ఆ విశాఖ స్వరూపానందుడికి ఓ ప్రత్యర్థి ఉన్నాడు… శ్రీకాకుళం జిల్లాలో ఓ స్వయం నిర్మిత ఆనందాశ్రమ పీఠం… దానికి ఈయన అధిపతి… ప్లీజ్, వీళ్లు ఏం చేస్తారు అనడక్కండి… స్వరూపుడు ఏమీ చేయడు, ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ శ్రీనివాసానంద సరస్వతీ ఏమీ చేయడు…
వీళ్లకు ఆధ్యాత్మికత, హిందూ ధర్మవ్యాప్తి వంటివి నిర్మాణాత్మకంగా ఏమీ చేతకాదు… ఏ పీఠమైనా సరే, పీఠాధిపతికి ‘ఆనంద’ ‘సరస్వతి’ అనే పదాలు పేర్లలో కలిస్తే దానికి పంచ్ ఉంటుందట… ఈ సరస్వతులకు ధర్మంకన్నా రాజకీయమే ముఖ్యం…
స్వరూపానందుడి మఠం వైసీపీ ఆఫీసు అని ఇదే శ్రీనివాసుడు అప్పట్లో వ్యాఖ్యానించడమే కాదు… జగన్ పాలనలో ప్రతిసారీ స్వరూపానందుడి రాజకీయాలు, పెత్తనాలు, అక్రమాలపై విమర్శలు చేసేవాడు… టీడీపీ క్యాంపు మనిషిలా మాట్లాడేవాడు… జగన్ హయాంలో సాగిన మతమార్పిళ్ల మీద కూడా విమర్శించేవాడు…
Ads
సరే, స్వరూపానందుడి అక్రమాలు, ఆక్రమణలు వెల్లడవుతూనే ఉన్నాయి… ఆయనపై విమర్శల్లో ఏ తప్పూ లేదు… జగన్ ప్రభుత్వం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ స్వరూపానందుడి ఎదుట సాగిలబడింది… జగన్ చెప్పాడు కదాని కేసీయార్ కూడా సాగిలబడి భూములు సమర్పించుకుని, ఆశీస్సులు పొందాడు…
స్వరూపానందుడి ఆశీస్సులకు ఉన్న నెగెటివ్ పవర్ తెలుసు కదా… ఇక్కడ కేసీయార్, అక్కడ జగన్ మట్టిగొట్టుకుపోయారు… ఇక ఈ శ్రీనివాసానందుడికి ఇకనేం, ఏపీలో మా పవర్ వచ్చేసింది అనుకుని భ్రమపడ్డాడు… తిరుపతిలో ఏదో జాతీయ సాధుసమ్మేళనం నిర్వహించాడు… హాజరైన పీఠాధిపతులు (??) అనుచరులకు బ్రేక్ దర్శనాలు, వసతి, ప్రత్యేక దర్శనాలు కావాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని అడిగాడు…
చౌదరి గారు ఎహె కుదరదుపో అన్నాడు… ఈ శ్రీనివాసానందుడికి తొలి షాక్… అఫ్‌కోర్స్, ఇంకా చాలా ఉంటాయి… ఇప్పుడు హఠాత్తుగా ఆ సరస్వతీ స్వామికి జగన్ పాలనే గొప్పదనిపిస్తోంది… జగన్ పాలనలోనే తిరుమలలో పీఠాధిపతులకు మంచి గౌరవం దక్కిందనీ అంటున్నాడు… వెంకయ్య చౌదరిని శపిస్తాడట…
పిల్లుల శాపాలకు ఉట్లు తెగవయ్యా పీఠాధిపతీ… చూస్తూ ఉండండి, అలనాటి ఆ ఆధర్మా‘రెడ్డి’ని మించి ఈ వెంకయ్య ‘చౌదరి’ కనిపిస్తాడు… అన్నట్టు, నువ్వు కూడా తిరుమలలో స్వరూపానందుడి రేంజులో బ్రహ్మాండమైన అక్రమ ఆక్రమణ భవనం ప్లాన్ చేస్తావేమో… కుదరదు…
అవునూ, వెంకయ్య చౌదరి గారూ… జగన్ పాలనలో రోజా సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వందలుగా, మందలుగా వచ్చిపడి ప్రత్యేక దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలతో ఆ స్వామి వారిని ఆశీర్వదించారు కదా… ఈమాత్రం 300 మందికి ఒకేసారి ప్రత్యేక దర్శనం ఇప్పించలేకపోయావా..? అదేమిటని అడిగితే భక్తులకు ఇబ్బంది అంటావా..? తిరుమలలో సామాన్య భక్తులను ఎవడు పట్టించుకుంటాడయ్యా స్వామీ..!!
ఈ స్వామికి కోపం వస్తే తనలాంటి పీఠాధిపతులతో ప్రత్యేక యజ్ఞం అర్జెంటుగా చేసేసి, నీ కొలువు ఊడబీకేస్తాడు తెలుసా..?
Share this Article