.
ఆమె… ప్రస్తుతతరం మహిళలు, ప్రత్యేకించి ఏ లక్ష్యమూ లేకుండా, ప్రేమ వికారాల్లో పడి సమాజానికి వైరసులుగా మారుతున్న యువ మహిళలు ఖచ్చితంగా ఈమె జీవితాన్ని చూసి, చదివి స్పూర్తి పొందాలి… ఇలాంటోళ్లే సరైన మార్గదర్శనం చేసే దివిటీలు… ఇంతగా మెచ్చుకుంటున్న ఆమె పేరు కోచ్… క్రిస్టినా హమ్మోక్ కోచ్… వయస్సు 47…
- ఏమిటీ స్పెషాలిటీ అంటారా..? లైఫ్ అంతా సాహసంతో ఎంచుకుని మరీ సవాళ్లను ఎదురీది గెలిచింది… మనం ఓ కల్పనా చావ్లా గురించి చదివాం, మొన్నమొన్నటి సునీతా విలియమ్స్ గురించీ తెలుసుకున్నాం… ఇద్దరూ ఇండియన్ రూట్స్… కానీ ఓసారి ఈ క్రిస్టినా గురించీ చదవాలి… అంతరిక్ష ప్రయాణం ఆమెకు ఓ ఆట… అంతేకాదు, మంచు ధ్రువాలు కూడా…
అవును, ఇంతకుముందే క్షేమంగా చంద్రుడి నుంచి భూమికి తిరిగివచ్చిన ఆ నలుగురు ఆర్టెమిస్-2 మిషన్ సభ్యుల్లో ఆమె కూడా ఉంది… అందుకే ఓసారి చెప్పుకుందాం ఆమె ఎవరో.,.
Ads

పుట్టింది మిచిగాన్… ఓ మధ్యతరగతి అమెరికన్ కుటుంబం… చిన్నప్పటి నుంచే ఆకాశం ఆమె ప్యాషన్… పైలట్ కావాలి లేదంటే వ్యోమగామి కావాలనేదే ఆమె కల… అందుకే ఆమె చదువును కూడా అదే దిశలో సాగించింది… 1999… ఘనా విశ్వవిద్యాలయంలో ఖగోళ భౌతిక శాస్త్రం చదివింది… నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ మాథమెటిక్స్‌లో గ్రాడ్యుయేషన్… నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్‌లలో డిగ్రీలు… తరువాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టర్స్… 2001లో నాసా అకాడమీ ప్రోగ్రామ్…
తన లక్ష్యం వైపు ప్రయాణం నుంచి దారి తప్పలేదు, డీవియేట్ కాలేదు… మొదట్లో అంతరిక్ష- విజ్ఞాన పరికరాల అభివృద్ధి, రిమోట్ సైంటిఫిక్ ఫీల్డ్ ఇంజనీరింగ్‌లో పనిచేసింది…. తరువాత నాసా గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (GSFC) లాబొరేటరీ ఫర్ హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా.., పలు నాసా మిషన్లకు పని… ఇప్పటివరకూ ఆమె చేసిన కొలువులన్నీ సాహసాలే… వివరంగా చెప్పుకుందాం…
- 2004 నుంచి 2007… అంటార్కిటిక్ ప్రోగ్రామ్‌లో రీసెర్చ్ అసిస్టెంట్ తను… ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మూడున్నరేళ్లు గడిపింది… మైనస్ 79.4 డిగ్రీల సెల్సియస్ శీతలంలో పని… నెలల తరబడీ సూర్యుడిని చూడకుండా… అదే సిబ్బందితో, ఏ కమ్యూనికేషన్లూ లేని వాతావరణంలో… ఫ్రెష్ ఫుడ్ కూడా లేకుండా… ప్రపంచానికి దూరంగా… కుటుంబానికి దూరంగా, ఎమోషనల్ ఒంటరితనంలో అంతకాలం గడపడం గ్రేటే…

కానీ ఆమె కల వ్యోమగామి కావడం, అంతరిక్ష ప్రయాణాలు కదా… నాసా 2013లో ఎంపిక చేసిన వ్యోమగాముల టీమ్‌లో చేరింది… దృఢమైన మానసిక, దైహిక శిక్షణ, టెక్నికల్ అంశాల అధ్యయనం… 2019లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం… అక్కడే మొదటి మహిళా స్పేస్‌వాక్ నిర్వహణ…
328 రోజులు… అంతరిక్షంలో అన్నిరోజులు గడిపిన ఏకైక మహిళ… ఆమెదే ఆ రికార్డు… అంత ప్యాషన్, అనుభవం ఉన్నాయి కాబట్టే ఆర్టెమిస్ చంద్రయాత్రకు వెళ్తావా అనడగ్గానే మరుక్షణం కూడా ఆలోచించకుండా సై అనేసింది… ఇది నిజానికి ప్రాణాంతకమైన యాత్ర… ఆమెకు సవాళ్లు కొత్త కాదు కదా…
చంద్రుడి అవతలి వైపుకు వెళ్లింది ఆమె ఉన్న నలుగురి టీమ్… చంద్రుడి దరిదాపుల్లోకి వెళ్లిన మొదటి మానవులు… క్షేమంగా తిరిగి వచ్చింది… ఆమె పెళ్లి చేసుకున్నది కూడా ఓ ఇంజినీర్‌నే… జియో స్పేషియల్ ఇంజినీర్ తను… పేరు బాబ్… ఆమెకు లభించిన అవార్డులు, గౌరవాలు అనేకం… 2020 సంవత్సరపు 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల టైమ్ జాబితాలో ఉంది…!!
Share this Article