Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దర్శకుడే ఓ స్వాతిముత్యం… ఫెయిర్ అండ్ లవ్‌లీ ఎంటర్‌టెయినర్…

October 5, 2022 by M S R

వీర్యదానం ఈరోజుల్లో చాలా కామన్… పైగా చాలామంది వాళ్ల వాస్తవ వివరాలు ఇవ్వరు… ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు… ఒకవేళ నిజమైన వివరాలే సదరు వీర్యదాత ఇచ్చినా అవి బయటపెట్టకూడదు… ఇలా చాలా లెక్కలుంటయ్… అలాంటిది ఎప్పుడో ఓసారి వీర్యదానం చేస్తే, దాంతో సరోగసీ ద్వారా ఓ బిడ్డ పుడితే… ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొచ్చి, పెళ్లి వేళ, ఇదుగో నీ బిడ్డ అని చేతిలో పెడితే..? బేసిక్ స్టోరీ పాయింట్ బాగుంది కదా…

ఎస్… ఓ భిన్నమైన స్టోరీ లైన్…. ఈ చెత్తహీరోల డిష్యూం డిష్యూం యాక్షన్ సీన్లు, బొమ్మ తుపాకుల గర్జనలు, బిల్డప్పులు… (గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ బైక్ మీద నుంచి మిసైల్ ప్రయోగిస్తాడు…) ప్రేక్షకుల్ని ఎడ్డి ఎదవల్ని చేసే మూసీ మురికి వాసనలకు భిన్నంగా… ఓ ప్లజెంట్ స్టోరీ లైన్… డిఫరెంట్ లైన్… దాని ఆధారంగా కామెడీ, ఫన్, ఎంటర్‌టెయిన్‌మెంట్ సీన్లు రాసుకోవడం, అల్లుకోవడం… బాగుంది… అయితే…

బెల్లంకొండ గణేష్ అంటే మస్తు బ్యాక్ గ్రౌండ్… నేపథ్యం ఉంది కదాని డిష్యూం డిష్యూంలు, ఐటమ్ సాంగులతో ప్రేక్షకుల్ని చావదొబ్బి, మాస్ హీరో అనుకోవాలని కోరుకోలేదు… ప్రస్తుతం ఆ సీన్ లేదు కూడా… ఈ పిచ్చి గెంతులు, ఎడ్డి ఫైట్లను ఎవడూ దేకడం లేదు… కాకపోతే సరదాగా, సున్నితంగా, ఓ డిఫరెంట్ కంటెంటును ఎలా డీల్ చేశారనేదే ముఖ్యం… ఈ స్వాతిముత్యం సినిమా అదే…

Ads

వర్ష

నిజానికి బెల్లంకొండకు అనుభవం లేదు… ఎంత సీరియస్ ఎఫర్ట్ పెట్టినా సరే, ఆ కొత్తదనపు తడబాటు గట్రా కనిపిస్తూనే ఉంటయ్… సో, వర్ష బొల్లమ్మ పూర్తిగా సినిమాను మోసే బాధ్యతను తనపై వేసుకుంది… సమర్థంగా నెరవేర్చింది… ఆమె కనబడినంత సేపూ ప్లజెంటుగా ఉంటుంది… పైగా బెల్లంకొండ కొడుకు కదా… తనను కష్టపెట్టే సీన్లను ఏమీ క్రియేట్ చేయలేదు దర్శకుడు…

మిగతా చాలామంది నటులు ఉన్నారు… ఎవరికి తగిన పాత్రలు వాళ్లకు… నిజానికి ఇలాంటి సినిమాలకు కలిసి రావల్సింది మ్యూజిక్… అందులో సినిమా ఫ్లాప్… ఒక్కటంటే ఒక్క మంచి ట్యూన్ లేదు, గుర్తుండదు… కంటెంట్ మాట దేవుడెరుగు… కాకపోతే పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే..? సినిమా లెంత్ తక్కువగా ఉండటం కూడా రిలీఫ్… మరి ఈమాత్రం దానికి థియేటర్ దాకా ఎందుకు వెళ్లడం, ఓటీటీలో రాదా..? టీవీలో రాదా అంటారా..? ఏమంటాం… మీరు తెలివైనవాళ్లు అని అభినందిస్తాం…

పెద్ద సంక్లిష్టమైన సీన్లు ఏమీ ఉండవ్ సినిమాలో… షార్ట్ ఫిలిమ్‌కు ఎక్కువ… ఫీచర్ ఫిలిమ్‌కు తక్కువ… చాలా చౌక ఖర్చుతో చుట్టేశారు… బహుశా వర్ష బొల్లమ్మకు ఇచ్చిందే ఎక్కువ రెమ్యునరేషన్ అయి ఉంటుంది… ఆమె ఆ డబ్బుకు న్యాయం చేసింది… కాకపోతే ఓ సున్నితమైన సబ్జెక్టును అగ్లీ కోణంలో గాకుండా, డర్టీ కంటెంట్ యాడ్ చేయకుండా క్లీన్‌గా, ప్లెయిన్‌గా ప్రజెంట్ చేసినందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి… పిచ్చి పిచ్చి డ్రామా జోలికి కూడా పోలేదు… దర్శకుడు మంచి స్వాతిముత్యం…!! సినిమాలో చెప్పుకోదగిన విశేషం వర్ష మాత్రమే కాదు… రావు రమేష్ కూడా…!! దర్శకుడు లక్ష్మణ్‌కు భవిష్యత్తు ఉంది…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…
  • వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…
  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions