.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి అందరినీ ఆకర్షిస్తున్న ప్రాంతం చికెన్ నెక్… సిలిగురి కారిడార్‌గా పిలిచే ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు, పోటీలు ఆసక్తిని రేపుతున్నాయి… వివరాల్లోకి, నిజాల్లోకి వెళ్తే గానీ ఈ ఏరియాలు ఎందుకు కీలకమో అర్థం కావు…
ఈ సన్నని ఏరియా ఈశాన్య రాష్ట్రాలతో మిగతా దేశాన్ని అనుసంధానిస్తుంది… దేశరక్షణ రీత్యా ఎందుకు కీలకం అంటే…? ఇది బంగ్లాదేశ్ సరిహద్దు… అక్కడి నుంచి కొన్నేళ్లుగా విపరీతంగా జనం అక్రమంగా వలస వస్తున్నారు… రాగానే లోకల్ పొలిటిషియన్లు ఆధార్, వోటర్ కార్డులు ఇచ్చి, ఇండియన్ పౌరులుగా మార్చేస్తున్నారు…
Ads
మమత ఈ విషయంలో ముందంజ… వాళ్లే ఆమెకు వోటు బ్యాంకు… ఆమెకు దేశం, భద్రత, రక్షణ ఏమీ పట్టవు తెలుసు కదా… బోర్డర్‌లో కంచె వేయనివ్వదు, ఎన్ఆర్సీ వద్దు, సీఏఏ వద్దు, సర్ వద్దు.., సరిహద్దు జిల్లాల్లో డెమోగ్రఫీ ఎలా మారిపోయిందో కూడా ఆమెకు పట్టదు, స్ట్రెయిటుగా, సింపుల్‌గా చెప్పాలంటే ఆమె ఓ బంగ్లాదేశీ నాయకురాలు అనాలేమో…
1. ఉత్తర దినాజ్‌పూర్ (Uttar Dinajpur)… చికెన్ నెక్ ఏరియాలో అత్యంత కీలకమైన జిల్లా ఇది… ఇక్కడ డెమోగ్రఫీ దాదాపు సమాన స్థాయికి చేరుకుంది… 1951లో ముస్లిం జనాభా సుమారు 39% ఉండగా, 2011 నాటికి అది 49.92% కు పెరిగింది… హిందూ జనాభా 60% నుండి 49% కు తగ్గింది… ‘చోప్రా’ ‘ఇస్లాంపూర్’ వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల శాతం గణనీయంగా ఉండటంతో ఎన్నికల ఫలితాలను వారే శాసిస్తున్నారు…
2. మాల్దా (Malda) …. బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉండే ఈ జిల్లాలో జనాభా సమతుల్యత పూర్తిగా మారిపోయింది… 1951లో ముస్లింలు 37%, హిందువులు 62% ఉండేవారు… 2011 నాటికి ముస్లిం జనాభా 51.27% కి పెరిగి మెజారిటీగా మారగా, హిందూ జనాభా 48% కి తగ్గింది…
3. ముర్షిదాబాద్ (Murshidabad) … రాష్ట్రంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన జిల్లా ఇది… 1951లో ముస్లింలు 55%, హిందువులు 45% ఉండగా… 2011 నాటికి ముస్లింల సంఖ్య 66% కి చేరింది… హిందువుల సంఖ్య 33% కి పడిపోయింది… ఎన్నికల సమయంలో ఈ జిల్లా ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి…

చికెన్ నెక్ ప్రాధాన్యత… కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ ప్రాంతంలో జనాభా మార్పులు దేశ భద్రతకు కూడా సవాలుగా మారాయి… బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న భారత వ్యతిరేకత తెలిసిందే కదా… ప్రస్తుత 2026 ఎన్నికల నేపథ్యంలో, ఈ జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ (SIR 2025) ద్వారా లక్షలాది మంది పేర్లను పరిశీలనలో ఉంచడం రాజకీయ వేడిని పెంచుతోంది…
మనం ఈ ఏరియా ఎన్నికల గురించి చెప్పుకోవడానికి మరో కారణం… మజ్లిస్ పోటీ..! ఈసారి బెంగాల్ ఎన్నికల్లో కేవలం నామమాత్రంగా కాకుండా, ఒక వ్యూహాత్మక కూటమితో బరిలోకి దిగుతున్నాడు… కొత్త కూటమి (AIMIM + AJUP) … ఏజేయూపీ (ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ) ఎవరిదీ అంటే… తృణమూల్ కాంగ్రెస్ నుండి బహిష్కరణకు గురైన బలమైన నేత హుమాయున్ కబీర్ పార్టీ…
ఈ కూటమి రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లో 182 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది… ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ (చికెన్ నెక్ ఏరియా), కోల్‌కతాలోని కొన్ని మైనారిటీ సెంట్రిక్ ప్రాంతాలపై వీరు ప్రధానంగా దృష్టి సారించారు…
చికెన్ నెక్ ప్రాంతంలో ఒవైసీ ప్రభావం చూపే అవకాశం ఉంది… ముర్షిదాబాద్ & మాల్దా జిల్లాల్లో హుమాయున్ కబీర్‌కు మంచి పట్టు ఉంది… ఇక్కడ మెజారిటీ స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులను నిలబెడుతోంది… ఉత్తర దినాజ్‌పూర్… ఇక్కడి చోప్రా, ఇస్లాంపూర్ వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి ఒవైసీ స్వయంగా బహిరంగ సభలు నిర్వహించబోతున్నాడు…
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో ఈ కూటమి తరపున పూనమ్ బేగం అనే అభ్యర్థిని పోటీకి దించుతున్నారు… కోల్‌కతాలోని నాన్- బెంగాలీ ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా మమతకు ఇబ్బంది కలిగించాలనేది వీరి ప్లాన్…
2021 ఎన్నికల్లో AIMIM పెద్దగా ప్రభావం చూపలేకపోయింది మజ్లిస్ (కేవలం 6 సీట్లలో పోటీ చేసి 0.02% ఓట్లు వచ్చాయి)… కానీ ఈసారి కబీర్ వంటి స్థానిక నేతతో కలవడం, చికెన్ నెక్ వంటి కీలక ప్రాంతాల్లో డెమోగ్రఫీ మార్పులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూడటం గమనార్హం… ఇది మా ఓట్లను చీల్చి, పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుందని (B-టీమ్ అని) టీఎంసీ ఆరోపిస్తోంది…!!
Share this Article