Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చల్లగా లేస్తుంది వంటి పాటలకు ‘ఎదిగినా’… జనం దింపేశారు..!

December 19, 2024 by M S R

.

. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) . భారీ ఓపెనింగులతో , అంచనాలతో విడుదలయిన సినిమా చాలెంజ్ రాముడు . మొదటి వారం 31 లక్షలు , రెండవ వారం 20.6 లక్షలు వసూలు చేసిన సినిమా . 1980 లో కలెక్షన్ల పరంగా మొదటి మూడు నాలుగు సినిమాలలో ఉన్నా వంద రోజులు ఆడలేకపోయింది . 90 రోజుల దాకా లాగించబడినట్లు ఉంది . Subject to correction . నెట్లో 90 రోజుల పోస్టర్లు కనిపించాయి కానీ వంద రోజులవి కనిపించలేదు .

యన్టీఆర్- జయప్రదల జోడీ ప్రభంజనం ఈ సినిమాలో కూడా కొనసాగుతుంది . అయినా కధలో కొత్తదనం లేకపోవడం వలన , అలాగే కధనంలో స్పీడు లేకపోవడం వలన యన్టీఆర్- జయప్రదల జోడీ పేలలేదు . రొటీన్ రివెంజ్ సినిమాయే .

Ads

హీరో యన్టీఆర్ కుటుంబాన్ని ఓ స్మగ్లర్ చంపుతాడు . ఆ కుటుంబంలో ఒక్క హీరోనే బతికి బయటపడతాడు . ఓ షిప్ కెప్టెన్ తన కొడుకుతో పాటు పెంచుతాడు . చిన్నప్పటి నుంచి చాలెంజులను తీసుకొని గెలిచే పాత్ర యన్టీఆరుది . ఈ సినిమాలో యన్టీఆర్ పాత్రకు వినూత్నత ఇదే .

1980 లో యన్టీఆరువి రెండు రాముళ్ళు వచ్చాయి . ఒకటి ఈ చాలెంజ్ రాముడు . మరొకటి సర్కస్ రాముడు . సర్కస్ రాముడు వంద రోజుల జాబితాలో చేరింది . (అడవి రాముడు, సరదా రాముడు, సర్కస్ రాముడు, చాలెంజ్ రాముడు… ఎన్టీయార్ సినిమా అంటే చాలు, టైటిల్‌కు రాముడు తగిలించేవారు అప్పట్లో )…

1980 సంక్రాంతికి రిలీజయ ఈ సినిమాకు ప్రాణం చక్రవర్తి సంగీతం , వేటూరి ఆత్రేయల పాటలే . ఎక్కడో ఎప్పుడో చూసాను నిన్ను క్లబ్ పాటలో గిటార్ వాయిస్తూ జయమాలినితో నృత్యిస్తాడు యన్టీఆర్ . చల్లగాలి వీస్తోంది మెల్లగా రమ్మంది , దోరదోర జాబిల్లి రా , పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టు చీర పాటలు యన్టీఆర్ జయప్రదల మీద చిత్రీకరించబడ్డాయి .

(ఆకుచాటు పిందె తడిసె, చల్లగాలేస్తోంది, దోర దోర జాం పండు వంటి ఊర నాటు కొట్టుడు సాంగ్స్ మీద ఎన్టీయార్‌కు ఆసక్తి అప్పట్లో… వేటూరి కదా, ఏదైనా రాసివ్వగలడు…)

పట్టుకో పట్టుకో పట్టు చీరె యన్టీఆర్ , జయప్రదల కోక సెంటిమెంట్ పాట . సెకండ్ హీరోయిన్ గీతతో పెడతా పెడతా నామం పెడతా పాట బాగుంటుంది . సెకండ్ హీరోయిన్ పాత్రలో గీత రాణిస్తుంది . చక్కగా నటించింది . పాటలు , డాన్సులు అన్నీ యన్టీఆర్ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి .

ఈ సినిమాలలో పాటల్ని చూస్తుంటే 55+ వయసులో కూడా NTR , ANR లు ఎంత కష్టపడి డాన్సులు వేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడ్డారా అని ఆశ్చర్యం కలుగుతుంది . Hats off to their professional commitment and dedication .

తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు టి యల్ వి ప్రసాద్ . కధను మహేంద్రన్ వ్రాస్తే డైలాగులను జంధ్యాల వ్రాసారు . యన్టీఆర్ , జయప్రదలతో పాటు ప్రధాన పాత్రలలో గుమ్మడి , సత్యనారాయణ , మిక్కిలినేని , కాంతారావు , నూతన్ ప్రసాద్ , కె వి చలం , వంకాయల , రాళ్ళపల్లి , గీత , పుష్పలత , జయమాలిని , తాతినేని రాజేశ్వరి , ప్రభృతులు నటించారు . రాళ్ళపల్లి భూతవైద్యుడి పాత్ర , గెటప్ కొత్తగా ఉంటుంది .

సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . యన్టీఆర్ అభిమానులు , జయప్రద అందపిపాసులు చూసి ఉండకపోతే చూడవచ్చు .జయప్రద అందాన్ని ఫొటోగ్రాఫర్ బాగానే ఆరేసాడు . ఈ సినిమాలో యన్టీఆరుతో పాటు హీరోయిన్ జయప్రద కూడా ఓ మారువేషం వేస్తుందండి బాబో . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆదిత్య ధర్… యామీ గౌతమ్… వెరీ పాపులర్ బాలీవుడ్ జంట ఇప్పుడు…
  • జగన్ క్యాంప్ ఎంత డిఫన్స్‌లో పడిందంటే… ఇదుగో ఈ యాడ్ పక్కా రుజువు…
  • ఏది ఉషోదయం..? ఏది పరాభవం..? ఎవడి నవ్వు, ఎవడి ఏడుపు..?
  • సారీ గబ్బర్ సింగ్..! ఈ సనాతన సీక్వెల్‌లో ఏదో మిస్సయింది..!!
  • తొండల భాషకు స్వస్తి… సెటైర్లతో ఎద్దేవా… రేవంత్ స్టయిల్ మారింది…
  • ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ ముఖచిత్రం ఎలా ఉందంటే..? ఫుల్ పిక్చర్..!!
  • ఆ బూతు రోత పాటపై అందరూ లెంపలేసుకుంటున్నారు..! కానీ..?
  • ఎవరు ఈ లారీజానీ..? ఇరాన్ ‘మాస్టర్ మైండ్’నే లేపిన ఇజ్రాయిల్..!!
  • వైఎస్ విజయమ్మ ‘ఫరమ్’ అటాక్… ఆస్తుల పంచాయితీలో జగన్‌కు షాక్…
  • ఈ ఒక్క దాడితో… ఇక ప్రపంచవ్యాప్తంగా ఇంధన విధ్వంసం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions