సాక్షిలో ఈమధ్య కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి… హైదరాబాద్ సిటీ పాఠకుల్ని టార్గెట్ చేసుకుంది పత్రిక… అటు ఏపీలో గడ్డుకాలం తప్పదు, తెలంగాణలోనూ యాంటీ రేవంత్ లైన్- ప్రొ కేసీయార్ లైన్ ఇంకా పాఠకుల్ని మెప్పించదు… సో, మెట్రో కల్చర్, అన్ని ప్రాంతాల ప్రజలూ ఉన్న మార్కెట్ కీలకమైన హైదరాబాద్‌ను టార్గెట్ చేసుకుంది యాజమాన్యం…
గుడ్, దానికి తగ్గట్టే, ఫస్ట్ నిలువు చీలిక పేజీ సిటీ ఆఫ్ బీట్, నాన్ రొటీన్ వార్తల్ని బాగా ప్లాన్ చేస్తున్నారు… అభినందనీయమైన స్టోరీలు కొన్ని కనిపిస్తున్నాయి… కాకపోతే ఇంకా బాగా రాయగల మ్యాన్ పవర్ షార్టేజీ ఉన్నట్టుంది… సిటీ ప్లస్ అని మరో పేజీ… ఓవరాల్‌గా గుడ్ స్ట్రాటజీ, గుడ్ ప్లానింగ్, గుడ్ ఇంప్లిమెంటేషన్… అయితే..?
సంస్థాగతంగా చాలా మార్పులు జరగబోతున్నాయి… తప్పదు, ఎందుకంటే..? సాక్షిని చంద్రబాబు ప్రభుత్వం ఇంకా ఇక్కట్ల పాలు చేస్తుంది… ఈనాడును, ఆంధ్రజ్యోతిని, టీవీ5ను పెకిలించడానికి జగన్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు రివర్స్‌లో కనిపించే ప్రమాదం ఉంది… తను అధికారంలో ఉన్నప్పుడు సాక్షిని మూసేయించడానికే చంద్రబాబు ట్రై చేశాడు కదా… ఇప్పుడు వదిలేస్తాడనుకోవడం సరికాదు…
Ads
తెలంగాణలో రేవంత్ సర్కారుకు కూడా సాక్షి పడదు… అది జగన్ పత్రిక కాబట్టి… అది యాంటీ -రేవంత్, ప్రొ -కేసీయార్ పొలిటికల్ లైన్ కాబట్టి… ఈ స్థితిలో రెండుచోట్ల ఇరకాటమే… కాకపోతే ఏ పత్రికైనా ప్రతిపక్ష పాత్రలోనే సరిగ్గా పోరాడితే బాగా రాణిస్తుంది… కానీ ఇన్నాళ్లూ జగన్‌ను, కేసీయార్‌ను మోసీమోసీ ఏకపక్షంగా కనిపించీ కనిపించీ… క్రెడిబులిటీ కోల్పోయాక… ఇక ఏం రాసినా పాఠకుడు అంత అక్కున చేర్చుకుని హత్తుకునే అవకాశం కనిపించదు…
నమస్తే తెలంగాణను చూస్తున్నాం కదా… సేమ్… ఎన్నాళ్లుగానో అనుకుంటున్నదే… జగన్ కూడా చెబుతున్నదే… ఈ ఎన్నికలయ్యాక ఎడిటర్ మురళికి వీడ్కోలు పలుకుతారని..! తను రేపోమాపో సాక్షిని విడిచిపెట్టిపోవాల్సిందే… (ఏమో, కొన్నాళ్లు డైరెక్టర్‌గా కంటిన్యూ చేస్తారేమో కూడా..) మురళితో బాగా శృతి కలిసిన యాదగిరిరెడ్డిని ఆల్రెడీ టీవీకి పంపించారు… అక్కడ ఔట్‌పుట్‌లో ఉన్న శ్రీనాథ్‌ను చాన్నాళ్ల క్రితమే డిజిటల్ వింగ్‌కు పంపించారు.. ఇప్పుడు తను ఏకంగా ఆర్గనైజేషన్‌నే విడిచిపెడుతున్నాడు… తనకు ఎందుకో పడటం లేదు సాక్షి వాతావరణం…
ఇన్నాళ్లూ ఏపీ రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్న మంథా రమణమూర్తిని తాజాగా డిజిటల్ చీఫ్‌గా తిరిగి హైదరాబాద్ పంపించేస్తారు… తనకు కూడా ఏపీలో ఉండాలని లేదు… మురళి స్థానంలో ధనుంజయ్ రెడ్డి రావల్సి ఉంది… అది జగన్ నిర్ణయం… కానీ ప్రస్తుతానికి ఏపీ రెసిడెంట్ ఎడిటర్‌గా ఉంచి, తరువాత మొత్తం పత్రిక బాధ్యతల్ని అప్పగిస్తారేమో… చూడాలి… ఆల్రెడీ తన నిర్ణయాన్ని జగన్ సంస్థ ముఖ్యులకు చెప్పేశాడు … తెలంగాణ రెసిడెంట్ ఎడిటర్‌గా విజయకుమార్‌రెడ్డి ఎంపిక… గుడ్…
పాతుకుపోయిన ఒకరిద్దరు ముఖ్యులు సంస్థను ఇకనైనా వదిలేయకతప్పదు… ఈ నెలే లాస్ట్ వాళ్లకు… మరొకాయన నాన్- ఫోకల్‌కు వెళ్లిపోతాడు… చలపతిరావు ఫీచర్స్, క్వాలిటీ సెల్ పగ్గాలు చేపడతాడు… గుడ్… ఈ మార్పులన్నీ నిజంగానే సాక్షిలో ఓ ఫైటింగ్ స్పిరిట్‌ను నింపి, చంద్రబాబు అండ్ బ్యాచ్ ఎత్తుగడల్ని వమ్ము చేసేలా, పాఠకుల ఆదరణను మళ్లీ పొందేలా చేయగలవా..? చూడాలి…
ఏమో, జగన్ ఎన్నికల ముందు పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాలు, అభ్యర్థిత్వాల్లో మార్పులు తనను మరీ 11 స్థానాల పరాభవ స్థాయికి చేర్చింది… సాక్షికి మరీ ఆ దురవస్థ రావొద్దనే ఆశిద్దాం… ఎందుకంటే… ఈనాడు, ఆంధ్రజ్యోతి తరహా పచ్చ రాజకీయానికి ఎదురుగా నిలబడి కనిపించగలిగే సాధనసంపత్తి సాక్షికే ఉంది కాబట్టి… మరో పత్రికే లేదు కాబట్టి..!!
Share this Article