చైనాది దురాక్రమణ బుద్దే… డౌటే లేదు… మన కళ్ల ముందే టిబెట్‌ను మింగేసిన తీరు చూశాం… మన సరిహద్దుల్లోనూ చొచ్చుకు వస్తూనే ఉంటుంది… అటు గల్వాన్, ఇటు తవాంగ్‌లోనూ సరిహద్దుల్లో ఇళ్లను నిర్మిస్తూ జవాన్లను తరలిస్తోంది… యుద్ధస్థావరాలుగా మారుస్తుంది… గతంలో వేరు, కానీ ఇప్పుడు మన సైనికులు ఎవరైనా చైనా జవాన్లు సరిహద్దులు దాటి వస్తే చాలు, ముళ్ల తీగె చుట్టిన రాడ్లతో ఈడ్చి కొడుతున్నారు… చైనా జవాన్లు పలుసార్లు పారిపోతున్నారు… ప్రభుత్వం కూడా పలుచోట్ల బ్రహ్మాస్ వంటి అత్యంతాధునిక క్షిపణులను మొహరించింది… తరచూ యుద్ధవిమానాలను తిప్పుతోంది… ఇప్పుడు రాఫెల్ కూడా వచ్చి చేరింది…
ఇది రియాలిటీ… కానీ సమస్యను పక్కదోవ పట్టించడానికి అబద్ధాలు ఆడటం చైనాకు అలవాటే… అది పాశ్చాత్య మీడియాను కూడా మించిపోతుంది… తక్కువేమీ కాదు… అరుణాచల్‌ప్రదేశ్‌లో పలుచోట్ల సరిహద్దులు దాడి చొచ్చుకు రావడానికి ప్రయత్నంచడం, మన జవాన్లు నిలువరించడం, ఉద్రిక్తతలు సాగుతూనే ఉన్నాయి కదా… దాన్ని ఓ అబద్ధంతో కవర్ చేయడానికి, తీవ్రతను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది చైనా… అందులో భాగమే అన్నట్టుగా ఓ వార్త నిన్నటి నుంచీ చక్కర్లు కొడుతోంది…
‘‘కార్డిసెప్స్ అనే ఫంగస్ కోసం చైనా దురాక్రమణ చేస్తోంది… ఇదే చెబుతూ ఇండోపసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (ఐపీసీఎస్‌సి) ఓ రిపోర్ట్ విడుదల చేసింది… హిమాలయ పీఠభూముల్లో మాత్రమే దొరికే పసుపు కొమ్ముల వంటి ఈ మూలిక బంగారంకన్నా ప్రియమైంది… దానికోసమే చైనా హద్దులు దాటి ఇండియన్ టెరిటరీలోకి వస్తోందట…’’ ఇదీ ఆ వార్త సారాంశం… ఒకరకంగా అబ్సర్డ్… వయగ్రాతో సమానంగా చైనా ఆయుద్వేద వైద్యులు తరతరాలుగా నమ్ముతున్న ఈ కార్డిసెప్స్ ధరలు మరీ విపరీతంగా పెరిగాయినేది నిజమే… కానీ..?
Ads
అసలు ఏమిటీ కార్డిసెప్స్..? హిందీలో కీడాజెడి అంటుంటారు… నిజం చెప్పాలంటే… ఈ కీడా జెడి మూలిక కాదు… మొక్క కాదు… దుంప కాదు… చెట్లపై పెరిగే పరాన్నజీవి కూడా కాదు… పుట్టగొడుగు వంటి ఒకరకం ఫంగస్ కూడా అసలే కాదు… శిలీంధ్రమూ కాదు… అసలు దీన్ని జీవజాలంలోని ఏ కేటగిరీలో చేర్చాలో తెలియదు… ఒకరకం గొంగళిపురుగులు మరణించాక ఓరకమైన జీవజాలం వాటిపై పెరుగుతుంది… అవి ఎండిపోయి ఇలా కనిపిస్తాయి… అదే కీడా జెడి…
చైనా ఆయుర్వేదం శృంగార సామర్థ్యం పెంచే మందుగా మాత్రమే కాదు… సుగర్, కేన్సర్, బీపీ, కాళ్ల నొప్పులు, స్పాండిలైటిస్, జీర్ణవ్యాధులు… వాట్ నాట్… అద్భుతమైన రోగనిరోధకశక్తిని పెంచి మనిషి ఆయుష్షును పెంచుతుందని నమ్ముతుంది… అయితే వీటి డిమాండ్ పెరిగీ పెరిగీ కొన్నేళ్లుగా మొత్తం ఈ జీవజాలమే అంతరించిపోతోంది… దొరకడం లేదు… ఇదీ కఠినవాస్తవం… దీనిపైనే ఆధారపడిన నేపాల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల కూలీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు…
ఇక రియాలిటీ ఏమిటంటే..? నిజంగానే చైనా విపరీతంగా వాడీ వాడీ ఈ జాతి అంతరించిపోతోంది… రేట్లు కూడా బంగారంకన్నా ఎక్కువయ్యాయి… మన ఆయుర్వేద వైద్యులు కూడా తరచూ నేపాల్, ఉత్తరాఖండ్ వెళ్లి తెచ్చుకునేవాళ్లు… ఇప్పుడు దొరకక వెళ్లడం లేదు… ఆమధ్య ఎవరో ‘‘నేను దీన్ని పండించాను..’’ అని క్లెయిమ్ చేసేసరికి ఆ వార్తను జనం విపరీతంగా చదివారు… ఈ కార్డిసెప్స్‌ను పండించడం అనేది కుదరదు… (ఈ కార్డిసెప్స్‌ను టిబెట్, నేపాల్‌లలో యర్సగుంబ అంటారు…) నిజంగా పండించే చాన్స్ ఉంటే కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే కుమ్మేసేవి కదా… అది సహజసిద్ధంగా కొన్ని నేలల్లో మాత్రమే దొరుకుతుంది…
కొన్ని జీవజాతులకు కొన్ని నేలలతోనే సంబంధం ఉంటుంది… ఇదీ అంతే… అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో దీని ఉనికి పెద్దగా ఉండదు… ఇది దొరికేది ఎక్కువగా నేపాల్, కొంతమేరకు ఉత్తరాఖండ్… అసలు అరుణాచల్‌ప్రదేశ్ బోర్డర్‌లో పెద్దగా కనిపించని దీనికోసం చైనా దురాక్రమణకు దిగుతోంది అనడం, దీనికోసమే చైనా జవాన్లు ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు అని తేల్చేయడం ఎంత ఫూలిష్‌నెస్… మరి సదరు సంస్థ ఎందుకు ఈ ప్రచారానికి దిగింది… ఏముంది..? ఇష్యూను పక్కదోవ పట్టించడం, సమస్య తీవ్రతను తగ్గించి చూపడం… చైనా కోసమేనా..? అవును, చైనాకు ఈ విద్య కూడా బాగా తెలుసు…
ఈ సంస్థ గత ఏడాదే ఏర్పాటైంది… తప్పుడు సమాచారాన్ని నిరోధించి, సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ఏర్పడినట్టు చెప్పుకుంటుంది… ఇది సరైన సమాచార వ్యాప్తి…? దరిద్రం ఏమిటంటే..? ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది… కీలకసభ్యులు ఇండియన్సే..!!
Share this Article