ఒక ప్రయోగం విఫలమైనప్పుడు హుందాగా అంగీకరించాలి… కానీ చంద్రబోస్‌కు ఆ అలవాటు లేనట్టుంది… ఈమధ్య అన్నీ తిక్కతిక్క పదాల్ని పేరుస్తూ ఏదేదో రాసేస్తున్నాడు… తాజాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌లో పిచ్చి ప్రయోగపదాల్ని వాడాడు… దాని మీద నెట్‌లో చర్చ సాగుతోంది… ‘ముచ్చట’ చెప్పింది ఏమిటంటే… తను ఏవో పారడాక్స్ ప్రయోగాలు చేయబోయాడు చరణాల్లో… కానీ ఫెయిలయ్యాడు అని…
ఎస్, యండమూరితో సహా చాలామంది అభిప్రాయం అదే… ఎవరో ఆల్‌రెడీ చంద్రబోస్ వివరణ అడిగినట్టున్నారు… దానికి పాటలో విరోధాభాసం ప్రయోగాల మీద ఏదేదో చెబుతూ పోయాడు… అయ్యా, కాళిదాసూ, నువ్వేం అనుకుని రాశావని కాదు… జనంలోకి అది ఎలా వెళ్లిందనేది ముఖ్యం… అసలు ఈ వివాదం ఏమిటో తెలియాలంటే ఈ లింకులు చదవండి…
చంద్రబోసూ… శివుణ్ని మరీ గుడ్డికన్నోడా అని తిట్టేశావేంటి మహాశయా…
Ads
సో వాట్… నో, యండమూరి ఏదో విమర్శిస్తే చంద్రబోస్ జవాబివ్వాలా..?
చాలా అసంబద్ధ అంశాలున్నయ్ పాటలో… కానీ ప్రధానంగా శివుడిని తిమిర నేత్రుడని ప్రస్తావించడం మాత్రం సరైన ప్రయోగం కాదు… మమ్మల్ని అడిగేవాడెవ్వడులే అనే ఓ బరితెగింపు… పోనీ, అడుగుతున్నారు, మరి కాస్త ఆలోచించి చెప్పొచ్చు కదా… ఇదుగో ఇలా చెబుతున్నాడు…
‘‘తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడు అని రాశాను, దాని అర్ధం లోతుగా వెళ్ళి చూస్తే, చీకటిలాగా శతృవుల మీదకు ఆవరిస్తాడని వర్ణన… ఆ తరువాత గుడ్డిగా వెళ్ళి యుద్ధం చేస్తాడనుకుంటే పొరపాటు… ఆయనకు మూడు కళ్ళు ఉన్నాయి… ఆయన త్రినేత్రుడు, అందువల్ల ఆయన శతృవుకు చీకట్లు కమ్మేలా చేస్తాడు కానీ తాను మాత్రం మూడు నేత్రాలతోనూ ప్రతాపం చూపిస్తాడు అని చెప్పడమే నా ఉద్దేశ్యం…
తరువాత ఇంకొకటి, మామూలుగా మనం ఒక రంగంలోకి దూకిన తరువాత ఇక శత్రువు మీదికి దాడి చేసేటప్పుడు గుడ్డిగా వెళ్లి కొట్టేస్తుంటాం. గుడ్డిగా వెళ్లేవాడే కానీ మూడు కళ్లున్నాయి. ఇది అర్థం… ఇది విరోధాభాసం ఇక్కడ…. కానీ కొట్టేప్పుడు గుడ్డిగానే వెళ్తాడు కానీ గుడ్డివాడు కాదు… మూడు కళ్లున్న వ్యక్తి. త్రినేత్రుడు తిమిర నేత్రుడు… చీకటి కన్నుల వెళ్లి ఆవరించేస్తాడు. దీంతో శత్రువుకి అంథకారమైపోతుంది అని అర్థం. ఇక్కడ శివ దూషణ కానీ మరోటి కానీ లేనే లేవని’’ చంద్రబోస్ వివరించాడు. ఇది కేవలం పాటకు సంబంధించిన అలంకారం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు…
ఓ విఫల సమర్థన… గుడ్డోడు అని తిట్టేసి, నిజానికి నేను గుడ్డోడు అని తిట్టలేదు తెలుసా అని సమర్థించడం దూషణకన్నా హీనం… తిమిర నేత్రమై అంటే ఏ ప్రేక్షకుడైనా సరే, గుడ్డి శివుడు అనే అర్థం చేసుకుంటాడు… కాదు, కాదని ఉల్టా దబాయిస్తే ఎలా..? అవును, ఏవో బరువైన పదాలు దొరికాయి కదాని నోటికొచ్చినట్టు రాయడం సినిమా పాటల సాహిత్యకారులకు కొత్తేమీ కాదు… ఈమధ్య అనంత శ్రీరాముడికి ఈ సమర్థన వ్యాధి ఒకటి తగిలింది… ఇక చంద్రబోస్…!! నిజానికి చంద్రబోసే ఓ తిమిరనేత్రుడు… ఎంత గుడ్డిగా వెళ్లిపోతాడో చెప్పడానికి ఈ లింకు చదవండి ఓసారి… అన్నట్టు ఇది ఆస్కార్ దాకా పోయిందిలెండి… చాలా ఖర్చుతో…!!
నాటు… ఘాటు… మోటు… ఫాఫం చంద్రబోస్… ఏం రాశాడో తనకైనా తెలుసా..?!
Share this Article