యూట్యూబ్ చానెళ్లకు ఎవరో ఒకరు దొరుకుతారు… నోటికొచ్చింది పేలుతుంటారు… మాంచి మసాలా థంబ్ నెయిల్స్‌తో వీళ్లు ప్రసారం చేస్తూ ఉంటారు… వాళ్లూ వీళ్లూ అనేమీ లేదు, దాదాపు యూట్యూబ్ చానెళ్లన్నీ అంతే… ఇక నోటికి హద్దూఅదుపూ లేని కేరక్టర్లు దొరికారు అంటే వీళ్లకు పండగే…
తోటపల్లి మధు అని ఓ రైటర్… కొన్నాళ్లుగా ఎవరి మీద పడితే వాళ్ల మీద ఏదేదో కక్కేస్తున్నాడు… ఏదైనా సరే పరిమితి దాటితే, శృతిమించితే ఇక ఎవరో ఎదురు దాడి ప్రారంభిస్తారు… ఇప్పుడదే జరిగింది… ఇండస్ట్రీలో కాస్త మంచి పేరే ఉన్న దేవిప్రసాద్ ఈ ఎదురుదాడి స్టార్ట్ చేశాడు… మిగతావాళ్లు ఆ పోస్టు షేర్ చేసుకుంటున్నారు… వైరల్ అయిపోతోంది… కామెంట్లలోనూ బోలెడన్ని తిట్లు…)
జర్నలిస్టు స్వప్న ఇంటర్వ్యూలు నిజానికి బాగుంటాయి… ఎక్కడా సంస్కారం గీత దాటదు… ఈమధ్య ఓ రీసెంటు ఇంటర్వ్యూలో మాత్రం తను కూడా బదనాం అయిపోయింది… ఆమె స్థాయికి తగినట్టు లేదు… సరే, దేవిప్రసాద్ ఏం రాశాడో ఆయన మాటల్లోనే చదవండి… ఫాఫం తోటపల్లి మధు… (మూఢవిశ్వాసాలను, హెల్త్ ఇష్యూస్‌ను ప్రమాదకరంగా, ఇష్టారాజ్యంగా ప్రసారం చేసే ఓ దిక్కుమాలిన చానెల్ ఉంది… బహుశా తోటపల్లి మధును పిలిచి ఇదే ఇష్యూ మీద ఇంటర్వ్యూ చేసేస్తారేమో..,)
Ads
ఇదిగో ఈ ఫోటోలో వున్న సీనియర్ రచయిత తోటపల్లి మధు గారి వంటివారు మాత్రం కొంత ప్రత్యేకం.
వీరికి కొన్ని ప్రత్యేక ప్రతిభలున్నాయి.
మీడియా మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తే చాలు…..
పరిశ్రమలో ఎంత సాధించినవారినైనా వాడు వీడు అని సంబోధించగలరు.
జంధ్యాల గారు, సావిత్రి గారు,శ్రీదేవి గారిలాంటివారు అసలెందుకు మందుకు బానిసలు అయ్యారో, రోజుకి ఎన్నిసార్లు తాగేవారో కూడ కళ్ళారా చూసినట్టు చెప్పగలరు.
అసలు శ్రీదేవి గారు చనిపోయే ముందు ఏమేమి ఎలా జరిగిందో అప్పుడు ఆ ప్రదేశంలో ఆయన అక్కడ వున్నట్టే వివరించగలరు.
తమిళ ఎం.జి.ఆర్ గారు స్విస్ బ్యాంక్ లో దాచిన 3000 కోట్ల సొమ్ము వివరాల చీటీని ఆయన తన తలపైన టోపీలో దాచుకుంటే జయలలిత గా రుదాన్ని తీసి శోభన్‌బాబు గారికిస్తే ఆయన భూములు కొని ఎలా లాభపడ్డారో ప్రత్యక్షసాక్షిలా చెప్పగలరు.
అద్భుతమైన నటనను కూడా ప్రదర్శించే వీరి దృష్టిలో జస్ట్ వందల సినిమాలలో మాత్రమే నటించి నంది అవార్డులు కూడా పొందిన సీనియర్ నటులు మురళీమోహన్ గారు అసలు ఆర్టిస్టే కాదని బల్లలు బద్దలు కొట్టగలరు.
మరణించిన మిక్కిలినేని గారివంటి నటులను అపహాస్యం చేయటమే కాక వీరికి అవకాశాలిచ్చి ఉపాధి కల్పించిన కోదండరామిరెడ్డి గారిలాంటి వారి ప్రతిభకూ వ్యంగ్యంగా మరకలద్దగలరు.
పాపం అస్సలు మందు వాసనంటే తెలియని వీరు ఇప్పుడు ఇండస్ట్రీలో మందుని దాటి అందరూ డ్రగ్స్ విరివిగా వాడుతున్నారనీ, అవి కూడా డాక్టర్లే ఇస్తారనీ చూసినట్లే చెప్పి అన్నం పెడుతున్న ఇండస్ట్రీనే ఎంతవరకైనా దిగజార్చగలరు.
వారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన మా గురువు గారు ఈ లోకంలో లేని “కోడి రామకృష్ణ” గారి మీద అబధ్ధాల అవాకులు చెవాకులు పేలగలరు.
కానీ వారికి తెలియనిదొక్కటే. మా గురువు గారు లేకపోయినా ఆయన శిష్యులం మేమింకా ఇక్కడే వున్నాం. తోటపల్లి మధు గారిలో పశ్చాత్తాపం రాకుంటే వారికున్నంత కుసంస్కార ప్రతిభ మాకు లేకున్నా వారి అసహ్యకర జుగుప్సాకర లీలలు విన్యాసాలు అప్పటివి ఇప్పటివి మాకు పరిపూర్ణంగా తెలుసు కనుక వాటిని విశదపరచి మేమూ మన్ననలందుకోక తప్పేట్టు లేదు… (వారి అబధ్ధపు ఘోష మధ్యలో పట్టరాని నవ్వులతో అలరించిన యాంకర్ స్వప్న గారి సంస్కారం కూడా తక్కువేమీ కాదు.) _____ దేవీప్రసాద్…
———————-
ఈయన చెప్పిన స్వవిషయం ఒకటి నవ్వొచ్చింది… హీరోయిన్ వాణి విశ్వనాథ్ తెలుసుగా… వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట… ఓరోజు కేరళలో ఓ గుడిలో పెళ్లి అనుకుని వెళ్తే, సూర్యగ్రహణం అని గుడి మూసేసి ఉందట… ఇలా మూడు నాలుగు సార్లు జరిగిందట… తర్వాత లవ్ బ్రేకప్… ఇది చదివి కొందరు కామెంట్లలో “బతికిపోయావ్ తల్లీ” అని ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు…
Share this Article