మాల్దీవుల కొత్త ప్రభుత్వం కనరు అంటే పొగారు, వాచాలత్వం, భారత వ్యతిరేకత గట్రా దింపడానికి సింపుల్‌గా, సైలెంట్‌గా మోడీ అడుగులు వేశాడు… ఆ దేశానికి ప్రాణాధారంగా నిలిచిన ఇండియన్ టూరిస్టులు అవాయిడ్ చేస్తుండటంతో అదిప్పుడు లబోదిబో మొత్తుకుంటోంది… చైనా ఉక్కుకౌగిలి ఎంత ప్రమాదమో దానికి మెల్లిమెల్లిగా తెలిసొస్తుంది… సరే, ఇక అదంతా వేరే కథ…
పాకిస్థాన్, చైనా కలిపి ఇండియా మీద సాగించే కుట్రలు అన్నీ ఇన్నీ కావు, తెలుసు కదా… చివరకు చైనా వాడైతే వెదర్ వార్, అంటే భారీగా కృత్రిమ వర్షాలు కురిపించడం లేదా గంగా పరీవాహకంలో వర్షాలే పడకుండా చేయడం, ప్రాజెక్టుల్లో నీళ్లు నింపేసి ఒకేసారి వదలడం వంటివి ప్లాన్ చేస్తుంది… కరోనా జీవాయుధం సంగతి తెలిసిందే కదా… ఇండియా మీద చైనా వాడు ప్రయోగించని జిత్తుల్లేవు… చివరకు దేశంలోని జాతీయవాదం మీద సీపీఎంను కూడా ప్రయోగిస్తుంటాడు…
పాకిస్థాన్ మీద సైలెంటుగా మరో అస్త్రం ప్రయోగించింది మోడీ సర్కారు… పాకిస్థాన్‌లోకి వెళ్ళే చినాబ్ నది ప్రవాహాన్ని మళ్లించేశారు… ఊహించిన దానికంటే ముందుగానే పాకిస్థాన్‌లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టే యాక్షన్ ప్లాన్ రియాలిటీలోకి తీసుకువచ్చింది… జమ్మూ & కాశ్మీర్‌లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద 27 జనవరి, 2024న కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్‌షాల్లా వద్ద సొరంగాల ద్వారా చీనాబ్ నదిని మళ్లించారు…
Ads
పాకిస్తాన్‌లోకి నీటి ప్రవాహాన్ని ఆపడమే కాకుండా, రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దాదాపు 4000 మంది వ్యక్తులకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది… ఈ ప్రాజెక్ట్ 40 సంవత్సరాల జీవితకాలంలో ₹5289 కోట్ల విలువైన ఉచిత విద్యుత్ & ₹9581 కోట్ల నీటి వినియోగ ఛార్జీల నుండి ప్రయోజనం పొందుతుంది…
పదే పదే మనమీదకు కాళ్లు దువ్వి, అంతులేని విషాన్ని దేశంలోకి ప్రవహింపజేసే పాకిస్థాన్‌కు ‘‘రక్తం, నీళ్ళు కలిసి పారలేవు’’ అని తేల్చి చెప్పినట్టయింది… మరి ఇదెలా సాధ్యం అయింది… అప్పుడెప్పుడో 1960 లో మన నెహ్రూ సాబ్ పాకిస్థాన్ అధినేత అయూబ్ ఖాన్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు… వరల్డ్ బ్యాంకు మధ్యవర్తి… దీన్ని సింధు నదీజలాల ఒప్పందం అంటారు…
దీనివల్ల సింధు పరీవాహకంలోని సింధు, జీలం, చినాబ్ నదుల నుంచి ఇండియాలో అనుమతించిన వాడకం పోగా మిగతా నీటిని పాకిస్థాన్ స్వేచ్ఛగా వాడుకోవచ్చు… సేమ్.., సట్లెజ్, బీస్, రావి నదుల నీటి నుంచి పాకిస్థాన్ అనుమతించిన వాడకం పోగా మిగతా నీటిని ఇండియా వాడుకోవచ్చు… ఆ ఒప్పందాల గడువు పూర్తయింది… ఈ నదుల నీటివినియోగ సమీక్షకు, పునఃఒప్పందానికి బదులు ఇండియా వీలైనంతగా మన భూభాగంలోనే ఎక్కువ నీటిని వాడుకునే ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంది…
పాకిస్థాన్ ఆల్రెడీ దివాళా దశలో ఉంది… ప్రభుత్వ నిర్వహణకే డబ్బులేదు, ఇక ప్రాజెక్టులకు సొమ్మెక్కడిది… మరోవైపు చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ ఇబ్బందులు ఎదుర్కుంటోంది… బెలూచ్ తీవ్రవాదుల ప్రతిఘటన అధికంగా ఉంది… ఐఎంఎఫ్ పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టే ఆలోచన కూడా తెలిసిందే కదా… సో, ఇండియా వచ్చే నీటిని అదేమీ అడ్డుకోలేదు… అలాగని ఇండియా నుంచి వచ్చే నీరు ఆగిపోతే నోరు మెదపలేదు… ఎందుకంటే నాటి ఒప్పందం ఇప్పుడు అమల్లో లేదు…
గతంలో పాకిస్థాన్ చెప్పినట్టల్లా ఆడే కశ్మీర్ పార్టీల వెన్నెముకలు ఆర్టికల్ 370 ఎత్తేసిన తరువాత విరిగిపోయాయి… కశ్మీర్ ఉగ్రవాదం వెన్ను విరవాలంటే… పాకిస్థాన్ విషప్రవాహాలకు అడ్డుకట్టలు పడాలంటే… ఇదుగో ఇలా కీలెరిగి వాతలు పెట్టడమే… జరుగుతున్నదీ అదే…! మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి స్టోరీలు రావెందుకు అంటారా..? భలే అమాయకపు ప్రశ్న మీది..!!
Share this Article