Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ ఆ శేషన్ దిగివచ్చినా… ఆ టెంపర్ చూపించలేడు… ఎందుకో తెలుసా..?

November 24, 2022 by M S R

అప్పట్లో మన ఎన్నికల వ్యవస్థను పరుగులు పెట్టించి, ఎన్నికల నిర్వహణకు కొత్త దిశను నిర్దేశించిన TN శేషన్ మీద సుప్రీంకోర్టు కూడా నిన్న ఓ కేసు విచారణలో ప్రశంసలు కురిపించింది… అలా ‘జీహుజూర్’ అనకుండా ఉండే ‘నిజమైన స్వయంప్రతిపత్తి’ కలిగిన ప్రధాన ఎన్నికల అధికారుల్ని నియమించుకోలేమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది… అవసరమైతే ప్రధాని మీద కూడా చర్యలు తీసుకునే వ్యవస్థ అవసరమనీ అభిప్రాయపడింది…

తమకు ఇష్టమైన రిటైర్డ్ బ్యూరోక్రాట్లను ప్రభుత్వం నియమించుకోవడం గాకుండా, జుడిషియరీలోని కొలీజియం సిస్టం ఎందుకు ఉండకూడదు అనేది కేసు… అసలు కొలీజియం పద్ధతి మీదే బోలెడు విమర్శలున్నయ్… పైగా కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల అధికారి నిర్ణయం ఏమీ అల్టిమేట్ కాదు, తనకేమీ వీటో పవర్స్ ఉండవు… అందులో ముగ్గురు సభ్యులుంటారు… మెజారిటీ నిర్ణయమే ఫైనల్… ప్రధాన ఎన్నికల అధికారిగా శేషన్‌ను మళ్లీ బతికించి, తీసుకొచ్చి పెట్టినా సరే… అవసరమైనా సరే, ప్రధానిపై చర్య తీసుకోలేడు…

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తాజా నియామకాన్ని అది విచారించబోతోంది… సరే, సుప్రీం వ్యాఖ్యల మీద చర్చ కాదు ఇక్కడ… కానీ ఒక మాట… రియాలిటీ చెప్పుకోవాలి… మన దేశమే కాదు, ఏ దేశమైనా సరే… రాజకీయాధికారమే అంతిమం… అది తనపైన ఎవరి సుప్రిమసీకి అంగీకరించదు… కాకపోతే దాన్ని సరిగ్గా వాడుకోగలగాలి… ఆ కిటుకులు, ఆ అనుభవం, ఆ చాణక్యం తెలిసినవాళ్లు పాలకుడి వెంట ఉండాలి, లేదా పాలకుడికే అవన్నీ ఉండాలి…

Ads

నేనేదో సివిల్స్ పరీక్ష రాశాను, ఆ పెద్ద కుర్చీ దాకా ఎక్కాను… ఇక ఒక్కొక్కరి కథేమిటో తేలుస్తాను అంటే మన సిస్టంలో కుదరదు… ప్రతి దానికీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటయ్… కాకపోతే కీలెరిగి వాతపెట్టడం ఎలాగో పాలకుడికి తెలిసి ఉండాలి… అది ఇందిరమ్మకు తెలుసు, అది పీవీకి తెలుసు… కొందరు అది తెలియక బోల్తాకొడుతుంటారు… అసలు ఇప్పుడు సుప్రీం ఆహా ఓహో అని ప్రస్తుతిస్తున్న ఆ శేషన్‌కు అప్పటి ప్రధాని పీవీ ఎలా చెక్ పెట్టాడనేది ఆసక్తికరం… (ఆయన వర్క్ ఎఫిషియెన్సీ, ధైర్యం, దూకుడు ప్రశంసనీయమే… ఐనా సరే… )

మళ్లీ చెబుతున్నా… ఎక్కడైనా సరే, రాజకీయాధికారమే సుప్రీం… ఒక దశ వరకే అది సోకాల్డ్ ‘‘స్వయంప్రతిపత్తి’’ని అనుమతిస్తుంది… ఇతర వ్యవస్థలు తమపై స్వారీ చేస్తే తట్టుకోలేవు… అంతెందుకు, అవసరమైతే సుప్రీం జడ్జిలను కూడా దింపేయగల అవకాశం రాజకీయాధికారానికి ఉంది… ఉంది… స్వయంప్రతిపత్తికీ పరిమితులు ఉంటయ్… మన సిస్టం గొప్పతనమే అది…

seshan

టీఎన్ శేషన్… 1990 చివరలో ఈ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యాడు… అత్యంత కీలకమైన కేబినెట్ సెక్రెటరీ ర్యాంకు దాకా ఎదిగిన ఉన్నతాధికారి… అధికార వ్యవస్థలో తెలియని కిటుకుల్లేవు… పైగా పెద్ద బుర్ర… ఎప్పుడయితే ఎన్నికల కమిషనర్ అయ్యాడో, ఇక పెద్ద కొరడా పట్టుకున్నాడు… ఎన్నికల అక్రమాలపై ఝలిపించడం ప్రారంభించాడు… ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉంటుంది, తలుచుకుంటే అది తాట తీసి, దండెం మీద ఆరేస్తుంది అని ఆచరణలో చూపించాడు… అప్పటిదాకా కాగితాలు, చట్టాలకే పరిమితమైన అనేక నియమాలను బయటికి తీసి, ఒక్కొక్కరినీ పరుగులు పెట్టించాడు… ఎన్నికల్లో ధన ప్రవాహం, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు, విద్వేష ప్రచారాలకు కళ్లెం వేయడమే కాదు… చివరకు వాల్ రైటింగుకు కూడా పర్మిషన్ తీసుకోవాలన్నాడు… అంటే, అంత సూక్ష్మ అంశాల దాకా వెళ్లాడు తను… పార్టీలు బెంబేలెత్తిపోయాయి…

EC OF INDIA

చంద్రశేఖర్ అనే ప్రధాని వరకూ వోకే… తను ఒక టైం బీయింగ్ ప్రైమ్ మినిష్టర్… లక్కీగా కుర్చీ దొరికింది… అలాంటోళ్లకు శేషన్ చిక్కుతాడా…? శేషన్ తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలు అప్పట్లో ఓ విప్లవం… మెల్లిమెల్లిగా పీవీనరసింహారావుకూ ఆ సెగ తగలడం మొదలైంది… ఇది శేషన్‌ను మించిన బుర్ర… శేషన్ ఓ బ్యూరోక్రాట్… కానీ పీవీ సకలవిద్యాపారంగతుడు కదా… పైగా అత్యంత కీలకమైన రాజ్యాధికారాన్ని, రాజకీయాధికారాన్ని కలిగి ఉన్నవాడు… ఎందుకు ఊరుకుంటాడు… మెల్లిమెల్లిగా కత్తెర్లు పెట్టడం స్టార్టయింది… కేంద్ర ఎన్నికల అధికారి హోదాను తగ్గించడం దగ్గర్నుంచి, ఆఫీసులో స్టాఫ్ మీద చర్యలు తీసుకోవడం వరకూ… శేషన్ చుట్టూ మంట పెట్టసాగారు… ఇద్దరూ పంతాలకు వెళ్లారు… వ్యక్తిగతం కాదు, పరస్పరం తన్నుకునే దురుద్దేశాలు కాదు… వాళ్లు కూర్చున్న కుర్చీల ఆధిపత్యాన్ని కాపాడే ప్రయత్నాలే…

pv

చివరకు ఓ దశలో పీవీ నరసింహారావు ఓపిక నశించింది… అకస్మాత్తుగా కేంద్ర ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు సభ్యులు కూడా ఉండేలా ఆర్డినెన్స్ జారీ చేసి, మెజారిటీ నిర్ణయాలే అల్టిమేట్ అని నిర్దేశించారు… విధేయులైన ఇద్దరిని నియమించేశాడు… అంటే ఏమైంది..? శేషన్ అధికారాల్ని అడ్డంగా నరికేశాడు… ‘‘ఒక వ్యక్తి తను పంతాల కొద్ది గానీ, వేరే ప్రభావాల చేత గానీ, ఉద్దేశపూర్వకంగా గానీ నిర్ణయాలు తీసుకోగల పరిస్థితి’’ని పీవీ తొలగించాడు… శేషన్ గదిలో ఫర్నీచర్, ఫోన్, స్టాఫ్ సహా అన్నీ డిస్టర్బయ్యాయి…

ఆ తరువాత శేషన్ ఓ శేషంలా మిగిలిపోయి.., చివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయాల అసలు తత్వం బోధపడి… కార్యనిర్వాహక అధికారానికీ, రాజకీయాధికారానికీ తేడా అర్థమై… సన్యాసం స్వీకరించి, తమిళనాడు వెళ్లిపోయాడు… సో, ప్రధానిపైనా చర్య తీసుకోగల స్వయంప్రతిపత్తి ఉన్న సీఈసీ కావాలనేది చెప్పడానికి బాగానే ఉంటుంది… మోడీకి ఏదీ చేతకాకపోవచ్చుగాక, రేప్పొద్దున మరో ‘టెంపర్‌మెంట్’ ఉన్న ప్రధాని గనుక వస్తే ఎవరికి ఎలా కత్తెర్లు పెట్టాలో, కీలెరిగి కోతలు పెట్టగలరు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions