రోజా ఓడిపోయింది… చాన్నాళ్లుగా ఊహిస్తున్నదే… ఆమెకు సొంత నియోజకవర్గంలోనే తీవ్రమైన అసమ్మతి ఉంది… దానికి తోడు ఆమె నియోజకవర్గంలోకన్నా తిరుమల టూర్లలోనే ఎక్కువగా కనిపించేది… దీనికితోడు జగన్ మీద ప్రబలిన తీవ్ర వ్యతిరేకతతో ఆమె సహజంగానే ఓడిపోయింది…
వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్… అసలే రోజా కదా… కొంచెం నోరు పెద్దది కదా… చంద్రబాబు అండ్ గ్యాంగును ఆడుకునేది… ఇప్పుడు చాన్స్ దొరికింది కదాని ఇక టీడీపీ బ్యాచ్ ఆడుకుంటోంది… జబర్దస్త్ షోకు మళ్లీ వెళ్లిపో, అదే నీకు అడ్డా అనేది ఆమె మీద విమర్శల్లో ప్రధానమైంది…
సరే, దానికి ఆమె పెద్దగా బాధపడదు… అసలు జబర్దస్త్ కారణంగానే తన పాపులారిటీ పెరిగిందనీ, అదే తనను గెలిపించిందనీ భావిస్తుంది… కానీ ఈటీవీ జబర్దస్త్ తాజా ప్రోమో ఒకటి చూస్తే రోజాకు ఇప్పుడు చాన్స్ లేనట్టే కనిపిస్తోంది… పైగా నాగబాబు వెళ్లిపోయాక ఆ షోను పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది… ఆమె మానేశాక అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు… పంచ్ డైలాగులు నటులకన్నా ముందే ఆమె చెబుతూ తెగ చికాకు పెట్టేది…
Ads
తాజా ప్రోమో ప్రకారం… ఇకపై ఎక్సట్రా జబర్దస్త్ ఉండదు, రెండురకాల జబర్దస్త్ షోలు కలిపేశారు… ఇప్పుడు ఒకే జబర్దస్త్ షో వారానికి రెండురోజులు వస్తుంది… రెండు పార్టుల జబర్దస్త్ షో… ఒకటి శుక్రవారం, మరొకటి శనివారం… ఒక షో పేరు సరదా శుక్రవారం, మరో షో పేరు సరిపోదా శనివారం… ఆరు టీమ్స్ మొత్తం… అందరికీ మార్కులు… మేల్ జడ్జి కృష్ణ భగవాన్… స్పాంటేనిటీ ఉంది, జోకులు వేస్తాడు, తను అక్కడ సెటిలైపోయాడు…
ఫిమేల్ జడ్జి ఖుష్బూ… ఇంద్రజ వెళ్లిపోయింది… ఢీ షో నుంచేమో ప్రణిత వెళ్లిపోయి హీరోయిన్ హన్సిక వచ్చిచేరింది… ఇక జబర్దస్త్‌కు వేరే యాంకరిణి ఉండదేమో… రెండింటికీ రష్మియే… ఐనా అది ఒకే షో కదా… ఇక ఆరు టీముల్లో ….
1. ఆటోరాంప్రసాద్ 2. రాకెట్ రాఘవ 3. బుల్లెట్ భాస్కర్ 4. ఇమాన్యుయెల్ 5. నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ 6. ప్రవీణ్ అండ్ కార్తీక్…. ప్రోమోలో ఫైమా, పొట్టి నరేష్, రోహిణి కూడా కనిపించారు… కాకపోతే ఆరు టీమ్స్ చేశారు కదా, అందులో ఒకటైనా ఫిమేల్ టీమ్ లేదా ఫిమేల్ టీం లీడర్‌గా ఒక టీమ్ ఉంటే బాగుండేది… ఫైమా, రోహిణి ఇద్దరూ మంచి టైమింగ్, మంచి ఎనర్జీ ఉన్న కమెడియన్లే… సరే, కూర్పు పర్లేదు… జబర్దస్త్ మీద ప్రస్తుతం ఎవరికీ పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు… అంతగా దిగజార్చారు దాన్ని… ఈ మార్పులతో ఏమాత్రమైనా మంచి ఆరోగ్యకరమైన కామెడీ కొత్తగా జనాన్ని పలకరిస్తే మంచిదేగా..!!
Share this Article