టైమ్… అమెరికన్ ఫేమస్ మ్యాగజైన్… అఫ్ కోర్స్, ఇండియా మీద విపరీత ద్వేషంతో వ్యవహరిస్తుంటాయి అమెరికన్ మీడియా… సేమ్, బీబీసీలాగే..! సరే, బీబీసీ అయితే మరీ భారత వ్యతిరేకతతో చెలరేగిపోతుంటుంది… మన తెలుగు పత్రికల్లాగే ఉచ్చం నీచం ఏమీ ఉండవు… తన పొలిటికల్ లైన్‌ను బట్టి రెచ్చిపోవడమే…
తాజాగా వార్తాంశం ఏమిటంటే..? అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ మీద ఓ కవర్ పేజీ వేసింది… తను ఫ్రేమ్ నుంచి బయటికి వెళ్లిపోతున్నట్టు… సింపుల్ ఫోటో… కానీ ఎన్ని అర్థాలు..? చాలామంది సీనియర్ జర్నలిస్టులకు నచ్చిందో లేదో, చూశారో లేదో తెలియదు గానీ ఒక పాఠకుడిగా బాగా నచ్చింది… ఆ ముఖచిత్రం శీర్షిక చాలా సింపుల్… ప్యానిక్…
ట్రంపు, బైడెన్ నడుమ ముఖాముఖి సంవాదం నడిచాక… వేసిన ముఖచిత్రం ఇది… నిజంగానే బైడెన్ మాట తడబడింది, మాటలో తొట్రుపాటు, స్పష్టత లేదు… ట్రంపు స్పష్టంగా డామినేట్ చేశాడు… బైడెన్ వెలవెలబోయాడు… అంటే ఇక్కడ ట్రంపు పెద్ద దేశోద్ధారకుడని కాదు… తన ఆలోచనల్లో క్లారిటీ ఉంది, ప్రజెంట్ చేయగలిగాడు, బైడెన్ ఆ పని చేయలేకపోయాడు… అంతే…
Ads
టైమ్ తీసుకున్న పొలిటికల్ లైన్ ప్రకారం అదీ వాళ్ల అభిప్రాయం… దాన్ని తప్పుపట్టలేం… అలాగని టైమ్ ముఖచిత్రాలు ఇలా ఎప్పుడూ లేవని కాదు… గతంలో చాలా సందర్భాల్లో చాలా నాయకులకు సంబంధించి ఫోటోల్లోనే మొత్తం పదీపదిహేను పేజీల విశ్లేషణకు తగిన సారాంశం చెప్పేస్తుంది…
పైన ఫోటో చూడండి, ఈ ప్యానిక్ ఫోటోయే కాదు, గతంలో ట్రంపు మీద వేశారు… శీర్షిక సింపుల్ … టు గో… (పోవాల్సిందే)… అది ఆ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తున్న సమయానికి ఉన్న పరిస్థితిని ఫోకస్ చేస్తుంది… అది నిజం కావాలనీ లేదు, కాకూడదనీ లేదు… ఐతే ఇప్పుడు విషయానికి వద్దాం…
మన ఇండియన్ మీడియా ఎప్పుడైనా ఇలాంటి ముఖచిత్రాలు వేయగలదా..? మహా అయితే మోడీ బొమ్మతో ఎడాపెడా గ్రాఫిక్స్ నెగెటివ్‌గా వేస్తాయేమో… ఐనా ఇండియాలో ఇప్పుడు పేరున్న మ్యాగజైన్స్ ఏమున్నాయని… అన్నీ కరోనా దెబ్బకు మూతపడిపోయాయి కదా… లేదా డిజిటల్‌లోకి మారిపోయాయి కదా…
ఇండియాటుడే వంటివి ఒకటీరెండు పాపులర్ మిగిలాయేమో… అదీ ఇతర ప్రాంతీయ భాషల్లో మ్యాగజైన్ ముద్రణను ఏనాడో ఆపేసుకుంది కదా… తెలుగు మీడియా అంటారా..? అసలు ఫస్ట్ పేజీల్లోనే ప్రయోగాలు లేవు, ఇంకా ఇలాంటివా..? ఐనా సండే మ్యాగజైన్లు కూడా పిచ్చి పిచ్చి ఆర్టికల్స్ తప్ప వేరే పొలిటికల్ విశ్లేషణలు ఏముంటున్నాయని..?
ఒక్క హెడ్డింగుల విషయంలో ది టెలిగ్రాఫ్ కొన్ని ఇంట్రస్టింగు శీర్షికలు పెడుతూ ఉంటుంది… మంచి ఎక్సర్‌సైజు చేస్తారు, క్రియేటివ్ ప్రజెంటేషన్లు… కానీ మొత్తం మోడీ ద్వేషమే… టీఎంసీ అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది… మన తెలుగు పత్రికలు ఎప్పుడైనా ఏ ప్రయోగాలైనా ఇలా చేశాయా..? పోనీ, వాళ్ల పొలిటికల్ లైన్‌కు అనుగుణంగానే… నెవ్వర్, అంత క్రియేటివిటీ లేదు, జస్ట్, రొడ్డు కొట్టుడు, నాటు కొట్టుడు…!!
Share this Article