కరోనా సమయంలో ఎస్బీఐ రెగ్యులర్‌గా నివేదికలు విడుదల చేసేది… WHO ఇండియా విభాగం అన్నట్టుగా…! ఈ బ్యాంకుకు కరోనాతో సంబంధం ఏమిటనే ప్రశ్నలు తలెత్తినా సరే, మన మీడియా కథనాల్లాగే భయాందోళనల్ని మరింత పెంచేవి ఆ రిపోర్టులు… ఓ వార్త చదివాక ఇదే గుర్తొచ్చింది…
మైక్రోసాఫ్ట్ ప్రకటన ఇది… అమెరికా, దక్షిణ కొరియాలతోపాటు ఇండియా జనరల్ ఎలక్షన్స్‌ను ప్రభావితం చేయడానికి చైనా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించే అవకాశమున్నట్టు ఆ ప్రకటన చెబుతోంది… (ఇది కొత్తేమీకాదు, రష్యన్ అధినేత పుతిన్ గతంలో అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయడానికి సోషల్ మీడియా బోట్స్ (ఆర్టిఫిషియల్, మెకానికల్ పోస్టులు) ఉపయోగించినట్టు వార్తలు కూడా వచ్చాయి…)
చైనా ఏదైనా చేయగలదు… అది అందరికీ తెలిసిందే… కానీ మైక్రోసాఫ్ట్ ఎందుకు ఈ ఆందోళనను వెలిబుచ్చింది..? మళ్లీ తనే చెబుతుంది… అఫ్‌కోర్స్ చైనా ప్రయత్నాలు ఏమీ ప్రభావం చూపించబోవని..! ప్రభావం చూపించకపోయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఎఐ) ద్వారా క్రియేట్ చేసిన మీమ్స్, పోస్టులు, వీడియోలు, ఆడియోల్ని చైనా ప్రయోగిస్తుందని Microsoft Threat Analysis Center (MTAC) చెబుతోంది…
Ads
ఈ రకమైన ప్రయోగాల్ని ఆల్రెడీ చైనా జనవరిలో తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రయత్నించిందట… ఒక ప్రభుత్వమే ఇతర దేశాల ఎన్నికలపై ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి అట… అన్నట్టు చైనా ఒక్కటే కాదు, ఈ సైబర్ యజ్ఞంలో ఉత్తర కొరియా కూడా ఉందట… అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయట…
చైనా ప్రధానంగా మూడు సైబర్ టీమ్స్‌ను వాడుతోంది… ఒక టీమ్ దక్షణ పసిఫిక్ దీవుల వ్యవహారాలను చూస్తుంది, మరొకటి దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని పట్టించుకుంటుంది… మూడో టీమ్ అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ వ్యవహారాల్ని చూస్తుంది… ఫ్లాక్స్ టైఫూన్ అనే సైబర్ ప్లేయర్ ఫిలిప్పీన్స్, హాంగ్ కాంగ్, ఇండియా, అమెరికాలను లక్ష్యంగా చేసుకుంటుందని మైక్రోసాఫ్ట్ వివరించింది…
సరే, రాబోయేకాలంలో సైబర్ యుద్ధాలే అధికం… చైనా మరీ ముందుకు ఆ దిశలో దూసుకుపోతుంది అనుకుందాం… తట్టుకుని, విరుగుడు ప్రయోగించే దిశలో ఇతర దేశాలు కూడా గేరప్ కావల్సిందే… తప్పదు… కానీ చైనా ఇంత టెక్నాలజీ వాడి, ఎన్నికలను ప్రభావితం చేయడానికి విశ్వప్రయత్నం చేసినా సరే… రాబోయే ఎన్నికల్లో చైనా విధేయ పార్టీ సీపీఐఎంకు ఎన్ని సీట్లు సాధించి పెడుతుందో చూద్దాం… అదీ కేరళలో తప్ప ఇంకెక్కడైనా ఏమైనా సీట్లు సాధించి పెట్టగలదా..?!
Share this Article