ఠాక్రే కాలం నుంచీ శివసేన నినాదం… జై భవానీ వీర శివాజీ… ఆ శివాజీని స్తుతించడం, మరాఠీ సంస్కృతికి పట్టం, భవానీ ఆరాధన శివసైనికుల బాధ్యతగా నూరిపోశాడు ఠాక్రే… బీజేపీ బీజేపీ అంటుంటారు గానీ బీజేపీకన్నా హార్డ్ కోర్ హిందుత్వవాాది ఠాక్రే… ఆ పార్టీ బలమే అది…
ఎప్పుడైతే తమ భావజాలానికి పూర్తి విరుద్ధంగా నడుచుకునే కాంగ్రెస్, ఎన్సీపీతో కలిశారో… కేవలం అధికారం కోసం నాటి ఠాక్రే ఐడియాటజీకి నీళ్లొదిలారో అప్పట్నుంచే పతనం ఆరంభమైంది… కేడర్ డిమోరల్ అయిపోయింది… వాళ్ల బేసిక్ సిద్ధాంతమే వాళ్లు చెప్పుకోలేని దురవస్థ. ఇన్నాళ్లూ ఎవరితో పోరాడారో వాళ్లతోనే చేతులు కలపడం ఇష్టం లేక… షిండే పార్టీని చీల్చగానే అందరూ తన వెంట నిలబడ్డారు… చివరకు ఉద్దవ్ ఠాక్రే చేజారిపోయింది శివసేన…
ఇప్పుడు జరిగిన నష్టం గుర్తించాడు, తమ ప్రచారగీతంలో భవానీ, హిందూ పదాలున్నాయని ఎన్నికల సంఘం ఆక్షేపిస్తే, వాటిని తొలగించేది లేదనీ, ఏం చేస్తారో చేయండనీ ధిక్కరించాడు… అవును, పోయేదేముంది..? ఎలాగూ శివసేన తనది కాదు ఇప్పుడు…? ఐతే ఈరోజుకూ అదే కాంగ్రెస్, అదే ఎన్సీపీతో కూటమిగా ఎన్నికల్లో పోటీపడుతూ… భవానీ, శివాజీ, హిందూ అని గీతాలు పాడినా వచ్చేదేముంది..?
Ads
మోడీ, అమిత్ షాలు బహిరంగంగా అయోధ్య, హిందూ పేర్ల చెప్పి వోట్లడుగుతుంటే ఏం చేశారని ఎన్నికల సంఘాన్ని అడిగాడు… నిజమే… ఐతే ఇదే సమయంలో మరో విభ్రాంతికరమైన నిజాన్ని బయటికి వెల్లడించాడు… ‘‘దేవేంద్ర ఫడ్నవీస్ నా కొడుకు ఆదిత్య ఠాక్రేను మంచి నాయకుడిగా మలిచి, ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, మోసం చేశాడు… రెండున్నరేళ్లు మేం, రెండున్నరేళ్ల బీజేపీ సీఎం ఉండాలనేది మా ఒప్పందం… దాన్ని ఫడ్నవీస్ ఉల్లంఘించాడు’’ అని చెప్పుకొచ్చాడు…
‘‘నీలాంటి సీనియర్ నా కొడుకు ముఖ్యమంత్రిగా ఉంటే, తన కింద ఎలా పనిచేస్తావని అడిగితే తను ఢిల్లీకి వెళ్లిపోతానని అన్నాడు… ఇప్పుడిప్పుడే మావాడు నాయకుడిగా ఎదుగుతున్నాడు, అప్పుడే మునగచెట్టు ఎక్కించకండి అని నేను వారించాను’’ అనీ వివరించాడు… సరే, ఈ వ్యాఖ్యల్ని ఫడ్నవీస్, షిండే తదితరులు మైండ్ లెస్ వ్యాఖ్యలుగా కొట్టిపారేశారు… అది వేరే సంగతి…
నిజానికి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మి ఒత్తిడి ఉద్దవ్ ఠాక్రే మీద ఉందట చాన్నాళ్లుగా… తన కొడుకును సీఎంగా చూడాలని ఉందని… సంజయ్ రౌత్ వంటి మేధావులు ఈ యువ సీఎం అనే భావనను పదే పదే బలంగా ఎక్కించారట… అంటే ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రే వెల్లడిస్తున్న విషయాల్ని బట్టి అది నిజమేనని అనిపిస్తోంది… బయటికి ఏం చెప్పుకుంటున్నా సరే, ఆదిత్య ఠాక్రేను సీఎం చేయడం ఏమిటి..? ఠాక్రే కుటుంబం పూర్తిగా లైన్ తప్పి పోతున్నట్టుంది…
ఆదిత్య ఠాక్రే వయస్సు జస్ట్, 34 ఏళ్లు ఇప్పుడు… అప్పుడే శివసేన యువజనవిభాగం అధ్యక్షుడు, తరువాత వర్లి ఎమ్మేల్యే… తరువాత మంత్రి… చకచకా పెంచేస్తున్నారు తన రేంజ్‌ను… ఈ వయస్సులో తన మెచ్యూరిటీ లెవల్స్ ఏమిటి..? సీఎం అనే కిరీటం పెట్టడానికి ఈ ప్రయత్నాలు, ఆలోచనలు, ప్రణాళికలు ఏమిటి..? ఒకసారి చెన్నై వైపు వెళ్దాం… ఈమధ్య సనాతన ధర్మం మీద విషం, విద్వేషం కక్కిన స్టాలిన్ కొడుకు ఉదయనిధి గుర్తున్నాడు కదా… తనకూ సీఎం పోస్టు కావాలట…
కాకపోతే ఇప్పుడే కాదు, డీఎంకే వారసుడు, స్టాలిన్ వారసుడు తనేనట, కాకపోతే ఆదిత్య ఠాక్రేకన్నా వయస్సులో పెద్దవాడు… 46 ఏళ్లు… ఈరోజుకూ డీఎంకే భావజాలాన్ని ప్రమోట్ చేసుకుంటూ పార్టీలో ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నాడు, కానీ తన మానసిక స్థితి సినిమా హీరో, నిర్మాత స్టేజ్ నుంచి ఎదగలేదు అంటారు మరి… ఇదీ మన దేశం… ఠాక్రేలు, స్టాలిన్‌లు… వీళ్లేమిటి..? ప్రతి కుటుంబ పార్టీ స్థితీ అంతే… మనం వాళ్లను మోస్తూనే ఉంటాం… వాళ్లు స్వారీ చేస్తూనే ఉంటారు… ఇద్దరు ముగ్గురు తెలుగు నేతల్ని కూడా ఆ జాబితాలో కలిపేస్తున్నారా..? మీ ఇష్టం..!!
Share this Article