అస్సలు అర్థం కానిదేమిటంటే..? కరాటే కల్యాణి అనబడే ఓ కేరక్టర్ హఠాత్తుగా హిందూ మనోభావాల ధర్మకర్తగా మారిపోయింది… తప్పు అనడం లేదు… కానీ ఆమె గతం, ప్రవర్తన, వివాదాలు, కాస్త చిల్లరతనం ఆమె ఉద్దేశాల పట్ల సందేహాల్ని రేకెత్తిస్తాయి… ఇప్పుడు తాజాగా మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్ మీద సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది… ఏమని..?
‘‘అయ్యా, ఫలానా సంగీత దర్శకుడు ‘ఓ పరి’ అనే అనే ప్రైవేటు సాంగులో హరేరామ హరే రామ, హరే కృష్ణ హరేకృష్ణ అనే పవిత్రమైన మంత్రాన్ని భ్రష్టుపట్టించాడు… ఇవి యావత్ హిందూ మనోభావాల్ని కించపరచడమే… కాబట్టి చర్య తీసుకోగలరు…’’… ఇక్కడ ఆంటీ పదాల వివాదాల దగ్గర నుంచి ఇలాంటి మంత్ర వివాదాల దాకా సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేయడమే… వాళ్లేం చేస్తారు ఈ కేసులో..?
ఇందులో సైబర్ రిలేటెడ్ క్రైమ్ ఏముంది… కరాటే కల్యాణి మాత్రమే కాదు, ఎవరో బీజేపీ నాయకుడు కూడా ఆ సాంగు మీద విమర్శలు చేసినట్టున్నాడు… కరాటే కల్యాణి బిగ్‌బాస్‌లో ఒకటీరెండు వారాలు ఉండి భలే విసిగించిన కేరక్టర్… ఆమధ్య ఎవరో యూట్యూబర్ శ్రీకాంతరెడ్డి మీద బజారులో దాడిచేసినట్టుంది… అది పెద్ద వివాదమై కూర్చుంది… ఆమె మీద ట్రోెల్స్, విమర్శలు ఎట్సెట్రా…
Ads
సరే, ఆమె గురించి చర్చ అనవసరం గానీ… ఆ పాట నిజంగా బాగా లేదా..? అంత చెత్త టేస్టా..? ముందుగా ఓ డిస్‌క్లయిమర్… దేవిశ్రీప్రసాద్ ఓ పక్కా కమర్షియల్ మ్యూజిక్ కంపోజర్… పాటలు నైతికత, నీతులు, ప్రమాణాలు వంటి పదాలు తనకు అక్కర్లేదు… డబ్బులు వస్తున్నాయా, పాపులారిటీ వస్తుందా అనే లెక్కలు మాత్రమే చూసుకునే కేరక్టర్ అది…
దేవిశ్రీప్రసాద్ ఆమధ్య కాస్త వెనుకబడినా… ప్రస్తుతం తమన్‌తో బాగానే పోటీపడుతున్నాడు… పాపులర్ అండ్ రిచ్… ఆమధ్య ఎక్కడో అబ్రాడ్‌కు వెళ్లాడు… ఏదో బీచ్ రిసార్ట్‌లో అడ్డా… రకీబ్ ఆలం రాసిన ఓ పాటకు సరదాగా ట్యూన్ కట్టాడు… నలుగురు మోడళ్లను పిలిచాడు… పిచ్చి డ్రెస్సులు వేశాడు… తనూ అలాగే తొడుక్కున్నాడు… ఒళ్లు కదలని నాలుగు స్టెప్పులు వేశాడు… పాట పాడాడు… ఎడిటింగ్ అయిపోయింది… సో, తనదే కాన్సెప్టు, తనే మ్యూజిక్ కంపోజర్, తనే సింగర్, తనే డాన్సర్, తనే పర్‌ఫామర్, తనే కొరియోగ్రాఫర్, తనే డైరెక్టర్… నిజానికి ఓ పెద్ద రీల్స్, షార్ట్స్ తరహా బిట్…
టీ-సీరీస్ వాడికి అమ్మిపారేశాడు… దానికేం ఖర్చుంది..? వస్తే డబ్బు, వస్తే పాపులారిటీ… లేకపోతే టైంపాస్ పల్లీ యవ్వారం… నిజానికి ఆ పాట సూపర్ హిట్ అయిపోయింది… యూట్యూబ్‌లో హిందీ వెర్షన్‌కే రెండు కోట్ల వ్యూస్ అట… ఇక వేరే భాషల్లోకి తర్జుమా చేస్తున్నారు… రిలీజ్ చేస్తున్నారు… ప్రతి భాషలోనూ హిట్… పాన్ ఇండియా ప్రైవేటు సాంగ్ అట అది ఇప్పుడు… మ్యూజిక్ లిజనర్స్ టేస్టు అప్పుడప్పుడూ అలాగే ఉంటుంది… దానికి రీజనింగు, అనాలిసిస్, బేస్ ఏమీ ఉండవు…
నిజానికి ఉత్త చెత్త సాంగ్… అందులో ఏమీ లిటరరీ వాల్యూస్ ఉండవ్… పిచ్చి పదాల కూర్పు అది… ఆ ట్యూన్ కూడా ఇంప్రెసివ్ కాదు… పైగా హరేరామ, హరేకృష్ణ పదాల్ని చిల్లరగా వాడుకున్నాడు… తెలుగులో మరీ ‘‘ఓ పోరి’’ అన్నట్టుగా ఉంది… మరీ కరాటే కల్యాణిలా సైబర్ క్రైమ్స్ యవ్వారం గాకుండా ఎవరైనా సీరియస్ కేసు వేస్తే ఏ మధ్యప్రదేశ్ హోం మంత్రో, యూపీ సాంస్కృతిక మంత్రో దేవిశ్రీప్రసాద్‌తో హరేరామ హరేకృష్ణ అనిపించే అవకాశం అయితే ఉంది… కానీ పాట రిలీజైన నెల, నెలన్నర తరువాత హఠాత్తుగా ఈ వివాదం ఎందుకు రేగుతోంది..?!
Share this Article