చిన్న వార్తే… కానీ చాలామంది చేస్తున్న పెద్ద తప్పు… అమెరికా వంటి దేశాల్లో ఓ వయస్సు వచ్చే వరకు పిల్లల్ని కారులో ఎటైనా తీసుకెళ్తున్నప్పుడు తప్పకుండా ఊయల వంటి ఓ బాక్సు (దాన్ని చైల్డ్ కార్ట్‌కు తగిలించి తోసుకుంటూ తీసుకుపోవచ్చు), దానికి సీటు కారుతో బెల్టు, పిల్లలు కదలకుండా స్ట్రాప్ ఉంటయ్…
చిల్డ్రన్ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ… ఇండియాలో ఇలాంటివేమీ ఉండవు… సరే, ఇది వేరే వార్త… రాజస్థాన్‌లో కోట… అదేనండీ ఫుల్లు కమర్షియల్ కోచింగ్ సెంటర్లు ఉండే ప్రాంతం… ప్రదీప్ నగర్ అని ఓ పెద్ద మనిషి… జోరావర్‌పురలో ఓ పెళ్లికి పెళ్లాం పిల్లలతో సహా కారులో బయల్దేరాడు… ఇద్దరు పిల్లలు, తను, భార్య… ఆనందంగా ఉన్నారు, ఫంక్షన్ హాల్ చేరాడు…
ఒక పిల్ల అమ్మతోపాటు కారు దిగింది… ఆమె హాలులోకి ముందే నడిచింది… కారు పార్క్ చేసి వస్తాను పదమన్నాడు ఆయన… మరో మూడేళ్ల పిల్ల కారులోనే ఉంది… డాడీతోపాటు వస్తుందిలే అనుకుంది ఆవిడ… ఆల్రెడీ అమ్మతోపాటు హాలులోకి వెళ్లిపోయింది అనుకున్నాడు డాడీ… ఆయన కారు తాళం వేసుకుని తనూ హాలులోకి వెళ్లిపోయాడు…
Ads
ఇద్దరూ తమకు బాగా పరిచయం ఉన్న సర్కిళ్లలో చేరి ముచ్చట్లలో మునిగిపోయారు… కాసేపటికి సోయి తెచ్చుకుని చూస్తే డాడీ దగ్గర లేదు బిడ్డ, మమ్మీ దగ్గర లేదు… అటూఇటూ చూసి, అరె, కారులోనే మరిచిపోయామా అనుకుని పరుగెత్తారు… అప్పటికే రెండు గంటలైంది… కారు తాళం తీసి చూస్తే బిడ్డ కారు వెనుక సీటులో (పేరు గోర్విక) స్పృహ తప్పి ఉంది…
సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు… అప్పటికే బిడ్డ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు… అటాప్సీకి గానీ, పోలీస్ కేసుకు గానీ సమ్మతించక ఆ పేరెంట్స్ ఏడుస్తూ ఇంటికి బయల్దేరారు… చాలాచోట్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి… ఆ బిడ్డ ఏడ్చి ఉంటుంది, షాక్, మరోవైపు కారులో ఉన్న ఆక్సిజెన్ అయిపోయి ఉంటుంది… లోపలకు గాలి ప్రసరించే చాన్సే లేదు… బిడ్డ ఎంత యాతన పడి ఉంటుందో…
ఇది నిర్లక్ష్యమే… ఎవరూ కావాలని చేసుకోరు… కానీ పార్కింగ్ చేసి వచ్చేవరకు ఆమె ఆగలేదు… లోపలకు ఇద్దరు పిల్లలు అమ్మతోపాటు వెళ్లారా లేదా అని డాడీ చూసుకోలేదు… క్షమించరాని నిర్లక్ష్యం ఓ పాపను బలితీసుకుంది… మరీ అంత సోయి తప్పి వ్యవహరిస్తే… ఇదుగో ఇలాంటి నష్టమే… సరిదిద్దుకోలేని తప్పు… సో, పేరెంట్సకు ఇదొక లెసన్… విలువైన పాఠం…
Share this Article