టీవీ9 మీద ఏ చిన్న సందు దొరికినా సరే విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది… ప్రేక్షకుల్లో ఈ టీవీ కవరేజీ తీరు పట్ల అసహనం స్పష్టంగానే కనిపిస్తుంది… పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవాళ్లకే రుధిరం, పోస్కోల భాష తప్ప ఇంకేమీ తెలియదంటే ప్రజల్లో ఈ చులకనభావం ఏర్పడటం సహజమే అనుకుందాం… పైగా స్టోరీ ప్రజెంటేషన్‌లో చిత్రవిచిత్ర ప్రయోగాలు కూడా టీవీ9ను మరింత చులకన చేశాయి… వెరసి నెంబర్‌టూ ప్లేసుకు పడిపోయింది… ఈరోజు టీవీ9 మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ […]
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని అనసూయ ఉయికే..? ఇంతకీ ఎవరీమె..!!
సరిగ్గా అయిదేళ్ల క్రితం… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా రామనాథ్ కోవింద్‌ను కలిశాడు… పుష్పగుచ్ఛం ఇచ్చాడు… భేటీ వేశాడు… సాయిరెడ్డి బీహార్ గవర్నర్‌గా ఉన్న రామనాథ్‌ను కలవడం ఏమిటబ్బా అనుకున్నారు అందరూ… ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాథ్ కోవింద్‌ను మోడీ ఎంపిక చేస్తాడని జగన్‌కు ముందే తెలుసా..? అందుకే సాయిరెడ్డి ముందే వెళ్లి తనతో భేటీ వేసి, సంప్రదింపులు జరిపాడా..? ఏంటీ కథ..? ఏంటీ..?’’ అని అప్పట్లో ఫేస్బుక్ పోస్టింగ్స్ కూడా పెట్టుకున్నాం… అనుకున్నట్టే జరిగింది… రామనాథ్ కోవిందే […]
ఇప్పుడు అర్జెంటుగా ఓ రాష్ట్రపతి అభ్యర్థి కావలెను..!
ఫరూఖ్ అబ్దుల్లా… వయస్సు 84 దాటింది… ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఉంటాడట… వీలైతే ప్రధాని పోస్టు బెటర్ తప్ప రాష్ట్రపతి పదవి వద్దేవద్దట… శరద్ పవార్… వయస్సు 81 దాటింది… సేమ్ ఆలోచనలు… అప్పుడే నాకు వయస్సు అయిపోలేదు అంటున్నాడు… వస్తే గిస్తే ప్రధాని పదవే కావాలట… ఫాఫం… దేశమంతా జల్లెడపడుతున్నా సరే విపక్షాలకు సరైన రాష్ట్రపతి అభ్యర్థి దొరకడం లేదు… ఏమి సేతురా లింగా అనుకుని చివరకు మళ్లీ ఆ గోపాలకృష్ణ గాంధీ అనబడే ఓ […]
ఔనా..? ముత్తయిదువలు గుళ్లల్లో గుండు గీయించుకుంటే అరిష్టమా..?!
అసలు తిరుపతిలోనే కాదు… ప్రతి ప్రముఖ దేవాలయాల దగ్గర కల్యాణకట్టలు ఉంటయ్… జాతరల దగ్గర కూడా చూస్తుంటాం… పురుషులు, మహిళలు, పిల్లాపీచు తలనీలాలు తీయించుకుంటూనే ఉంటారు… గుండు కొట్టించామని చెప్పడానికి నాలుగు వెంట్రుకలు తీసుకెళ్లి హుండీలో కూడా వేస్తుంటారు… ఇక్కడ పురుషులు, మహిళలు అనే తేడా కనిపించదు… కాకపోతే పొడవైన జుట్టు దేవుడికి ఇచ్చేస్తే, మళ్లీ అంత పొడవు పెరగడానికి ఎంతకాలం పడుతుందో అనే సందేహంతో వెనుకాడుతుంటారు కొందరు… కొందరైతే పాపిష్టి జుట్టు ఉంటే ఎంత..? పోతే […]
హేమయ్యా పరిమళ్ నత్వానీ… హేమిటిది..? ఏ క్యాహై అంబానీ సాబ్..?!
అందరికీ తెలిసిన సమాచారం ఏమిటి..? విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తోంది… నిజానికి పెద్ద పార్టీ కాంగ్రెస్ ఈ పనిచేయాలి… చేయలేకపోతోంది… మమత చేస్తోంది… ప్రజాస్వామిక స్పూర్తి ఏమిటంటే గెలిచినా ఓడినా సరే, పోటీపడాలి… సో, మమత రాజకీయ ప్రయత్నాల్ని ఖండించాల్సిన పనిలేదు… కానీ ఆమెకు ఆ క్రెడిబులిటీ లేదు… శరద్ పవార్‌ను పెట్టాలని అనుకున్నారు… తను ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఉండాలట… ఓడిపోయే పోటీ వద్దట… అంటే ముందుగానే మోడీ అభ్యర్థి […]
అబ్బాయిని కిడ్నాప్ చేశారు… అర్జెంటుగా పిల్లనిచ్చి పెళ్లిచేశారు…
అనేక రకాల పెళ్లిళ్లు ఉంటాయి… మహిళల్ని నిర్బంధంగా పెళ్లిచేసుకునే ఉదాహరణలు కోకొల్లలు… వాటికి రాక్షస వివాహమనో, పిశాచ వివాహమనో పేర్లు పెట్టారు… మరి మగవాడికి నిర్బంధంగా పెళ్లిచేస్తే దాన్నేమనాలి..? ఎత్తుకుపోయి, మెడ మీద కత్తిపెట్టి, తాళి కట్టిస్తే దాన్ని ఏమంటారు..? బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇలాంటి పెళ్లిళ్లను పకడ్వా పెళ్లిళ్లు అంటారు… యుక్త వయస్సు వచ్చిన అబ్బాయిల్ని కాపాడుకోవడం కొన్ని జిల్లాల్లో తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష… ఇప్పుడు ఇలాంటి పెళ్లి ఒకటి వార్తల్లోకి వచ్చింది… బెగూసరై […]
ఫాఫం… ఈయన రాష్ట్రపతి అభ్యర్థి అట… దివాలా తీసిన ఈ దేశవిపక్షాలు…!?
ఎవరు సార్… విపక్షాలు రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాయట ఆయన్ని… పేరు గోపాలకృష్ణ గాంధీ అట… తను కూడా గాంధీ పేరుతో చెలామణీ అయ్యే నెహ్రూ కుటుంబ వారసుడా..? అదే బాటలో ప్రయాణించే మరొకరా అనడిగాడు ఓ మిత్రుడు… అరె, గాంధీ మనమడు గుర్తుపట్టలేదా అన్నాను నేను… ఓహో, ఆ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రక్త వారసులూ ఉన్నారా అన్నాడు తను… అదేమిటి అంత మాటనేశావ్ అన్నాను… అవునూ, ఇంతకీ ఎవరీ గాంధీ..? కొత్త జనరేషన్‌కు […]
చంద్రముఖి పేరు చెప్పుకుని… సీక్వెల్ కాయలు అమ్మేస్తున్నారు…
ఫాఫం చంద్రముఖి…! ఓ పోస్టర్ చూడగానే అనిపించింది ఇలాగే..! సదరు పోస్టర్ వార్తేమిటీ అంటే… లారెన్స్ ప్రధానపాత్రలో చంద్రముఖి-2 వస్తోందట… అది సీక్వెలా..? లేక వేరే కథకు ఈ పేరు పెట్టుకుని ‘కాయలమ్ముకుంటారా’ అనేది వేచిచూడాలి… కానీ ఎందుకు జాలేసిందో చెప్పుకోవడానికి మనం కేరళ వెళ్లాలి… రకరకాల కథలు, ప్రయోగాలు, చౌక ఖర్చు, వేగంగా నిర్మాణం, నో రిస్క్ ఇవన్నీ ఒకప్పటి మలయాళ సినిమా విశేషాలు… మణిచిత్రతాజు సినిమా కూడా ఆ కోవలోనిదే… 1993లో… మోహన్‌లాల్ హీరోగా, […]
చే గువెరా..! ఈ ఆరాధనలేమిటి..? ఈ మూఢభక్తి ఏమిటి..? అసలు తనెవరు..?!
Jagannadh Goud………… చేగువేరా మనకెందుకు..? అక్కడక్కడా కొందరు పోరగాళ్ళు బైక్ లకి చేగువేరా స్టిక్కర్‌కు, T- షర్ట్స్ కి చేగువేరా బొమ్మలు తెలిసి వేసుకుంటరో, తెలియక వేసుకుంటరో తెలియదు. భగత్ సింగ్, రాజ్ గురూ, సుభాష్ చంద్ర బోస్ స్టిక్కర్స్ వేసుకోండ్రా అయ్యా, ఆ గెవెరా బొమ్మలెందుకు..? మనకు అవసరమా అన్నది భారత యువత ఆలోచించాలి. అసలు తన పేరు కూడా అది కాదు, ఊడబొడిచింది కూడా ఏమీ లేదు. అసలు చేగువేరా ఎవరు.? ఏమి చేశాడు..? […]
స్వేచ్ఛా భారతంలో తొలి దేశద్రోహం కేసు గౌరవం పొందిన తొలి సంపాదకుడు..!
Taadi Prakash….. భారతీయ జర్నలిజాన్ని ఎత్తుకుని పెంచిన పెదనాన్న టిజెఎస్ జార్జి! ………………………………………… A BOMBSHELL IN A NUTSHELL ——————————————— దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి నను జూసి నవ్వింది కవిత్వం నీలాకాశం నుంచి గంధర్వగానాన్ని మోసుకొచ్చి నా దోసిలి నింపింది సంగీతం కరుణ లేని ఈ లోకంలో మనిషికి చివరికి మిగిలేవి కాసిని కన్నీళ్ళేనని చెప్పింది సాహిత్యం గాయాలపాలవుతున్న నా గుండెలకు పరిమళిస్తున్న పూలతో కట్లు కట్టింది మాత్రం జర్నలిజం… తెలుగు జర్నలిజంలో […]
పెద్ద మెదడులో డబ్బు.., చిన్న మెదడులో ఆడదాని బొడ్డు… మెదడే అక్కర్లేని ఓ బుక్కు…
ఒకసారి పేరొస్తే చాలు… ఇక తను ఏం చేసినా చెల్లుబాటే… ఆహా ఓహో అని చప్పట్లే… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన హిపోక్రసీ.., పదునైన విమర్శ ఉండదు, పనికొచ్చే సమీక్ష ఉండదు, బట్టలిప్పి నిజస్వరూపం చూపించే ఒక్క అభిప్రాయమూ బయటికి రాదు… రానివ్వరు… ఇక్కడ డప్పులు, డబ్బులు మాత్రమే… పాదదాస్యాలు, పాదతీర్థ సేవనాలు తప్ప ఇంకేమీ కనిపించవు… ఇండస్ట్రీ పారేసే బిస్కెట్ల మీద మీడియాకు అమితమైన ప్రేమ… ‘కవరేజీ’ కక్కుర్తి బతుకుల్లో వీసమెత్తు నిజాయితీ కనిపించని దురవస్థ… […]
టెన్త్ ఫలితాల్లో జగన్ ఫెయిల్… సరే, అస్సాంలో సీఎం కూడా అంతేనా..?!
ఎవరూ తక్కువ కాదు… ఒకరి రాజకీయం క్షుద్రం, ఇంకొకరిది అతిక్షుద్రం… పెద్ద తేడా ఏమీ కనిపించదు ఏపీ పాలిటిక్సులో… టెన్త్ పాస్ పర్సంటేజీ మీద బజారులోని బురదనంతా ఎత్తిపోసుకున్నాయి కదా… నిజంగానే జగన్ తనే స్వయంగా పేపర్లు దిద్ది, కసికసిగా తక్కువ మార్కులేసి, ఫెయిల్ చేసి ఉంటాడా..? లేక ముందుగానే టీడీపీ కుటుంబాల పిల్లల్ని ఐడెంటిఫై చేసి, వాళ్లను ఫెయిల్ చేయాలని మౌఖికంగా అధికారుల్ని ఆదేశించి ఉంటాడా..? అనే రేంజులో టీడీపీ విరుచుకుపడింది… ఫోఫోవోయ్, నీ పాలనలో […]
బన్నీకి మాత్రమే కాదు… మహేశ్ బాబుకు కూడా లీగల్ చిక్కులు తప్పవు…
హీరో బన్నీ మీద కేసు పెట్టడం కరెక్టేనా..? తను చేసిన తప్పేముంది..? తను శిక్షార్హుడేనా..? అనడిగాడు ఓ మిత్రుడు… దీనికి సమాధానం ఏమిటంటే..? బన్నీ శిక్షార్హుడే… తనే కాదు, మహేశ్ బాబు కూడా ఇలాంటి లీగల్ చిక్కులు తప్పకపోవచ్చు… వివరాల్లోకి వెళ్తే… కొద్దిరోజుల క్రితం రాపిడో యాడ్ చేశాడు బన్నీ… అందులో సిటీ బస్సులను తక్కువ చేసి చూపించడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహించాడు… నిజానికి ఓ ప్రభుత్వ రంగ సంస్థను కించపరుస్తూ తమ గురించి డప్పు […]
వారెవ్వా కామ్రేడ్ సీఎం… ఆ దుబయ్ బంగారం వెనుక అంతా తమరేనా..?!
పార్ధసారధి పోట్లూరి ….. 2020, జులై 5 న… మొదటిసారిగా వెలుగు చూసిన కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో అప్పట్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైపే అన్ని ఆధారాలు చూపబడ్డాయి కానీ విజయన్ వాటిని ఖండించిన సంగతి తెలిసిందే !.అయితే ఈ దుబాయి బంగారం స్మగ్లింగ్ కేసులో అప్పట్లో ప్రముఖంగా వినిపించిన పేరు స్వప్న సురేష్ సెక్షన్ 165 ప్రకారం వాంగ్మూలంని కోర్టులో వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు NIA ఈ కేసుని విచారిస్తున్నది. […]
నోకియా… Unable to connect people…. కానీ ఎందుకిలా…?!
Jagannadh Goud…….. నోకియా – ఎత్తుపల్లాల ప్రస్థానం: 1998 లో ప్రపంచం మొత్తంలో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగంలో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100”. 2007 ప్రారంభంలో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటంతో ప్రపంచ మార్కెట్ లో నోకియా […]
అంతటి సూర్యకాంతం నోరుమూగబోయిన ఆ చివరి రోజున…
Taadi Prakash ……… SURYAKANTHAM :The last journey of the greatest star of our silver screen నటి సూర్యకాంతం 1924 అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద ఒక శోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. సినిమాలో నటించడం అంటే వ్యభిచారం చేయడంతో సమానం అనుకునే ఆ దుర్మార్గపు రోజుల్లో..15 ఏళ్ల వయసుకే మద్రాసులో అడుగుపెట్టిన సాహసి సూర్యకాంతం. ఆమె భర్త పేరు పెద్దిభొట్ల చలపతిరావు. 70 సంవత్సరాలు జీవించిన సూర్యాకాంతం మనకి స్వయానా […]
మంచు మళ్లీ ఏసేశాడు..! ఈసారి కోన వెంకటయ్య తోడయ్యాడు…!!
ట్రోలర్స్‌కు అత్యంత ఇష్టుడు… మంచు విష్ణు… సన్నాఫ్ మోహన్‌బాబు… వీళ్ల మాటలు, వీళ్ల చేష్టలు కొన్నిసార్లు నవ్వు కాదు, జాలి పుట్టిస్తుంటయ్… కనీసం జనం ఏమనుకుంటారనే స్పృహ కూడా ఉండదు… మా ఎన్నికల సమయంలో ఎన్నెన్ని ఆణిముత్యాలు వాళ్ల ప్రసంగాలు..? టంగుటూరి వీరేసం పెకాహం పంతులు అని నోరు తిరగని ఉచ్ఛారణతో విపరీతంగా ట్రోలైన విష్ణు… ఆమధ్య ఏదో ‘ఎప్పటికయ్యదమప్పటికి’ అని విచిత్రమైన తెలుగు పద్యం తను చదివిన తీరు మాత్రం నభూతో… నభవిష్యత్ అని చెప్పలేం… […]
నయనతార మీద యాక్షన్ తీసుకుంటారట… ఇంకేం చేతనవుతుంది మరి…!!
మీడియా చాలా వార్తలు రాస్తుంది… ఓ సెన్సేషన్ అనుకున్నప్పుడు, ఓ సెలబ్రిటీకి సంబంధించిన కంట్రవర్సీ వార్త దొరికినప్పుడు అతిగా స్పందిస్తుంది… దాన్నే ఓవరాక్షన్ అంటాం… కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్లు అవి చూసి, చదివి అంగీలు చింపుకోవద్దు… చింపుకుంటే మన కాళ్ల మీదే పడేది… దురదృష్టం కొద్దీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఏ ముఖ్య అధికారికి ఈ పాలనపరమైన పరిణతి గానీ, సోయి గానీ ఉన్నట్టు కనిపించదు… చేయకూడనివి చేసేస్తూ ఉంటారు… చేయదగినవి అస్సలు పట్టించుకోరు… ఇదీ […]
వెంకయ్యనాయుడిపై ఈనాడుకు మస్తు లవ్వు… అదీ అసలు సెంటిమెంట్…
అవసరమైన వార్తల విషయంలో గింజుకుంటున్న ఈనాడు ఈమధ్య వింత, తిక్క వార్తల విషయంలో మాత్రం ముందుంటోంది… రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది… సహజంగానే ఇది మోడీ ప్రభుత్వానికి ప్రిస్టేజియస్… సరిపడా సంఖ్యాబలం లేకపోయినా తమ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవాలి… అదీ అవసరం… ఈ నేపథ్యంలో ఈనాడు సైట్లో కనిపించిన ఓ సెంటి‘మెంటల్’ వార్త నవ్వు పుట్టించేలా ఉంది… ఆ సెంటిమెంట్ ఫలిస్తే వెంకయ్యనాయుడే తదుపరి రాష్ట్రపతి అనే హెడింగ్తో ఉంది ఆ వార్త… ఏమిటా సెంటిమెంట్ అంటే..? […]
హబ్బ… హేం సినిమా తీసినవ్ నానీ… ఎక్కడో పూర్తిగా దారితప్పిపోయినవ్…
సగటు హిందూ కుటుంబం అంటే అది బ్రాహ్మణ కుటుంబమే అయి ఉండాలా..? అందులోనూ ఓ సగటు బ్రాహ్మణ కుటుంబం అనగానే మూఢనమ్మకాలు, మితిమీరిన ఆచారాలు, మడి, ఛాందసపోకడలు చూపించాలా..? నామాలు, బొట్టు, జంధ్యం, ఒకరకమైన యాస భాష ఎట్సెట్రా బ్రాండెడ్ లక్షణాలు ఉండి తీరాలా..? ఇతర మతాలను ఈసడించుకునే తత్వాన్ని రుద్దాలా..? ఆధునికతకు ఆమడదూరంలో ఉన్నట్టుగా చిత్రీకరించాలా..? ఎల్లరకూ ఆ కులమే అలుసుగా దొరుకునేల..?! ఏమో, నాని కులం, వివేక్ ఆత్రేయ కులం ఏమిటో తెలియదు… అంటే […]
- « Previous Page
- 1
- …
- 82
- 83
- 84
- 85
- 86
- …
- 108
- Next Page »