.
ముందుగా వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించిన ఓ వార్త చదవండి… అది…
అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్
Ads
కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని.. తద్వారా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆరోపించిన AISF
ఈ మేరకు అల్లు అర్జున్, శ్రీలీలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విజయవాడ సిటీ కౌన్సిల్
జేఈఈ మెయిన్ టాప్ ర్యాంకర్ల ఫొటోలను వేర్వేరు కాలేజీలు వేశాయని.. ఒకే విద్యార్థి రెండు కాలేజీల్లో ఎలా చదువుతాడని ప్రశ్నించిన AISF
గుడ్, డిమాండ్ హేతుబద్దమే… ఏ సరుకు విషయంలోనైనా సరే నాణ్యతకు ప్రచారం చేసే సెలబ్రిటీలు (బ్రాండ్ అంబాసిడర్లు కూడా) బాధ్యత వహించాలి, జవాబుదారీతనం ఉండాల్సిందే… రూల్స్ అవే చెబుతున్నాయి…
సో, అల్లు అర్జున్, శ్రీలీల మీద యాక్షన్ అనే డిమాండ్ వరకూ వోకే… ఐతే అల్లు అర్జున్ మీద కూటమి ప్రభుత్వం చర్య తీసుకుంటుందా..? ఊహించగలమా..? అంతకుముందు దూరం ఉంది గానీ మొన్న అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించాడు… అదే పవన్ కల్యాణ్ కొడుకు సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడినందుకు…
సరే, మరి తెలంగాణ…? అప్పట్లో సంధ్య థియేటర్ బాపతు కేసు పెట్టారు, జైలులో వేశారు… తరువాత ఏమైనా ఫాలోఅప్ ఉందా..? లేదు కదా..? అంటే అర్థమైపోయింది కదా… సో, పాపం శమించుగాక, మరో సంధ్య ఘటన జరిగినా ఇక కేసు లేదు… సో, రెండు రాష్ట్రాల్లోనూ అల్లు అర్జున మీద కేసు అనేది అసాధ్యం…
పైగా నిన్నటి ఐఐటీ జేఈఈ ఫలితాల ప్రకటనల్లో అఅ్లు అర్జున్ కనిపించలేదు… శ్రీచైతన్యతో ఒప్పందం కొనసాగుతున్నదో లేదో తెలియదు… కానీ యాడ్స్‌లో శ్రీలీల కనిపించింది… ఇలా…
మరి శ్రీలీల మీద క్రిమినల్ కేసు పెడతారా..? నెవ్వర్… చైతన్య, నారాయణల జోలికి వెళ్లే దమ్ముందా ఈ ప్రభుత్వాలకు..? అసలు కేసులు పెట్టాల్సింది యాజమాన్యాలపై కదా… డిమాండ్ చేయాల్సిందీ అదే కదా…
విద్యార్థుల ఆత్మహత్యలు, అడ్డగోలు విద్యావిధానాలు, ఒత్తిళ్లు, అబద్దపు ప్రకటనలు, మోసాలు, అడ్డగోలు ఫీజుల దోపిడీలు… వాట్ నాట్..? అల్లు అర్జున్, శ్రీలీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకున్నందుకు ముందు మేనేజ్‌మెంట్లపై కేసులు పెట్టి, తరువాత చేతనైతే బ్రాండ్ అంబాసిడర్లను బుక్ చేయాలి…
నారాయణ కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తి… భాగస్వామి… మంత్రి… చైతన్య మేనేజ్‌మెంట్ ముఖ్యమంత్రికి బాగా దగ్గర… సో, ఏపీలో కేసులు కాదు కదా… పూచికపుల్ల కూడా కదలదు… మరి తెలంగాణలో..? సింపుల్… మరీ అంత అవసరమొస్తే కూటమి ప్రభుత్వ ముఖ్యులే ముందుపడి రేవంత్ రెడ్డితో రాజీ కుదురుస్తారు… అంతే… విద్యార్థుల ఆత్మహత్యల కేసులకే దిక్కులేదు, ఆఫ్టరాల్ అబద్ధపు ప్రచారాలను అరికడతారా..?! సో, ఇలాంటి డిమాండ్లు వార్తల వరకూ వోకే..!!
బన్నీ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యాపార ప్రకటన విద్యార్థులని తప్పుదోవ పట్టించేలా ఉందని, ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కొత్త ఉపేందర్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు రెండేళ్ల క్రితం ఫిర్యాదు చేశాడు… ఏమైంది, ఏమీ కాదు…
నిజానికి నియమనిబంధనలు ఏం చెబుతున్నాయంటే… తప్పుడు ప్రకటనలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసే వారిపైనా, అందులో నటించిన వారిపైనా, ప్రచురించిన, ప్రసారం చేసిన వారిపై మొదటిసారి 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇలాంటి ప్రకటనలు జారీ చేసే వారిపై మూడు సంవత్సరాల నిషేధం విధిస్తారు…
Share this Article