరద ఉధృతి పెరుగుతోంది… పడవ కొట్టుకుపోసాగింది… బరువు ఎక్కువై మునక ప్రారంభమైంది… జెట్టీసన్ (ఈ పదం ఇక్కడ వాడొచ్చా)… తప్పదు… బతికుంటే పశువుల్ని కొత్తవి కొనుక్కోవచ్చు అని పాడిగేదెల్ని, ఎద్దులను వరదలోకి తోసేశాడు… తరువాత పెంపుడు జంతువులను కూడా… ఇంకా బరువు తగ్గాలి… ఆ మనిషి చూపు అమ్మ, అయ్య మీద పడింది… రోజూ తిండి దండుగ […]
కళ్లు కుట్టే వైభోగం నుంచి కడతేరిపోయే వైరాగ్యం దాకా… నీ లైఫే ఓ లెసన్..!
Taadi Prakash…. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెర మీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన శృంగార మందుపాతర! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! ఆ కిక్కే వేరు. స్మిత మరణ వార్త తెలిసి అక్కడికి వెళ్ళిన తోట భావనారాయణ చిట్టచివరి దృశ్యాన్ని ఒక […]
డీజే టిల్లు సిద్ధూకు ఏమైంది..? హీరోయిన్లందరూ ఎందుకు తిరస్కరిస్తున్నారు..!!
చిన్న హీరో… అకస్మాత్తుగా ఓ పెద్ద విజయం… కొన్నిసార్లు అలా లాటరీ తగుల్తుంది… అలాగని ఇక నేనే తోపు అనుకుంటే, అలాగే వ్యవహరిస్తే చిక్కులొస్తయ్… దురదృష్టం కొద్దీ మన విష్వక్సేనులకు, మన జొన్నలగడ్డ సిద్ధులకు ఆ సోయి లేదు… డీజే టిల్లు అనుకోకుండా హిట్… ఆ దర్శకుడు టైటిల్ సాంగ్ ట్యూన్ భలే కుదిరేసరికి, దాన్నే దాదాపు బీజీఎంగా వాడుతూ సినిమా చివరిదాకా కొట్టాడు… కథ, కథనాల్లో లాజిక్కుల మాటెలా ఉన్నా, ప్రేక్షకులకు కొత్తగా నచ్చేసింది… సిద్ధూ […]
ఈనాడు ఒక్కటే మిగిల్చారు… సార్, సండే మ్యాగజైన్ ఉంచేస్తారు కదా…
చాలారోజుల నుంచి వింటున్నదే… ఈనాడు అన్నదాత మ్యాగజైన్ సిబ్బందిని అక్కడి నుంచి మార్చినప్పుడే అర్థమైంది దాన్ని ఎత్తేస్తున్నారని… సింపుల్, ఈనాడు గ్రూపే కాదు, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా సరే అంతే… ఇన్నాళ్లు పాడిగేదెలా పాలిచ్చింది అన్నదాత అనే మ్యాగజైన్… కానీ ఇప్పుడది వట్టిపోయింది… దాణా ఖర్చు ఎక్కువ, పాలు తక్కువ… ఇంకేముంది..? కబేళాకు తరలించేశారు… (పత్రికను కార్పొరేట్ కంపెనీ అనవచ్చా అని అమాయకంగా అడక్కండి… ఒకింత ఎక్కువే)… ప్రింట్ మీడియాకు గడ్డురోజులు అని ఆ ఫీల్డు […]
సిద్ధరామయ్య బయోపిక్… ఆ పాత్రలో విజయ్ సేతుపతి… ఇమేజీ బిల్డింగ్ పాట్లు…
కొందరి జీవితకథల్ని వాళ్ల తదనంతరం ఎవరో రాస్తారు… కొందరు తామే రాయించుకుంటారు బతికి ఉన్నప్పుడే… ఇంకొందరైతైే తామే రాసుకుంటారు… సహజంగా ప్లస్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటారు… మైనస్ పాయింట్స్ పరిహరిస్తారు… సహజమే… బయోపిక్స్ మాటేమిటి..? అవీ అంతే… కానీ బయోపిక్ తీయించుకోబడటానికి అర్హత ఏమిటి..? మామూలుగానైతే భిన్నమైన రంగాల్లో అసాధారణ కృషి చేయడం, మంచి విజయాలు సాధించడం, లెజెండరీ స్టేటస్ పొందడం, సొసైటీలో మంచి పేరు గడించడం… స్పూర్తిదాయకంగా జీవితాలు గడపడం… ఇలాంటివే కదా… ఇందులో ముఖ్యమంత్రి […]
- « Previous Page
- 1
- …
- 77
- 78
- 79
- 80
- 81
- …
- 108
- Next Page »