ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా ఇక సెలవు తీసుకుంటోంది… ఇదొక వార్త… అంతేకాదు, ఏకంగా జబర్దస్త్ షో, ఎక్సట్రా జబర్దస్త్ షో కలిపేసి, ఇకపై కేవలం జబర్దస్త్ మాత్రమే నామమాత్రంగా నడిపిస్తారు… ఇది మరొక వార్త… ప్రోమోల్లో కూడా క్లారిటీ ఇచ్చారట… అంటే, ఈటీవీ ఫ్లాగ్ షిప్ బూతు షోను బాగా కుదించేస్తున్నారన్నమాట…
గుడ్, ఎలాగూ రేటింగ్స్ ప్రతి వారం డౌన్… ఎవడూ దేకేవాడు లేడు… దీనికితోడు కాస్త సత్తా ఉన్న కమెడియన్లందరూ వెళ్లిపోయి ఎవరెవరో వస్తున్నారు, ఫిట్ కావడం లేదు, టైమింగ్ ఉండటం లేదు, మొత్తంగా జబర్దస్త్ పరమ నాసిరకం కామెడీ షోగా మారిపోయింది…
అక్రమ సంబంధాలు, బూతులే ప్రధాన చోదకశక్తిగా నడిచినా సరే ఒకప్పుడు స్కిట్లు బాగా పేలేవి… నాగబాబు ఔట్, తరువాత రోజా ఔట్… అనసూయ, సుడిగాలి సుధీర్ ఔట్… గెటప్ సీను ఔట్… ఇలా చాలామంది ఔట్… మధ్యలో సౌమ్యారావు కొన్నాళ్లు యాంకరిణి… క్లిక్ కాలేదు… ఇప్పుడు సిరి హన్మంతు, అంతకన్నా క్లిక్ కాలేదు… ఎవరెవరిని తీసుకొచ్చి యాంకర్లను చేసినా, జడ్జిలుగా కూర్చోబెట్టినా ఎవరూ రాణించలేదు…
Ads
హైపర్ ఆది మానేశాడు… ఏదో ఢీ షోలో కనిపిస్తున్నాడు అప్పుడప్పుడూ… ఆమని, సదా, పూర్ణ, ఖుష్బూ ఎందరొచ్చినా జనానికి కనెక్ట్ కావడం లేదు… ఇంద్రజ చాలా బెటర్… నిజం చెప్పాలంటే రోజాకు చాలారెట్లు బెటర్, బెటరున్నర… ఇంద్రజ వెళ్లిపోతుంది సరే, మరి శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జి ఎవరు..? తెలియదు..!
రెండు జబర్దస్త్ షోలను ఒక్కటిగా కుదిస్తే యాంకర్‌గా రష్మి ఉంటుంది, సందేహం లేదు, తను ఈటీవీ ఆస్థాన యాంకరిణి… అసలు జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఢీ, సుమ అడ్డా, శ్రీదేవి డ్రామా కంపెనీ… ఏదైనా సరే కామెడీయే… అసలు ఈటీవీ రియాలిటీ షోలంటేనే కామెడీ అయిపోయింది… జనం చూడ్డం మానేశారు…
ఆటో రాంప్రసాద్, రాకెట్ రాఘవ, ఫైమా, బులెట్ భాస్కర్ తదితరులు మంచి టైమింగుతో స్కిట్ ఎలివేట్ చేయగలరు… కానీ దీటుగా చేయగల సహకమెడియన్లు ఏరి..? ఒకరిద్దరు మరుగుజ్జు ఆర్టిస్టులను తీసుకొచ్చి కథ నడిపిస్తున్నారు… వాళ్ల డైలాగులు వినబడవు, స్కిట్‌లో అసలు ఫిట్టే కావడం లేదు… ఒక్క నరేష్ తప్ప…
నిజంగా జబర్దస్త్ షోను కుదించడం అంటే… ఒకరకంగా బూతుకు అడ్డుకట్ట వేయడం, తెలుగు జాతికి కాస్తయినా సేవ చేయడం, కాదు, జరుగుతున్న తప్పును కొంతైనా సవరించుకోవడం..! ఏం జరుగుతుందో తెలియదు గానీ… జడ్జిగా కృష్ణ భగవాన్‌ను అలాగే కొనసాగిస్తూ, రష్మిని దానికి యాంకర్‌గా అలాగే ఉంచేసి, మరో బెటర్ ఫిమేల్ జడ్జిని తీసుకొస్తే నాలుగురోజులు ఈ జబర్దస్త్ షో అయినా నడుస్తుంది…
ఫైమా, భాస్కర్, రాంప్రసాద్, రాఘవ, రోహిణిలను టీం లీడర్లుగా చేసి, మిగతావాళ్లను ఆ టీంలకు అటాచ్ చేస్తే బెటర్… కాకపోతే వెరయిటీ కామెడీ స్కిట్లు ట్రై చేయాలి, స్పూఫ్‌లు, పేరడీలు ఎట్సెట్రా… ఎలాగూ ఒరిజినల్ స్కిట్స్ పవర్ ఫుల్‌గా రాయలేకపోతున్నారు కదా… ఏమో, మల్లెమాలకు, ఈటీవీ వాళ్లకే జబర్దస్త్ మీద అంత వైరాగ్యం వచ్చాక ఇక ఎవరుంటేనేం..? ఎవరు వెళ్లిపోతేనేం… మొత్తానికి ప్రేక్షకులకు కొద్దిగా రిలీఫ్…!!
Share this Article