Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనవాళ్లూ తీశారు బోలెడు వైవిధ్యభరిత కథాచిత్రాలు… చిలకమ్మ చెప్పిందీ అదే…

September 17, 2024 by M S R

45 ఏళ్ల కింద ఇంత సంచలనాత్మక సినిమా తీసిన నిర్మాతలకు , దర్శకులకు హేట్సాఫ్ . ఇద్దరు స్త్రీల కధ . ముఖ్యంగా మల్లి అనే ఒక సాధారణ , సంచలనాత్మకంగా ఆలోచించగల స్త్రీ కధ . మల్లికి ఎన్నో కలలు . జీవితాన్ని అనుభవించాలనే పేద పిల్ల . సినిమా పేరు చిలకమ్మ చెప్పింది .

మనిమనిషిగా ఉన్న మల్లిని ఇంటి యజమానురాలి తమ్ముడు ప్రేమించానని చెప్పి గర్భవతిని చేస్తాడు . ఆ యజమానురాలు ప్రమీలాదేవి గారి వారసురాలు . ప్రపంచంలో మగవాళ్ళందరూ దుర్మార్గులు , కేవలం ఆడవారిని మోసం చేయటమే వారి పని అని ఆమె ప్రగాఢ నమ్మకం . ఆమె తమ్ముడు స్నేహితుడే ఆ గర్భానికి కారణమని నమ్ముతుంది .

ముగింపులో బిడ్డను కన్న మల్లిని పెళ్లి చేసుకోవటానికి అందరూ చీరె సారెతో వస్తే మల్లి అందరికీ షాక్ ఇస్తుంది . పెళ్లి చేసుకోనని ప్రకటిస్తుంది . భర్త అంటే కష్టాల్లో వెంట ఉండేవాడని చెప్పి , తనను ఆదుకొన్న మరో నౌకరు , తనను మౌనంగా ఆరాధించే చెవిటివాడిని పెళ్లి చేసుకుంటానని చెపుతుంది . సినిమా ముగుస్తుంది .

Ads

1977 లో వచ్చిన మన తెలుగు సినిమాకు మాతృక అడిమైకళ్ అనే మళయాళం సినిమా . మన తెలుగు సినిమాలో మల్లిగా శ్రీప్రియ , ప్రమీలాదేవి వారసురాలు భారతిగా సంగీత , మౌనంగా ఆరాధించే చెవిటి కాశీగా నారాయణరావు , యజమానురాలి తమ్ముడిగా లక్ష్మీకాంత్ , అతని స్నేహితుడు కమ్ ట్రబుల్ షూటరుగా రజనీకాంత్ నటించారు . రజనీకాంత్ మన తెలుగులో డైరెక్ట్ సినిమాలలో మొదట్లో చాలా సినిమాలలో నటించాడు . ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రే .

sangeeta
మలయాళం సినిమాలో శ్రీప్రియ నటించిన మల్లి పాత్రను ఊర్వశి శారద నటించింది . నారాయణరావు పాత్రను ప్రేమ నజీర్ నటించారు . మన తెలుగు సినిమాకు పర్యవేక్షణ బాధ్యత వహించిన బాలచందర్ తర్వాత ఆయనే తమిళంలో తీసారు . తమిళంలో కమల్ హసన్ నటించారు .

ఈ నలుపు తెలుపు ఆఫ్ బీట్ సినిమాకు డబ్బులు ఎలా వచ్చాయో నాకు తెలియదు కానీ సినిమాకు ప్రశంసలు , అవార్డులు వచ్చాయి . రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి బంగారు నంది అవార్డును ఇచ్చింది . ఈ సినిమాకు నిర్మాత ప్రముఖ రాజకీయ నాయకులు చేగొండి హరి రామజోగయ్య . దర్శకులు ఈరంకి శర్మ . గణేష్ పాత్రో డైలాగులు వ్రాసారు . పాటల్ని ఆత్రేయ , వేటూరి వ్రాసారు .

యం యస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో పాటలు బయట గొప్పగా హిట్ కాలేదు కానీ. థియేటర్లో చాలా బాగుంటాయి . బాలసుబ్రమణ్యం పాడే కుర్రాడనుకుని కునుకులు తీసే అనే పాట భలే బాగుంటుంది . రాగాలు తానాలు నాకు తెలియవు కానీ గాత్రంలో చాలా వంపులు ఉండి , గమ్మత్తుగా ఉంటుంది . చిట్టి చిట్టి చేపల్లారా , ఎందుకు నీకీ దాపరికము పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

మన తెలుగు సినిమా 1978 లో మన దేశంలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . ఇతర ప్రధాన పాత్రల్లో హేమ సుందర్ , పి యల్ నారాయణ నటించారు . 1978 లో వచ్చిన శ్రీదేవి- చంద్రమోహన్ల పదహారేళ్ళ వయసు సినిమాలో ఈ సినిమా ఛాయలు కనిపిస్తాయి .

సినిమా యూట్యూబులో ఉంది . ఆఫ్ బీట్ సినిమాలను చూడకలిగే ఓపిక , టేస్ట్ ఉన్నవారు తప్పక చూడండి . చూడతగ్గ సినిమా . అయిదు ప్రధాన పాత్రలను నటించిన రజనీకాంత్ , నారాయణరావు , శ్రీప్రియ , సంగీత , లక్ష్మీకాంత్ చాలా బాగా నటించారు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు   ….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions