నిజానికి ఇందులో జూనియర్ ఎన్టీయార్‌ను తప్పుపట్టడానికి ఏమీ లేదు… కాకపోతే ఇలాంటి వివాదాలు అంతిమంగా తనకే చెడ్డపేరు తీసుకొస్తాయి…
జరిగిందేమిటంటే..? దేవర సినిమా ట్రెయిలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు… ఆర్ఆర్ఆర్ తరువాత రాబోయే జూనియర్ సినిమా ఇది, పాన్ ఇండియా రేంజ్… తనకూ బాగా హోప్స్ ఉన్నాయి…
శ్రీదేవి బిడ్డ జాన్వి తనతో నటిస్తుండటం ఓ ప్లస్ పాయింట్ కాగా… సైఫ్ ఆలీ ఖాన్ మరో ప్లస్ పాయింట్… హిందీలో సినిమా సక్సెస్ కోసం జాన్వి, సైఫ్ ఉపయోగపడతారనేది మార్కెటింగ్ టెక్నిక్… ఆర్ఆర్ఆర్ బాపతు ఇమేజీ జూనియర్‌కు ఉండనే ఉంది… ఈ స్థితిలో ఫేక్ హైప్ క్రియేషన్ కోసం ప్రయత్నించకూడదు…
Ads
అనిరుధ్ సంగీతం, పాటలు పెద్దగా ఇంప్రెసివ్ ఏమీ లేవు, పైగా ఒకటైతే కాపీ ట్యూన్ అని ఆరోపణలు… తను తమిళ సినిమాలకు మంచి కసరత్తు చేస్తాడు తప్ప తెలుగు అనేసరికి పెద్దగా పట్టించుకోడు అనే విమర్శ కూడా ఉంది… జూనియర్ అభిమానుల్లో కూడా కాస్త నిరాశ ఉంది దీని మీద… అందుకని ప్రమోషన్ వర్క్, ప్రోగ్రామ్స్ జాగ్రత్తగా ఏ వివాదాలూ తలెత్తకుండా జాగ్రత్తపడాల్సింది… కానీ దానికి రివర్స్‌లో ఉంది సిట్యుయేషన్…
ట్రైలర్ లాంచ్ ముంబైలో… అసలే సౌత్ హీరోల డామినేషన్ పెరిగిపోవడం మీద బాలీవుడ్ మీడియాకు కూడా అక్కసుగా ఉంది… ఎక్కడ ఏ చిన్న సందు దొరికినా రచ్చ చేయడానికి కాచుక్కూర్చుంది… ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపూ జై జై జూనియర్ ఎన్టీయార్ అని నినాదాలు చేయడానికి డబ్బులిచ్చి కొందరిని నియమించుకున్నారనేది వివాదం…
ఇదీ ముంబై బాలీవుడ్ మీడియా అందిపుచ్చుకుంది… రచ్చ అదే స్టార్ట్ చేసింది… సోషల్ మీడియాలో విమర్శలు పోస్ట్ చేస్తున్నారు… సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు మొదటి వరుసలో, జర్నలిస్టులు రెండో వరుసలో కూర్చోవడం ఏమిటి, ఈ నినాదాలు ఏమిటనేది వాళ్ల విమర్శ… పైగా ఎవరికీ ఏమీ అడిగే అవకాశం ఇవ్వలేదనీ, యాంకర్‌తో సెలెక్టెడ్ పర్సన్స్‌కే ప్రశ్నలు అడిగే చాన్స్ ఇచ్చి ముగించారని మరో విమర్శ…
నిజానికి హిందీలో ఎలాంటి ప్రశ్న ఎదురైనా జూనియర్ ధాటిగా, దీటుగానే బదులు ఇవ్వగలడు… తొట్రుపాటు, తడబాటు ఏమీ ఉండవ్, ఎక్కువ ప్రశ్నలకు అవకాశం ఇవ్వాల్సింది… మరింత ప్రచారమూ వచ్చేది… ఐనా ఇలాంటి టెక్నిక్స్ దేనికి..? హిందీ హీరోలు ఢమ్కీలు కొడుతున్నవేళ ఎలాగూ సౌత్ హీరోలకు బోలెడంత గ్యాప్ దొరుకుతోంది హిందీ మార్కెట్‌లో… పైగా జాన్వి, సైఫ్ ఉండనే ఉన్నారు… మరెందుకీ జేజేల ప్రహసనాలు..?! ష్, మనలోమనమాట… చేస్తే చేశారు గానీ, మరీ జూనియర్ నినాదాలేమిటోయ్… జై తారక్ అనిపించకపోయారా..?!
Share this Article