…. ఏమన్నా అంటే అన్నామంటారు గానీ బాబయ్యా… రంధ్రాన్వేషణ అంటారు… గుడ్డు మీద ఈకలు పీకడం అంటారు… గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం అంటారు… మనిషన్నాక, పత్రికన్నాక తప్పులే ఉండవా అంటారు… తప్పులు రాయడం మా ప్రివిలేజ్ అని కూడా అంటారు… కానీ మరీ ఇంత అరాచకమా అధ్యక్షా…?
ఒకవైపు మా అభిమాన భగవద్గీత ఈనాడు తెలుగు భాష సంరక్షణ కోసం నానా క్షుద్ర విద్యల్నీ ప్రయోగిస్తూ… కాష్మోరాల్ని ఆవహింపజేసుకుని మరీ శివాలూగుతున్న స్వర్ణతరుణంలో… ఇదుగో ఈ తెలుగు భాష దురవస్థ ఏమిటండీ..? అఫ్ కోర్స్, దీన్ని తెలుగు అనడం కూడా మన భాషకు తీరని ద్రోహం చేసినట్టే…
సరే, ఎవరైనా సరే… తెలుగు చదవడంలో, అర్థం చేసుకోవడంలో, జీర్ణం చేసుకోడంలో సిద్ధహస్తులు అనే భ్రమల్లో ఉంటే… వాళ్లకు ఓ సవాల్… మధ్య మధ్య తడబడకుండా, తొట్రుపడకుండా… ఒకే ఫ్లోలో ఈ వార్తను చదవగలరేమో ప్రయత్నించండి… ఆ కిలికిలి భాషకు అర్థం సంగతి కాసేపు మరిచిపొండి…….
Ads
మీ వల్ల కాలేదు కదా… పోనీ, మీకు తెలుగు భాష మీద అత్యంత అనురక్తి కదా… ఓ పనిచేయండి… దీన్ని దిద్ది ఓసారి మార్కులేయండి… ఒకటికి నాలుగుసార్లు చదివి మరీ జాగ్రత్తగా మార్కులేయండి…
అదీ మీ వల్ల కావడం లేదు కదా… సరే, చివరగా మరో ప్రయత్నం చేయండి… దీన్ని చదివి, సరైన తెలుగు పదాలతో మీరే ఓ వార్తను తిరగరాయండి… అనగా రాయటానికి ప్రయత్నించండి… అప్పుడు దీన్ని, మీరు రాసినదాన్ని పక్కపక్కన పెట్టుకుని పరిశీలించండి…
అబ్బే, ఇవన్నీ ఎందుకండీ, ఏమిటీ పైత్యం అంటారా..? నిజం… పత్రికలు భాషను ఉద్దరించాల్సిన పనేమీ లేదు… భాష బతుకుతుంది… మనం, మన పిల్లలు మాట్లాడుతూ, రాస్తూ, చదువుతూ… ఆ తరువాత తరానికి కూడా చేరవేస్తే… ఆ తరువాత తరాలు దీన్ని కాపాడుకోవాల్సిన ఓ కర్తవ్యంగా భావిస్తే… భాషకు ఏమీ కాదు… బతుకుతుంది…
కానీ ఇదుగో పత్రికలు ఇలాంటి నిర్లక్ష్యాన్ని తెలుగు భాష మీద, పాఠకలోకం మీద వదిలితేనే… అది కరోనా వైరస్ను ప్రపంచం మీదకు వదిలిన చైనీయుల పాపం కన్నా ఘోర పాపం…
అరెరె, ఏదో సరదాగా సవాల్ స్వీకరించండి అనగానే… మరీ అంత సీరియస్గా ఈ వార్తారత్నం వెంటబడకండి ప్లీజు… పదే పదే చదివితే అది మానసికారోగ్యానికి మంచిది కాదు… వదిలేయండి సార్… ఎవరి పాపాన వాళ్లే పోతారు… మనకెందుకు..? హషళే రోఝుళు భాఘళేవు… థూ, ఇక్కడేదో కొత్త భాష పుట్టుకొస్తోంది… వామ్మో…
Share this Article