Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తిరుమల లడ్డూకు జంతువుల కొవ్వు వాడారా..? వెంకన్నకు జగన్ ద్రోహమా ఇది…!!

September 18, 2024 by M S R

ఈ మాట అనడానికి ఏమాత్రం సందేహించడం లేదు… తిరుమల శ్రీవారితో ఆడుకున్న వాళ్లు బాగుపడినట్టు చరిత్రలో లేదు… తెలుగు ప్రజలకు బాగా తెలుసు… ఎవరు ఎక్కడ కడతేరిపోయారో…

ఎస్, జగన్ హయాంలో హిందూ గుళ్లపై దాడులు బోలెడు… బీజేపీ ఎందుకు సహించిందంటే… అదొక దిక్కుమాలిన పార్టీ కాబట్టి… జగన్‌కు సపోర్ట్ చేస్తూ వచ్చింది కాబట్టి… మతిస్థిమితం లేని చర్యలు అంటూ ఒక్కరిపైనా చర్య తీసుకోలేదు జగన్… ఒకవైపు పుష్కర స్నానాలు చేస్తాడు, రిషికేష్‌లో ఓ స్వార్థానంద స్వామితో యాగాలు చేయిస్తాడు… కానీ..?

చంద్రబాబు చేసిన ఆరోపణ తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది… తిరుపతి లడ్డూ తయారీకి నాసిరకం ఇంగ్రెడియంట్లే కాదు, నెయ్యికు బదులు జంతువుల కొవ్వును (యానియల్ ఫ్యాట్) వాడారట… అసలు చంద్రబాబు నోటి వెంట అది వింటుంటేనే ఓ జలదరింపు, ఓ ఏవగింపు… ఇన్నేళ్లూ జగన్‌ను సమర్థించిన మోడీ కూడా ఆ పాప ఫలాన్ని అనుభవించాలి కదా అన్నట్టుగా…

Ads

ఏ ఢిల్లీ పాదుషా కూడా ఇంతటి దుర్నీతికి పాల్పడలేదు… నిజాం నవాబులు సైతం భద్రాచలం రాముడి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపించారు… మరి జగన్ పాలనలో ఇదేమిటి..? ఏకంగా జంతువుల కొవ్వు వాడారా..? కోట్ల మంది భక్తులు దాన్ని ప్రసాదంలా స్వీకరించారా..? మళ్లీ మళ్లీ అనుకోవడానికే వెగటు పుడుతోంది…

alipiri

ఒక ధర్మారెడ్డి, ఒక భూమన కరుణాకర్‌రెడ్డి, ఒక చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి… వీళ్లే కదా తిరుమల వెంకన్న మీద కూడా పెత్తనం చెలాయించింది… అప్పట్లో భూమన క్రిస్టియన్ అని కదా ఒక దశలో దుమారం లేచింది… అందరూ కలిసి ఏం చేశారు..? ఇప్పటికే మొత్తం అన్యమతస్తుల గుప్పిట్లోకి తిరుమల చేరిపోయింది… వాళ్లు ఏది చెబితే అదే… ఫాఫం వెంకన్న…

ఇక్కడ మరో విషయం… చంద్రబాబు ఏ ఆధారాలతో ఇంతటి తీవ్ర ఆరోపణ చేశాడు..? సరే, చేశాడు… నిరూపించి భక్తజనానికి జగన్ తాలూకు హిందూద్రోహాన్ని నిరూపించగలడా..? అది చేయకపోతే… తిరుమల పవిత్ర ప్రసాదంతో రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు అనుభవిస్తాడు… ఆల్రెడీ అలిపిరి ఉదాహరణ ఉండనే ఉంది… చంద్రబాబూ సిద్ధమేనా..?

నప్పతట్ల యవ్వారాలు వద్దు… రాజకీయ ప్రయోజనాలు కాదు, నిజంగా జగన్ గనుక తిరుమల వెంకన్నకు, హిందూ మతానికి ఆ స్థాయి తీవ్ర ద్రోహం చేయడమే నిజమైతే… పదే పదే తిరుమలకు వచ్చి పత్రికల్లోఫోటోలు అచ్చేయించుకును సుప్రీంకోర్టు జడ్జిలతో, లేదా జడ్జితో, కనీసం హైకోర్టు జడ్జితో జుడిషియల్ విచారణకు ఆదేశించు… నిజానిజాలు తేలాలి…

laddu

ఈ దెబ్బకు సగటు హిందువు సిగ్గుతో తలదించుకోవాలి… జగన్ తప్పులేకపోతే… శుష్క, డొల్ల, దిక్కుమాలిన రాజకీయం నువ్వు చేస్తున్నావనేదైనా తేలిపోవాలి… వెంకన్న ఎవరికి శిక్షిస్తాడో కూడా ఓ హింట్ కావాలి సొసైటీకి… భూమనలు, రోజాలు, చెవిరెడ్డిలు కాదు… అధినేతలే అనుభవించాలి… అది జగనైనా..? అది చంద్రబాబైనా..? రెడీయా చంద్రబాబూ..!? గోవుల కొవ్వును తూటాలకు పూశారనే ఒకే ఒక అంశం ఏకంగా బ్రిటిష్ అధికారంపై పోరాటానికి, విముక్తికి దారితీసింది… నీకు తెలుసో లేదో..!!

నిజంగా చంద్రబాబు చెప్పిందే నిజమైతే… జగన్‌ను దుష్ట రాజకీయాల కోసం మద్దతునిస్తూ వచ్చిన మోడీ కూడా అలిపిరి బాపతు శిక్షకు రెడీ కావాల్సిందే..!! తన ఆరోపణకు వెంటనే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి స్పందించాడు ఇలా…

https://x.com/yvsubbareddymp/status/1836423994876076105

తను ఎంపీ కదా… చంద్రబాబును నమ్మరు కదా… పోనీ, సుబ్బన్నా… పురంధేశ్వరి పెద్దగా స్పందించకపోవచ్చుగానీ, నువ్వే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు మోడీ ఆదేశించేలా డిమాండ్ చేయడమో, ప్రయత్నించడమో బెటర్ కదన్నా..! మోడీ అండ్ కో మీద పదే పదే మర్మవ్యాఖ్యలతో దాడి చేస్తున్న మోహన్ భగవత్ స్పందన కూడా చూడాలని ఉంది…

https://news.tirumala.org/stern-action-against-suppliers-on-low-quality-ghee/

టీడీడీ National Accreditation Board for Testing and Calibration Laboratories తో పరీక్ష చేయిస్తే కల్తీ నెయ్యిని ఒక సప్లయర్ పంపించినట్టు తేలిందట… పైన లింక్ ఆ ప్రెస్ నోటే… ఏం కల్తీ చేశారో, ఆ సప్లయర్ ఎవరో, ఏం శిక్ష వేస్తారో చంద్రబాబు తేటతెల్లం చేయాలి… ఊరికే మనోభావాలు దెబ్బతీయడం కాదు… ఇప్పుడు మంచి నెయ్యి వాడుతున్నాం అనేది సమర్థన కాదు, వివరణ కాదు… నిజంగానే గతంలో కొవ్వు కలిపితే ఆ సప్లయర్‌ను ఏం చేశారు..? అది కదా చెప్పాల్సింది…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions