.
సిగ్గుపడదాం… నిజంగానే ఓ సమూహంగా, ఓ సమాజంగా మూకుమ్మడిగా సిగ్గుపడదాం… అలా సిగ్గుపడటానికి నామోషీ అక్కర్లేదు… మనం సిగ్గుపడటానికి పక్కాగా అర్హులం…
మాదచ్చోద్ ప్రభుత్వ విధానాలు… వాటికి పుట్టిన బ్యూరోక్రాట్టు… తోడుగా పుట్టిన రాజకీయ నాయకులు… సవతి పుత్రులుగా ఉన్నతాధికారులు… ఎవరూ తక్కువేమీ కాదు… ఈ వ్యవస్థలో బతుకుతున్నందుకు ఉమ్మడిగా సిగ్గుపడదాం…
Ads
ఎహె, సిగ్గుపడడానికి ఏముంది, ఇది లోకసహజం, అధికారులు, నాయకులు, మీడియా, లీగల్ సిస్టం ఎవరు సంపాదించడం లేదూ అంటారా… ఎస్, అందుకే అందరమూ కలిసి సిగ్గుపడదాం అనేది…
రేవంతుడున్నాడా కుర్చీ మీద… నియంత కేసీయార్ ఉన్నాడా అనేది నథింగ్… ఎవడికి ఎంత చేతనైతే వాడు అంత దోచేస్తున్నాడు… తాజా ఉదాహరణ… ఆఫ్టరాల్ ఒక ఏఈఈ… పేరు నిఖేష్ కుమార్… వాడు… ఈ మాట అనడానికి ఏమాత్రం సందేహం, సంకోచం లేవు… వాడే…
ఆ దరిద్రుడి ఆస్తుల విలువ కనీసం 170 నుంచి 200 కోట్లు అట… మహా అయితే నాలుగేళ్లుగా సంపాదన స్టార్ట్ చేశాడట… వాడి రేంజ్ ఏంది..? వాడి సంపాదన రేంజ్ ఏంది..? మొత్తం ఉద్యోెగగణం కూడా సిగ్గుతో తలదించుకునే కేరక్టర్…
ఆరు నెలలు పట్టిందట వాడి ఆస్తుపాస్తుల లెక్క తేల్చడానికి..!! నువ్వు గ్రేటురా… ఈ విషవ్యవస్థలో మొలిచిన మహావృక్షం నువ్వు… నీదొక సూపర్ బంపర్ సక్సెస్ స్టోరీ… ఏమవుతుంది..? ఏమీ కాదు…
లాయర్లు వస్తారు… జడ్జిలు కళ్లు మూసుకుంటారు… ఏసీబీ అధికారులూ నాన్చుతారు… వందల కోట్ల డబ్బు పారేయడం ఓ సమస్యా… ఏమీ కాదు, రీఇన్స్టిట్ట్యూట్ అవుతాడు… రెట్టింపు దండుకుంటాడు… ఎస్, ఖచ్చితంగా మన సిస్టం లోపం ఇది…
ఇలాంటి విషపురుగుల్ని ఏమీ చేయలేని అసహాయత మన చట్టాలది… మన ప్రభుత్వాలది… ఎవడో రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అవుతాడు… బెయిల్ ఎలాగూ ఇస్తాయి కదా మన కోర్టులు… మరి మన న్యాయవ్యవస్థ చాలా గొప్పది కదా… శాఖాపరమైన విచారణ అంటారు… బారా ఖూన్ మాఫీ… మళ్లీ ఉద్యోగం…
వాడికేం తక్కువ..? నిన్నటే ఓ వార్త చదివాను… సచివాలయంలో ముఖ్యమంత్రిగా వెలిగిన ఎవడో చివరకు తప్పు ఒప్పుకుని ఎన్నికలకు ఒప్పుకున్నాడట… రేవంత్‌కు చేతనవుతుందా అలాంటోడిని శిక్షించడం… నెవ్వర్… అన్నీ ఒకటే… అందరూ ఒకటే… ఎవరి వల్లా ఏమీ కాదు… మరేమిటి పరిష్కారం..? ఎవడికి చేతనైనంతమేరకు వాడు దండుకోవడమేనా..? ఏం వ్యవస్థలో బతుకుతున్నాం మనం..?
డౌటా..? ఒక్కసారి… జస్ట్ ఒక్కసారి… 200 కోట్లు, 300 కోట్లతో పట్టుబడిన వెధవలు ఇప్పుడెలా ఉన్నారు..? జైళ్లలో ఉన్నారా..? దేవుడి శాపం అనుభవిస్తున్నారా..? ఏమీ లేదు… అందరూ ఎంచక్కా మహా వైభోగాన్ని అనుభవిస్తున్నారు… మన డొల్ల వ్యవస్థల సాక్షిగా..!!
లక్షల కోట్లు మింగిన తిమింగలాలు, గాడిదలకే శిక్షలు దిక్కులేవు… ఈ పిత్త బరిగెలకు ఏమొచ్చింది అంటారా..? కావచ్చు… కుళ్లిపోయిన వ్యవస్థలో ఏదైనా సాధ్యమే…!! ఎవరైనా క్షమార్హులే..!! ఒరేయ్, వెధవా, వీలైనంత త్వరగా మళ్లీ రీఇన్‌స్టిట్యూట్ అయిపోయి, ఈసారి కనీసం 500 కోట్లకు టార్గెట్ చేయరా…!!
నటనలో ఓనమాలు తెలియని వెధవలు వేల కోట్లు సాధించి, ఏకంగా సీఎం సీట్లకు గురిపెడుతున్న నవీన కాలంలోె మీరేం తక్కువ…? మీరు వర్తమాన సమాజానికి మార్గదర్శులురా…. మా ఖర్మానికి…!!
Share this Article