.
అబ్బే, అదంతా చరిత్ర వక్రీకరణ… మతోన్మాదాన్ని పెచ్చరిల్లచేయడానికి తీసిన సినిమా… ఫక్తు కాషాయ ఎజెండా… ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేస్తోంది… వసూళ్ల లెక్కలూ తప్పు… ఇలాంటి డొల్ల విశ్లేషణలు ఛావా సినిమా మీద చాలా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో…
తప్పు… కాషాయ ఎజెండాతో తీసిన ప్రతి సినిమా సక్సెసైందా మరి..? అంతెందుకు..? సాక్షాత్తూ మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో స్వయంగా చూసి, ప్రమోషన్‌కు పరోక్షంగా సహకరించాలి అనుకున్న ది సబర్మతి రిపోర్ట్ సినిమా సంగతేమిటి..? ఎవడూ దేకలేదు… అన్ని కశ్మీర్ ఫైల్స్‌లాగా హిట్ కావాలనేముంది..? బీజేపీ ఎంపీ కంగనా స్వయంగా తీసిన ఎమర్జెన్సీలో కూడా కాషాయ వాసనలున్నాయి… కానీ ఎవడూ పట్టించుకోలేదు దాన్ని…
Ads
రజాకార్ అని ఓ సినిమా వచ్చింది ఆమధ్య… సక్సెస్ కాలేదు… సో, కంటెంట్ ఎంత ప్రధానమో, ప్రజెంటేషన్ అంతకన్నా ఎక్కువ ప్రధానం… ఛావా సినిమా కంటెంటు మీద విమర్శలు, విశ్లేషణలు, ప్రశంసల్ని కాసేపు పక్కన పెడదాం…
కానీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రతిభతోపాటు మెయిన్ లీడ్ శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ విశ్వరూపం… ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కూడా పోటీపడ్డాడు తనతో… ఏఆర్ రెహమాన్ బీజీఎం ఖచ్చితంగా ఓ ప్లస్ పాయింట్… బాలీవుడ్‌కు ఈ సినిమాతోపాటు స్కైఫోర్స్ (150 కోట్ల వసూళ్లు) కూడా ఊపిరి అందించాయి…
సరిగ్గా వారం రోజుల్లో ఛావా సినిమా 307 కోట్ల వసూళ్ల మార్క్ దాటేసింది… ఇప్పుడున్న స్థితిలో ఇది చిన్న విజయమేమీ కాదు… పైగా పాన్ ఇండియా కాదు, జస్ట్, హిందీ వెర్షన్ ఓన్లీ… నిజంగానే సౌత్ భాషల్లో కూడా రిలీజ్ చేసి ఉంటే ఈరోజుకు ఐదారు వందల కోట్లు కొల్లగొట్టేదేమో… సినిమాకు రేపు, ఎల్లుండి వీకెండ్స్ ఇంకా ముఖ్యం…
ఒకసారి టికెట్ల అమ్మకాల్ని చూస్తే… బుక్‌మై షో లెక్కల ప్రకారం ఇప్పటికే ఛావా 50 లక్షల టికెట్లను అమ్మింది… బాగా హిట్టయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొత్తానికి ఇప్పటికి 36 లక్షలు, చతికిలపడిన గేమ్ చేంజర్ 22.5 లక్షలు (పాన్ ఇండియా స్థాయి అయికూడా…), సాయిపల్లవి తండేల్ 12 లక్షలు, అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ 20 లక్షలు, అజిత్ విడామయూర్చి 15 లక్షలు, బాలయ్య 13.5 లక్షల టికెట్లు అమ్మాయి…
సో, ఏ కోణంలో చూసినా ఛావా సూపర్ హిట్… శంభాజీ కథ కేవలం మహారాష్ట్ర ప్రేక్షకులకే కనెక్ట్ అవుతుందనే భావనతో నిర్మాతలు ఇతర భాషల్లోకి తీసుకురాలేదు… కానీ దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ చూస్తున్నారు ప్రేక్షకులు… మౌత్ టాక్ మరింతగా ప్రేక్షకుల్ని రప్పిస్తోంది థియేటర్లకు… అదీ దాని సక్సెస్‌కు కారణం…!
Share this Article