చిలుకూరు వెంకటేశ్వరస్వామి టెంపుల్ పూజారి రంగరాజన్… సర్కారీ దేవాదాయ దుష్ట చెరలోనికి చిలుకూరు గుడి వెళ్లకుండా… గుళ్ల స్వయంప్రతిపత్తికి పోరాడుతున్న ఆ గుడి పూజారుల పట్ల సద్భావన ఉంది… ఓ దళితుడిని భుజాలపై ఎక్కించుకుని గుడిప్రవేశం చేసిన తీరు పట్లా అభినందన… వీఐపీ ప్రవేశాల పేరిట దేవుడిని అమ్మకానికి పెట్టని ఆచరణ పట్ల ప్రశంస కూడా…
కానీ నీకెందుకు స్వామీ… ఆదిపురుష్ మీద వాచాలత… ఆఫ్టరాల్ అదొక సినిమా… ఎస్, తిరుమల కొండ మీద దాని పవిత్రతను కాలరాస్తూ సదరు తిక్క దర్శకుడు ఆ హీరోయిన్‌ను ముద్దుపెట్టుకున్నాడు… నువ్వు తిట్టిపోశావ్… అందులో అర్థముంది… నీ వృత్తికి, ప్రవృత్తికీ లింక్ ఉంది… కానీ ఆదిపురుష్ అనే సినిమాను అందరూ చూడాలని పిలుపునివ్వడం ఏమిటసలు..? నువ్వెందుకు పీఆర్వో జాబ్‌కు పూనుకున్నట్టు..?
తిరుమలపై దర్శకుడు, హీరోయిన్ల ముద్దులాటను విమర్శించి తప్పుచేసినట్టు ఫీలవుతున్నావా..? ఆ పాప పరిహారానికి ఇలా సినిమాకు ప్రమోషన్ చేస్తున్నావా..? ఏమిటేమిటి..? ‘‘వాల్మీకిలాగా ఎవరూ తీయలేరు, రాయలేరు… ఐనా రాముల వారి గుణగణాల గురించి అందరూ నెట్‌లో వెతుకుతున్నారు… దానికి కారణం ఆదిపురుష్ సినిమా… కాబట్టి ఆదిపురుష్ దిగ్రేట్, అందరూ చూడాలి’’… ఇదెక్కడి పైత్యం స్వామీ…
Ads
https://twitter.com/SureshPRO_/status/1671064962167635969?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1671064962167635969%7Ctwgr%5E948dc863766c9e3023764d87a37ea1fa6635f534%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.dishadaily.com%2Fmovie%2Fchilukuri-balaji-temple-priest-about-adipurush-223856
అప్పట్లో ఎన్టీయార్ కీచకుడు, దుర్యోధనుడు, రావణాసరుడు గట్రా విలన్ పాత్రల్ని తన ఇమేజ్‌ను పణంగా పెట్టి హీరోదాత్తంగా చిత్రీకరించాడు… అందరూ మెచ్చుకున్నారు, ఆమోదించారు… అప్పట్లో నెట్ లేదు గానీ పత్రికల్లో ఆయా పాత్రల గుణగణాలను వెతికి మరీ చదివారు… ఐనంతమాత్రాన ఆ పాత్రలు సర్వామోదాలు అయిపోతాయా..? హీరోలు అయిపోతారా..? ఇదీ అంతే…
ఒక సినిమా… వాడికి తీయరాలేదు… భ్రష్టుపట్టించాడు… కించపరిచాడు… మొదట్లో నీలాగే ఈసినిమాను అందరూ చూడాలి, లేకపోతే పుట్టగతులు ఉండవు అన్నట్టు ప్రచారం చేసిన కాషాయ సెక్షనే ఇప్పుడు సినిమాను బ్యాన్ చేయాలని యూపీలో ఆందోళనలు చేస్తున్నయ్… ఇప్పుడు చెప్పండి, ఈ సినిమా చూడబులా..? లేదా..?
హనుమంతుడి పాత్రచేత నీచమైన డైలాగులు వినిపించాడు మాటల రచయిత… అబ్బే, ఇది రాయాయణమే కాదంటాడు, ఉద్దేశపూర్వకంగానే ఆ డైలాగులు రాశానంటాడు, మళ్లీ మాటమార్చి ఆ డైలాగులు మార్చేస్తామంటాడు… ఇక ఆ దర్శకుడైతే అసలు రామాయణం అర్థమే కాదు అంటాడు… ఓ చెత్తా సినిమా తీయడమే కాదు, ఇష్టారీతిన మాట్లాడుతున్నారు… ఈ మహత్కార్యాన్ని సపోర్ట్ చేస్తున్నావా రంగరాజన్..? ఐనా నీకెందుకు ఈ ప్రమోషన్ తీట పంతులు గారూ… తనకున్న మంచి ఇమేజీని ప్రభాస్ చెడగొట్టుకున్నాడు ఈ సినిమా అంగీకరించి… మీకూ మంచి ఇమేజీ ఉంది, ఆదిపురుష్‌కు వత్తాసు పలుకుతూ మీరూ ప్రభాస్‌లాగే…!!
Share this Article