S.P బాలసుబ్రహ్మణ్యం మృతి సందర్భంగా కొందరు పనిగట్టుకుని మరీ సామాజిక మాధ్యమాలలోనూ, ఇతరత్రా అనవసరమైన వివాదాలు సృష్టించారు. ఆయన బ్రాహ్మణీయ సంస్కృతికి సమర్థకుడనీ, ఆయనకు కులతత్వం ఉందనీ విమర్శలెన్నో చేశారు… ఇప్పుడు కాశీనాథుని విశ్వనాథ్ మరణించాక అదే రచ్చ… బ్రాహ్మణీయ సినిమాలు తీశాడని సోషల్ మీడియాలో ఒకటే వాగ్వాదాలు… అసలు విశ్వనాథ్ బ్రాహ్మణుడేనా..? ఇదీ ఒక ప్రశ్న… సుబ్రహ్మణ్యం పుట్టుక రీత్యా ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు… సుబ్రహ్మణ్యం, విశ్వనాథ్ బంధువులు… అలాంటప్పుడు విశ్వనాథ్ వైదిక బ్రాహ్మణుడెలా […]
చివరకు రాఘవ కూడా సోయి తప్పాడు… సుడిగాలి సుధీర్‌పై చెత్త వ్యాఖ్యలు…
ఒక్కొక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు… నానాటికీ నాసిరకం సరుకు నిండిపోతోంది… టీవీ రేటింగ్స్ ఢమాల్ ఢమాల్ అని పడిపోతున్నయ్… ఐనా సరే, జబర్దస్త్ నిర్మాతలకు సోయి లేదు, అక్కడ మిగిలిపోయిన వాళ్లకూ లేదు… అసలే అంతంతమాత్రంగా ప్రజాదరణ ఉన్నప్పుడు కాస్త మనసు పెట్టి మంచి స్కిట్స్ చేయాలి… థర్డ్ రేట్ కామెడీతో విసిగిస్తూ, మరోవైపు వెళ్లిపోయిన వాళ్ల మీద వెకిలి వ్యాఖ్యలు దేనికో మల్లెమాల ప్రొడక్షన్స్‌కే తెలియాలి… 9వ తేదీ ప్రసారం కాబోయే జబర్దస్త్ ప్రోమో ఒకటి విడుదలైంది… […]
అంబడిపూడి… ప్రపంచంలో ఏ విషయం మీదనైనా సరే నిమిషాల్లో పుస్తకం రెడీ…
Bharadwaja Rangavajhala………. అంబడిపూడి ….. ఈ పేరు డెబ్బైల్లో చాలా పాపులర్ . టీవీలు రాని రోజులవి. ఇంట్లో ఉంటే రేడియో ప్లస్ పుస్తకాలు … బయటకు వెళ్తే కేవలం పుస్తకాలే అప్పుడు. బస్సుల్లోనూ రైళ్లలోనూ లాంగ్ జర్నీ చేసే వాళ్లందరూ ఓ నవల పట్టుకుని ఎక్కేసేవాళ్లు. నేను చదివిన చాలా నవలలు అలా దారి ఖర్చుగా నమిలినవే. ముఖ్యంగా బస్టాండుల్లో పుస్తకాల షాపుల దగ్గర సేల్స్ చాలా బాగుండేది. మధుబాబు, కొమ్మూరి సాంబశివరావుల డిటెక్టివ్ నవలలకు […]
అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
సూర్యకాంతం… ఈ మాట వినగానే తెలుగువాడు మొహం చిట్లిస్తాడు… తిట్టిపోస్తాడు… ఎవరూ ఆ పేరును పిల్లలకు పెట్టుకోరు… సగటు లేడీ విలన్‌కు ప్రతీక… ప్రతి సినిమాలోనూ ఆమెకు అలాంటి పాత్రలే చేసీ చేసీ ఆమె ఓ క్రూరురాలు అయిపోయింది… కోడళ్లను రాసిరంపాన పెట్టే ధూర్త అత్తగారు అయిపోయింది… ఆ పాత్రల్నీ ఇరగ్గొట్టి ఆమె అఖండమైన పేరు సంపాదించుకుంది, అది వేరే కథ… సేమ్, రామాయణం అనగానే రావణుడికన్నా జనం అందరూ తిట్టిపోసేది కైకేయిని… సీతమ్మ కష్టాలు చూస్తూ, […]
మంచు మోహన్‌లాల్… పేరుకు స్టారాధిస్టారుడే… పల్లీబఠానీ వసూళ్లు…
ఆమధ్య మంచు విష్ణు సినిమా ఒకటి వచ్చింది… దాని పేరు జిన్నా… మాంచి కసి హీరోయిన్లు సన్నీ లియోని, పాయల్ ఉన్నారు… కాస్తో కూస్తో కామెడీ ఉంది… అయితేనేం, టాలీవుడ్ ఈమధ్యకాలంలో ఎరుగనంత డిజాస్టర్ అది… కొన్నిరోజులైతే థియేటర్ల సింపుల్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాలేదు… జీరో షేర్… ప్రేక్షకులు అడ్డంగా ఈడ్చి తన్నడం అంటారు దాన్ని… అంతకుముందు మంచు మోహన్‌బాబు సినిమా ఒకటి కూడా అంతే… అది మరీ దారుణాతిఘోరం… హిందీకి వెళ్తే కంగనా రనౌత్ […]
ఆకుపూజ చేయించారా..? పారేయకండి… ఔషధాహారం చేయొచ్చు…
నిజమే… ఏదో గ్రూపులో చూశాను ఈ పోస్టు… చాన్నాళ్లయింది, సరిగ్గా గుర్తులేదు… అకస్మాత్తుగా కనిపించింది… Sundari Vedula పోస్టు… ఎందుకు ఇంట్రస్టింగు అనిపించిందంటే…. చాలామంది హనుమంతుడికి ఆకుపూజ చేయిస్తుంటారు… ఆ తమలపాకులు మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం… వాటిని ఏం చేసుకోవాలి… ఎవరికి పంచిపెట్టినా ఎవరూ తీసుకోరు, తీసుకున్నా వాడరు… ఇప్పుడు తాంబూలం ఎవరు వేసుకుంటున్నారు గనుక… అందుకే ఆరోగ్యం కూడా ప్రసాదించే ఓ రెసిపీ చెబుతున్నదామె… అవే తాంబూలపు ఉండలు… కావల్సినవి ఏమిటంటే… శుభ్రంగా ఉప్పునీటిలో కడిగి, […]
పది మార్కుల ప్రశ్న…! ఆర్ఆర్ఆర్ నిర్మాత ఎవరు..? ఏమైపోయాడు..?
ఎవరో అడిగారు… ఆర్ఆర్ఆర్ నిర్మాత ఎవరు..? చటుక్కున గుర్తురాలేదు… దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ వంటి నిర్మాతలైతే గుర్తొచ్చేదేమో… సినిమా ప్రమోషన్లలో, వసూళ్ల సక్సెస్ మీట్లలో, ఆడియో రిలీజుల్లో, ప్రిరిలీజ్ ఫంక్షన్లలో, పోస్టర్ విడుదల సమయంలో, టీజర్ల వేళో ఎప్పుడైనా నిర్మాతగా హడావుడి చేసి ఉంటే మన మైండ్లలో ఇంప్రెషన్ పడి ఉండేది… కానీ… ఆర్ఆర్ఆర్ అంటే జస్ట్, రాజమౌళి… తరువాత రాంచరణ్, జూనియర్… ఈమధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చాక నాటు కీరవాణి… అంతే, ఇక […]
ఆర్నబ్‌కు చేతకాలేదు… పాల్కీ శర్మ… అనిల్ ఆంటోనీ… వీళ్లే బీబీసీ బట్టలిప్పారు…
పాల్కీ శర్మ… ఇంగ్లిష్ టీవీల్లో న్యూస్, విశ్లేషణలు చూసే ప్రేక్షకులు బాగా ఆదరించి పేరు… ఆమె వ్యాఖ్యలకు ఓ క్రెడిబులిటీ ఉంది… తెలుగు టీవీల్లో న్యూస్ విభాగాలు పనిచేసే స్టాఫ్, రుధిర ప్రజెంటర్లు, పౌడర్ దిగ్గజాలు, పోస్కో పెద్ద తలకాయలు గట్రా ఆమెకు కనీసం ఓ వంద మైళ్ల దూరంలో ఉంటారేమో… కయ్ కయ్ అని హైపిచ్‌లో అరిచే ఆర్నబ్కన్నా కూడా చాలారెట్లు నయం ఆమె… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దానికి ఓ నేపథ్యం ఉంది… ఎన్డీటీవీని […]
గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)
మంథర ——– చక్కగా, వేగంగా సాగిపోతున్న రథచక్రానికి చీల జారిపోతుందని తెలిసి, వెంటనే పరుగెత్తి ఆ చీలను సరిచేసి, చక్రం ఊడిపోకుండా, రథం పడిపోకుండా చేసే మంచి వాళ్లు ఉన్నట్లే- ఎక్కడో ఒక మూల దాగి, చక్రానికున్న చీలను ఊడబెరికి, రథాన్ని పడదోయడానికి ప్రయత్నించే చెడ్డవాళ్లు కూడా లోకంలో ఉంటారు. శ్రీమద్రామాయణంలో మంథర ఒక దాసి. కైక పుట్టింటి నుండి అరణంగా వచ్చిన దాసి. కైక అంతఃపురంలోనే ఉండే దాసి. ఈ దాసి చాటు మాటుగా అంతటి […]
రామాయణంలో అసలు ప్రతినాయకి కైకేయి… చివరకు ఆమె ఏమైంది..? (పార్ట్-2)
కైకేయి ——– సాగర సంగమమే చరమ గమ్యంగా సాగిపోతున్న ఒక ఏటి ప్రవాహానికి ఎక్కడో ఒక కొండ అడ్డుతగిలితే, ఆ ప్రవాహం చిందర వందర అవుతుంది. పాయలు పాయలుగా చీలిపోతుంది. చిత్ర విచిత్రాలైన మలుపులు తిరుగుతుంది. ప్రవాహ వైశాల్యం కూడ పెరుగుతుంది. అడ్డుపడిన కొండ వల్ల ఆ ప్రవాహానికి ఇలా జరిగినా, దాని వల్ల లోకానికి మేలే కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రవాహం పాయలుగా చీలి, మలుపులు తిరిగి, విశాలమైనందువల్ల అనేక ప్రాంతాల నీటి సమస్య తీరుతుంది. […]
ఎంగిలి పళ్లు తినిపించింది సరే… తరువాత శబరి ఏమైపోయింది… (పార్ట్-1)
రామాయణం అనగానే…. రాముడు, సోదరులు, తండ్రీ తల్లులు… విలన్లు… అంతేనా..? మరి ఇతర కీలక పాత్రలు జటాయువు, శబరి, గుహుడు, తార, మంథర… వీళ్ల మాటేమిటి..? చివరకు వాళ్లంతా ఏమయ్యారు..? అసలు వాళ్ల పాత్ర చిత్రణ మాటేమిటి..? వాళ్లేమయ్యారు..? ఎవరైనా పట్టించుకున్నారా..? జగనానంద కారకా, జయజానకీనాయకా అని పాడుకోవడమేనా, జనం వాళ్లను పట్టించుకున్నారా..? అసలు కథారచయిత వాల్మీకి పట్టించుకున్నాడా..? కీలకపాత్రలేమయ్యాయి..? అసలు ఆ పాత్రల వైశిష్ట్యం ఏమిటి..? అవి కదా…! పోనీ, మనం ఓసారి ముచ్చటించుకుందామా..? చిన్న […]
మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
చిన్నప్పటి నుంచీ రకరకాల కళారూపాల్లో, మార్గాల్లో రామాయణం వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం… కట్టె, కొట్టె, తెచ్చె అనేంతవరకు అందరికీ తెలుసు రాముడి కథ… కానీ మీకు ఎంతమేరకు తెలుసు..? ఎప్పుడైనా పరీక్షించుకోవాలని అనిపించిందా..? ఇక్కడ 108 ప్రశ్నలున్నయ్… ఓసారి మీకు తెలుసో లేదో పరీక్షించుకొండి… ప్రశ్న, తరువాత జవాబుకు నడుమ కాస్త దూరం ఉంది… అందుకని ప్రశ్న చదివి, మెల్లిగా దిగువకు స్క్రోల్ చేసుకుని జవాబు చూసుకొండి… సులభప్రశ్నలే కాదు, చాలా గొట్టు ప్రశ్నలు కూడా ఉన్నయ్… […]
RRR… చివరకు మిగిలింది ఒకటే… రాజమౌళి మరిచిన చేదునిజం ఏంటంటే…
వస్తే సంతోషం… ఒక భారతీయ సినిమాకు, టెక్నీషియన్లకు ఆస్కార్ అవార్డు వస్తే మస్తు ఖుషీ… అందులోనూ ఓ తెలుగు సినిమాకు వస్తే మరింత ఖుషీ… కానీ లాబీయింగ్, డొంకతిరుగుడు, డబ్బు ఖర్చు, మేనేజింగ్ థింగ్స్ అవార్డులను ప్రభావితం చేసే పక్షంలో వాటికి విలువ ఏముంటుంది..? ఆర్ఆర్ఆర్ విషయంలో జరుగుతున్నది ఇదే… రాజమౌళి అండ్ గ్యాంగ్ అక్కడే అడ్డా వేశారు… ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏ విభాగంలో కూడా ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ లభించలేదు… అదేదో చెల్లో షో […]
అమ్మా అలీదా గువేరా… వీళ్లకు సంఘీభావం చెప్పే అర్హత కూడా లేదమ్మా…
Gurram Seetaramulu………. చేగువేరా బిడ్డ హైదరాబాద్ వస్తోంది అని తెలిసి, అంత గొప్ప యోధుని బిడ్డను చివరిసారిగా చూడాలి అని ఆఘమేఘాల మీద హైదరాబాద్ బయలుదేరా. రవీంద్ర భారతి ముందు ఈ ఇరవై ఏళ్ళలో అన్ని కార్లు ఆగి ఉండడం నేనెప్పుడూ చూడలేదు. మొత్తానికి నిలబడే స్థలం కూడా లేని, కిక్కిరిసిన రవీంద్ర భారతిలో ఒంటికాలి మీద నిలబడి ఒక్కసారి ఆమెను చూసి బయట పడ్డా.. ఐరిష్ మూలాలున్న చే కుటుంబం… లాటిన్ అమెరికాలో స్థిరపడ్డ మెడికో… […]
ప్రొఫెషనల్ డాన్సర్లకు దీటుగా… అదరగొట్టేస్తున్న బీబీజోడి డాన్స్ షో…
నిజానికి చాలారోజులైంది ఈ ప్రోగ్రాం స్టార్టయి… ఎహె, నలుగురు సెలబ్రిటీలను తీసుకొచ్చి ఏవో పిచ్చి గెంతులు వేయిస్తారు, అంతేకదా అనుకున్నాను అందరిలాగే… కానీ స్టార్‌మాటీవీలో వచ్చే బీబీ జోడీ ప్రోగ్రాం డిఫరెంటుగా ఉంది… ఆకట్టుకుంటోంది… బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రాం చేయడం మాటీవీకి అలవాటే… వాళ్లకు కూడా అదనపు ఆదాయం కాబట్టి మాటీవీ చెప్పిన ప్రోగ్రామ్స్‌లో చేస్తుంటారు… మాటీవీకి నాన్-ఫిక్షన్ కేటగిరీలో రియాలిటీ షోల అవసరం ఉంది… లేకపోతే రేటింగుల్లో ఇంకా పడిపోయే ప్రమాదం […]
మా లెక్కల సార్ రుణం తీర్చుకునే లెక్క దొరికింది నాకు…
డిసెంబరు 21, 1946… మైలాపూర్, వివేకానంద కాలేజీ, ఇంటర్మీడియెట్ క్లాస్… ఓ క్లాస్‌కు అయిదు నిమిషాలు లేటుగా వెళ్లాను… మా ఇంగ్లిష్ ప్రొఫెసర్, కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేశాడు… ‘సారీ సర్, నాకు కాస్త లేటయింది…’‘వోకే, వోకే, కమిన్… లంచ్ బ్రేకులో ఓసారి కలువు..’ 12.15 గంటలు… ఆయన ఆఫీసుకు వెళ్లాను… ‘క్షమించండి సార్, అనుకోకుండా రోజూ వచ్చే దారిలో డైవర్షన్… అందుకని ఇంకాస్త ఎక్కువ దూరం ఉండే దారిలో నడిచి […]
పైసలా, పెంకాసులా… వరల్డ్ ఫోర్త్ రిచ్చెస్ట్ యాక్టర్ ఆస్తి ఇన్నివేల కోట్లా..?
అమితాబ్ కుటుంబంలో ముగ్గురు సంపాదిస్తున్నారు… సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు… నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ దరిదాపుల్లోకి కూడా రారు… హాలీవుడ్ నటులకు ఇచ్చే రెమ్యునరేషన్లు, ఎండార్స్మెంట్ డబ్బులు అడ్డగోలు… ఐనా సరే, నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ వాళ్లను కూడా దాటేసిపోయాడు… ప్రస్తుతం షారూక్ పొజిషన్ ఏమిటో తెలుసా..? ప్రపంచంలోకెల్లా నాలుగో అత్యంత ధనిక నటుడు… పఠాన్ సినిమాను బ్యాన్ చేస్తారా..? చేసుకొండి… కొడుకు ఆర్యన్ ఖాన్ మరింతగా డ్రగ్ కేసుల్లో ఇరుక్కుంటాడా..? […]
ఎంతసేపూ ఆడ దేహాలు, మొహాలే… నెట్ సుధీర్‌లకు మగ మొహాలు పట్టవెందుకో..!!
పింక్ శారీలో జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యను చూస్తే తట్టుకోలేం భయ్యా… నాభి అందాలతో అనసూయ అదుర్స్ స్వామీ… శ్రీముఖి క్లీవేజీతో మతిపోతోంది బాసూ… విష్ణుప్రియ ఎదపొంగులతో ఇక వేడి సెగలే… కొత్త లుక్కులో రష్మి పిచ్చెక్కిస్తోంది చూశారా… జాకెట్ మరిచి దడపుట్టిస్తున్న శ్రీలీల……. ఇలాంటి థంబ్ నెయిల్స్ కోకొల్లలు… యూట్యూబ్ చానెళ్లే కాదు, తెలుగులో మేం తోపులం అని చెప్పుకునే సైట్లు సైతం ఇదే బాట… ఇక సినిమా హీరోయిన్ల విషయంలోనైతే చెప్పనక్కర్లేని హెడింగులు, వర్ణనలు… […]
రావణుడికి ముందు… రామలక్ష్మణుల కళ్లెదుటే సీత అపహరణ ప్రయత్నం…
శీర్షిక చూసి నవ్వొచ్చిందా..? ఎహె, సీతమ్మవారిని రావణాసురుడికన్నా ముందే మరో రాక్షసుడు అపహరించడం ఏమిటి..? ఆ ప్రయత్నం చేయడం ఏమిటి..? అదీ రామలక్ష్మణుల కళ్ల ఎదుటే…!! సాధ్యమేనా..? నమ్మశక్యమేనా..? అని తేలికగా తీసిపడేస్తున్నారా..? ఆగండి… మహాభారతంలో ఉన్నన్ని అసంఖ్యాక లఘుపాత్రలు రామాయణంలో మనకు కనిపించకపోవచ్చు… కానీ కొన్ని పాత్రలు అప్రధానంగా అలా ఉండిపోతయ్… ఎంతసేపూ రాముడు, రావణుడు, సీత, లక్ష్మణుడు, కుంభకర్ణుడు వంటి పాత్రలే ప్రధానంగా తెర మీద కనిపిస్తుంటయ్… అది సరే, సీతను రావణుడికి ముందే […]
ఓ చిన్న ప్రశ్న… పెద్ద చర్చ… అమలా పాల్‌ను గుడిలోకి అనుమతిస్తే తప్పేమిటి..?!
హిందూ బంధుగణానికి ఓ ప్రశ్న… సినిమా నటి అమలా పాల్‌ను ఓ గుడిలోకి రానివ్వకపోవడం కరెక్టేనా..? కేరళలోని తిరువైరానిక్కుళం మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లగా… అక్కడి అర్చకులు, ఆలయ కమిటీ, సిబ్బంది అడ్డుకున్నారు… అన్యమతస్తులకు ప్రవేశం లేదని తేల్చి చెప్పారు… మహాదేవ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉందని తేల్చి చెప్పారు… ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చని సూచించారు… విధి లేక ఆమె అలాగే చేసింది… ఇదీ వార్త… ప్రశ్న ఏమిటంటే..? ఆమె ప్రవేశాన్ని ఆలయ ఆచారాలు, […]
- « Previous Page
- 1
- …
- 87
- 88
- 89
- 90
- 91
- …
- 119
- Next Page »