వెరీ థిన్ లైన్… పెద్ద లోతైన సమీక్ష కాదు, విశ్లేషణ కాదు… కానీ ఏమాటకామాట… కేరళ తారలు నటనలో పర్‌ఫెక్ట్… మంచి కమిట్మెంట్… (సినిమా పరిభాషలో కమిట్మెంట్ గురించి కాదు…) మంచి నటన తెలిసిన తారలు… నిజానికి అది కూడా కాదు అసలు విషయం… వివక్ష మీద గొంతెత్తుతారు… స్త్రీద్వేషం మీద, మగ వివక్ష మీద, ఆ పోకడల మీద, వేతనాల్లో తేడా మీద సంయుక్తంగా పోరాడతారు… ఒకరికొకరు సంఘీభావంగా నిలుస్తారు… అదెందుకో కాస్త నచ్చుతుంది… అదే సమయంలో వృత్తిపరంగా ఓ పరిణతి ప్రదర్శిస్తారు…
పార్వతి తిరువొత్తు… ఈమె చాలా ఏళ్లుగా మాలీవుడ్‌లో నటిస్తోంది… ఈ నూడుల్స్ సుందరి నటికన్నా ఓ పెద్ద యాక్టివిస్టు… అప్పుడప్పుడు తమిళం, కన్నడంలో కూడా నటిస్తుంది… 2006 నుంచి ఫీల్డులో ఉన్నా సరే, ఇంకా మనవాళ్ల కన్ను పడనట్టుంది… ఆమెలో ఫైర్ భయపెట్టి ఉంటుంది బహుశా… ఆమెలో మెరిట్ ఉంది, బాగా పాపులారిటీ కూడా వచ్చింది… ఆమె ఖాతాలో మంచి హిట్లు పడ్డయ్ కొన్ని… ఎంత పెద్ద హీరోలైనా సరే స్త్రీద్వేష డైలాగుల్ని ఎంకరేజ్ చేయకూడదని మొదట గొంతెత్తిన వాళ్లలో ఈమె కూడా ఉంది…
ఉదాహరణగా కసబ మూవీలో మమ్ముట్టి డైలాగుల్ని ఉదహరించింది కూడా… దాంతో ఆయన ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారామెను… వేధించారు… టాప్ హీరోల ఫ్యానిజం ఎలా ఉంటుందో తెలిసిందే కదా… ఆమె ఫిర్యాదు మేరకు అప్పట్లో ఇద్దరు మమ్ముట్టి ఫ్యాన్స్‌ను పోలీసులు అరెస్టు కూడా చేశారు… మలయాళ ఇండస్ట్రీలో స్త్రీల సమస్యలపై పోరాడే Women in Cinema Collective వ్యవస్థాపక సభ్యురాలు ఆమె… అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్ సినిమాలను కూడా కడిగేసిందామె… ఎప్పుడూ ఏదో అంశం మీద పత్రికల్లో కనిపిస్తూనే ఉంటుంది… ఇదీ ఆమె నేపథ్యం…
Ads
మమ్ముట్టి ఒక్క మాట కూడా దీనిపై మాట్లాడలేదు… తను ఏం మాట్లాడినా సరే, అది పెద్ద రచ్చ అవుతుందని తెలుసు తనకు… అంతేకాదు, ఓ కొత్త దర్శకురాలు రతీనా ఓ వైవిధ్యమైన పాత్రతో తనను అప్రోచ్ అయినప్పుడు ఆమె ఓ మాట చెప్పింది… ఆ సినిమా పేరు పుజ్జు… అంటే మలయాళంలో పురుగు… నిజంగా మమ్ముట్టిని ఓ మెట్టుపైకి ఎక్కించిన పాత్ర… నలభయ్యేళ్లు మలయాళ ఇండస్ట్రీలో టాప్ టూ హీరోల్లో ఒకడిగా రకరకాల పాపులర్ పాత్రల్ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఆ పాత్రను అంగీకరించడమే గ్రేట్…
అదొక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర… జనం అసహ్యించుకునే పాత్ర… సగటు సౌతిండియన్ హీరోల అవలక్షణాలేమీ కనిపించని ఓ రియలిస్టిక్ పాత్ర… రతీనా చెప్పగానే ఆ పాత్రకు వోకే చెప్పాడు… డెబ్బయ్ ఏళ్లకు దగ్గరపడినా ఇంకా చెత్త స్టెప్పులతో, హీరోయిక్ ఫైట్లతో, చెత్త ఐటమ్ సాంగ్స్, సీన్లతో, డబ్బు కోసం వెంపర్లాడే మన తెలుగు వృద్ధ హీరో కాదు కదా… ముందుగా ఓ మాటన్నాడు… ఆ పార్వతి తనతో నటిస్తుందా..? ఇదీ తన ప్రశ్న… అది మాకు వదిలేయండి అని చెప్పింది రతీనా… (ఈ సినిమా సోనీలివ్ ఓటీటీలో రిలీజ్ చేశారు, జాతీయ మీడియా కూడా మమ్ముట్టిని ప్రశంసిస్తోంది తన నటనకు… రకరకాల వైవిధ్యమున్న భావోద్వేగాల ప్రదర్శనలతో మమ్ముట్టికి తిరుగేముంది..? అదీ ఓ నటుడిగా తమ కెరీర్‌ను సార్థకం చేసుకోవడం అంటే… నడుం వంగిపోతున్నా సరే, స్టెప్పులు వదలని ముసలి హీరోలకు మమ్ముట్టి పాత్ర ఓ పాఠం…)
ఆ సినిమా స్క్రీన్ రైటర్లలో ఒకరైన హర్షద్‌ను పార్వతి దగ్గరకు పంపించింది రతీనా… ఆయన ముందుగా పార్వతికి ఫోన్ చేశాడు… బ్రీఫ్‌గా ఇదీ కథ అని చెప్పాడు… స్టోరీ బాగుంది, నాకు వోకే అన్నదామె… దానికి ముందు ఓ ప్రశ్న అన్నాడు ఆయన… ఆ సినిమాలో హీరో మమ్ముట్టి, అసలే కసబ బాపతు పంచాయితీ మీద ఇండస్ట్రీలో, కేరళ సమాజంలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది కదా, మీరు నటిస్తారా అనడిగాడు నేరుగా… వ్యతిరేకించాల్సిన ఇష్యూస్ వచ్చినప్పుడు వ్యతిరేకిద్దాం, అది వేరు, కానీ వృత్తిపరంగా మంచి పాత్ర దొరికితే హాయిగా ఆయనతో కలిసి నటించేద్దాం, ఆయనకు అభ్యంతరం లేకపోతే నాకేమీ ప్రాబ్లం లేదు అన్నదామె… ఎంచక్కా అన్నీ మరిచిపోయి నటించారు… ప్రేక్షకుల నుంచి భారీ చప్పట్లు సంపాదించుకున్నారు… ఆ మెచ్యూరిటీ లెవల్స్ తెలుగు ఇండస్ట్రీలో ఆశించగలమా..?!
Share this Article