.
ఈటీవీ జబర్దస్త్ టేస్ట్ మొదటి నుంచీ తెలిసిందే కదా… ద్వంద్వార్థాలు, బూతులు, అక్రమ సంబంధాలే దాని అభిరుచి… ఓహో కామెడీ అంటే మరీ ఈ బజారు స్థాయిలో ఉండాలా అంటూ బోలెడు విమర్శలు…
ఐతేనేం, జనం చూశారు… క్రమేపీ జనానికే వెగటు పుట్టింది… ఎహె పోరా, అని చూడటం మానేశారు… పేరున్న కమెడియన్లు వదిలేసి వెళ్లిపోయారు… దాంతో కాస్త ఆమధ్య ఆరోగ్యకరమైన కామెడీ వైపు మళ్లినట్టు అనిపించింబది…
Ads
కానీ మన భ్రమ… పాత బాటలోకి వచ్చేసింది… పండుగ స్పెషల్ జబర్దస్త్ అని ఓ ప్రోమో వదిలారు కదా… స్కిట్లన్నీ మళ్లీ అవే… పోనీ, వత్రం చెడ్డా సుఖం దక్కిందా..? అదీ లేదు… జనం ఇదే కాదు, అసలు ఈటీవీ రియాలిటీ షోలను, అంటే నాన్-ఫిక్షన్ షోలనే చూడటం మానేశారు…
తాజా ప్రోమోలో ఓ చిల్లర స్కిట్ కనిపిస్తోంది… అసలు మాటలు కూడా సరిగ్గా పలకలేని, డైలాగులు చెప్పలేని ఓ కమెడియన్ ఉంటాడు కదా, పేరు తెలియదు… తను వర్ష పిరుదుల మీద కొడతాడు… దాన్ని చూసి డాన్సర్ కమ్ కమెడియన్ పండు ఏడుస్తుంటాడు… తోడుగా ఇమాన్యుయెల్ కూడా..! సరిపోలేదేమో, అతను మళ్లీ అలాగే కొడతాడు… (డాకూ మహారాజ్ దబిడిదిబిడి సాంగ్ స్టెప్పులకు ఇదేనా స్పూర్తి శేఖర్ మాస్టర్..?)
ఫాఫం, వర్షను మరీ దిగజార్చేస్తున్నా ఆమెకు ఏ సోయీ లేనట్టుంది… జడ్జిలట వాళ్లు…, శివాజీ, ఖుష్బూ పడీ పడీ నవ్వుతున్నారు… 1) ఫైమా, పొట్టి నరేష్… ఎప్పటిలాగే ‘మామూలుగానే ఏముండదు నీ దగ్గర’ అంటూ ఓరకం బాడీ షేమింగ్… ద్వంద్వార్థం… 2) ఇమాన్యుయెల్ దేవదాసులా బుడ్డీ, కుక్కపిల్లతో… ఎవరినో ప్రేమించాను, వేరేవాడిని పెళ్లి చేసుకుని పోయింది అని ఏవో డైలాగులు…
3) సద్దాం స్కిట్‌లో నంబర్ ప్లేటు, పార్టీ గుర్తు వంటివి మరీ నాసిరకం కామెడీ… 4) పొట్టి నరేష్‌కు ఆడవేషం వేయించి… పెద్ద పెద్ద పదవులు, నా పెదవులు దక్కడం కష్టం వంటి చీప్ డైలాగులు… ఒక్కరోజు గరల్ ఫ్రెండ్ పాత్ర అట… తాగుబోతు రమేష్‌తో… 5) కాస్తో కూస్తో బాగుండే రాఘవతో కూడా పంపుసెట్టు స్కిట్…
6) సొంతంగా స్కిట్లు, డైలాగులు రాసుకునే ఆటో రాంప్రసాద్ బాట కూడా ఇదే… లేడీ గెటప్ శాంతితో, మరో కమెడియన్‌తో కలిసి పతివ్రత పరమాన్నం స్కిట్ కూడా బాగాలేదు… దాదాపుగా ప్రతి స్కిట్ అదే… తెలుగు టీవీ ప్రేక్షకుల దురదృష్టం ఏమిటంటే, మిగతా చానళ్లకు కామెడీ షోలు చేతకాకపోవడం, గతంలో కొన్ని చేసీ ఫెయిల్ కావడం…
ఆహాలో కామెడీ దర్శకుడు అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్, ఇతర కమెడియన్లతో కామెడీ ఎక్స్‌చేంజ్ అని ఓ షో నడిపించారు… స్కిట్స్, ఆ ఫార్మాట్ బాగుండేవి… మరీ ఈ అక్రమ సంబంధాలు, బూతుల వాసన పెద్దగా ఉండేది కాదు… అదీ ఆపేశారు… చివరకు ఈ జబర్దస్తే దక్కింది ప్రేక్షకులకు..!!
Share this Article