.
విక్కీ కౌశల్… వర్తమాన బాలీవుడ్ నటుల్లో టాప్ కేటగిరీ… మొన్న ఛావా సినిమా మీద బాలీవుడ్‌లో బాగా ఇంట్రస్టు పెరుగుతున్న తీరు మీద, ఆ సినిమా మీద కొన్ని వివరాలు రాస్తే, కొందరికి నచ్చలేదు…
విక్కీ కౌశల్‌కు అంత సీన్ లేదని వాళ్ల అభిప్రాయం కావచ్చు… అలాంటివాళ్లు ఒక్కసారి ఛావా సినిమా చూడాలి… ఎందుకు అంతగా హిందీ ప్రేక్షకులు తనను అభిమానిస్తారో అర్థమవుతుంది… ఆమధ్య తను చేసిన శామ్ బహదూర్ పాత్రలో విక్కీ అక్షరాలా దూరిపోయాడు…
Ads
బాడీ లాంగ్వేజీ, డైలాగ్ డిక్షన్… వాట్ నాట్..? ఇక ఛావా సినిమాలో అయితే మరింత రెచ్చిపోయాడు… నిజానికి ఛావా సినిమా ప్లస్ పాయింట్లలో విక్కీని ఆ పాత్రకు ఎంచుకోవడం కూడా ముఖ్యమైందే… సినిమా చివరి ముప్పావుగంట తన విశ్వరూపం…
లక్ష్మణ్ ఉటేకర్ అనే ఓ మరాఠీ దర్శకుడు చాలా జాగ్రత్తగా కథ రాసుకున్నాడు… ఓ నవల ఆధారితమే అయినా సినిమాకు ఏం కావాలో అదే తీసుకున్నాడు… దాన్నే పకడ్బందీగా ప్రజెంట్ చేశాడు… ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ… ఈ సినిమాలో కథానాయకుడు తనే…
నిజానికి మొదట్లో శంభాజీ వ్యక్తిత్వంలో పెడపోకడలు ఉండేవి… ఆ మైనస్ పాయింట్లన్నీ తీసేసి, శంభాజీని శివాజీకి నిజమైన వారసుడిగా చిత్రీకరించాడు దర్శకుడు… సాహసం, పౌరుషం, ధీరత్వంతోపాటు ఓ మరాఠీ యుద్ధ వీరుడిగా (marathi pride) ఫోకస్ చేశాడు… చివరకు కుట్రల బాధితుడు కూడా… యుద్ధాల్లో గెలవలేక ఔరంగజేబు తనను ఎలాంటి కుట్రలతో ఖతం చేశాడనేదే అసలు కథ…
మొదట్లో కాస్త నడక స్లోగా ఉన్నా సరే, సెకండాఫ్‌లో యుద్ధ సన్నివేశాలు గానీ, రాజకీయ కుట్రలు గానీ, శంభాజీ యుద్ద నైపుణ్యం, పోకడలు బాగా చిత్రించాడు దర్శకుడు… పలుచోట్ల క్రియేటివ్ ఫ్రీడం తీసుకున్నా సరే, మరీ దారి తప్పలేదు ఎక్కడా… ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా సినిమాకు ప్లస్…
ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా, శంభాజీ భార్యగా రష్మిక మంధాన ఆ పాత్రలకు సరిపడా నటనను ఇచ్చారు… రష్మిక ఇకపై జస్ట్, శ్రీవల్లి కాదు, యేసుభాయ్ కూడా..! వార్ సీన్లు, కుట్రలకు శంభాజీ ముఖ్య అనుచరులు ఒక్కొక్కరే నేలకొరిగే సీన్లు బాగా పండాయి…
మరొకరి గురించీ చెప్పుకోవాలి… ఔరంగజేబు కూతురు జీనత్ ఉన్నీసా బేగం పాత్రలో నటి డయానా పెంటీ ఆకట్టుకుంది… (13 ఏళ్ల కెరీర్‌లో చేసినవి 13 సినిమాలు మాత్రమే…) సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫీ పలుచోట్ల హాలీవుడ్ లుక్ తీసుకొచ్చింది…
కునారిల్లుతున్న హిందీ సినిమాకు స్కైఫోర్స్ సినిమా కాస్త ఊపిరి పోసింది… 150 కోట్ల వసూళ్లు… ఇప్పుడు ఛావా మొదటి రోజే 32 కోట్లు… బాలీవుడ్ ప్రముఖులు ఛావా సినిమా మీద ఆశలు పెట్టుకోవడానికి కారణం కూడా ఈ దేశభక్తి, పిరియాడిక్ సినిమా హిందీ బెల్టులో బాగా ఆడుతుందని..!
Share this Article